Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ వ్యవస్థలో వాళ్లకు ఏ హక్కులూ సాయాలూ అక్కర్లేదా..? అవి అస్థిపంజరాలా..?!

April 28, 2026 by M S R

.

ఏటా లక్షల కోట్ల రుణాల్ని రద్దు చేస్తూ, కార్పొరేట్ అక్రమార్కులకు వంత పాడే, డప్పు కొట్టే వ్యవస్థ మనది… సిగ్గుపడదాం… ఢిల్లీ పీఠంపై ఎవరున్నారనేేది వదిలేయండి… సోనియా పాలనలో అలియాస్ ఓ రిమోట్ మన్మోహనుడి పాలనలో అక్రమార్కులు అనేకులు లక్షల కోట్లను పొందారు, అఫ్‌కోర్స్ ఆదానీ వంటి మోదీయులు తరువాత కాలంలో… అలా మన సిస్టమే భ్రష్టుపట్టింది…

ఎవరెంత భారీగా బ్యాంకు రుణాల్ని ఎగ్గొడితే వాడు తోపు మన నవీన దురదృష్టపు సమాజంలో… అరె, ప్రతిసారీ మోదీని తిట్టకండి… తనకు సిస్టమ్ మార్పుల గురించి తెలిస్తే కదా… తెలిసినా చేస్తే కదా… తనకు దివంగత పరీకర్ వంటి మంత్రులు ఇప్పుడెక్కడున్నారు..? నిర్మలా సీతారామన్‌లు తప్ప… ఆమె మొగుడు తెల్లారిలేస్తే మోదీ ప్రభుత్వాన్ని తిడుతుంటాడు…

Ads

సరే, ఈ ఉద్దేశపూర్వక బ్యాంకు రుణాల ఎగవేత దొంగల్లో తెలుగువాళ్లే పక్కా స్టువర్ట్‌పురం బ్యాచ్… ఫాఫం, వాళ్లు నథింగ్, వీళ్లు కాలరెగరేసుకుని మరీ వేల, లక్షల కోట్లను దిగమింగే డ్యాష్ డ్యాష్ బ్యాచులు కదా… ఎందుకు చెబుతున్నానూ అంటే… తన సోదరి బాపతు డబ్బు ఇవ్వని బ్యాంకుల దగ్గరకు, తనే స్వయంగా పాతిపెట్టిన సోదరి సమాధిని తవ్వి తీసుకొచ్చిన ఓ అమాయక గిరిజనుడి కథను చదివాం కదా, దానికి ఇది కొనసాగింపు… ఓసారి ఇది చదవండి…



సమాధి నుంచి లేచి బ్యాంకుకు వచ్చిన ఓ అస్థిపంజరం… చదువుతుంటేనే…!!



నిజమేమిటంటే..? క్లాస్ వన్ వారసుల కిందకు భాగస్వామి లేదా పిల్లలు, తల్లి, తండ్రి… వాళ్లు లేకపోతే సెకండ్ లేయర్ వారసులు, అంటే అన్న, తమ్ముడు ఎట్సెట్రా… నామినీ పేరు లేకపోతే వాళ్లకే ఆ డబ్బులు దక్కుతాయి… ఆమేరకు హిందూ సక్సెషన్ లా కరెక్టే… ఈ వివరణలన్నీ కరెక్టే… కానీ ఇక్కడ సమస్య నిరక్షరాస్యుల గురించి… ఏమీ చదువుకోని, ఏమీ తెలియని వాళ్ల గురించి…

ఈ ప్రభుత్వాలు చదువుకున్నవారి గురించి కాదు… ఈ భూమ్మీద వాళ్లకే హక్కున్నట్టు కాదు… పాపం పుణ్యం తెలియని అమాయక గిరిజనులకు ఈ ప్రభుత్వాల మీద, ఈ భూమ్మీద ఏ హక్కూ లేదా..,? వాళ్లకు ఈ ప్రభుత్వాలు సాయంగా రావద్దా… ఈ ప్రభుత్వాలు క్రియేట్ చేసుకున్న దుర్మార్గపు రూల్స్‌కు సవరణలు అక్కర్లేదా..? అవి అమాయక గ్రామీణులను మింగాల్సిందేనా..? మరి లక్షల జనధన్ యోజన ఖాతాల కథేమిటి.,.?

బ్యాంకులో నామినీలు ఉండాలి… కానీ రాయలేదు, మరెలా..? ఒక డెత్ సర్టిఫికెట్ ఈ దుర్మార్గపు వ్యవస్థలో మామూలు విషయం కాదు, మొన్న ఒక గలీజు గాడిద డెత్ సర్టిఫికెట్‌కు 20 వేలు అడిగి, ఏసీబీ ట్రాపులో దొరికాడు… అదీ శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే ‘దొం- లం- కొడుకులసలే మెసిలే లోకం…’



ఇక్కడ మరో మిత్రుడు Naren G  ఏమంటాడంటే…

·
అతను నెలల తరబడి బ్యాంకు చుట్టూ తిరిగాడు… బ్యాంకు వాళ్ళు అతనికి ఏ విధంగానూ సహాయం చేయలేదు… డెత్ సర్టిఫికెట్ తెమ్మని చెప్పడం తప్ప… అతను ఎంత మందిని సహాయం అడిగాడో తెలీదు, అతను చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు….

ఇవాళ తన చెల్లి అస్థి పంజరాన్ని తీస్కెల్లి బ్యాంకు ముందు పెట్టాడు… అది తప్పే… కానీ అతనికి ఇంకో దారి ఎందుకు దొరకలేదు? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అంబుడ్స్‌మెన్ కన్నా ఎక్కువ ప్రెషర్ పడుతుంది… అంబుడ్స్‌మెన్ అంటే మళ్లీ ఈ వ్యవస్థలోని వాళ్లే కదా అక్కడ చేరేది… మన పవర్ రెగ్యులేటరీ కమిషన్ సభ్యుల్లాగా..!




ఆ అమాయక, నిరక్షరాస్య గిరిజనుడికి ఏమీ తెలియదు… తనకు తోచిన మార్గంలో తను ధ్రువీకరణ చూపించాడు… అది తప్పే… కానీ ఒప్పు ఏమిటో చెప్పే సిస్టం ఏది..? జగన్ గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు అని ఏదో సిస్టం పెట్టాడు, సరే, తన రాజకీయ ఉద్దేశాలేమిటో, అదెలా భ్రష్టుపట్టిందో పక్కన పెడితే ప్రతి 500 జనాభాకు ఒక వాలంటీర్, లేదా ప్రభుత్వ సహాయ వ్యవస్థ అక్కర్లేదా..? ఆ దిశలో మన పయనం అక్కర్లేదా..? ఓసారి మనుషుల్లాగా ఆలోచిద్దాం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆషురెడ్డి రివర్స్ కట్నం కేసులో తెరపైకి వేణుస్వామి పేరు..!
  • ఈ వ్యవస్థలో వాళ్లకు ఏ హక్కులూ సాయాలూ అక్కర్లేదా..? అవి అస్థిపంజరాలా..?!
  • సోనియా నారంగ్… సోషల్ ప్రచారంలో నిజాలెన్ని..? అతిశయోక్తులెన్ని..?
  • 60 లక్షల సభ్యత్వాలు- ఓ నిజం… ఈ లెక్క కేసీయార్ కోసమే…
  • కుజదోషం ఎఫెక్ట్… ఆమె మనసు పారేసుకుంటుంది పాపం…
  • అపరిచిత, విశ్రాంత ఉపాధ్యాయుడికి ఉపరాష్ట్రపతి ఆత్మీయ పలకరింపు..!!
  • సమాధి నుంచి లేచి బ్యాంకుకు వచ్చిన ఓ అస్థిపంజరం… చదువుతుంటేనే…!!
  • న్యాయవ్యవస్థకే కేజ్రీవాల్ కొత్త సవాల్..! సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో..!!
  • రీల్స్, జోక్స్, డాన్స్… ఇవి కాదు, మల్లారెడ్డిది పెద్ద ప్లానింగే…
  • ఆత్మవిమర్శ, దిద్దుబాటు, రీవ్యాంప్… KCR కళ్లు తెరుచుకున్నట్టేనా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions