Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!

September 3, 2026 by M S R

.

కొండా సురేఖ కాంగ్రెస్ హైకమాండ్‌కు రాసిన లేఖలో అంశాలు బ్లాస్టింగ్ అని కదా ప్రచారం జరిగింది… కానీ అది ఆమె రాసినట్టుగా లేదు… ఏమీ లేదు, తుస్సు… ఆమె తన వాదనను కూడా సరిగ్గా బిల్డప్ చేయలేదు సరికదా, ఆమె మాజీ ఓఎస్డీ, అత్యంత వివాదాస్పదుడైన సుమంత్ ప్రస్తావన తీసుకొచ్చి, అపహాస్యం చేసుకుంది… ఇంకా వివరాల్లోకి వెళ్దాం…

ఎఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ బాస్ రాహుల్ గాంధీ, ఎఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక వాద్రాకు ఈ లేఖలు సమర్పించింది… ముందుగా సుమంత్ గురించి చెప్పి, మిగతా అంశాల్ని చెప్పుకుందాం… సుమంత్ తన ఓఎస్డీ… అత్యంత వివాదాస్పదుడు… నిజానికి ఆమధ్య తనను అరెస్టు చేయాలి, కానీ రేవంత్ రెడ్డి ఉపేక్షించాడు…

Ads

ఈమె తన లేఖలో తన మంత్రిత్వ శాఖ నిర్ణయాల్ని తనను తీసుకోనివ్వలేదు, సీఎంవో నిర్ణయాలు తీసుకునేది అని రాసింది… కానీ పొల్యూషన్ కంట్రోల్, ఎండోమెంట్స్ వ్యవహారాల్లో సుమంత్ అనధికారిక మంత్రి… ప్రస్తుతం తన మీద కేసుంది… అది పరిపాలన కోణంలో తీసుకున్న నిర్ణయం, ఇప్పటికే లేటైంది కూడా…

దాన్ని తనకు అన్యాయం జరిగినట్టుగా ఆమె చిత్రించుకోవడం విచిత్రం… ఈ లేఖ ఆమె రాసిందా..? సుమంత్ రాశాడా..? నిజానికి తన ఓఎస్డీ పలు ఆరోపణల్లో దొరికిపోవడం తనకే చిన్నతనం… సో, ఇవన్నీ ఆమె ప్రస్తావించకుండా ఉండాల్సింది… తను ఓఎస్డీ గురించి తనే బయటపెట్టి, చర్యలు తీసుకోవాల్సింది…

లేఖలో మరో ప్రస్తావన… మొదటి నుంచీ కాంగ్రెస్ ఎదుగుదల కోసం పనిచేశాం అని… ఆమె వైఎస్సార్సీపీలో చేరింది, రోశయ్య కేబినెట్‌ నుంచి వైదొలిగి కాంగ్రెస్ పరువు తీసింది ఒక దశలో… తరువాత కాంగ్రెస్ ప్రబల ప్రత్యర్థి పార్టీ కేసీయార్ పార్టీలోనూ చేరింది… మొన్నటి ఎన్నికలు కాంగ్రెస్ గెలుపు వైపు వెళ్తున్నాయని తెలిసి కదా మళ్లీ కాంగ్రెస్‌లో చేరింది..!! ఇక్కడా ఆమె వాదన తేలిపోయింది…

నా కూతురు వ్యాఖ్యలు చేస్తే నామీద చర్యలు ఏమిటి అనడిగింది… ఆమెకు అసలు కాంగ్రెస్‌తో సంబంధం లేదు కదా… మరి ఆమె వ్యాఖ్యల్ని సురేఖ కుటుంబం చేస్తున్న వ్యాఖ్యలుగానే కదా పరిగణించాల్సింది… బిడ్డ వ్యాఖ్యలతో సంబంధం లేదు అన్నప్పుడు వాటిని ఎందుకు ఖండించలేదు… అంటే ఉద్దేశపూర్వకంగానే బిడ్డతో వ్యాఖ్యలు చేయించినట్టే కదా మరి…

konda

యాదాద్రి గుడి ట్రస్టు విషయంలో దేవాదాయ శాఖ మంత్రినైనా సరే నాకు సమాచారం లేదు అని మరో ప్రస్తావన… తెలంగాణకు సంబంధించి పెద్ద గుడి… అందరి అభిప్రాయాలూ తీసుకుని ట్రస్టు బోర్డు నియామకం జరపడం కష్టం… అందుకే రేవంత్ రెడ్డి తన విచక్షణాధికారాన్ని వినియోగించాడు, అందులో తప్పులేదు… అదీ తుస్సు…

సమ్మక్క – సారలమ్మ గుడి డెవలప్‌మెంట్ పనులకు దేవాదాయ నిధులు ఖర్చుపెట్టినా సరే, వాటిని ఆర్‌అండ్‌బీకి అప్పగించారని మరో ప్రస్తావన… అందులో తప్పేం ఉంది..? ఆ వివాదం అప్పట్లోనే ముగిసింది కూడా… ఆర్‌అండ్‌బీకే ఈ పనుల్లో నైపుణ్యం ఉంటుంది…

తన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వివక్ష అని మరో ప్రస్తావన… ఖజానా పరిస్థితులు, పరిపాలన జాప్యాల్లో కొన్ని మెల్లిగా నడుస్తుంటాయి, అది సంబంధిత ఎమ్మెల్యే మీద వివక్ష ఎలా అవుతుంది..? మరి ఇన్నేళ్లు ఈ విషయాన్ని ఎందుకు వెల్లడించలేదు..?

konda

కడియం శ్రీహరి తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించాడు అట… తన నియోజకవర్గానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులతో వివిధ పనుల్ని సమీక్షించడంలో తప్పేం ఉంది..? పైగా కడియం శ్రీహరి సుదీర్ఘ రాజకీయాల్లో, అధికార హోదాల్లో పనిచేశాడు, కావాలని ఆ తప్పు  చేయడు…

జగ్గారెడ్డి సంగారెడ్డిలో గానీ, మరే ఇతర నియోజకవర్గంలో పోటీచేసే విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అన్నాడు రేవంత్ రెడ్డి, అందులో తప్పేముంది..? అంతేకాదు, పరకాలలో రేవూరి నిలబడతాడని చెప్పాడు, పార్టీ కేడర్‌లో ఓ జోష్ కోసం ప్రసంగాల్లో అలా వదులుతూ ఉంటారు నాయకులు, అందులోనూ తప్పు లేదు…

konda susmitha

పాత వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నేతలు సీఎం ప్రోద్బలంతో తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మరో ఆరోపణ… అంతమంది ఎందుకు దూరమయ్యారని కదా ఆమె ఆలోచించుకోవల్సింది..? కొద్దిరోజులుగా పార్టీ నాయకులు తన మీద అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఇంకో ప్రస్తావన… పార్టీకి అధికారికంగా ఏ లింకూ లేని సురేఖ బిడ్డ ఏకంగా సీఎం మీద వ్యాఖ్యలు చేస్తే, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ అభిప్రాయాల్ని చెబితే తప్పెలా అవుతుంది..?

వీటన్నింటి మీద విచారణ జరపాలని కోరింది ఆమె… అసలు ఇందులో సీరియస్ అలిగేషన్స్ ఏమున్నాయని..? బీసీ మహిళను కాబట్టి వివక్ష అంటోంది… ఆమెకు బదులుగా మరో ముగ్గురు బీసీ మహిళలకు, దాదాపు అవే కులాలకు చెందిన వాళ్లకు పదవులు ఇచ్చాడు రేవంత్ రెడ్డి… శుభం… ఆమె చేసిన తప్పులో ప్రముఖమైంది సీఎం మీద విచారణ జరగాలని..! అది హైకమాండ్ దగ్గర ఎదురుతన్నింది…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు
  • డియర్ యానిమల్ వంగా ! ఒక్క రోమమూ నిక్కబొడుచుకుంటే ఒట్టు !!
  • యుద్ధరంగంలో ఇక ఈ వీరప్పన్ మార్క్ మీసాలు తిప్పబడవు !
  • సెన్సేషనల్ హిట్ ! కానీ ఈ కథలో తెలుగు స్టార్ హీరో ఇమడగలడా !
  • బిగ్‌బాస్ ట్రోఫీ – జస్ట్, ఇంట్లో పెట్టుకునే ఓ షో పీస్‌ మాత్రమే…
  • ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, శివాదులందరూ యమలోకానికి వెళ్లారు..!
  • మెలితిరిగిన మీసాల తెలుగు ముఖ్యమంత్రి… ఓ సరదా కథనం…
  • జితేంద్ర మిశ్రా ! ‘ఆపరేషన్ సిందూర్’ లీడర్‌‌కు ఇక ‘ఆపరేషన్ అయోధ్య’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions