Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు ఈ ‘చదివింపులు భోజనం’ తెలుగునాట ఉందా చినరాయుడూ?

May 15, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. వెంకటేష్ జైత్రయాత్రలో మరో మ్యూజికల్ హిట్ సినిమా 1992 లో విడుదల అయిన ఈ చినరాయుడు . ఇది కూడా రీమేకే . తమిళంలో సూపర్ హిట్టయిన చిన్న గౌండర్ సినిమాకు రీమేక్ . అందులో విజయకాంత్ , సుకన్య , మనోరమ ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ సినిమా కన్నడంలోకి కూడా రీమేక్ అయింది . అక్కడ రవిచంద్రన్ , గౌతమి లీడ్ రోల్సులో నటించారు .

పూర్తి గ్రామీణ నేపధ్యంలో కధ. ఓ ఊళ్ళో ఒకప్పుడు పెదరాయుడు గారు తీర్పులు చెప్పేవారు . ఆయన చనిపోయాక ఆయన కొడుకు చినరాయుడు తీర్పులు చెప్పే సీట్లోకి వస్తాడు . అతనికో బావ విలన్ . అతనికో ఉంపుడుగత్తే . ఆమెకో తమ్ముడు . ఇది విలన్ బేచ్ .

Ads

ఆ ఊళ్ళోనే మేకలు కాసే దుర్గ (విజయశాంతి) చినరాయుడుని లవ్వాడుతుంది . పెళ్లి కూడా అవుతుంది . భర్త గౌరవాన్ని కాపాడేందుకు ఆ ఊళ్ళోనే ఉండే వినోద్ ని చంపేసానని అనుకుని అరెస్ట్ అవుతుంది . నిజానికి గొంతు పిసికి చంపింది విలన్ బావే . ఇలా మలుపులు తిరుగుతూ విలన్లను హతమార్చి కేసుల నుండి విముక్తితో సినిమా ముగుస్తుంది .

ఈ సినిమాలో ముందుగా మెచ్చుకోవలసింది దర్శకుడు బి గోపాల్‌ను , స్క్రీన్ ప్లేని తయారు చేసిన ఆర్ వి ఉదయ కుమార్‌ను . పాత్రల్ని అద్భుతంగా మలిచారు . చాలా intense గా ఉంటాయి . అందుకు ధీటుగా పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ . విజయశాంతి , నిర్మలమ్మ మధ్య వెటకరింపు మాటలు , విసుర్లు చాలా బాగా ఉంటాయి .

అలాగే వెంకటేష్ , విజయశాంతి లవ్ ట్రాక్ , సరసం , రొమాన్సులు కూడా . కోట శ్రీనివాసరావు రాయుడు బంటుగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు . సినిమాలో నాగరికులకు తెలియని ఓ ఆచారం ప్రస్ఫుటంగా తెలుస్తుంది . చదివింపుల భోజనం . మన ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆచారం ఉన్నట్లు కనిపించదు . బహుశా తమిళనాడులో ఉందేమో !

ఇతర పాత్రల్లో విజయలలిత , మోహన్ రాజ్ , వినోద్ , బాబూమోహన్ , పి యల్ నారాయణ , జిత్ మోహన్ మిత్రా , హరిత , రజిత , నర్రా , రాజేశ్వరి  తదితరులు నటించారు .

సినిమా విజయానికి మరో ప్రధాన కారణం ఇళయరాజా సంగీతం . భువనచంద్ర వ్రాసిన పాటలు . బాలసుబ్రమణ్యం , జానకమ్మ ,చిత్ర గాత్రం . కంటి చూపు చాలునయ్యా చిన్న రాయుడూ , బుల్లి పిట్ట బుజ్జి పిట్ట గూటిలోని గువ్వ పిట్ట , నిండు ఆకాశమంత మనసున్న రాజువయ్యా , స్వాతి ముత్యమాల ఒళ్ళు తాకి తుళ్ళిపోయింది , చిట్టి చిట్టి నీ పైటకొంగు , చెప్పాలనుంది సుందరి అంటూ సాగే పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

డ్యూయెట్లను బి గోపాల్ చాలా రొమాంటిక్‌ గా చిత్రీకరించారు . విజయశాంతి , వెంకటేష్ అభిమానులకు బాగా నచ్చుతాయి . విజయశాంతి పొట్ట మీద బొంగరం తిప్పే సీనుని ప్రేక్షకులు అస్సలు మరచిపోరు . మరి ఇన్ని విశేషాలు ఉంటే హిట్ కాక ఏమవుతుంది ! ఇరవై కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ సినిమా తరచూ ఏదో ఒక చానల్లో వస్తూ ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . An excellent romantic , emotional entertainer . తప్పక చూడతగ్గ సినిమా .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బన్నీకి మళ్లీ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు రాలేదు ?!
  • పోసాని మార్క్ వింత విన్యాసం ! సినిమా తీసేవాడికి చూసేవాడు లోకువ !!
  • గగనానికి బాటలు వేస్తూ కొందరు – ‘జంతర్ మంతర్’ గుప్పిట్లో ఇంకొందరు
  • నో నో… ఈ కుందనపు బొమ్మకూ ఆ గణిత మేధావికీ ‘నెత్తుటి సంబంధం’ లేదు !!
  • ఇదేం పైత్యంరా !? లోదుస్తుల చోరీ ఫుటేజ్ చూసి పోలీసులూ విభ్రాంతి !!
  • ‘‘నేను ఆ శివుడి ఉనికిని ఫీలయ్యాను- అది నిజంగా నా అదృష్టం’’
  • థ్రిల్లర్ ! మెస్సీని భజిస్తున్నాం కానీ ఎంబాపె అసలైన ఫైటర్ !!
  • జాతీయ అవార్డుల ఎంపిక పర్లేదు – మనకూ బాగానే వచ్చాయి
  • మహానటికన్నా ఏం తక్కువ ? మరువలేని అభినయ *సౌందర్యం !
  • సాక్షి రాసింది… సగం అబద్ధం – సగం నిజం … దేని గురించంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions