.
( Gopu Vijay Kumar Reddy ) … JioStarకి పోటీగా Sony Regional- First Strategy… అసలు టార్గెట్ South India నా? Reliance–Disney కలయికతో JioStar ఏర్పడిన తర్వాత భారత మీడియా మార్కెట్లో ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది— ఇక JioStar కు అసలు పోటీ ఎవరు?
దాదాపు ₹2 లక్షల కోట్లకు చేరుతున్న భారత advertising marketలో TV, OTT, Sports, Cinema, Digital అన్నింటినీ కలుపుకున్న భారీ ecosystem JioStar చేతిలోకి వచ్చింది. మరోవైపు Zee Network ఆర్థిక సమస్యలు, declining competitivenessతో అదే స్థాయిలో పోటీ ఇవ్వలేని పరిస్థితిలో… అనూహ్యంగా Sony Pictures Networks India మరోసారి aggressiveగా రంగంలోకి వస్తోంది.
Ads
కానీ Sony strategyలో అసలు ట్విస్ట్ Hindi- first కాదు… Regional -first. Sony అసలు గేమ్ ఇదే! అందరూ Hindi entertainment marketలో కొత్త audience కోసం పోటీ పడుతుంటే, Sony మాత్రం Regional Indiaలో premium content, పెద్ద celebrity names, established formatsతో కొత్త spaceను capture చేయాలని చూస్తోంది.
ఒక్కసారి Sony ప్రకటించిన కొత్త line-up చూస్తే strategy చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
Sony Regional & National Content Line-up
Marathi
Kon Honar Crorepati – Madhuri Dixit
Marathi version of the iconic KBC formatను Madhuri Dixitతో తీసుకురావడం Sonyకి Maharashtra marketపై ఉన్న seriousnessను చూపిస్తోంది.
Tamil
MasterChef Tamil – Samantha Ruth Prabhu
Cinemaలో భారీ fan base ఉన్న Samantha ను cooking reality format కు తీసుకురావడం ద్వారా youth + women + family audiencesను target చేస్తోంది.
Tamil
Tamil Idol – A.R. Rahman
Tamil music audience కు A.R. Rahman కంటే పెద్ద emotional connect చాలా తక్కువ. Music reality spaceలో ఇది Sonyకి భారీ brand play.
Hindi
Crime Patrol – Ajay Devgn
ఇప్పటికే successful IP అయిన Crime Patrol ను Ajay Devgnతో కొత్తగా position చేయడం ద్వారా established franchiseకు fresh celebrity value జోడిస్తోంది.
Hindi / Entertainment
The Rohit Sharma Show
Cricketను entertainment తో కలిపే ప్రయత్నంలో Indian cricket star Rohit Sharma ను television entertainment space లోకి తీసుకురావడం మరో పెద్ద bet.
ఇవి కాకుండా Sony తన కొత్త slate లో Hindi entertainment, fiction, non-fiction, reality, comedy, crime, sports, movies, digital originals , multilingual OTT contentను ఒకే ecosystem లో తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తోంది.
అంటే ఇది కేవలం TV channel programming కాదు.
TV + OTT + Cinema + Celebrity + Regional Content
అన్నింటినీ కలిపిన strategy.
తమిళ్ మార్కెట్లో ఎందుకు ఇంత ఫోకస్?
ఇక్కడ Sonyకి ఒక interesting window కనిపిస్తోంది.
2026 Tamil Nadu ఎన్నికల్లో DMK 59 సీట్లకే పరిమితమై, TVK 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ఈ రాజకీయ మార్పును నేరుగా entertainment vacuum కు కారణంగా చెప్పలేం. కానీ Tamil Nadu లో politics–cinema–celebrity ecosystem లో ఒక పెద్ద transition మొదలైంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
అలాంటి సమయంలో Sony Samantha, A.R. Rahman లాంటి భారీ Tamil cultural iconsతో entertainment space లోకి బలంగా రావడం చిన్న విషయం కాదు.
అంటే Sonyకి Tamil market లో target కేవలం TV audience కాదు.
Tamil cultural mindshare.
తెలుగు మార్కెట్లో కూడా space ఉందా?
ఇక్కడ పోటీ మరింత interesting.
JioStar కి Star Maa ద్వారా ఇప్పటికే Telugu GEC లో బలమైన position ఉంది.
మరోవైపు ETV Plus తన Jabardasth, Dhee Dance వంటి successful properties చుట్టూ బలమైన identity తెచ్చుకున్నప్పటికీ, ఆ ecosystem ను దాటి మరింత పెద్ద premium entertainment spaceను capture చేయాల్సిన అవసరం ఉంది.
అంటే మార్కెట్లో space లేదు అనేది కాదు.
కొత్త format + premium production + celebrity-led IP + regional originalsతో ఆ spaceను ఎవరు capture చేస్తారన్నదే ప్రశ్న.
Sony కి అదే opportunity.
Chennai Love Story… మరో signal
ఇదే సమయంలో Chennai Love Story ను SonyLIV ఆగస్టు 21 నుంచి Telugu తో పాటు Tamil, Kannada, Malayalam, Hindi భాషల్లో stream చేస్తోంది.
ఒక regional సినిమా → theatrical release → multilingual OTT.
అంటే Sony regional content ను ఒక రాష్ట్రానికి పరిమితం చేయకుండా pan-India digital asset గా చూస్తోంది.
అసలు పోటీ Contentలో మాత్రమే కాదు… Talentలో కూడా!
ఇక్కడ మరో కీలకమైన విషయం ఉంది…
ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం national, regional entertainment space లో experienced senior talent ను Sony aggressively attract చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని cases లో పెద్ద salary hikes తో offers ఉన్నాయన్న చర్చ కూడా ఉంది.
దీనిపై అధికారిక confirmation లేకపోయినా, strategy మాత్రం clear.
JioSta rకి పోటీ ఇవ్వాలంటే programmes మాత్రమే కాదు… programmes తయారు చేసే quality manpower కూడా కావాలి.
ఎందుకంటే ఇప్పుడు Sony కి పోటీ Local player తో కాదు.
International experience ఉన్న global media company తో.
TV vs OTT కాదు… TV + OTT
Traditional TV viewership తగ్గుతున్న సమయంలో Sony మరో important bet వేస్తోంది.
Television + SonyLIV.
ఒకే IPని TVలో build చేసి, OTTలో extend చేసి, celebrity ని regional market లో establish చేసి, అదే content ను multilingual audience కు తీసుకెళ్లడం.
అందుకే వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో అసలు పోటీ—
JioStar vs Sony మాత్రమే కాదు.
Scale vs Strategy.
JioStar దగ్గర scale ఉంది.
Sony దగ్గర ఇప్పుడు premium content, marquee talent, global formats, regional-first strategy ఉన్నాయి.
అంబానీ మీడియా సామ్రాజ్యానికి Sony ఎంతవరకు చెక్ పెడుతుందో ఇప్పుడే చెప్పలేం.
కానీ ఒక విషయం మాత్రం స్పష్టం—
JioStarకి పోటీగా ఇప్పుడు వస్తున్నది మరో Indian TV network కాదు… Sony.
Share this Article