Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాగార్జున కుటుంబంలో ఏం జరుగుతోంది? సోదరుల నడుమ పొరపొచ్చాలు?

July 11, 2026 by M S R

.

నిన్న ఓ వీడియో బిట్ అందరినీ ఆకర్షించింది… పుష్కరకాలంగా ఒక్క సినిమా కూడా సక్సెస్ గాకుండా, ఓ చిన్న విజయం కోసం చకోరపక్షిలా నిరీక్షిస్తూ… ఇక నిన్నటి లెనిన్ సినిమా గనుక ఫెయిలైతే ఇక తన కెరీర్ క్లోజ్ అనుకుని తీవ్ర ఒత్తిడిలో ఉన్న అఖిల్ అక్కినేని, లెనిన్ సినిమా‌కు కొంత పాజిటివ్ టాక్ రావడంతో ఇక ఆ ఉద్వేగాన్ని పట్టలేకపోయాడు…

తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట తండ్రి నాగార్జున కాళ్లు మొక్కి కన్నీళ్లు పెట్టుకున్నాడు… అర్థం చేసుకున్నాడు నాగార్జున… గట్టిగా హత్తుకున్నాడు చాలాసేపు… తండ్రి భరోసా అది… తనకూ ఇన్నాళ్లు ఓ బాధ ఉండేది అఖిల్ కెరీర్ గాడిన పడటం లేదని… తనకూ ఈ సినిమా ఓ రిలీఫ్…

Ads

https://www.facebook.com/reel/4466199306934795

అఖిల్

దీనికి సమాంతరంగా నిన్న మీడియాలో, సోషల్ మీడియాలో మరో అంశం ప్రధానంగా కనిపించింది… నాగ చైతన్య, సమంత విడిపోయి చాన్నాళ్లయింది… ఇద్దరూ మళ్లీ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు… ఎవరి బతుకులు వాళ్లవి… ఒకరికొకరు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు…

ఆమధ్య ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో సమంత పేరును ప్రస్తావించి ఓ మంత్రి ఏదో మాట్లాడటం వివాదానికి దారితీయడం, నాగార్జున కేసు పెట్టడం తెలిసిందే కదా… అక్కినేని కుటుంబం కూడా సమంత విషయంలో సైలెన్స్ మెయింటెయిన్ చేస్తోంది…  కానీ ఇప్పుడు విశేషం ఏమిటంటే..?

అఖిల్

సమంత సినిమా మా ఇంటి బంగారం హిట్ కావాలంటూ అఖిల్ శుభాకాంక్షలు చెప్పాడు… ఇంట్రస్టింగ్… నాగార్జున కుటుంబంలో అన్నాదమ్ముల మధ్య పడటం లేదాని సందేహాలు మొదలయ్యాయి… ఇప్పుడు సమంత కూడా లెనిన్ సినిమాకు మంచి టాక్ వస్తోంది అంటూ శుభాకాంక్షలు చెప్పింది… ఇప్పుడిక చర్చ…

అసలు నాగ చైతన్య తన సోదరుడి సినిమా పట్ల శుభాకాంక్షలు చెప్పకపోవడం ఏమిటి..? సమంత చెప్పడం ఏమిటి..? అంతకు ముందు అఖిల్ సమంత సినిమాకు శుభాకాంక్షలు చెప్పడం ఏమిటి..? బిగ్‌బాస్ కుటుంబంలో ఏవో పొరపొచ్చాలు వచ్చినట్టున్నాయి, ఏమిటవి? ఎందుకు? ఇదీ చర్చ ఇండస్ట్రీ సర్కిళ్లలో!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కెరీర్ మొదట్లో చిరంజీవి దస్తూరీ తెలుసా మీకు..? ఇదుగో ఓ లేఖ!!
  • I, No Body – ఓ కొత్త స్టోరీ లైన్ – కథ చెప్పడంలోనే కాస్త తడబాటు!!
  • నాగార్జున కుటుంబంలో ఏం జరుగుతోంది? సోదరుల నడుమ పొరపొచ్చాలు?
  • యుద్ధ మేఘాల కింద సముద్రంలో!- ‘పాంచ్‌ సాహెబ్‌’ హిఫా సలీమ్ ధైర్యగాథ!
  • పొలిటికల్ అంకగణితం! లెక్కల్లో కేటీఆర్ ఫెయిల్- రేవంత్‌రెడ్డి పాస్!!
  • ప్రభుత్వ శాఖల్లో ‘డిజిటల్ పాలన’… కొత్త సీఎస్ సంజయ్ జాజు ముద్ర!
  • భారీ ఆర్థిక మోసం ‘షేర్ బజార్’ – ‘కిసాన్ పరివార్’ స్కామ్ వెనుక అసలు కథ!
  • విజయ్ అపరిణతి! స్టేట్ అంటే నీ ఎస్టేట్ కాదు ముఖ్యమంత్రి గారూ!!
  • యూ టూ ఈటల!! అచ్చం హరీష్ భాషే!! ఎవరిని ఆక్షేపిస్తున్నట్టు!?
  • నిదా ఖాన్ బెయిల్ ఇష్యూ! మరి కృష్ణుడి పుట్టుక మీద వ్యాఖ్యలు దేనికి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions