Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంపేస్తారా? సోనమ్ వాంగ్‌చుక్‌ను చంపేస్తారా?

July 17, 2026 by Rishi


.

సోనమ్ వాంగ్‌చుక్… 20వ రోజు నిరాహార దీక్షలో సోనమ్ వాంగ్‌చుక్. సీ.జే.పీ. కార్యాచరణలో భాగంగా ఈ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష మొదలయింది.

సీ. జే. పీ. లాగా ఈ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష కూడా దారుణంగా విఫలమైంది! ఇది శుభ పరిణామం. దేశ ప్రజ సీ.జే.పీ. విషయంలోనూ, ఈ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విషయంలోనూ తెలివితోనూ, తెలివిడితోనూ వ్యవహరిస్తోంది. దేశ ప్రజకు అభినందన.

సీ.జే.పీ. ద్వారా దేశంలో అలజడి సృష్టించి దేశాన్ని దెబ్బకొట్టాలనుకున్న దేశ, ప్రజ, హిందూ వ్యతిరేక ఎకో సిస్టమ్ ఇప్పటికే భంగపడింది. ఈ దశలో తన ఉనికిని చాటుకునేందుకుగానూ, తన బలాన్ని నిరూపించేందుకుగానూ, భవిష్యత్తులో దేశానికి పెను కీడు కలిగించే పన్నాగంలో భాగంగానూ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రణాళిక రూపుదాల్చింది అని పెద్ద శాతం ప్రజ తెలుసుకుంది. ఈ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను కూడా దేశ ప్రజ నిశ్శబ్దంగా విఫలం చేసింది.

Ads

సీ.జే.పీ. విషయంగానూ, ఈ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విషయంగానూ కేంద్ర ప్రభుత్వం బహు సరిగ్గా వ్యవహరించింది. కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు.

ఇక సీ.జే.పీ. తదుపరిగా ఏం ఎత్తు వెయ్యనుంది? సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ఏ దశకు చేరుతుంది? నిరాహార దీక్ష విరమణను ఉన్నపళాన ఉపసంహరించుకోవడం ఒక పర్యవసానం. కానీ ఇప్పుడు నిరాహార దీక్ష విరమించడం సోనమ్ వాంగ్‌చుక్ ఘోర పరాజయం అవుతుంది.

ఆ పరాజయం సీ.జే.పీ.కీ ఘోర పరాజయమూ అయి దేశ వ్యతిరేక ఎకో సిస్టమ్ మరింత భంగపడి అత్యంత బలహీనపడుతుంది.
ప్రభుత్వాన్ని, ప్రజను కదిలించలేని ఈ నిరాహార దీక్ష పన్నాగాన్ని చటుక్కున విరమింపజేయ్యడం వల్ల ఇప్పటికే పెట్టిన భారీ ఖర్చులకు ఫలితం ఉండదు కదా?

ఇటీవల రాహుల్ గాంధీ దేశంలో లేకపోవడమూ, అతడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో తెలియకపోవడమూ పూర్వరంగంలో ఈ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు ముగింపు పరిణామం ఏమిటి అన్న ప్రశ్న, ఆపాయకరమైన ప్రశ్న, పెను భయాన్ని కలిగించే ప్రశ్నగా కలుగుతోంది. నిన్న అరవింద్ కేజ్రీవాల్ దీక్షా స్థలానికి రావడం, ఆ తరువాత ఆయన మాటలు కూడా దేశ ప్రజలో కొన్ని ప్రశ్నల్ని, భయాన్ని కలిగిస్తున్నాయి.

సోనమ్ వాంగ్‌చుక్ ఈ నిరాహార దీక్షలో ‘మరణించడం’ దేశ వ్యతిరేక ఎకో సిస్టమ్‌కు పెను లబ్ది చేకూర్చే పర్యవసానం అన్న ఆలోచన, కార్యాచరణ బలపడుతున్నాయా? ఆ మరణం వచ్చే వరకూ ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందా? సోనమ్ తన మరణాన్ని వాంఛిస్తాడా? ఆయన మరణం మాత్రమే సీ.జే.పీ. భవిష్యత్తుకు అత్యవసరం కానుందా?
ఇటువంటి పరిస్థితిలో సోనమ్ మరణాన్ని సీ.జే.పీ., దేశ వ్యతిరేక సిస్టమ్ సాధిస్తుందా?
సోనమ్ వాంగ్‌చుక్‌ను చంపేస్తారా?

భయాన్ని కలిగించే ప్రశ్నలు దేశ ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో సోనమ్ వాంగ్‌చుక్‌ మరణం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టచ్చు; దేశంలో అలజడి సృష్టించనూ వచ్చు. అందుకని
సోనమ్ వాంగ్‌చుక్‌ మరణమో ఈ నిరాహార దీక్ష లక్ష్యం అవబోతోందా?

ఒకటి మాత్రం స్థిరమైంది. అది
సోనమ్ వాంగ్‌చుక్‌ అన్ని రకాలుగానూ ఒక విఫలమైన వ్యక్తిగా ఇక దేశంలో మిగిలిపోవడం. దేశ ప్రజ ముందు ఆయన ఒక దోషి అయిపోవడం కూడా స్థిరమైపోయింది.
ఈ నిరాహార దీక్షకు దిగడం సోనమ్ వాంగ్‌చుక్‌ పెను తప్పిదం. దీక్ష విరమణమూ వైఫల్యమే; దీక్ష వల్ల మరణమూ వైఫల్యమే.

దేశ ప్రభుత్వాన్ని, దేశ ప్రజను తక్కువగా అంచనా వేసి ఈ నిరాహార దీక్ష వంటి తప్పుడు ఎత్తులు వేస్తున్న దేశ వ్యతిరేక ఎకో సిస్టమ్‌కు ఈ సోనమ్ వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష వైఫల్యం అన్నది ఒక చావు దెబ్బ. ఎంత తప్పుడు పని చేసినా కూడా ఒక వ్యక్తి మరణాన్ని ఆశించకూడదు. సోనమ్ వాంగ్‌చుక్‌ ఎవరి వల్లో మరణించకూడదు. కనుక కేంద్ర ప్రభుత్వం సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేసి అతడి ప్రాణాలు కాపాడాలి. ఇకనైనా సోనమ్ వాంగ్‌చుక్‌ దేశ వ్యతిరేక శక్తుల పావు కాకుండా ప్రభుత్వం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి అతణ్ణి మామూలు మనిషిని చెయ్యాలి.

రోచిష్మాన్
9444012279

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘రాసి పెట్టుకొండి- రావడం మాత్రం పక్కా… అవసరమూ ఉంది’’
  • ది ఒడిస్సీ ! వెండి తెరపై ఓ దృశ్య కావ్యాన్ని చెక్కిన నోలన్ !!
  • చంపేస్తారా? సోనమ్ వాంగ్‌చుక్‌ను చంపేస్తారా?
  • నో, నో – త్రీ ఇడియట్స్ హీరో పాత్రకూ ఈ సోనమ్ వాంగ్‌చుక్‌కూ లింకే లేదు !!
  • ఔను, నిజమే… ఆమె జీవితం ఓ పాఠ్యాంశం ఎందుకు కాకూడదు !!
  • లార్డ్స్‌లో రోహిత్ శర్మ చివరి మ్యాచ్? వీడ్కోలు అనివార్యమేనా?
  • ప్రైవేటు కంపెనీల ‘స్పేస్’లోకి ఇస్రో మేధోవలస ! ఓ నిశిత పరిశీలన !!
  • BRS – a political paradox ! బీఆర్ఎస్ అంటేనే ఓ పేద్ద విరోధాభాసం !
  • సుప్రీం సరేనంది ! మమత మార్క్ ముస్లిం రిజర్వేషన్లకు తెర !!
  • తీస్తా-3 ఓ వార్నింగ్ బెల్..! మేడిగడ్డతో ఆటలాడితే అసలుకే మోసం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions