.
Subramanyam Dogiparthi …. ఫుల్ కాలక్షేపం బఠాణీల సినిమా . కామెడీ స్కూల్ మాస్టారు రేలంగి నరసింహారావు గారే కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాలను సమకూర్చుకున్నారు . ఆయన సినిమాలలో హాస్యం , అల్లరి , గందరగోళం , వగైరాలు సాధారణం కదా ! అవన్నీ ఉన్నాయి . మరీ ప్రేక్షకుడిని ఏమీ సందేశం ఇవ్వకుండా పంపితే బాగుండదనేమో భార్యాభర్తలు బాధ్యతగా ఉండకపోతే పిల్లలు చెడిపోతారనే ఓ సందేశాన్ని ఇస్తారు . సినిమా పేరు ‘చిల్లర మొగుడు- అల్లరి కొడుకు‘…
It’s a hilarious movie . చంద్రమోహన్ , జయసుధ ఒక జంట . కోట శ్రీనివాసరావు , వై విజయ ఒక జంట . గిరిబాబు , శ్రీలక్ష్మి ఒక జంట . మల్లికార్జున రావు , జయశీల ఒక జంట . ఇన్ని హాస్య జంటలు ఉంటే వినోదం కావలసినంత .
Ads
It’s a comedy of mistaken identities . చంద్రమోహన్ జయసుధ ఇంట్లో అద్దెకు దిగుతాడు . మగ దిక్కు లేనివారు కావటంతో పెళ్ళి అయిందని జయసుధ చంద్రమోహన్ కు అబధ్ధం చెపుతుంది . ఆ భర్త ఎవరో కనుక్కోవాలనే తాపత్రయంలో వారింటికి వచ్చిన SI గిరిబాబుకు సెకండ్ సెటప్ అనుకుంటాడు .
ఆ గందరగోళాన్ని గిరిబాబు అసలు కళత్రం శ్రీలక్ష్మికి చెప్పటంతో గోలగోల అవుతుంది . ఆ గందరగోళానికి తెర దించి చంద్రమోహన్ , జయసుధలకు పెళ్లి జరిపిస్తాడు . వాళ్ళకో అల్లరి కొడుకు . వాడి గడసరితనంతో అందరూ కోర్టుకు ఎక్కుతారు . అక్కడ జ్ఞానోదయం కావటంతో సినిమా శుభాంతం అవుతుంది .

చంద్రమోహన్ చిల్లర వసూలు చేసే కానిస్టేబులుగా చిల్లర మొగుడు . ఇప్పుడు అలాంటి పాత్రను చూపితే పోలీస్ సంఘాలు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కోర్టుకు వెళతారు . అప్పట్లో హాస్యాన్ని హాస్యంగానే తీసుకునేవారు .
ఆద్యంతమూ హాస్యంగా నడిచే ఈ సినిమాలో ఇతర పాత్రల్లో చిన్న , అరుణశ్రీ , సుత్తి వేలు , వల్లభనేని జనార్దన్ , బాబూ మోహన్ , సిల్క్ స్మిత , మాస్టర్ ఆదిత్య తదితరులు నటించారు .
విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో వెన్నెలకంటి , జొన్నవిత్తుల పాటల్ని బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ , మిన్ మినీ , బేబీ అనూరాధ పాడారు . థియేటర్లో బాగానే ఉంటాయి . ఏమండోయ్ వచ్చారా ఏదీ పంచదార , ఎర్ర టోపీ ఓడు , తింగరబుచ్చి , జనవరి ఒకటిన , అల్లిబిల్లి పాట పాడే అంటూ సాగుతాయి పాటలు .
పోలీస్ స్టేషన్లో నకిలీ ఆఫీసరుగా వచ్చి వల్లభనేని జనార్దన్ సెల్లో ఉన్న డాన్సర్లతో డాన్స్ ఆడించటం హాశ్చర్యంగా ఉంటుంది . నోరు లేని జనాన్ని దడదడలాడించే పోలీసులు ఇంత gullible గా ఉంటారా అనిపిస్తుంది . అనిపిస్తే అనిపించింది కానీ సిల్క్ స్మిత డాన్సుతో ప్రేక్షకులను ఊపేస్తుంది .
శంకరమంచి పార్ధసారధి మొదటిసారిగా ఈ సినిమాకు డైలాగులను వ్రాసారు . అల్లాడ సత్యనారాయణ నిర్మాత . సినిమా యూట్యూబులో ఉంది . హాస్య ప్రియులకు బాగానే ఉంటుంది . కాలక్షేపం బఠాణీలు . చూడబులే …
Share this Article