.
Subramanyam Dogiparthi … శోభన్ బాబు , బాలకృష్ణల రేర్ కాంబినేషన్. ఆరోజుల్లోనే మూడు కోట్ల భారీ బడ్జెట్టుతో వచ్చిన సినిమా ఈ అశ్వమేధం . ఇద్దరు హీరోయిన్లు . అమ్రీష్ పురి ద్విపాత్రాభినయం . ఆశా భోంస్లే పాటలు కూడా ఉన్నాయి . అయినా ఆ లెవెల్లో ఆడలేదు .
రామలక్ష్మణులు వంటి అన్నాదమ్ములు శోభన్ బాబు , బాలకృష్ణ . అన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ , తమ్ముడు పైలట్ . అమ్రీష్ పురి , కోట శ్రీనివాసరావు , రాధా రవి విలన్లు . ఆయుధాల అక్రమ వ్యాపారస్తులు . సిన్సియర్ ఆఫీసరయిన శోభన్ బాబుని చేయని హత్య కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి అవమానిస్తారు .
Ads
ఖిన్నుడైన శోభన్ బాబు ఆత్మహత్య చేసుకోవటంతో తమ్ముడు అశ్వమేధాన్ని మొదలుపెట్టి విలన్లను తుదముట్టించి దేశాన్ని విధ్వంసం నుండి కాపాడతాడు . అయితే ఇద్దరు హీరోయిన్లలో ఒకరయిన మీనాకు అన్యాయం చేసాడు రాఘవేంద్రరావు . అలా ముగుస్తుంది సినిమా .
సినిమాకు ప్లస్ ఇళయరాజా సంగీతంలో వేటూరి వారి పాటల్ని బాలసుబ్రమణ్యం , ఆశా భోంస్లే , జానకమ్మ , చిత్రలు శ్రావ్యంగా పాడారు . కొన్ని పాటలు రాజస్థాన్ పేలసుల్లో షూట్ చేయబడ్డాయి . ప్రభు దేవా డాన్సుల్ని అందంగా కంపోజ్ చేసాడు .
ఓ ప్రేమా నాలో నువ్వే ప్రేమా , చెప్పనా ఉన్న పని చెయ్యనా కాస్త పని , గుంతలకిడి ఘుమ ఘుమందం , శీతాకాలం ప్రేమకు ఎండాకాలం , ఏం దెబ్బ తీసావురా ఓ యబ్బ నచ్చావురా అంటూ సాగే డ్యూయెట్లు హీరోహీరోయిన్ల మీద బాగా వచ్చాయి . ఫేమిలీ సాంగ్ జుం చకు చకు ఆనందాలే పొంగే పాట బాగా చిత్రీకరించబడింది .
బాలకృష్ణ , నగ్మాలు నటించిన ఏకైక చిత్రం . బాలకృష్ణకు మీనాతో మొదటి సినిమా . ఇతర పాత్రల్లో బ్రహ్మానందం , ప్రసాద్ బాబు , అల్లు రామలింగయ్య , గీత , తదితరులు నటించారు . కధను , డైలాగులను సత్యానంద్ వ్రాయగా , స్క్రీన్ ప్లేని యండమూరి సమకూర్చారు . రాఘవేంద్రరావు దర్శకుడు , అశ్వినీదత్ నిర్మాత . సినిమా యూట్యూబులో ఉంది . బాలకృష్ణ అభిమానులు చూడవచ్చు .
Share this Article