.
( గోపు విజయకుమార్ రెడ్డి ) … మనకు క్రికెట్ తప్ప వేరే మతం లేదు, టేస్టూ లేదు, కానీ ప్రపంచంలోని అధిక దేశాలు ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాయి, పిచ్చిగా ఆరాధిస్తాయి. అదొక కల్ట్ వాళ్లకు… కొన్ని దేశాలకు ఫుట్‌బాల్ ఆ దేశాల వారసత్వ సంస్కృతికి ప్రతీకలు.
ఇప్పటి వరకు జరిగిన ప్రపంచ కప్ మ్యాచులలో పెద్దగా షాకింగ్ రిజల్ట్స్ అయితే రాలేదు కానీ.. ఒక రెండు దేశాలు ప్రపంచంలోని అన్ని ఫుట్ బాల్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకున్నాయి. ఒకటి స్కాట్లాండ్, రెండు నార్వే.. ఆది వాళ్ళ ఆట కంటే ఆ దేశ అభిమానులు అమెరికాలో చేస్తున్న సంబరాలు
Ads
నార్వే.. వైకింగ్ రో సెలబ్రేషన్.. వైకింగ్ రో అనేది నార్వే ఫుట్‌బాల్ అభిమానులు ప్రారంభించిన ఒక ప్రత్యేక సంబరాల సంప్రదాయం. ఇందులో అభిమానులు, ఆటగాళ్లు వరుసలుగా కూర్చుని లేదా నిలబడి, వైకింగ్ యోధులు పడవ నడిపినట్లుగా చేతులను ముందుకు వెనక్కు కదుపుతూ “రో… రో…” అని నినదిస్తారు.
అసలు సంబరాలకి ఆటకి సంబంధం ఏంటని అనుకుంటున్నారా ఒక్కసారి ఆ దేశ చరిత్ర తెలిస్తే ఇది ఎందుకు స్పెషలో తెలుస్తుంది. “వైకింగ్ రో” (Viking Row) లేదా “వైకింగ్ రోర్” (Viking Roar) అనేది నార్వే ఫుట్‌బాల్ అభిమానులు మరియు ఆటగాళ్లు చేసే ప్రత్యేక సంబరాల విధానం.
ఇది ఎలా చేస్తారు?
అభిమానులు వరుసగా కూర్చుంటారు లేదా నిలబడతారు.
అందరూ కలిసి పడవ నడిపే వారిలా చేతులను ముందుకు వెనక్కు కదుపుతూ,, వాళ్లూ కదులుతూ, తెడ్లు వేస్తున్నట్లు (rowing) నటిస్తారు.
ఒక నాయకుడు లయను నిర్దేశిస్తాడు.
క్రమంగా నినాదాలు, చప్పట్లు, అరుపులు పెరుగుతూ ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పడుతుంది.
దీనికి “వైకింగ్ రో” అని పేరు ఎందుకు?
నార్వే దేశ చరిత్రలో వైకింగ్స్ అనే సముద్ర యోధులు చాలా ప్రసిద్ధి. వారు పెద్ద లాంగ్‌షిప్‌లు (Longships) అనే పడవలను తెడ్లు వేస్తూ సముద్ర ప్రయాణాలు చేసేవారు.
అందుకే ఈ సంబరంలో…
పడవ నడిపే కదలికలను అనుకరిస్తారు.
వైకింగ్‌ల ధైర్యం, ఐక్యత, యోధస్ఫూర్తిని గుర్తుచేసుకుంటారు.
ఇది ఎంతలా వైరల్ అయ్యిందంటే నార్వే పార్లమెంట్ కూడా నిన్న అలాంటి సంబరాలనే చేసింది. దానిలో ఆ దేశ ప్రధానితో పాటు అందరు ఎంపీలూ పాల్గొన్నారు.. అలాగే చిన్న పిల్లలు కిండర్ గార్డెన్ స్కూల్స్ లో కూడా వైకింగ్ రో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. చివరకు ఆ ఫుట్ బాల్ జట్టు కూడా సేమ్.
https://www.facebook.com/reel/1458663749639138
2026 ప్రపంచకప్‌లో ఎందుకు ప్రసిద్ధి ?
2026 FIFA ప్రపంచకప్‌లో నార్వే విజయాల తర్వాత ఆటగాళ్లు, అభిమానులు కలిసి వైకింగ్ రో చేయడంతో ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ముఖ్యంగా Erling Haaland, Martin Ødegaard అభిమానులతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొనడం వల్ల మరింత ప్రాచుర్యం పొందింది.
వైకింగ్ రో అనేది నార్వే ప్రజలు తమ వైకింగ్ వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ చేసే ఫుట్‌బాల్ విజయోత్సవం. అంతే కాదు, అది ఆ దేశ పోరాటవీరుల ఐక్యతని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ చేసుకొనే ఒక రకమైన సంబరాలు.
ఇంకోటి స్కాట్లాండ్ ఫ్యాన్స్ “టార్టన్ ఆర్మీ “.. స్కాట్లాండ్ ఫుట్‌బాల్ అభిమానులను “టార్టన్ ఆర్మీ” (Tartan Army) అని పిలుస్తారు.
టార్టన్ అంటే ఏమిటి?
టార్టన్ (Tartan) అనేది స్కాట్లాండ్‌కు చెందిన సంప్రదాయ చెక్కుల (checked pattern) వస్త్రం. వివిధ రంగుల గీతలతో ప్రత్యేక నమూనాలు ఉంటాయి.
స్కాటిష్ ప్రజలు ఈ టార్టన్ వస్త్రంతో తయారు చేసిన కిల్ట్ (Kilt) అనే సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.
టార్టన్ ఆర్మీ పేరు ఎలా వచ్చింది?
1970లలో స్కాట్లాండ్ జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుగా వెళ్లే అభిమానులు టార్టన్ కిల్ట్‌లు ధరించేవారు, స్కాట్లాండ్ జెండాలు పట్టుకునేవారు
బ్యాగ్‌పైప్స్ (Bagpipes) వాయించేవారు ( బ్యాగపైపర్ విస్కీ బ్రాండ్ లోగో వీళ్ళ నుంచే వచ్చింది ) వీళ్ళు. మంచి విస్కీ పీపాలు, అందుకే స్కాటిష్ విస్కీకి ప్రపంచమంతా అభిమానులు.. వీళ్ళ దెబ్బకి అమెరికాలో మందు కొరత వచ్చిందంటే అర్ధం చేసుకోవాలి, వీళ్ళ కన్సంప్షన్ ఎలా ఉంటుందో..
పైన చెప్పుకున్న రెండు విషయాలు ఆటలు అంటే గ్రౌండ్లో రెండు జట్లు పోటీపడటం కాదు.. ఆ దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియచేసే వేడుకలు, వేదికలు.. ఆ విషయంలో ఈ అమెరికా ఫుట్ బాల్ వరల్డ్ కప్ సక్సెస్ అయ్యినట్టే…
మచ్చుకు ఈ రెండు వీడియోలు చూడండి…
Share this Article