Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు సినిమా కథకన్నా… కోట- బాబూమోహన్ కామెడీయే హైలైట్…

April 9, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. తమిళంలో బాగా హిట్టయిన నాన్ పుడిచ మాప్పిళ్ళై సినిమాకు రీమేకే 1991 లో వచ్చిన ఈ మామగారు హిట్ సినిమా . ఎమోషన్స్ , సెంటిమెంట్సుతో చక్కని మసాలా సినిమా . సినిమాకు హీరో ఒక విధంగా మామగారే . ఆ పాత్ర దాసరి నారాయణరావు తప్ప మరొకరు సూట్ కారు అన్నట్లుగా నటించారు ఆయన . ఉత్తమ నటుడిగా నంది అవార్డుని కూడా పొందారు .

ఈ సినిమా పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చే పాత్రలు రెండు . కోట శ్రీనివాసరావు , బాబూమోహన్ . సుత్తి జంట ఎలా పాపులర్ అయిందో వీరిద్దరి జంట కూడా అలాగే పాపులర్ అయింది ఈ సినిమాతో . కొద్దిగా అరవ ఓవరేక్షన్ కనిపిస్తుంది . అయినా మొత్తం మీద సామాన్య ప్రేక్షకులకు బాగా నచ్చిందని చెప్పవచ్చు . బాబూమోహన్ ఉత్తమ హాస్య నటుడు నంది అవార్డు కూడా పొందాడు . కోట శ్రీనివాసరావు కామెడీ విలనీని బాగా పండించారు .

Ads

సినిమాలో ముఖ్య పాత్ర వినోద్ కుమారో ది . మేనకోడలు ఐశ్వర్యను పెళ్లి చేసుకోవలసిన అతను యమునను చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు . దురదృష్టవశాత్తు మధ్యలో యమున చనిపోవటం , మామగారి ఒత్తిడి మీద ఐశ్వర్యను పెళ్లి చేసుకోవటం , ఇంట్లో అందరికి మామగారు అడ్డు కావటం , అతని మీద లేనిపోని ఆరోపణలను వేసి ఇంట్లో నుంచి బయటకు పంపటం , క్లైమాక్సులో నిజాన్ని తెలుసుకోవటం , తీరా వెళ్ళేటప్పటికి మామగారు చనిపోయి ఉండటంతో సినిమా విషాదాంతంగా ముగుస్తుంది .

వినోద్ కుమార్ నటన కూడా బాగుంటుంది . ఉత్తమ సహాయ నటుడు నంది అవార్డు వచ్చింది . ఇంక యమున , ఐశ్వర్య గ్లామర్ ప్రదర్శనలో పోటాపోటీగా , పాటల్లో హాటుహాటుగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో అక్కగా అన్నపూర్ణమ్మ , తల్లిగా నిర్మలమ్మ , మేనల్లుడుగా రాజ్ కుమార్ బాగా నటించారు . ముఖ్యంగా అన్నపూర్ణమ్మ .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ బాగుంటాయి . దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు దుర్గమ్మా బృంద నృత్యం పాట చిత్రీకరణ బాగా వచ్చింది . సిరివెన్నెల వారు వ్రాసారు ఈ పాటను . ఈ రాతిరి శివరాత్రి జాగారమే చేయ రారా అంటూ సాగే డ్యూయెట్ వినోద్ కుమార్ , ఐశ్వర్య మీద చాలా బాగుంటుంది . అలాగే వారిద్దరి మీదే కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ పాట కూడా .

శ్రీరాముడల్లె శ్రీకృష్ణుడల్లె ఏ వంక లేనేడే అనే డ్యూయెట్ వినోద్ , యమున మీద చాలా బాగుంటుంది . పాటల్ని సిరివెన్నెల వారితో పాటు వెన్నెలకంటి , డి నారాయణ వర్మ , వేదవ్యాస్ వ్రాసారు . బాల సుబ్రమణ్యం , చిత్ర , మంజుల , స్వర్ణలత శ్రావ్యంగా పాడారు . డాన్సులను శివ-సుబ్రమణ్యం , కళ , లలితామణిలు కంపోజ్ చేసారు .

తోటపల్లి మధు వ్రాసిన డైలాగులు సినిమా విజయానికి బాగా దోహదపడ్డాయి . తిరుపతికి సమీపంలో ఉన్న దుర్గాసముద్రం అనే గ్రామంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు నిర్మాత ఎడిటర్ మోహన్ . ఈ చక్కని ఫేమిలీ ఓరియెంటెడ్ ఎమోషనల్ , సెంటిమెంటల్ మూవీ యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి .

Undoubtedly an unmissable neat movie . ఇంత చక్కని సినిమాను అందించిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్యని ప్రత్యేకంగా అభినందించాలి ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేవంత్ మరో ఉత్తమ ప్రతిపాదన – కానీ సమస్య ఎక్కడొస్తుందంటే..?
  • శబరిమలలోనూ నెయ్యి కుంభకోణం ! లెఫ్ట్ నేతల నిర్వాకం !!
  • అబ్బే, ఐశ్వర్య రాయ్ అసలు అందగత్తె కానేకాదోయ్..! అందని ద్రాక్ష !!
  • పాలనలోనే… ఎక్కడో ఏదో బాగా తేడా కొడుతోంది మోదీ మహాశయా..!!
  • ‘తెలంగాణ ఫ్యామిలీ రిజిష్టర్’ – ఏమిటి? ఎవరికి? ఎందుకు?
  • సీఎం విజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ! ‘ముచ్చట’ ముందే చెప్పింది!!
  • అపర కుబేరులు ఐతేనే పిల్లనిస్తారట! గొంతెమ్మ పేరెంట్స్ !!
  • పాడలేను అన్న పాటకే… జాతీయ పురస్కారం అందుకున్న నైటింగేల్!
  • సో వాట్? జైనాబ్ అఖిలకన్నా పెద్దదే! మళ్లీ పిచ్చి ట్రోలింగ్ షురూ!!
  • ప్రధాని మోడీ ఈ మూడో దఫా పదవీకాలం పూర్తి చేయగలడా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions