Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్ నేరాలు- ఓ నిశిత విశ్లేషణ ! ఈ సంఖ్య కేసీయార్ వేధింపుల పుణ్యమే !!

August 19, 2026 by M S R

.

ఓ సీరియస్ విషయం చెప్పుకుందాం… 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసుల అంశం మళ్లీ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది..? అందరికన్నా రేవంత్ రెడ్డి మీదే ఎక్కువ కేసులు ఎందుకున్నాయి..? ఇందులో జనానికి కొంత క్లారిటీ అవసరం… ఎందుకంటే, తనపై 89 కేసులున్న నేరచరితుడిగా ముద్ర వేస్తున్నారు కాబట్టి..

కేసుల సంఖ్య వేరు – కేసుల తీవ్రత వేరు కాబట్టి… పైగా ఇవేమీ దాచిపెట్టబడిన కేసులు  ఏమీ కాదు… అన్నీ తనే స్వయంగా తన ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నవే… మళ్లీ ఈ కేసుల కథ తెరమీదకు ఎందుకు వచ్చింది అంటే..?

Ads

revanth

ఇది సుప్రీంకోర్టులో చాలా కాలంగా నడుస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలన్న PILలో భాగంగా కోర్టుకు సమర్పించిన తాజా స్టేటస్ రిపోర్ట్/ అఫిడవిట్… సీనియర్ అడ్వొకేట్ విజయ్ హన్సారియా ఈ కేసులో amicus curiae గా సుప్రీంకోర్టుకు తాజా వివరాలు సమర్పించారు. అందులో దేశంలోని 28 రాష్ట్రాల సీఎంలలో 14 మంది తమ ఎన్నికల అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అదే రిపోర్టులో 251 లోక్‌సభ ఎంపీలు, 75 రాజ్యసభ సభ్యులపై కూడా కేసుల వివరాలు ఉన్నాయి…

అందుకే ఇప్పుడు ఒక్కసారిగా… “14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు” అంటే సగం మంది సీఎంలపై… అనే హెడ్డింగ్ దేశవ్యాప్తంగా వార్త అయింది. అంటే కేసులు ఇప్పుడు పుట్టలేదు; పాత ఎన్నికల అఫిడవిట్లలో ఉన్న కేసులను సుప్రీంకోర్టు కేసు సందర్భంలో మళ్లీ ఒకచోట చేర్చి బయటకు తెచ్చారు. ఇది మొదటి క్లారిటీ.

రేవంత్‌రెడ్డిపై 89 కేసులు — నిజమేనా? నిజమే. కానీ అది 2026లో కొత్తగా నమోదైన 89 కేసులు కాదు. రేవంత్‌రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో 89 పెండింగ్ క్రిమినల్ కేసులు ప్రకటించారు.

అదే రికార్డులో:

2009 — 2
2014 — 2
2018 — 36
2019 — 42
2023 — 89

  • జాగ్రత్తగా గమనించండి… 2009లో కేవలం 2 కేసులు… స్వరాష్ట్రం వచ్చాక, కేసీయార్ పాలన స్థార్టయ్యాక రేవంత్ రెడ్డి మీద బనాయించబడిన కేసుల సంఖ్య చూడండి… 2018 వరకు 36, తరువాత ఒకే ఏడాదిలో 42కు పెరిగాయి, 2023 వచ్చేసరికి, అంటే తను సీఎం అయ్యే సంవత్సరానికి ఏకంగా వాటి సంఖ్య 89 కు చేరింది…

పోరాడే వీరుడి సత్తా తన దేహంపై గాయాలు చెబుతాయి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన ప్రత్యర్థి, ప్రతిపక్ష నేతపై ఉన్న కేసులు పాలకుడి అసహనాన్ని, కక్షసాధింపుల్ని చెబుతాయి… 2009లో 2 → 2014లో 2 → 2018లో 36 → 2019లో 42 → 2023లో 89… అనేది అధికారిక ఎన్నికల అఫిడవిట్లలో కనిపిస్తున్న పెరుగుదల…



రేవంత్ నేరాలు



2023 ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్‌రెడ్డి 89 కేసులూ pendingగా ఉన్నాయి. వాటి Charges Framed కాలమ్‌లో No అని ఉంది. Myneta/ADR రికార్డులో కూడా ఇదే కనిపిస్తుంది…. ఓటుకు నోటు కేసులో charges 2020 డిసెంబర్‌లోనే frame అయ్యాయి. ACB ప్రత్యేక కోర్టు 16 డిసెంబర్ 2020న రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులపై charges frame చేసింది…

“2023 ఎన్నికల అఫిడవిట్‌లో నమోదైన 89 కేసుల్లో, ఓటుకు నోటు కేసు మినహా మిగతా కేసులన్నింటిలోనూ అప్పటికి charges frame కాలేదు…” తెలంగాణ ఏర్పడకముందు 2 కేసుల్లో ఒక దాంట్లో ఎఫ్ఐఆర్ కూడా కాలేదు…



రేవంత్ నేరాలు



ఇది బలమైన, డాక్యుమెంట్‌తో నిలబెట్టగలిగిన వాదన. ఇంకో ముఖ్యమైన విషయం: 89 కేసుల్లో conviction ఒక్కటీ లేదు — 2023 అఫిడవిట్‌లో Cases where Convicted కింద No Cases అని స్పష్టంగా ఉంది.

మరి ఈ 89 కేసుల్లో ఎక్కువ భాగం ఎలాంటి కేసులు?

రేవంత్‌రెడ్డి అఫిడవిట్‌లో ఉన్న సెక్షన్లను చూస్తే…

IPC 506 — criminal intimidation: 34
IPC 505(2): 22
IPC 504 — intentional insult provoking breach of peace: 38
IPC 153 — provocation to riot: 20
IPC 188 — disobedience of public servant’s order: 17
IPC 341 — wrongful restraint: 12
IPC 189 — threat of injury to public servant: 5
IPC 120B — criminal conspiracy: 5
IPC 427 — mischief: 7

వంటి సెక్షన్లు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. అంటే కేసుల స్వభావంలో గణనీయమైన భాగం: నిరసనలు, ర్యాలీలు, రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల సందర్భాలు, పోలీసుల ఆదేశాల ఉల్లంఘన, ప్రజా శాంతికి సంబంధించిన సెక్షన్లు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం, ప్రసంగాలు/ప్రకటనలు, నిరసనల్లో చోటుచేసుకున్న ఘటనలు వంటి వాటికి సంబంధించినవి… అందువల్ల “89 కేసులు అంటే 89 తీవ్రమైన క్రిమినల్ నేరాలు” అనే impression ఇవ్వడం తప్పుదారి పట్టించేది…

సరే, కేటీయార్ భాషలో చెప్పుకోవాలంటే… లొట్టపీసు కేసులు, కేసీయార్ కావాలని ఎడాపెడా నమోదు చేయించిన కేసులు, పొలిటికల్ కేసులు… ఇవేమీ ఫార్ములా రేస్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి అడ్డగోలు అక్రమాల కేసులు అస్సలు కాదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తన జన్మస్థలి- తన రాజధాని ఖిలాషాపూర్… అక్కడ తన కోట…
  • రేవంత్ నేరాలు- ఓ నిశిత విశ్లేషణ ! ఈ సంఖ్య కేసీయార్ వేధింపుల పుణ్యమే !!
  • పెదరాయుడు రజినీకాంత్ ! అత్యంత సహృదయ స్నేహశీలి !
  • ఫేక్ న్యూస్‌పై కేంద్ర ప్రభుత్వం ‘యుద్ధం’ ప్రారంభించింది !
  • ఓ ప్రియురాలి వేదన – ఈ ఒక్క పాటతో గుల్జార్ వెనక్కి చూసుకోలేదు ఇక !!
  • తడి తడిమే ఓ ఆర్ద్రగీతం- కర్కశ హృదయుల కళ్లూ చెమర్చాల్సిందే
  • మంత్రి క్షమాపణ ! ఇది స్వీయ అభిశంసన !! అయ్యో, పొంగులేటి !!
  • ధ్రువ… ఆ రీల్ అపరిచితుడి కొడుకేనా ఈ రియల్ అపరిచితుడు..?!
  • ఛిన్న మస్తాదేవి ! ఓ స్టేజ్ షో ప్రదర్శనపై రచ్చ ! అసలేం జరిగిందంటే !!
  • ఫాఫం తెలంగాణ బీజేపీ ! హైకమాండ్ గాలికి వదిలేసినట్టుగా ఉంది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions