.
పురుషులేమిటి..? స్త్రీలేమిటి..? ఎవరూ అవినీతికి అతీతం కాదు, ఏ దేశమూ మినహాయింపు కాదు, అసలు ఓ లెక్కన పురుషులకన్నా స్త్రీలకే అక్రమ సంపాదన పట్ల మోజు అంటుంటారు కొందరు… ఓ వార్త చూస్తుంటే జయలలిత గుర్తొచ్చింది…
తెలుసు కదా, జయలలిత అవినీతి సామ్రాజ్ఙి… దత్తపుత్రుడి పెళ్లి జరిపించిన తీరు చూసి దేశమే నివ్వెరపోయింది… అవినీతి కేసులో ఇరికి, అధికారులు ఇంటి మీద దాడి చేస్తే దొరికిన నగలు గట్రా పక్కన పెట్టండి, ఎలాగూ స్త్రీలకు బంగారం అంటే కక్కుర్తే కదా…
Ads
సుమారు 27.5 కిలోల బంగారు ఆభరణాలు (వీటిలో వజ్రాలు పొదిగిన నగలు, బంగారు కిరీటాలు, ఖడ్గం), సుమారు 1,116 కిలోల వెండి వస్తువులు… 1,500 ఎకరాలకు పైగా విస్తీర్ణమున్న వ్యవసాయ, ఇతర భూములకు సంబంధించిన పత్రాలు… అసలు ఇవి కాదు, 11,344 ఖరీదైన పట్టు చీరలు, 750 జతల డిజైనర్ చెప్పులు, 250కి పైగా డిజైనర్ షాల్స్, 91 రిస్ట్ వాచీలు… 65 నుంచి 100 వరకు హేండ్ బ్యాగులు…
ఆడవాళ్ల పిచ్చి దేనిపైనే జయలలిత ఆస్తులు చెప్పాయి… ఎస్, రీసెంటుగా ఇరాక్‌లో బోలెడుమంది ప్రజాప్రతినిధుల మీద అవినీతి నిరోధక దాడులు జరిగాయి… ఎంపీలు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారుల ఇళ్లపై వరుస దాడులు, కోట్ల డాలర్ల నగదు స్వాధీనం, బంగారం, ఆస్తుల వెలికితీత, 47 మంది అరెస్టు… ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే, మరోవైపు సోషల్ మీడియాలో “27 కిలోల బంగారం, 57 మిలియన్ డాలర్లు, బంగారు లోదుస్తులు” అనే కథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది…
ఇక్కడే కథ ఆసక్తికరంగా మారుతుంది… టర్కీ, రష్యన్ భాషా మీడియా, అజర్‌బైజాన్‌కు చెందిన కొన్ని వార్తా వెబ్‌సైట్ల కథనాల ప్రకారం ఒక మహిళా ఎంపీ హింద్ అల్-అబ్బాసీ ఇంట్లో 57 మిలియన్ డాలర్లు, 27 కిలోల బంగారం, బంగారంతో తయారైన లోదుస్తులు దొరికాయట…

నిజానికి దోచుకున్నది దాచుకోవాలి అనేది అవినీతి కథల్లో ప్రాథమిక సూత్రం, కానీ ఆడవాళ్లు ఊరుకోరు… సంపద ఊరుకోనివ్వదు… మరీ బంగారు లోదుస్తులు ఏమిటి..? విస్మయాన్ని, వెగటును కలిగించే ఫోటోలు… అఫ్‌కోర్స్, ఆడవాళ్లకు సంపద ప్రదర్శన అంటే ఓ పిచ్చి…
వాళ్లే కాదు, ఇదేమీ కొత్త కాదు… గాలి జనార్దన్ రెడ్డి బంగారు సింహాసనమే చేయించుకున్నాడనీ వార్తలు చూశాం కదా… అప్పనంగా వచ్చి పడుతున్న వందలు, వేల కోట్లను ఏం చేసుకోవాలో తెలియనంత అట్టహాసం, ఆడంబరం, ప్రదర్శన… తన ఇంట్లో పెళ్లి కూడా నిరూపించింది అదే కదా… వాడెవడో బంగారు కమోడ్ చేయించుకున్నట్టు కూడా చదివినట్టు గుర్తు…
ఇరాక్ ఎంపీ లేడీ కదా, బంగారు డిజైనర్ లోదుస్తులు చేయించుకుంది… అవినీతి అంతే, దానికి నీతి ఉండదు, రీతి ఉండదు… ఈ లేడీయే పక్కా ఉదాహరణ!!
Share this Article