.
రామ్‌గోపాల్ వర్మ (RGV) అనేక కోణాల్లో, అనేక రకాలుగా భ్రష్టుపట్టిపోయిన కేరక్టర్… ఇప్పుడు మరో సంచలనానికి తెరతీస్తున్నారనే వార్త వినడానికి బాగానే ఉన్నా, నేటి సినీ వాస్తవాలను, తన ప్రస్తుత ట్రాక్ రికార్డ్‌ను గమనిస్తే.. ఈ ప్రాజెక్టుపై ఆశలకంటే ఆందోళనలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ చేతిలో పడి ‘దయా నాయక్’ లాంటి ఒక పవర్‌ఫుల్ రియల్ లైఫ్ పోలీస్ స్టోరీ దెబ్బతింటుందేమోననేది ఓ ఆందోళన.
దయా నాయక్ బయోపిక్…: వర్మ చేతిలో పడితే ‘మరో సంచలనం’ అవుతుందా… ఉన్న కథ కాస్తా చెడుతుందా? ముంబై అండర్‌వరల్డ్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుల కథలకు వెండితెరపై ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందునా 80కి పైగా ఎన్‌కౌంటర్లతో ముంబై క్రైమ్ హిస్టరీలో సంచలనం సృష్టించిన దయా నాయక్ జీవితం అంటే అటు బాలీవుడ్‌కు, ఇటు టాలీవుడ్‌కు పీక్ ఇంట్రెస్ట్ ఇచ్చే సబ్జెక్ట్. ఇలాంటి పవర్‌ఫుల్ లైఫ్ స్టోరీని మళ్లీ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారనే వార్త బయటకు రాగానే సహజంగానే చర్చ మొదలైంది. అయితే, ఈ చర్చ ఆసక్తి కంటే ఎక్కువగా ‘ఆందోళన’ వైపే మొగ్గు చూపుతోంది.
Ads
ఎందుకంటే.. ఇప్పుడున్నది ‘శివ’, ‘సత్య’, ‘కంపెనీ’ తీసిన క్లాసిక్ వర్మ కాదు! ఆనాటి ‘కల్ట్’ మేకింగ్.. నేటి ‘యూట్యూబ్’ క్వాలిటీ!
ఒకప్పుడు వర్మ సినిమా తీస్తున్నారంటే అందులో రియలిజం ఉంటుంది, ఒక ఇంటెన్సిటీ ఉంటుంది. ‘సత్య’లో భీకూ మాత్రే పాత్రను, ‘కంపెనీ’లో మాలిక్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన విధానం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. కానీ, గత పుష్కర కాలంగా వర్మ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆ పాత దర్శకుడు ఎప్పుడో కనుమరుగయ్యాడని స్పష్టమవుతోంది.
క్వాలిటీ లేని కెమెరా యాంగిల్స్, హడావుడి స్క్రిప్టులు, కేవలం పబ్లిసిటీ స్టంట్ల కోసమే తీసే సినిమాలతో ఆయన తన బ్రాండ్ వాల్యూను పూర్తిగా తగ్గించుకున్నాడు. వరుస ఫ్లాపుల లూప్‌లో పడిపోయిన వర్మ.. ఇప్పుడు దయా నాయక్ లాంటి హై-వోల్టేజ్ సబ్జెక్ట్‌ను టేకప్ చేయడం అంటే, వేలు పెట్టి వారం చెడగొట్టుకున్నట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం వర్మ బ్రాండ్ వాల్యూ మైనస్‌లో ఉంది.
సమర్థుడైన దర్శకుడు పడితే ‘సింహం’.. వర్మ చేతిలో ‘డ్రామా’?
దయా నాయక్ బయోపిక్‌కు ఉన్న పొటెన్షియల్ చాలా పెద్దది. ముంబై పోలీసుల అంతర్గత రాజకీయాలు, అండర్‌వరల్డ్‌తో మైండ్ గేమ్స్, లీగల్ పోరాటాలు.. ఇలా ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఇందులో బోలెడంత మెటీరియల్ ఉంది.
ఈ కథను నేటి తరం మేకర్స్ ఎవరైనా హ్యాండిల్ చేస్తే.. ఒక రా అండ్ రస్టిక్ క్లాసిక్‌గా మలిచే అవకాశం ఉంటుంది. కానీ వర్మ ప్రస్తుత శైలి చూస్తుంటే, కేవలం ఆరు నెలల్లో చుట్టేసే లో-బడ్జెట్ మేకింగ్, లేదా వివాదాల చుట్టూ తిరిగే ఓ సాధారణ క్రైమ్ డ్రామాగా దీనిని మార్చే ప్రమాదం ఉందనేది పరిశ్రమ వర్గాల భయం.
ఆలోచించాల్సిన విషయం…: ‘కంపెనీ 2’ అన్నా, ‘బయోపిక్’ అన్నా.. కంటెంట్‌లో దమ్ముండాలి. కానీ, వర్మ రీసెంట్ ప్రాజెక్టులు (సిండికేట్, ఇతర అనౌన్స్‌మెంట్లు) చూస్తుంటే ఆయన క్వాంటిటీపైనే తప్ప క్వాలిటీపై దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదు.
సినిమా అనౌన్స్మెంట్ వరకే వర్మ మార్క్ హైప్ వస్తుంది. కానీ థియేటర్‌లోకి వచ్చాక ఆడియన్స్‌ను మెప్పించాలంటే మాత్రం ఆయన తన పాత ఫార్ములాను, మొబైల్ కెమెరా తరహా మేకింగ్‌ను పక్కన పెట్టాల్సిందే. లేదంటే, ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ బయోపిక్.. వర్మ ఫ్లాపుల లిస్టులో మరో నంబర్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. సమర్థుడైన దర్శకుడి చేతిలో పడితే క్లాసిక్ అవ్వాల్సిన సబ్జెక్ట్, వర్మ చేతిలో పడి ఏమవుతుందో చూడాలి!
Share this Article