.
సినిమా డైలాగ్ అంటే… సహజంగా పాత్రల నడుమ కథానుసారం, పాత్రోచితంగా లైవ్‌గా ధ్వనించాలి… అంతేతప్ప నీతులు పంచులుగా పేల్చొద్దు… మాయాబజార్2లో ‘ అమ్మో- అమ్మే’ అనే డైలాగ్ ఫరెవర్… రెండే పదాలు… ఆ సీన్‌ను బ్రహ్మాండంగా ఎలివేట్ చేసింది…
అతడు సినిమాలో త్రిష అంటుంది ‘నేనూ వస్తా’ అని… మహేశ్ రిప్లయ్… ‘నేనే వస్తా’… ఇలా ఒదగాలి, ఆ సీన్‌ను పైకి లేపాలి… ఆ సందర్భాన్ని చిన్న పదాల్లోనే ప్రేక్షకుల మెదళ్లలోకి ఎక్కించాలి… లేదా బాలయ్య సినిమాల్లోలాగా బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ దంచి కొట్టాలి… మంచి డైలాగులు కోకొల్లలు…
Ads
కానీ టాక్సిక్ సినిమా అటూ ఇటూ గాకుండా పోయింది… నిజానికి ఆ ఒరిజినల్ కన్నడ డైలాగ్ రచయిత బాగా కష్టపడ్డాడు… అది మనం నిన్నో మొన్నో వివరంగా చెప్పుకున్నాం, తెలుగు అనువాదంలోకి వచ్చేసరికి చచ్చిపోయాయి కొన్ని…
కొటేషన్లు పుస్తకాల్లో సందర్భానుసారం, సోషల్ మీడియా పోస్టులకు బాగానే ఉంటాయి కవితా పాదాలుగా… ఏదో మార్మికతను ధ్వనిస్తూ… కానీ కొటేషన్లనే డైలాగుల్లాగా వదిలితే అవి సినిమా కథలో ఇమడవు, పంటి కింద రాళ్లలా పటుక్కుమంటుంటాయి…
మొన్న ఆ డైలాగుల్లో కొన్ని చెప్పుకున్నాం కదా… సోషల్ మీడియాలో కనిాపించిన ఓ విశ్లేషణ నచ్చింది… ఇలా… సారాంశం ఏమిటంటే..?
ఈ డైాలాగుల్లో చాలావరకు పాప్‌కల్చర్, హాలీవుడ్ సినిమాలు, ఐకానిక్ టీవీ సిరీస్‌లు, ప్రపంచ ప్రసిద్ధ కోట్స్, పాత సామెతలు, సోషల్ మీడియా సర్క్యులేటెడ్ కోట్స్ ను paraphrase చేసినట్టు అనిపించింది… ఎత్తేయడం తప్పని కాదు, కానీ రచయితలకు Art of lifting (ఎత్తేసే కళ- అది 65 కళ) తెలియాలి… కొన్ని పరిశీలిద్దాం…
నా కథ ఎదిగిన వాళ్లకు చెప్పే ఫెయిరీ టేల్. (by great Spanish director Guillermo del Toro.)
“అయిపోయిందని నువ్వు చెప్పినప్పుడు కాదు, నేను చెప్పినప్పుడే అయిపోతుంది. (We’re done when I say we’re done.‘ ఇది Breaking Bad’ సిరీస్ లోని ఒక ఐకానిక్ డైలాగ్.)
నన్ను చంపాలని చాలామంది ప్రయత్నించారు. బతకాలని నేను ఒక్కణ్ణే నిర్ణయించుకున్నాను. (ఇది Batman విజువల్స్ వాడుతూ వైరల్ అయిన ఒక ఫ్యాన్-మేడ్ ఎడిటెడ్ కోట్.)
విశ్వాసం చాలా ఖరీదైన వస్తువు. అందుకే నేను దాన్ని చవక మనుషుల దగ్గర కొనను. (Honesty is a very expensive gift, don’t expect it from cheap people- ఇది వారెన్ బఫెట్ పేరు మీద బాగా circulate అయిన కోట్. కానీ ఆయన అనలేదు. ఫ్యాన్-మేడ్.)
ప్రతీకారం అంటే ఎదుటివాడిని చంపడం కాదు. వాడు బతికుండగానే ఓడిపోయానని తెలిసేలా చేయడం. (ఇది త్రివిక్రమ్ ది. “యుద్దం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం.” టాక్సిక్ లైన్ మరీ డబ్బింగ్ డైలాగులా ఉంది. May be- its a ‘lost in translation’…)
ఈ ప్రపంచంలో అమాయకులు ఎవరూ ఉండరు. అవకాశం రానివాళ్లు మాత్రమే ఉంటారు. (ఇది మనం చాలాసార్లు సాహిత్యంలోనూ సినిమాల్లోనూ విన్న, చదివిన వాక్యమే కదా…)
అగ్నితో అగ్నిలాగానే పోరాడాలి. (ముల్లును ముల్లుతోనే తీయాలి లాంటి పాత సామెతల adaptation. ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే Shakespeare King John నాటకంలోని డైలాగ్ “be fire with fire. సినిమా adaptationsలో కూడా ఇదే లైన్ ఉంది. అంతేకాదు చాలా హాలీవుడ్ సినిమాల్లో ఇది పంచ్ డైలాగ్.
ఇంకొన్ని డైలాగులు… “మన క్రౌర్యానికి, శౌర్యానికి, వీర్యానికి.. చీర్స్!”
“ఒక చెయ్యికి సమాధానం చెప్పాం.. రెండో చేతికి అర్థమయ్యేలా నువ్వు చెప్పు”
“మగతనానికి, మగాడి నిజాయితీకి ఒకే సారి పరీక్ష పెట్టకూడదు”
“కొంత మందిని బతకడానికి ప్రేమిస్తాం, కొంత మందిని బతుకే అనుకుని ప్రేమిస్తాం”.
శాంతి వల్ల అంతా బాగుంటే శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగాయి.
….. డైలాగులు చదవడానికి బాగున్నాయి… కానీ కన్వీనియెంటుగా కథలో ఒదగలేదు, పైగా కాపీ కొటేషన్లు… దీన్నే మనం ‘టాక్సిక్ ధోరణి’ అని పలుస్తున్నాం… సినిమా డిజాస్టర్ అయిపోయి, ఈ డైలాగులు మట్టికొట్టుకుపోయాయి గానీ, సినిమా హిట్టయితే ఇవీ ఆణిముత్యాలుగా బహుశ ప్రచారం పొంది ఉండేవి!!
Share this Article