Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!

April 30, 2026 by M S R

.

TRS… అంటే ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించి, తరువాత అధికారం మరిగి, నానా అవలక్షణాలకు గురై తెలంగాణ సమాజంలో భ్రష్టుపట్టిపోయిన పేరు..? కాదు, కేసీయార్ తనంతట తానే ప్రధాని ఆశలతో ఉట్టికెరగాలని కలలు గని, BRS గా మార్చి, మరింత దిగజారిపోయిన పేరు…

తరువాత ఏమైంది..? ఆ తెలంగాణ ఆత్మ ఉన్న పార్టీ పేరును ఆయన బిడ్డ, ఆయన్ని ఇప్పుడు బాగా ఏవగించుకుంటున్న బిడ్డ, అవును, తెలంగాణ బిడ్డ కైవసం చేసుకోవాలని అనుకుంది… కానీ అదే తెలంగాణ రాష్ట్రసమితి పేరును ఎన్నికల సంఘం ఇవ్వదు కదా, ఏదో కూలింగ్ పీరియడ్ ఉంటుంది కదా…

Ads

అందుకని తెలంగాణ రాష్ట్ర సేన అని రిజిష్టర్ చేసుకుందని చెప్పారు.., అంటే షార్ట్ ఫామ్‌లో అదే TRS… కొట్టానులే డాడీని, బ్రదర్‌ను, తన చుట్టుపక్కల పందికొక్కులను (ఆమె చెప్పిందే) అని అనుకుంది… ఎందుకైనా మంచిదని ఆ పేరు చివరలో అసోసియేషన్ అనీ రాసుకుంది… ఏ లీగల్ చిక్కూ లేకుండా…

పాత పేరు, కొత్త ఎజెండా అని ఆమె ఎప్పుడైతే అన్నదో అప్పుడే హరీష్ రావుకు డౌటొచ్చింది… ముదుర్స్ కదా… వెంటనే ఢిల్లీ వెళ్లాడు, జీవన్ రెడ్డి చేరిక, జగిత్యాల సభ మన్నూమశానం అన్నీ వదిలేసి… ఎన్నికల సంఘం వాళ్లతో భేటీ… షార్ట్ ఫామ్స్ మాకెందుకు, ఆ పేరు గతంలో లేదు, కొత్త పేరు, అన్నీ వోకే అన్నారు వాళ్లు…

కాకపోతే ఇది జనంలోకి రాంగుగా, అంటే టీఆర్ఎస్ పేరుపై కేసీయార్, కేటీయార్, హరీష్ అండ్ కో భయపడుతున్నదని జనంలోకి వెళ్తే కష్టమని భావించి… (కవిత పార్టీ ప్రకంపనలు మరి)… అప్పటికప్పుడు కాళేశ్వరం కేసు ఫాలో అప్, ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఏవేవో సాకులు చెప్పేలా ఓ లాయర్‌తో దిగిన అర్జెంటు ఫోటోను జనంలోకి వదిలారు… హరీష్ రావు అండ్ కో ఇందులో సిద్ధహస్తులు కదా…

తీరా చూస్తే ఏమైంది..? అనుకోని ట్విస్టు… కవితకు కూడా షాక్… ఆమె ఏం చెప్పుకుంది…? తెలంగాణ రాష్ట్ర సేన అని కదా… ఇదుగో ఇదే కదా.,.. పసుపు బ్యాక్ గ్రౌండ్, దిగువ ఆకుపచ్చ, బ్లూ బ్యాక్ డ్రాప్‌లో టీఆర్ఎస్ రివర్స్ లెటర్స… ఆమె ఏం చెప్పుకున్నా… టీడీపీ, బహుజనం, మైనారిటీ ఎజెండా అనే విమర్శలూ వచ్చాయి… (అసలు అసోసియేషన్ అనే సఫిక్స్‌ను కూడా ఆమె దాచిపెట్టింది, అశ్వత్థామ హత కుంజర అన్నట్టుగా..,. కానీ ట్విస్టులు అనేకం)…

టీఆర్ఎస్

Screenshot

సీన్ కట్ చేస్తే… ఆమె పార్టీ పేరు ఏమిటో తెలుసా… తెలంగాణ రాష్ట్ర సేన కాదు… తెలంగాణ రక్షణ సేన అట… ఇదుగో తాజా వార్త…



బిగ్ బ్రేకింగ్….

టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవితకు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర

అధికారికంగా ఆమోదం తెలిపిన సీఈసీ

ఈనెల 25న మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించిన కల్వకుంట్ల కవిత

తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం

బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో పార్టీకి అనుమతి ఇస్తూ లేఖ అందజేసిన అధికారులు



ఓహ్, రాష్ట్ర సేన కాదు, రక్షణ సేనా..? మరి ఆమె అధికారికంగా పార్టీ ఆవిర్భావ వేదిక మీద అలా ఎలా తప్పు పేరును ప్రకటించినట్టు..? ఏదో తేడా కొడుతోంది సీనా… చివరకు పార్టీ పేరు ఏమిటో కూడా తెలియదా ఆమెకు ఫాఫం..? వేల మంది ప్రకటించినప్పుడు వెనుకాముందూ చూసుకోలేదా ఫాఫం..?

సరే, ఒకటి మాత్రం నిజం… TRS పేరును ఆమెకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక ఎంటైర్ బీఆర్ఎస్ ముఖ్యులు గింజుకుంటున్నారు… ఉలిక్కిపడుతున్నారు… ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పేరు ఆమెకు రాకుండా ఉండేందుకు…? అన్నీ ఫెయిల్… కాకపోతే రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన…!!



రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన, చివరలో అసోసియేన్ గట్రా అనే ఊహాగానాల నేపథ్యంలో కవిత ఓ క్లారిటీ ఇవ్వాలని ‘ముచ్చట’ ఓ కథనం రాసింది… జనంలో అనేక రాంగ్ సంకేతాలు పోతున్నాయని… ఇప్పుడు ఆ రాంగ్ సంకేతాలు మరిన్ని రెట్లు పెరిగి జనంలోకి పోయాయి… ఎస్… ఫాఫం కవిత… తెలివి కలిగిన పిండం అనుకున్నాం… చివరకు ఇంతేనా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మావిగన్! ఆంధ్రుల రాజధాని ఇక ఎప్పటికీ ఓ ప్రశ్నార్థకమే!!
  • గోల్డ్ మార్కెట్! మన ‘బంగారు తల్లుల’ కొత్త పాఠాలు – అనూహ్య మార్పు!!
  • ‘తిరుచ్చిలో మా పోటీ అనైతికం’ – త్రిష కాళ్లల్లో లారెన్స్ కట్టెలు!
  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!
  • తల్లిదండ్రుల ఓవర్ కంట్రోల్ అసలు సమస్య – చేతన్ భగత్ విశ్లేషణ!
  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions