అప్పుడెప్పుడో 1984లో… మన భారతీయుడు రాకేష్ శర్మ రష్యా స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లివచ్చాడు..! ఇంకా..? సునీతా విలియమ్స్ కూడా అంతరిక్ష యాత్రికురాలే… కానీ భారతీయ తండ్రి, స్లొవేనియన్ అమెరికన్ తల్లి… ఈమె పుట్టింది, పెరిగింది అమెరికాలోనే, పెళ్లిచేసుకున్నది కూడా ఓ అమెరికన్నే… హర్యానాలో పుట్టిన కల్పనా చావ్లా మరో వ్యోమగామి… నాసాలో పనిచేస్తూ, అక్కడే ఓ అమెరికన్‌ను పెళ్లిచేసుకుంది… ఆమె స్పేస్‌లోకి వెళ్లిన తొలి భారతీయురాలు… తరువాత 2003లో, ఒక స్పేస్ ప్రమాదంలోనే మరణించడం ఓ విషాదం… మళ్లీ ఇన్నేళ్లకు ఒక భారతీయురాలు… అందులోనూ ఓ తెలుగు మహిళ పేరు వినిపిస్తోంది… పేరు శిరీష బండ్ల… తొలి తెలుగు అంతరిక్ష యాత్రికురాలు కాబోతోంది… ఆమె పనిచేసే వర్జిన్ గెలాక్టిక్ అనే కంపెనీ ప్రకటించిన తొలి యాత్రికుల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది…
Ads
Share this Article