.
హరీష్ రావే కాదు, కేటీయార్, కేసీయార్, ఆ క్యాంపు అంతా అంతే… ప్రత్యర్థులను బదనాం చేయడానికి అన్ని మార్గాలూ వెతుకుతారు… అవి అనైతికం, అసమంజసమైన పద్ధతులు అని తెలియక కాదు, కావాలనే ! చివరకు కోర్టులను కూడా వాడుకుందామని ప్రయత్నిస్తే… మీ రాజకీయ ఫిర్యాదులు, కక్షలు, ప్రయోజనాలను కోర్టు ముందుకు తీసుకురావడానికి అనుమతించలేం అని సాక్షాత్తూ హైకోర్టు తేల్చి చెప్పింది…
ఒకరకంగా తప్పుపట్టింది… దీన్ని కాంగ్రెస్ తన అనుకూలంగా జనంలోకి తీసుకుపోలేకపోయింది… అదొక కథ… ప్రభుత్వ విధానాల అమలును పర్యవేక్షించడం మా పని కాదని హైకోర్టు విస్పష్టంగా చెప్పింది… రుణమాఫీ, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ ఆర్థిక ప్రాధామ్యాలు, నిధుల కేటాయింపు కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశాలని పేర్కొంది…
Ads
ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంతోపాటు పరిపాలనా అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ దాఖలు చేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. (సాక్షి కథనం ప్రకారం…)
ఎన్నికల హామీ మేరకు పంట రుణమాఫీ పథకం కింద రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయడం లేదని హరీశ్ రావు ప్రజాప్రయోజన వ్యాజ్యంలోని ప్రధాన ఫిర్యాదు… రుణ మాఫీ కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన రూ.31 వేల కోట్లలో రూ.20 వేల కోట్లనే విడుదల చేసిందని… ఇంకా రూ.11 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నాడు….
ప్రభుత్వ విధానం, నిధుల కేటాయింపులో కార్యనిర్వాహక వ్యవస్థ స్థానాన్ని కోర్టు భర్తీ చేయలేదని ధర్మాసనం స్పష్టం చేసింది… పంట రుణమాఫీ పథకం. అమలు, నిధుల పంపిణీ ప్రభుత్వ పరిధిలోని అంశాలని.. ప్రభుత్వ విధానాలపై అప్పీల్ అధికారిగా కోర్టు వ్యవహరించదని తెలిపింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే… అది చట్టబద్ధం కాకపోతే లేదా రాజ్యాంగ విరుద్ధం కానంత వరకు తాము ఆ నిర్ణయాన్ని పరిశీలించలేమని ధర్మాసనం పేర్కొంది.
రుణమాఫీ అమలుపై గతంలో దాఖలు చేసిన పిల్‌లో పిటిషనర్‌కు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించి, 8 వారాల తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. కానీ 8 వారాల గడువు పూర్తికాకముందే పిటిషనర్ జూన్ 22న పిల్ దాఖలు చేయడం సరికాదని పేర్కొంటూ పిల్‌ను తోసిపుచ్చింది…
భారీ వర్షాలు, మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు రూ.231 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని కోరుతూ దాఖలైన పిల్ పై విచారణకు సైతం హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ కోసం నిధులు మంజూరు చేసినా రైతులకు ఆ సొమ్ము సకాలంలో అందలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తను వేసిన ‘పిల్’ లో ఆరోపించాడు…
దీన్ని పరిశీలించిన ధర్మాసనం… ఆ వాదనకు తగిన వాస్తవ వివరాలను కోర్టు ముందు ఉంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది… సో, ఈ పిల్ నిర్వహణార్హం కాదంటూ నంబర్ కేటాయింపునకూ నిరాకరించింది…
Share this Article