.
Pardha Saradhi Upadrasta … శబరిమల PILపై సుప్రీంకోర్టు స్ట్రాంగ్ కామెంట్స్!
శబరిమల అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. కానీ ఈసారి ఫోకస్ ఆలయం కాదు..
PILల అసలు ఉద్దేశం మీదే!
సీజేఐ షాకింగ్ కామెంట్…
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ:.. “ఆ PIL అప్పుడే చెత్తబుట్టలో వేయాల్సింది!” అన్నారు…
Ads
పిటిషనర్ అర్హతపై సందేహం…
ధర్మాసనం అసలు పిటిషనర్ locus standi (అర్హత) , ఉద్దేశాన్ని ప్రశ్నించింది.
Indian Young Lawyers Association తరఫున 2006లో ఈ పిటిషన్ దాఖలైంది. పిటిషన్ వేసింది ‘ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్’ (IYLA) అధ్యక్షుడు నౌషాద్ అలీ…. ఇక్కడ కోర్టు ఉద్దేశ్యం హిందూ దేవుళ్ళ నమ్మకాల గురించి, వాటితో వేరే వారు ప్రభావితం కావప్పుడు వాళ్ళు పిల్ ఎందుకు వేశారు? అసలు కోర్టు అప్పుడు ఎందుకు తీసుకుంది అని. చాలా మంచి ప్రశ్న…
కోర్టు ప్రధాన సందేహం… పిటిషన్ వేసిన వారికి వ్యాజ్యం వేసే అర్హత ఉందా? ఇది నిజంగా ప్రజల ప్రయోజనానికేనా?
ఇంకా జడ్జీల స్ట్రాంగ్ అభిప్రాయాలు….
జస్టిస్ B. V. Nagarathna…: “పిటిషన్ తీసుకోకపోతే భద్రత సమస్యే ఉండేది కాదు…”
జస్టిస్ M. M. Sundresh…: “ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం….”
బ్యాక్‌డ్రాప్ (2018 తీర్పు)… అప్పటి సీజేఐ Dipak Misra నేతృత్వంలో…
మహిళల ప్రవేశ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది…
ఇప్పుడు అసలు ప్రశ్న…
“PILలు నిజంగా ప్రజల కోసమేనా? లేక అజెండాల కోసమా?”
శబరిమల కేసు ఇప్పుడు కేవలం ఆచారాల గురించి కాదు, న్యాయవ్యవస్థ వినియోగం ఎలా జరుగుతోంది అన్న దానిపై పెద్ద చర్చ!…. —- ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #Sabarimala #SupremeCourt #PIL #Judiciary #ayyappan_sabarimalai
Share this Article