Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!

May 9, 2026 by M S R

.

ఓ పాత తెలుగు సినిమా… విలన్ సత్యనారాయణ… టెలిఫోన్ పబ్లిక్ బూత్‌లో కూర్చుని, ఎవరికో కాల్  చేసి బెదిరిస్తూ… చేతిలో బొద్దింకను పట్టుకుని, చేతిలోని సిగరెట్ దాని తలపై పెడతాడు… చూస్తుంటేనే ఓ గగుర్పాటు… మరిప్పుడు అంతకు వేల రెట్లు హింస… థియేటర్లలో నెత్తుటి కమురు వాసన… తెరపై రక్తపాతం…

ఎంత ఎక్కువ హింస చూపిస్తే అంత సక్సెస్ అవుతామనే పిచ్చి భ్రమలో దర్శకులు, హీరోలు… పైగా ఇప్పుడు పెద్ద పెద్ద స్క్రీన్లు, డాల్బీ ఆడియోలలో ఆ హింస మరింత భయాన్ని కలిగించి, మనిషిని తల్లడిల్లజేసేలా… తాజా ఉదాహరణ రేజర్… ఆ పాత హింసధ్వనులను మించి పరమహింస… పోర్క్‌తో కనుగుడ్లు పీకేయడాలు, తలలు, కాళ్లు అడ్డంగా నరికేయడం… ఓ చిన్నారిని ఎత్తుకుని, రౌడీలను వరుసగా పొడుస్తూ, నరుకుతూ వెళ్తుంటాడు హీరో…

Ads

ఒక దశలో సెన్సార్ బోర్డే ఠారెత్తిపోయి ఆ సీన్ల నిడివిని కత్తిరించాలని కోరినా… మార్చినా… ఆ హింస తీవ్రత స్థాయి మాత్రం తగ్గలేదు… అంటే ఒరిజినల్ సినిమా సీన్లు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలి… నిజానికి హీరో, దర్శకుడు రవిబాబు గతంలో అనసూయ వంటి సినిమాలు తీశాడు, భిన్నమైన థీమ్స్, వెరయిటీ కలర్ పాలెట్స్‌తో ఓ డిఫరెంట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు… సినిమాలు ఫెయిలైనా పాసైనా ఓ డిఫరెంట్ కేరక్టర్ తను…

వారం రోజుల నుంచీ మీడియాలో ఊదరగొడుతున్నాడు ప్రచారం, ఇంటర్వ్యూలు… తీరా సినిమా చూస్తేనేమో హెవీ వయెలెన్స్.,. మార్కో, కిల్ వంటి సినిమాల్లో కనిపించిన వీర హింసను మించి… అఫ్‌కోర్స్ ఆ సినిమాల్లో కాస్త ఎమోషన్, ఆర్ద్రత కనిపిస్తాయి… దురంధర్ సినిమాల్లో దేశభక్తి అనే ఎమోషన్ ఉంది… కానీ రేజర్ సినిమాలో హీరో నేపథ్యం కూడా ఎమోషన్ లెస్… ఎందుకోగానీ బరువైన సన్నివేశాల్లో రవిబాబుకు ఇప్పటికీ డైలాగ్ డెలివరీలో తడబాటే…

పైగా దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించిందట… ‘రేజర్’ వంటి సినిమాలను ‘గ్రిట్టీ’ (Gritty), ‘డార్క్’ (Dark) సినిమాలు అంటారు… హింసను లేదా క్రైమ్‌ను గ్లామరైజ్ చేయకుండా, వాస్తవానికి దగ్గరగా, చాలా పచ్చిగా (raw) చూపించినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తారు… వీటిని ‘గ్రిట్టీ క్రైమ్ థ్రిల్లర్స్’ అని  పిలుస్తారు… ఆ ఇంపాక్ట్ మరింత బలంగా ఉండేందుకు డార్క్ అట్మాస్పియర్, అంటే సినిమా అంతా ఒక విధమైన సీరియస్ మూడ్‌లో, తక్కువ వెలుతురులో (low-key lighting) సాగుతుంది…

ఇలాంటి సినిమాలనూ ఇష్టపడేవారు ఉంటారేమో… కానీ తక్కువ తక్కువ శాతం… అసలు ప్రేక్షకుడు మరీ ‘థియేటర్ ఎక్స్‌పీరియెన్స్’ బలంగా ఉండే మూవీస్‌కు కూడా థియేటర్‌కు రావడం లేదు… మరి ఇలాంటి సినిమాలను చూడటానికి ఎవరు రావాలి రవిబాబూ..? ఈ సినిమా కథలోకి, దాని సమీక్షలోకి వెళ్లడం లేదు ఇక్కడ… రవిబాబు తనకున్న టాలెంట్ ఇలా వృథా అయిపోతున్నదని చెప్పడం కోసమే ఇదంతా..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నంబర్లాట- నవ్వులాట..! అనామక పార్టీలూ ‘ఆడుకుంటున్నయ్’…!!
  • ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!
  • పరివార్‌వాద్… వారస రాజకీయాలు… ఏ పార్టీ మినహాయింపు కాదు…
  • సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!
  • తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…
  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…
  • డ్రగ్స్ తంబాకు కాంబో… కరీంనగర్‌లో సైడ్ ఎఫెక్ట్స్… కేటీయార్‌కు తల్నొప్పి…
  • ఆనందప్రకాష్… ఓ రాక్షసుడితో 19 ఏళ్ల అలుపెరుగని పోరాటం…
  • ప్రతిష్టంభన..! తగ్గని గవర్నర్…! తలైవా కథ సుప్రీం కోర్టు వైపు..?
  • ‘‘తమిళ గవర్నర్ తప్పు లేదు… స్పష్టత కోరడం న్యాయసమ్మతమే’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions