Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రోత ఆహార్యం! – ఒక సీఎం భార్యకే ఇలా డ్రెస్ సోయి లేకపోతే ఎలా?

June 24, 2026 by M S R

.

Priyadarshini Krishna …. Shakespeare రాసిన హేమ్లెట్ అనే నాటకంలో రాజు క్లాడియస్ మంత్రివర్గంలో ముఖ్యుడైన పొలోనియస్ తన కొడుకు లార్టెస్ కి చాలా విషయాల్లో సుద్దులు నేర్పుతూ… సమాజం ఆహార్యం – దుస్తులు వేసుకునే విధానం బట్టి ఒక వ్యక్తి గుణగణాలను, స్థాయిని, ధనవంతుడా కాదా అనే విషయాలను బేరీజు వేస్తుంది అని చెప్తూ… సందర్భాన్ని బట్టి, మనకి ఆహ్వానం వచ్చిన చోటుని బట్టి, మన స్థాయిని బట్టి అలాగే మనల్ని ఆహ్వానించిన వారి స్థాయిని బట్టి కూడా మనం దుస్తులను ధరించాల్సి ఉంటుంది అని చెపుతాడు….

మనం వెళ్లే చోటును సమయం, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏ దుస్తులను వేసుకోవాల్సి ఉంటుంది…
పెళ్లికి ఒకలాగా, చావు ఇంటి పరామర్శకు ఒకలాగా, బడిలో పిల్లలని కలిసేప్పుడు ఒకలాగా మనం వేసుకునే బట్టలు మారుతుంటాయి… ఇది ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఐతే మరి ఎక్కువ వ్యత్యాసంతో ఉంటాయి…

Ads

ఇప్పుడున్న సమాజ స్థితిగతులను బట్టి ఆడవారు చీరకట్టుకోవాలా, చుడీదార్ వేసుకోవాలా, జీన్స్- టీషర్ట్ వేసుకోవాలా అనేది కూడా ఆధారపడి వుంటుంది….
ఇదే Shakespeare ఇంకో నాటకం king lear లో సమాజం మనుషులను వారి వస్త్రధారణ బట్టి జడ్జ్ చేస్తుంది, పేదవారు తమ పేదరికాన్ని వస్త్రధారణతో కప్పి పుచ్చుకోలేరు కానీ అదే వస్త్రాలతో ధనవంతులు వారి పాపాలపైన కూడా ముసుగు వెయ్యగలరు – అని అంటాడు…

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే…. మొన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన ఒకానొక కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు… మన శ్రీలీల కూడా పాల్గొన్నది… ఆమెతోపాటు అక్కడికి వచ్చిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవిస్ వేసుకున్న దుస్తులపైన నెట్లో బోలెడంత డిబేట్ జరుగుతోంది…

ఇప్పుడే కాదు, ఆవిడ అనేక సందర్భాల్లో సినిమా తారలను మించి ఆకర్షణీయంగా … కొండొకచో అధ్వానంగా డ్రెస్సులు వేసుకొచ్చి, ఆడియన్స్ మైండ్ ని డైవర్ట్ చేస్తుంది…. కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చాలా రివీలింగ్ గా డ్రెస్సింగ్ చేసుకుంటుంది…..

ముఖ్యమంత్రే తన మొగుడైనప్పుడు ఇంకెవరిని ఆకర్షించాలని అనుకుంటున్నది ఈవిడ అని చాలామంది కామెంట్స్ చేసిన వారికి ‘నా వొళ్ళు … నా ఇష్టం’ అన్న పంథాలో వుంటుంది ఈవిడ జవాబుల వ్యవహారం… ఈవిడే కాదు చాలా మంది స్త్రీలు ఈ మధ్యకాలంలో స్కిన్‌షో్ చెయ్యడానికి తహతహలాడుతున్నారు. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఆడవారు మొదలుకుని పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న CEO ల భార్యలు కూడా అలా వస్త్రధారణ చేసుకుని మీటింగ్స్ కి రావడం, సెల్ఫీలు తీసి సోషల్మీడియాలో పెట్టడం కద్దు…

బహుశా వారి తెలివితేటలపైనకంటే స్కిన్ షో పైనే ప్రగాఢ విశ్వాసం అయి ఉంటుంది…. బహుశా ఆయా భర్తలు కూడా వీరిని అలాగే వేసుకోవాలి అని వత్తిడి చేస్తారయి వుండవచ్చు ….

సామాన్య జనాల సంగతి ఏంటో గానీ మరి ముఖ్యమంత్రి స్థాయి భార్యలు కూడా ఇలా అందాలను జాతికి ఎక్స్‌పోజ్ చేయడం ఎలా అర్థం చేసుకోవాలో ….

ఒక డెకోరం అనేది ఉంటుందని, ఆ హోదాకు విలువని తన వంతుగా ఇవ్వాలి అనే విజ్ఞత లేదేమో మరి ….!! డ్రెస్ ఒకరి కేరెక్టర్ ని నిర్ణయించదు, చీర కట్టుకుంటే పతివ్రత, షార్ట్స్ వేసుకుంటే బజారు మనిషి అనే డిసైడ్ అయ్యే మీరు చాలా ఎదగాలి అని ఇక డిస్కషన్ మొదలెట్టే వాళ్లకు ఒక పే-ద్ద దణ్ణం …!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రోత ఆహార్యం! – ఒక సీఎం భార్యకే ఇలా డ్రెస్ సోయి లేకపోతే ఎలా?
  • భేష్ శ్రీచరణి! ఐసీసీ నంబర్ వన్ ర్యాంకింగ్- ఆషామాషీ కాదు!
  • ‘మెట్రోపై ముందడుగు’ – ప్రస్తుతానికి ఓ పే-ద్ద భేతాళ ప్రశ్న!
  • 00.00 – హేపీ బర్త్ డే డియర్ సీఎం… త్రిష చాలా తెలివైంది సుమీ!
  • రోజులు బాగాలేవు..! పెళ్లాల్నే కాదు, కాబోయే పెళ్లాలతోనూ బహుపరాక్..!!
  • అమ్మ కాగానే ఆట మానేయాలా? మరేం చేయాలి? ఇదీ 6R ఫార్ములా!
  • విజయశాంతి “కర్తవ్యం”… అనుష్క “అరుంధతి”… సమంత “మా ఇంటి బంగారం”
  • చైనా కంట్లో నలుసు! – హఠాత్తుగా ఇండియాలో వాలిన బర్మా చీఫ్!
  • KCR’s Voice – ఆ మంత్రి కడిగేశాడట- ఈయన చూశాడట !!
  • జంబలకిడిపంబ! కాన్సెప్టే బ్లాక్‌ కామెడీ, ఆపై ఈవీవీ మార్క్!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions