Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతా ‘మాయ’ – పాక్ ఏదైనా స్మగుల్ చేస్తుంది – చైనా ఏదైనా తినేస్తుంది

July 3, 2026 by M S R

.

చైనా వాడి గురించి తెలిసిందే… ప్రపంచంలోని ఏ జీవజాలమైనా సరే… కాలుస్తాడు, ఉడికిస్తాడు, వండుతాడు, గోలిస్తాడు, పచ్చళ్లు పెడతాడు, కొన్ని అలాగే తింటుంటాడు… పాకేవి, ఎగిరేవి, నడిచేవి, దూకేవి, ఈదేవి… వాడికి ఏ తేడా ఉండదు… కనిపించవు గానీ లేకపోతే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ కూడా ఫ్రై చేసి తినేసేరకం…

కానీ… మరీ హ్యూమన్ ప్లాసెంటాను కూడా తింటున్నారనే ఒక వార్త ఆశ్చర్యాన్ని, అసహ్యాన్ని కలిగించింది… అసలు ఆ ప్లాసెంటా కిలోల కొద్దీ అంతర్జాతీయ సరిహద్దులు దాటి, పాకిస్థాన్ నుంచి స్మగ్లింగ్, అక్రమ రవాణా జరుగుతుందనే ఆ వార్త సారాంశం మరింత విస్మయాన్ని కలిగించింది…

Ads

అవును, పాకిస్థాన్ వాడు ఏ పనైనా చేయగలడు, చైనా వాడు దేన్నయినా తినేయగలడు… అసలు ఆ వార్త ఏమిటంటే…  పాకిస్థాన్‌లో ఆసుపత్రులు, ప్రసూతి కేంద్రాల నుంచి వైద్య వ్యర్థాలుగా పారేసే ప్లాసెంటాను (మాయ) చాలా తక్కువ ధరలకు కొనుగోలు చేసి, దానిని ‘గొర్రె మాంసం’ అని నమ్మించి విదేశాలకు ఎగుమతి చేసే ఒక భారీ ముఠాను పాకిస్థాన్ దర్యాప్తు సంస్థ (FIA) పట్టుకుంది.

ముగ్గురు చైనా జాతీయులతో సహా ఐదుగురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) శుక్రవారం తెలిపింది… నిజానికి జరాయువు కణజాలం, ముఖ్యంగా ఉమ్మనీటి పొర, గాయం మానడాన్ని ప్రోత్సహించగలదు కాబట్టి, దీనిని కఠినమైన వైద్య నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేసి, కాలిన గాయాలు, మధుమేహ సంబంధిత పుండ్లు, కంటి శస్త్రచికిత్సల కోసం కొన్ని గాయాల కట్టులలో ఉపయోగిస్తారు. ఇది కూడా అనుమతించబడిన కొన్ని సంస్థలు మాత్రమే అన్ని జాగ్రత్తలతో ప్రాసెస్ చేస్తాయి.

ఇస్లామాబాద్‌లో అక్రమంగా ప్రాసెస్ చేసే ఓ పెద్ద ప్లాంట్‌ను కనిపెట్టారు. అక్కడి నుంచి వేర్వేరు దేశాలకు ‘షి ప్లాసెంటా’ పేరిట స్మగుల్ చేస్తున్నారు.


గర్భధారణ సమయంలో తల్లి గర్భంలో పిండం ఎదుగుదలకు అవసరమైన పోషకాలను, ఆక్సిజన్‌ను అందించే కీలకమైన అవయవమే ప్లాసెంటా (మాయ/ జరాయువు). ఇది గర్భాశయ గోడకు అతుక్కుని, నాభి తాడు (umbilical cord) ద్వారా బిడ్డకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. శిశువుకు అవసరమైన రక్షణను ఇవ్వడంతో పాటు, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రసవం తర్వాత ఈ ప్లాసెంటా కూడా బయటకు వచ్చేస్తుంది.


Placenta smuggling

మీడియా కథనాల ప్రకారం, ఈ అక్రమ రవాణా వెనుక ప్రధానంగా చైనా మార్కెట్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలో మానవ ప్లాసెంటాను “జిహెచె” (ziheche) అని పిలుస్తూ, దానిని ఔషధంగా లేదా ఆహారంగా వాడే అలవాటు ఉంది. ఒక మాతృత్వపు వ్యర్థాన్ని సౌందర్య ఉత్పత్తిగా మార్చుకుంటే పర్లేదేమో, కానీ మరీ ఆహారంగా తీసుకోవడమే ఇక్కడ అసహ్యాన్ని కలిగిస్తోంది.

ఆరోగ్య ప్రమాదాలు: మానవ ప్లాసెంటా ద్వారా హెపటైటిస్ B, HIV, సిఫిలిస్ వంటి ప్రాణాంతక వైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ వంట పద్ధతులు లేదా ప్రాసెసింగ్ ద్వారా ఈ వైరస్‌లను నిర్మూలించడం సాధ్యం కాదు. అదీ కారణం.

సౌందర్య సాధనాల్లో వినియోగం: ప్లాసెంటాలో పోషకాలు ఉంటాయని నమ్మే కాస్మెటిక్ కంపెనీలు, అక్రమ మార్గాల్లో సేకరించిన ప్లాసెంటాను క్రీములు, ఇంజక్షన్లు, ఇతర సౌందర్య ఉత్పత్తుల తయారీలో వాడుతున్నట్లు గతంలో కెనడా, జపాన్, కొరియా వంటి దేశాల్లో కూడా కేసులు నమోదయ్యాయి.

చట్టపరమైన పరిస్థితి: మానవ అవయవాల వాణిజ్యంపై ప్రపంచవ్యాప్తంగా కఠినమైన నిషేధాలు ఉన్నాయి. పాకిస్థాన్ వంటి దేశాల్లో ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణలో ఉన్న లొసుగులను వాడుకుని, ఈ ముఠాలు వ్యవస్థీకృతంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఇది కేవలం ఆహారానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మానవ అవయవాలు, వ్యర్థాల అక్రమ రవాణాతో కూడిన ఒక పెద్ద అంతర్జాతీయ నేరపూరిత నెట్‌వర్క్.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గడ్డ కట్టిపోయే స్థితిలో…. ఆ చిన్నారిని అలాగే ఎత్తిపట్టుకుని…
  • అంతా ‘మాయ’ – పాక్ ఏదైనా స్మగుల్ చేస్తుంది – చైనా ఏదైనా తినేస్తుంది
  • ఆ ‘టైమ్’ వచ్చేదాకా ప్రసవవేదన- ప్రయాస… టాటా వాచీల కథ!
  • నిజంగానే బాలు లేదా దాసరి ఈ సినిమా చేసి ఉంటే…. నా సామిరంగా..!!
  • అమరావతి రాజధాని పనుల్లో ఏదో భారీ తేడా కొడుతోంది!
  • అర్థరాత్రి స్వతంత్రం వెనుక ఆసక్తికర జ్యోతిష్య రహస్యం!
  • ఒక ఆదిపురుష్ – ఒక అఖండ2 – ఒక నాగబంధం!!
  • బంగారు లోదుస్తులు! – వామ్మో ఇరాక్ ఎంపీ!! విస్తుపోయిన ప్రపంచం!!
  • “ప్రతి పొరపాటు వైఫల్యం కాదు… కొన్నిసార్లు అదే ఒక అవకాశం”
  • నాగబాబూ.., మహానటుడు ఎన్టీఆర్‌‌పై మరీ అంత చౌకబారు స్కిట్..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions