.
సూపర్ స్టార్ కృష్ణ, వారసుల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆయన పెద్ద కొడుకు రమేష్ బాబు గుర్తొస్తాడు అందరికీ… తనను హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి కృష్ణ పడిన పాట్లు, వైఫల్యాలు గుర్తొస్తాయి… ఏదో అలాంటిదే చదువుతుంటే… తన డెబ్యూ సినిమా సామ్రాట్, అందులో నటించిన సోనమ్ గుర్తొచ్చారు…
సోనమ్, 1987 లో సామ్రాట్ సినిమాయే తనకు కూడా డెబ్యూ… అప్పటికి జస్ట్, పదిహేనేళ్లు… మంచి అందగత్తె… అప్పటి కుర్రాళ్లకు తెగ నచ్చేసింది… అప్పట్లో కుర్రకారు గుండెల్లో ‘ధడకన్’ … చాలా సినిమాల్లో ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉండేది… కానీ ఆ తరువాత ఆమె ఏమైంది అనే ఆసక్తి… తరువాత కృష్ణ తనను ముగ్గురు కొడుకులు సినిమాకు తీసుకున్నాడు… తరువాత రెండేళ్లకు చిరంజీవి సరసన కొదమసింహం… అంతే, మొత్తం ఇక హిందీ సినిమాలే…
Ads
అప్పట్లో ఫుల్ డిమాండ్ తనకు… ఒక ఏడాది అయితే (1990) పది సినిమాలు చేసింది, దర్శకుడు రాజీవ్ రాయ్‌ను పెళ్లి చేసుకుంది… ఆమెకు పేరు తెచ్చిన త్రిదేవ్, విశ్వాత్మ అనే హిట్ సినిమాలకు తనే దర్శకుడు… కానీ ముంబై అండర్ వరల్డ్‌తో ఏదో గొడవ, రాజీవ్ మీద అబూసలేం గ్యాంగ్ హత్యాయత్నం… ఆ దెబ్బకు దంపతులు బాలీవుడ్ వదిలేసి. దేశం కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది… అక్షరాలా విదేశాలకు పారిపోయారు…
లాస్ ఏంజిల్స్, లండన్, యూరప్… ఓ కొడుకు… కానీ తనకు ఆటిజం… ఈ బంధం చాన్నాళ్లు నిలవలేదు… 2001లో విడిపోయారు, 2016లో అధికారికంగా విడాకులు… అంటే పదిహేనేళ్లు పట్టింది… 2023లో ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవం దగ్గర కనిపించింది… అంటే, 30 ఏళ్లుగా ఆమె ఎవరికీ కనిపించలేదు… ఇప్పటికీ నటనకు సై అంటోంది…
2016లో అధికారికంగా విడాకులు వచ్చాక, ఇక 2017లో మురళి పొడువాల్ అనే ఓ ఆర్థోపెడిక్ సర్జన్ ను పెళ్లి చేసుకుంది, తనకు కూడా ఇది రెండో పెళ్లే… ఆమె కొడుకుతో ముంబైలోనే ఉంటోంది… తన వయస్సుకు తగిన పాత్రలు, ఓటీటీ, వెబ్ సీరీస్‌లో వస్తే పనిచేస్తానని ఈమధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పింది..!!
Share this Article