Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు బ్లండర్ కేసీయార్‌కూ తెలుసు! అందుకే కాళేశ్వరంపై ద్రోహ నిశ్శబ్దం!!

July 9, 2026 by M S R

.

లక్ష కోట్లను గోదాట్లో పోసిన కేసీయార్ సైలెంటుగా ఉన్నాడు చేసే ద్రోహం అంతా చేసి… కానీ తన టీమ్ నవ్వొచ్చే డిమాండ్లు చేస్తూ, ఆ అవినీతి బాగోతం మీద జనం చర్చించకుండా ఏదో డైవర్షన్ ప్రయాసలో ఉన్నారు… ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషాదం ఏమిటంటే..? సంబంధిత మంత్రి ఉత్తముడికీ ఏది కౌంటర్ చేయాలో, ఏ నిజాలు జనానికి ఎంత సరళంగా వెల్లడించాలో ఏమాత్రం తెలియకపోవడం!

‘ముచ్చట’ పలువురు ఇంజినీర్లను అడిగింది… నీళ్లు గోదావరిలో వృథాగా పోతున్నాయి కదా, తస్కిన మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి నుంచి ఎత్తిపోయొచ్చు కదా..? ఏదో రబ్బర్ డ్యామ్ లేదా రాళ్ల కట్ట కట్టి లిఫ్టులు పనిచేయించొచ్చునని హరీష్, కవిత చెబుతున్నారు కదా…

Ads

  • అసలు కన్నెపల్లి పంప్ హౌజులో 6 మోటార్లు ఈరోజుకూ డీఫంక్ట్… మిగతా 11 అసలు పనిచేస్తున్నాయో లేదో డౌట్… రబ్బర్ డ్యాములు, రాళ్ల కట్టలు పొలిటికల్ డిమాండ్లకు మాత్రమే పనిచేస్తాయి… హరీష్‌కు మొత్తం విషయం తెలిసీ జనం కళ్లకు గంతలు కట్టడం, పైగా గురుదక్షిణ అనే వితండ వ్యాఖ్యలు… వృథా వెళ్లే నీటిని ఎవరైనా గురుదక్షిణ ఇస్తాడా..? తనేం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదు పాపం… ఇక కవితకేమో ఆ సబ్జెక్టు అస్సలు తెలియదు… ఆమె మాటల్ని పట్టించుకోవాల్సిన పని లేదు… ఐనా అక్కడి నుంచి నీటిని ఎక్కడికి ఎత్తిపోయాలి…
  • మళ్లీ అన్నారం బరాజులోకి ఎత్తిపోయాలి…

అవును, అన్నారంలోకి ఎత్తిపోస్తే తప్పేముంది..? 

  • తప్పున్నర… ఓ పది టీఎంసీలు నిండితే గానీ అన్నారం నుంచి లిఫ్ట్ చేయలేం, నిజానికి మేడిగడ్డకన్నా అన్నారం డేంజర్‌గా ఉంది… గతంలో నాలుగు బుంగలు పడ్డాయి… ఇప్పుడు నీటిని నిల్వ చేస్తే అదీ మేడిగడ్డకన్నా దారుణంగా తస్కడం ఖాయం…
  • పోనీ, అది ఎత్తిపోయాలంటే సుందిళ్లలోకి పోయాలి… దాని సిట్యుయేషన్ ఏమిటో ఎవడికీ తెలియదు… అక్కడ ఏడో, ఏడున్నర టీఎంసీలో నిండితే గానీ అక్కడి నుంచి ఎల్లంపల్లిలోకి పోయలేం…

KANNEPALLI

ఎల్లంపల్లి నింపితే బెటరే కదా, అక్కడి నుంచి కాళేశ్వరం నెట్‌వర్కులోని రిజర్వాయర్లన్నీ నింపొచ్చు కదా…?

  • అదీ తప్పే… ఇవన్నీ నింపేలోపు కడెం నిండిపోయి, ఎల్లంపల్లిలోకే నీళ్లొస్తాయి… కడెం ఎగువన క్యాచ్‌మెంట్ మనదే, ఆదిలాబాద్ అడవులు… అది నిండగానే ఏం చేయాలి..? ఇలా ఎత్తిపోసిన నీళ్లన్నీ గోదావరిలోకి మళ్లీ మనమే వదిలేయాలి… గతంలోనూ ఈ వ‌ృథా తతంగం సాగింది… కరెంటు దండుగ…

గతంలో ఏం జరిగింది..? ఆశ్చర్యంగా ఉంది, ఎత్తిపోసిన నీటిని గోదాట్లో పోశామా..? 

  • అక్షరాలా… 150 టీఎంసీల దాకా ఎత్తిపోశారు గతంలో, కానీ ఆలోపు ఎల్లంపల్లికి వరదనీరు రావడంలో 70- 80 టీఎంసీలు మళ్లీ గోదాట్లోకి వదిలేశారు… మిగతావి ఎవాపరేషన్ లాసెస్… మరెందుకు ఈ బరాజులు? ఆగస్టులో ఒక్క భారీ వరద వస్తే చాలు, ఎత్తిపోసిందంతా కిందకు హడావుడిగా వదిలేయడమే…! ‘ఒడిసి పడతారా? ఇడిసిపెడతారా’ అనేది ఓ దుర్మార్గమైన ప్రశ్న!!
  • ఎందుకు లక్ష కోట్ల కమీషన్ల బాగోతం..?! భారతదేశ సాగునీటి వ్యవస్థల్లోనే ఇదొక భారీ డిజైనింగ్, ప్లానింగ్ బ్లండర్… పిటీ కల్వకుంట్ల విశ్వేశ్వరరావు!! 

మరి శ్రీరాంసాగర్?

  • అది వేరు, దాని ఎగువన వరద నీరు ఉధృతంగా వస్తే తప్ప అది నిండదు, పదేళ్లుగా నిండటం లేదు… ఒకవేళ ఎల్‌నినో దుర్దినాల కాలంలోనూ అది అబ్బురంగా నిండితే, ఆ ఎక్కువ నీళ్లు వచ్చేది ఎల్లంపల్లికే… కింద బలహీనంగా కట్టబడిన మూడు బరాజులకూ దానికి సంబంధం లేదు… ఎస్సారెస్పీ ఎగువన బాబ్లీ, ఇతర ప్రాజెక్టులు, ఆ కథలు వేరు…

ఇవన్నీ సరే, కింకర్తవ్యం?

  • ఈ సిస్టమ్‌‌కు గుండెకాయ ఎల్లంపల్లి… అది నిండేకొద్దీ… మిడ్ మానేరు, ఇతర రిజర్వాయర్లను నింపుకుంటే ఈ ఎల్‌నినో రోజుల్లో కనీసం తాగునీటికైనా ఉపయోగకరం… హల్దీ వాగు నుంచి అప్పర్ మానేరుకు, అక్కడి నుంచి మానేరు స్ట్రీమ్‌లోనే ఎల్ఎండీకి నీరొస్తే వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకూ తాగునీరు… మానేరు ఓవర్‌ఫ్లో అయితే అదీ వెళ్లి అన్నారం బరాజు దగ్గర గోదావరిని కలుస్తుంది… అక్కడి నుంచి మళ్లీ నీటిని వదిలేయడమే గతి…
  • కడెం ఓవర్ ఫ్లో చూడాల్సిందే ఇక… అది కాలగతికి నిలిచిన గొప్ప కట్టడం, అది కేసీయార్ కట్టిన కాళేశ్వరం బరాజులు కావు కదా…

మరిప్పుడు ఏం చేయాలి..? 

  • బీఆర్ఎస్ ఓ ట్రాపులోకి లాగుతోంది… సంయమనం ముఖ్యం… NDSA ఏం చెప్పిందని కాదు, కాళేశ్వరాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి, రేవంత్ రెడ్డే కరెక్ట్ కౌంటర్ ఇవ్వాలి… వారం రోజులు కేసీయార్‌కు ఇస్తా అనే ఆఫర్లు, మూడు నెలలు ఇవ్వు అని హరీష్ కౌంటర్ శుద్ధ దండుగ… 3 నెలలు దేనికి హరీష్ రావుకు 3 రోజులు అప్పగించినా మేడిగడ్డ మరో రెండు బ్లాకులు, అన్నారం కొన్ని బ్లాకులు మటాష్..!!

(ఇవన్నీ నిజాలు… కేటీయార్‌కు ఇరిగేషన్ సబ్జెక్టు తెలియదు, హరీష్‌కు తెలిసీ కథలు చెబుతాడు… చివరకు పింక్ మీడియాతో సహా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఏదేదో రాసేస్తోంది… అది మరో విషాదం… కానీ ఏమాటకామాట క్యూరింగ్ లేక ఫెయిల్ వంటి జగ్గారెడ్డి నవ్వొచ్చే, జాలి కలిగింగే వ్యాఖ్యలు మినహా మిగతా కాంగ్రెస్ నాయకులు ఏమీ మాట్లాడటం లేదు… ఏమీ తెలియక!! అదీ ఒకందుకు మంచిదే పాపం) ….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!
  • అనసూయా జాగ్రత్త ! కర్మ ఎవరినీ వదలదు ! పది రెట్లు తిరిగి ఇస్తుంది !!
  • రేవంత్‌ రెడ్డిపై బహుముఖ కుట్ర ! జగన్ కూడా ఓ పాత్రధారేనా ?
  • నూరేళ్ల విల్లాకు కొత్త కళ ! సొగసైన బ్యాటింగే కాదు – కళాత్మక అభిరుచి !
  • కాళేశ్వరం బరాజుల బ్లండర్స్‌లాగే ఈనాడులో ఓ బ్లండర్ కథనం..!
  • న్యూయార్క్ సిటీ మేయర్ పక్కా భారత ద్వేషి- నిజమే, సో వాట్..?!
  • అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions