.
ఈమధ్య విరివిగా రివ్యూలు వస్తున్నాయి ఓ సినిమా మీద… పేరు సంభవం అధ్యాయం ఒన్ను… ఎక్కువగా పాజిటివ్‌గా, కొందరేమో గందరగోళం ఉందని… ఎలాగూ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో వచ్చేసింది… కాస్త తాపీగా చూస్తే… తికమకపడకుండా చూస్తే… ఓ కొత్త అనుభూతి ఇచ్చేలాగే ఉంది… కాకపోతే ఇది ‘టైమ్ లూప్’ థ్రిల్లర్… సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి అంత త్వరగా జీర్ణం కాదు… అర్థం కాదు…
పదండి, ఓసారి సినిమాలోకి వెళ్దాం… మనం ఎప్పుడైనా వెళ్ళిన దారిలోనే మళ్ళీ మళ్ళీ వెళ్తుంటే… అది కూడా ఒక అడవిలో ఇరుక్కుపోయి, ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే టెన్షన్‌ని ఈ సినిమా మనకు చూపిస్తుంది… ఇది ఒక ‘టైమ్ లూప్’ థ్రిల్లర్…. అంటే ఒకే సంఘటనలో మనుషులు ఇరుక్కుపోవడం అన్నమాట…
Ads
కథ ఏందంటే…: కేరళ-కర్ణాటక బోర్డర్‌లోని ఒక మారుమూల పోలీస్ స్టేషన్‌కి ఆనంద్ అనే ఆఫీసర్ బదిలీపై వస్తాడు… డ్యూటీలో చేరకముందే ఒక యాక్సిడెంట్ జరుగుతుంది… అక్కడ దొరికిన ఒక వాకీటాకీ ద్వారా ‘స్టీఫెన్’ అనే వ్యక్తి సాయం కోరుతుంటాడు… తను అడవిలో ఆపదలో ఉన్నానని, కాపాడమని అడుగుతాడు…
తీరా ఆరా తీస్తే.. ఆ స్టీఫెన్ అనే పోలీస్ ముప్పై ఏళ్ల క్రితమే అదే అడవిలో మాయమైపోయాడని తెలుస్తుంది… అసలు ముప్పై ఏళ్ల కిందట వ్యక్తి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఆ అడవిలో ఉన్న ఆ వింత విగ్రహం ఏంటి? ఆనంద్‌కి, స్టీఫెన్‌కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే అసలు కథ…
ఎట్లుంది సినిమా?
-
ఫస్టాఫ్….: మెల్లగా సాగుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడానికి కొంచెం టైమ్ పడుతుంది…. కానీ ఆ అడవి వాతావరణం, ఆ గందరగోళం మనల్ని కథలోకి లాక్కుంటాయి…
-
సెకండాఫ్…: అసలు ఆట ఇక్కడే మొదలవుతుంది…. ముఖ్యంగా లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సీటు అంచున కూర్చోబెడుతుంది…. ట్విస్టులు ఒకదాని వెంట ఒకటి వస్తుంటే ‘అరే… ఇది కదా సినిమా!’ అనిపిస్తుంది…
-
హైలైట్…: టైమ్ లూప్ కాన్సెప్ట్ మీద మన దగ్గర సినిమాలు తక్కువ…. హాలీవుడ్ లెవల్ ఐడియాని మన నేటివిటీకి తగ్గట్టు, ఒక చిన్న మిస్టరీ ఎలిమెంట్ జోడించి, సూపర్ నేచురల్ పవర్స్ కూడా కలిపి చెప్పడం బాగుంది….
ప్లస్ పాయింట్స్…:
-
కొత్త కాన్సెప్ట్…: రొటీన్ ఫైట్లు, పాటలు లేకుండా విభిన్నంగా ఉంటుంది….
-
ట్విస్టులు…: క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌ని బాగా మెయింటైన్ చేశారు….
-
నిడివి…: రెండు గంటల లోపే ఉండటం వల్ల సాగదీత అనిపించదు…
మైనస్ పాయింట్స్…:
-
స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది…
-
జాగ్రత్తగా గమనించకపోతే.. ఆ టైమ్ లూప్ ట్విస్టులు కొంచెం తికమక పెడతాయి…
మీకు సస్పెన్స్, మిస్టరీ సినిమాలు నచ్చితే… ఈ ‘సంభవం’ ఖచ్చితంగా చూడాల్సిన అధ్యాయం… ప్రస్తుతం ఇది జియో సినిమా (Jio Cinema) లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది… వీకెండ్‌లో ఏదైనా కొత్తగా చూడాలనుకుంటే దీనిపై ఒక లుక్కేయండి!
Share this Article