Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హిమాలయాల నిశ్శబ్దంలో ఓ అద్భుతం… అలీనా వెట్రోవా ‘పునర్జన్మ’ కథ…!

May 1, 2026 by M S R

.

కొన్ని కథలు వింటుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది… భయంతో కాదు, తర్కానికి అందని నిజాలు, ప్రకృతి చేసే వింతలు, మనిషి ఊహకు కూడా అందని నిజాలతో…. సరిగ్గా అలాంటి ఒక కథే ఇప్పుడు సోషల్ మీడియాను, ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది… ఇది ఒక రష్యన్ విద్యార్థిని కథ… మంచు కొండల్లో కాలిపోయిన ఆశల కథ… నాలుగు ఏళ్ల తర్వాత మళ్లీ చిగురించిన అద్భుత గాథ!

అదృశ్యం: హిమపాతంలో మిగిలిన ప్రశ్న…. కథ 2021లో మొదలవుతుంది… 24 ఏళ్ల రష్యన్ యువతి, అలీనా వెట్రోవా…. సాహసయాత్రలంటే ప్రాణం ఇచ్చే అలీనా, ఒంటరిగా హిమాలయాల్లోని ‘అన్నపూర్ణ బేస్ క్యాంప్’ ట్రెకింగ్‌కు బయలుదేరింది… ఆ ప్రయాణంలోనే ఆమె ఆఖరిసారిగా కనిపించింది… వారం గడిచింది… నెల గడిచింది… నేపాల్ సైన్యం, రష్యన్ రెస్క్యూ టీమ్స్ జల్లెడ పట్టాయి… కానీ అంతుచిక్కని మంచు తుఫానులు ఆమె ఆనవాళ్లను మింగేశాయి…

Ads

ఆమె సొంత ఊరు నోవోసిబిర్స్క్‌లో కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు… ప్రతీకాత్మక అంత్యక్రియలు కూడా ముగిశాయి… రికార్డుల ప్రకారం అలీనా వెట్రోవా ‘మరణించింది’…

 2025: ఊహించని మలుపు… 

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత… కాలం మళ్ళీ వెనక్కి తిరిగింది… హిమాలయాల్లోని మారుమూల మఠాలపై డాక్యుమెంటరీ తీస్తున్న ఒక బృందం, సముద్ర మట్టానికి 4,800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక ఏకాంత మఠానికి చేరుకుంది… అక్కడ వారికి ఒక దృశ్యం కనిపించింది… బర్గండీ రంగు వస్త్రాలు ధరించి, గుండు చేసిన తలతో, ప్రశాంతమైన ముఖవర్చస్సుతో ఒక యూరోపియన్ యువతి…

ఆమె మరెవరో కాదు… చనిపోయిందని ప్రపంచం భావించిన అలీనా!

అలీనా నుంచి ‘టెన్జిన్ డోల్మా’ దాకా..

ఆమె కథ ఇప్పుడు ఒక మిస్టరీ… ఆ రోజు మంచులో స్పృహ కోల్పోయిన ఆమెను కొందరు బౌద్ధ సన్యాసులు కాపాడారు… హిమాలయ మూలికల వైద్యంతో ఆమెకు ప్రాణం పోశారు… స్పృహ వచ్చేసరికి దారులు మూసుకుపోయి ఉండటంతో, ఆమె అక్కడే ఉండిపోయింది…

  • కొత్త గుర్తింపు…: సన్యాసులు ఆమెకు ‘టెన్జిన్ డోల్మా’ అని పేరు పెట్టారు…

  • అద్భుత శక్తి…: అలీనాకు ఒక అరుదైన సామర్థ్యం పట్టుబడింది… కేవలం వాసన ద్వారా పర్వత ప్రాంతాల్లో దొరికే 600కు పైగా ఔషధ మొక్కలను ఆమె గుర్తించగలదు… 40 ఏళ్లుగా ఖాళీగా ఉన్న మఠం ఔషధశాలకు ఇప్పుడు ఆమె వారసురాలు…

ఇది నిజమా? కల్పితమా? (The Fact Check)… ఈ కథ వినడానికి సినిమాటిక్‌గా ఉన్నప్పటికీ, జర్నలిజం కోణంలో పరిశీలిస్తే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి… నెట్ ప్రపంచాన్ని జల్లెడ పట్టినప్పుడు తేలిన కొన్ని వాస్తవాలు ఇవే…

  1. అధికారిక ధృవీకరణ లేదు…: ఏ ప్రధాన అంతర్జాతీయ వార్తా సంస్థ లేదా రష్యన్ మీడియా ఈ వార్తను అధికారికంగా ధృవీకరించలేదు…

  2. ఫోటోల మిస్టరీ…: ఈ కథనంతో పాటు షేర్ అవుతున్న ఫోటోలు తరచుగా ఏఐ (AI) సృష్టించినవి లేదా ఇతర మతపరమైన డాక్యుమెంటరీల నుంచి సేకరించినవిగా కనిపిస్తున్నాయి…

  3. అర్బన్ లెజెండ్…: హిమాలయాల చుట్టూ ఇలాంటి “అద్భుత పునరాగమనం” కథలు తరచుగా పుట్టుకొస్తుంటాయి…. మనుషుల్లో ఆశను, ఆధ్యాత్మికతను పెంచేందుకు ఇలాంటి కథనాలను ఎవరో ఒకరు సృష్టించే అవకాశం ఉంది…

అలీనా వెట్రోవా కథ నిజమైనా, కాకపోయినా… ఇందులో ఉన్న సందేశం మాత్రం శక్తివంతమైనది… “పర్వతాలు ఎవరిని ఎంచుకుంటాయో.. వారిని తిరిగి వెళ్లనివ్వవు” అని ఆమె చెప్పినట్లుగా ఉన్న మాటలు మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేస్తున్నాయి…

ఒకవేళ ఇది నిజమైతే, ఆధునిక సమాజానికి ఇది ఒక గొప్ప పాఠం… ఒకవేళ ఇది కల్పితమైతే… ఒక మనిషి శాంతి కోసం ఎంతటి ప్రయాణమైనా చేయగలడని చెప్పే ఒక అద్భుతమైన ఊహ…!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒకరు ఐపీఎస్… మరొకరు ఐఐటీ… కొత్త డీజీపీ కుటుంబ నేపథ్యం…
  • హహహ…! బిడ్డింటికి దారేది..? స్పూఫ్… నవ్వు ఆపుకుంటున్నవ్ కదరా..!!
  • గెలిచిన గుజరాత్ పైకి ఎక్కలేదు… ఓడిన బెంగుళూరు దిగిపోలేదు…
  • హిమాలయాల నిశ్శబ్దంలో ఓ అద్భుతం… అలీనా వెట్రోవా ‘పునర్జన్మ’ కథ…!
  • కోర్టు వర్చువల్ విచారణ సందర్భంగా అశ్లీల వీడియోల ప్రదర్శన
  • టీఆర్ఎస్… పార్టీ పేరు, అనుమతి… బభ్రాజమానం- భజగోవిందం…
  • చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
  • ‘కర’… ఉత్త సోది… ధనుష్ ఎందుకిలాంటి సినిమాలు చేస్తాడు…?
  • TRS… కవిత పార్టీ పేరులో మరో ట్విస్టు… రాష్ట్ర సేన కాదు, రక్షణ సేన..!!
  • ఆ అసందర్శపు, అసంగత ప్రశ్నకూ… ఆమె పరిణత జవాబు సూపర్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions