Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ముఖ్యమంత్రి కావడం సులభం సుమీ… నమ్మకపోతే ‘సూర్య IPS’ చూడుడు…

April 24, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. వెంకటేష్ , కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఈ సూర్య , IPS . చిక్కని కధను నేసి బాణాల్లాంటి డైలాగులను వ్రాసిన పరుచూరి బ్రదర్సుని మొదటగా అభినందించాలి . తగ్గ స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని దర్శకత్వం వహించిన కోదండరామిరెడ్డిని అభినందించాలి .

టి సుబ్బరామిరెడ్డి నిర్మాత . ‌సమకాలీన రాజకీయాల మీద చెణుకులతో నడుస్తుంది సినిమా . వాటికి తోడుగా వెంకటేష్ , విజయశాంతి లవ్ ట్రాక్ , తాత మనమళ్ళ ఎమోషన్సు కలిపి చుట్టేసిన సినిమా .

Ads

టూకీగా కధ ఏంటంటే : రాజకీయ ఔత్సాహికుడు చరణ్ రాజ్ . ప్రేమించానని చెప్పి మోసం చేసిన కొడుకు చేత తండ్రి సత్యనారాయణ బలవంతంగా పెళ్లి చేస్తాడు . మంత్రి గోకిన రామారావు చెల్లెల్ని చేసుకుంటానని మాట ఇస్తాడు . భార్యను చంపేసి తండ్రితోటే రంకు కట్టి తండ్రి పోలీస్ ఉద్యోగాన్ని కూడా పీకించేస్తాడు .
తాత పెంపకంలో ఆకతాయిగా పెరిగిన వెంకటేషుని IPS కు మోటివేట్ చేసి పోలీస్ అకాడమీకి పంపుతాడు . అక్కడ తన కాలేజి ఫ్రెండ్ విజయశాంతితో గొడవలు పడి శిక్షణాధికారి శరత్ కుమార్ వద్ద నుండి తన కధను తెలుసుకుని బాధ్యతగా శిక్షణ పూర్తి చేస్తాడు .

సమాంతరంగా తండ్రి బావ రాజకీయాల్లో MLA గా గెలవకుండానే CM అవుతాడు . ఎన్నికల్లో తనకు పోటీగా నిలబడిన విజయశాంతి తండ్రి చారుహాసన్ని చరణ్ రాజ్ చంపుతాడు . తిరిగి జరిగిన ఎన్నికలో విజయశాంతే నిలబడి CM గా ఎన్నుకోబడుతుంది . ప్రమాణ స్వీకారం సమయంలో భీభత్సం సృష్టించే ప్రయత్నం చేసిన విలన్లను వెంకటేష్ చంపేస్తాడు .

గతంలో చేసిన నేరాలకు శిక్షను అనుభవించేందుకు జైలుకు వెళ్ళిపోతాడు . అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాననే విజయశాంతి డైలాగుతో సినిమా ముగుస్తుంది . సినిమా బాగానే ఉన్నా శత్రువు సినిమాలాగా విజయాన్ని సాధించలేదు .

వెంకటేష్ , విజయశాంతి , చరణ్ రాజ్ , గోకిన రామారావు , వల్లభనేని జనార్దన్ , రాళ్ళపల్లి పాత్రలు , నటన బాగుంటాయి . చిచ్చర పిడుగు మాస్టర్ తరుణ్ బాగా నటించాడు . ఇతర పాత్రల్లో జ్యోతి , నారాయణరావు , చారు హాసన్ , శరత్ కుమార్ , నూతన్ ప్రసాద్ , కోట శంకరరావు  తదితరులు నటించారు . రాళ్ళపల్లి భార్యగా రాజేశ్వరి కాసేపే కనిపించినా “నీ యమ్మ కడుపు మాడ” అనే డైలాగుతో ప్రేక్షకులకు గుర్తుండేలా నటించింది .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి , నారాయణరెడ్డి , సిరివెన్నెల పాటలను బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు . హిట్టయ్యాయి కూడా . సుందరం మాస్టారు , ప్రభుదేవా డాన్సుల్ని బాగా కంపోజ్ చేసారు .

ముఖ్యంగా ఓం నమో నమా యవ్వనమా రావమ్మ డ్యూయెట్ బాగుంటుంది . అలాగే హత్తెరి అదో మాదిరి , నెలరాజా ఇటు చూడరా , జిజ్జనక జిజ్జనక డ్యూయెట్లు కూడా బాగా చిత్రీకరించబడ్డాయి . విజయశాంతిని టీజ్ చేసే వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తిని పాట బాగుంటుంది . వెంకటేష్ ఎనర్జిటిక్ గా డాన్సిస్తాడు .

సినిమా యూట్యూబులో ఉంది . తరచూ టివిలో కూడా వస్తూ ఉంటుంది . ఇంతకుముందు చూడనట్లయితే వాచ్ లిస్టులో పెట్టుకోవచ్చు . It’s an action entertainer .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సాహసి CM విజయ్! బెరుకు లేదు- పెరియార్ భావజాలానికి తిరస్కృతి
  • తుంగభద్రపై ముగ్గురు ముఖ్యమంత్రులతో కేంద్రం కీలక భేటీ
  • బహుళ ప్రశంసల బడ్డీ మదర్ ! – ఎవరు ఈ IAS లక్ష్మీ ప్రియ?
  • పాలకుడు చుక్కలు చూపిస్తే… SBI ఐతేనేం? ఎందుకు దిగిరాదు?
  • ఇళయరాజాతో ఏదో తేడా కొట్టింది! వంశీ హార్మోనియం అందుకున్నాడు!!
  • రోత ఆహార్యం! – ఒక సీఎం భార్యకే ఇలా డ్రెస్ సోయి లేకపోతే ఎలా?
  • భేష్ శ్రీచరణి! ఐసీసీ నంబర్ వన్ ర్యాంకింగ్- ఆషామాషీ కాదు!
  • ‘మెట్రోపై ముందడుగు’ – ప్రస్తుతానికి ఓ పే-ద్ద భేతాళ ప్రశ్న!
  • 00.00 – హేపీ బర్త్ డే డియర్ సీఎం… త్రిష చాలా తెలివైంది సుమీ!
  • రోజులు బాగాలేవు..! పెళ్లాల్నే కాదు, కాబోయే పెళ్లాలతోనూ బహుపరాక్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions