Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనంత శ్రీరాముడు ఓ రోత ప్రబుద్ధుడు… ‘పెద్ది’కి పెద్ద మరక పూశాడు…

May 29, 2026 by M S R

.

అనంత శ్రీరామే కాదు… ఏ సినీగీత రచయిత కూడా శుద్ధపూస కాదు… నిర్మాత, దర్శకుడు ఏది కోరితే అది రాసిచ్చి సొమ్ముచేసుకునేవాడే… అలనాటి ప్రఖ్యాత గీత రచయితలు కూడా మినహాయింపు ఏమీ కాదు… చల్లగా లేస్తోంది పాట దగ్గర నుంచి గ్గుగ్గు గుడిసుంది దాకా… నిఖార్సయిన బూతును ప్రవహింపచేశారు అందరూ… అవును, అందరూ కవి చౌడప్ప వారసులే… బూతు గ్రంథ సాంగులే…

ఐతే… ఇక్కడ చిన్న తేడా ఏమిటంటే..? అనంత శ్రీరామ్ చేసే వెధవ, చీదర పని చేస్తూనే… సనాతన ధర్మం పేరిట ప్రవచనాలు చెబుతుంటాడు… అక్కడొస్తుంది తేడా… అప్పట్లో దిగు దిగు నాగ అనే భక్తిపాటను కూడా బూతుపాటగా మార్చిన ప్రబుద్ధుడు… అప్పట్లోనే ‘ముచ్చటించుకున్నాం’…

Ads

తాజాగా 50 రోజులు నానా అవస్థలూ పడి, మెదడు చింపుకుని రాశాడట ఒక పాట… తీరా చూస్తే మెగా పవర్ గ్లోబల్ సూపర్ స్టార్ రాంచరణ్ ఇజ్జత్ తీసేలా ఉంది ఆ పాట… పక్కా గలీజు పాట… ఎస్, ముందే చెప్పుకున్నాం కదా, ఈ అనంతుడు మొదటివాడు కాదు, చివరి వాడూ కాదు… ఇంతకీ ఆ పాటేమిటంటారా..?




మనిషన్నవోడికి ఇవి మామూలే
ప్రతి పూట తప్పని పేచీలే
అడపాదడపా ఇడిసేయ్ గడపా
ఏటి పీపీలయిపోతావ్ అతిగా..
వారానికి వెయ్యి నాకోసం దాయి
నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి..
అరకాసులు తియ్యి అరవంకీలేయ్యి
స్వర్గానికి దారి సూపిత్తాం వచ్చేయి..
అందం బిందులున్నాయ్ దా దా
ఆలోసిత్తా పోతే ఆలస్యం అయిపోదా..
ఇంట్లో వంటె తింటుంటావా
హొటల్కో దాబాకో ఓసారెల్లో ముద్ద మింగి రావా
హే ఇంట్లో తానం సాలంటావా
పండక్కో పబ్బంకో ఏట్లోకెళ్లో మునక మునిగి రావా..
ఇది కూడా అంతేరో ప్రతివారం సంతేరో
అది కూడా వగ్గేత్తే పుట్టిందింకెందుకు



ఇది ఏ ప్రాంత తెలుగు మాండలికమో నాలుగైదు ఎఐ ప్లాట్‌ఫారాలను అడిగినా… అవీ ఆలోచించి చించి స్టక్కయిపోయాయి గానీ తేల్చలేకపోయాయి… బహుశా అనంత శ్రీరాముడు సొంతంగా క్రియేట్ చేసిన ఏదో కిలికిలి వెకిలి భాష అయి ఉంటుంది…

ఒరేయ్, వారానికి ఓ వెయ్యి దాయండిరా, అమ్మడికి ఖర్చు పెట్టేసేయండి, రోజూ ఇంటి స్నానం ఏమిటి, ఎప్పుడో ఓసారి నదిలో మునిగి రావా…? ఎప్పుడూ ఇంటి వంటేనా, ఎప్పుడైనా హోటల్, దాబా తిండి తినవా..? ఇవి కూడా వదిలేస్తే ఇక జన్మెందుకు, పుట్టిందెందుకు అని తేల్చిపారేస్తున్నాడు ఈ శ్రీరాముడు…

ఆ రోత సాహిత్యం సరే గానీ… ఆ పదాలేమిటి..? ఆ చరణాలేమిటి..? దీన్ని అప్రూవ్ చేసిన మెదళ్లు ఎవరివి..? ఈ వెగటు సాహిత్యానికి సారు గారికి 50 రోజులు పట్టిందట… అదో ప్రపంచ వింత… అవునూ, సెన్సారోడికి ఇవి వినపడలేదా..? అర్థం కాలేదా..? ఎప్పటిలాగే కళ్లుచెవులునోళ్లు మూసుకుని సంతకాలు పెట్టేశారా..? ఏమో, పాట చూస్తూ స్టెప్పులు కూడా వేశారేమో అంటారా..? ఏమో, తెలియదు…

అయ్యా, మోడీ గారూ… వాటీజ్ దిస్… నువ్వేమో పొదుపు చేయండి, రాబోయేవి గడ్డు రోజులు అంటావు… వీడికెవరు గడ్డి పెట్టాలి మరి… వారానికో వేయి తగలెయి, ఎవరడుగుతారో చూద్దాం అన్నట్టు రాసి జనం మీదకు వదిలేశాడు… ప్చ్, నీ సూక్తులంటే మరీ సినిమావాళ్లకు ఎటకారం అయిపోయింది సుమీ..! అఫ్‌కోర్స్, తెలుగు నెటిజనం మాత్రం ఎక్కీదిగుతున్నారు… నిన్నటి నుంచీ..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జగములేలినవాని సగము నివ్వెరబోయె, సగము మిగిలినవాని మొగము నగవైపోయె…
  • Vaibhav Suryavanshi is illegal … Do you know why…
  • అందరూ కక్షకట్టారు, వివక్ష ప్రదర్శించారు… ఆ గ్రేట్‌నెస్ చంపలేకపోయారు…
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో “సక్సెషన్ ఎరా” ప్రారంభమైందా?
  • ఎన్టీయార్ వేషం వేస్తే విలన్ ఏమిటి..? హీరో ఏమిటి..? జస్ట్, ఎన్టీయార్… అంతే..!
  • నేనే తారలాగా వచ్చా నీ కోసం – నన్నే ఆదుకున్న నీవే ఆకాశం
  • వ్యూహాత్మక అడుగు… తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ‘ఎన్టీఆర్’ కార్డ్…!
  • Byju’s …. ఎగిరెగిరి పడటం ఎంతసేపు..? విరిగిపడటం ఎంతసేపు..?
  • అనంత శ్రీరాముడు ఓ రోత ప్రబుద్ధుడు… ‘పెద్ది’కి పెద్ద మరక పూశాడు…
  • సిద్దరామయ్య విధేయ రాజకీయాల్లో ఇమిడేనా..? భవిష్యత్ ఏమిటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions