Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు

May 16, 2026 by M S R

.

చిన్న స్పాట్ వార్తే… మూడు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి బెంగాల్‌లో బీజేపీ గెలుపును అమెరికాలో సెలబ్రేట్ చేసుకున్నారు ప్రవాస భారతీయులు… అదీ వార్త… కానీ అందులో ఆసక్తికరంగా అనిపించింది ఏమిటంటే… ఎన్నికల ప్రచారంలో మోడీ కలకత్తాలో, ఓ చిన్న నమ్‌కీన్ దుకాణంలో ‘జాలమురి’ తిన్న వీడియో వైరల్ అయ్యింది గుర్తుంది కదా…

దాంతో ఆ చిరుతిండికి విశేష ప్రాధాన్యం వచ్చింది తెలుసు కదా… ఈ ప్రవాస భారతీయుల సెలబ్రేషన్స్‌లో కూడా అదే జాలమురిని ప్రత్యేకంగా వడ్డించి సంబురాలు జరుపుకున్నారు… ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ (OFBJP-USA) ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ప్రసిద్ధ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో ఘనంగా ఈ విజయోత్సవ సభ నిర్వహించారు. అమెరికాలో వర్కింగ్ డే అయినప్పటికీ, ట్రై-స్టేట్ ప్రాంతం నుండి 600 మందికి పైగా భారతీయ అమెరికన్లు ఈ వేడుకకు తరలిరావడం విశేషం…

Ads

ఈ వేడుకల్లో పశ్చిమ బెంగాల్‌లో లభించిన చారిత్రాత్మక విజయం ప్రత్యేక ఆకర్షణగా, సభికుల్లో ప్రత్యేక చర్చగా నిలిచింది… ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ విజయానికి ప్రతీకగా ఆ రాష్ట్ర ప్రత్యేక వంటకం ‘జాల్‌మురి’ (Jhal murri) ని అతిథులకు వడ్డించి వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు…

ఈ సందర్భంగా ‘ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ’ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ మాట్లాడుతూ.. భారత భద్రత, సమగ్రత దృష్ట్యా బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. భారత పార్లమెంట్ సభ్యులు మయాంక్ నాయక్ జూమ్ ద్వారా ఈ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ’ ప్రధాన కార్యదర్శి వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ.. ఇది కార్యకర్తల కఠోర శ్రమకు భారత ప్రజలు ఇచ్చిన గొప్ప గౌరవమని, అత్యంత మధురమైన విజయమని అభివర్ణించారు.

usa

తెలంగాణలోనూ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ … సంస్థ పూర్వ అధ్యక్షుడు కృష్ణారెడ్డి అనుగుల మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లోనూ ఇంతమంది ప్రవాసులు తరలిరావడం మోదీ గారి నాయకత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ‘ఆఫ్ బీజేపీ-యూఎస్ఏ’ తెలంగాణ చాప్టర్ కన్వీనర్ విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. తెలంగాణలోనూ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ రావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ కమ్యూనిటీ నేతలు జయేష్ పటేల్, చరణ్ సింగ్, ఆల్బర్ట్ జసాని, హెచ్.ఆర్. షా, డాక్టర్ సుధీర్ పారిఖ్, పీయూష్ పటేల్, కల్పనా శుక్లా, దీప్తి జాని, ప్రదీప్ కట్ట, సుమా రెడ్డి, అరవింద్ పటేల్, అమిత్ పాండే, ఆనంద్ గుప్తా తదితరులు పాల్గొని విజయానందాన్ని పంచుకున్నారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తీస్తా-3 ఓ వార్నింగ్ బెల్..! మేడిగడ్డతో ఆటలాడితే అసలుకే మోసం !!
  • ఆమె మాకొద్దు, మాకసలే వద్దు… శ్రీలీలకు ఏమిటి ఈ దురవస్థ !
  • బుల్‌డోజర్ సర్కారు! ఆ యూనివర్శిటీ 38 బిల్డింగులనూ కూల్చేస్తారట!
  • రాష్ట్రపతి అయ్యాక కూడా… ఆ మహాప్రభు అనుమతిస్తేనే దర్శనం
  • Greatest of All Time..! ఫుట్‌బాల్ GOAT ఎవరు? తేలిపోయినట్టేనా?
  • మన అన్నం పళ్లెంపై ఈయన పేరు! ఆకలి తీర్చిన నాయకుడు!!
  • శతాబ్దపు దోపిడీ..! ఇంగ్లండ్- అర్జెంటీనా వైరం మొదలైన వేళ !
  • Destiny – మెస్సీ ముద్దాడే ఈ పసికందు..! ఈ ఫైనల్స్‌లో తనకే ‘పోటీదారు’ !!
  • శిశువులకు బంగారు ఉంగరాలు – విజయ్ వైఖరిపై సందేహాలు !
  • పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నయ్ ! అసలు గేమ్ షురూ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions