Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!

September 11, 2026 by M S R

.

ఇప్పుడంతా జెన్‌జీ లేదా లేత యూత్ ముచ్చట్లే కదా… కానీ జెన్‌జీ అనగానే ఈతరం సినిమా దర్శకులు ఊహిస్తున్నట్టుగానే ఉందా ప్రపంచం..? చదువుకుంటూ, కొలువు చేసుకుంటూ, కనిపించిన అబ్బాయితో జస్ట్ ఇలా కలిసిపోయి, ఒకే గదిలో కోలివింగ్ లేదా లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిపోతుంటారా..?

పెళ్లికి ముందు… ఏదో హోటల్‌లో కలిసి భోంచేసినట్టు, సినిమా చూసినట్టుగా… అంతే లైట్‌గా, అంతే కాజువల్‌గా సంభోగాలు..? నో పెళ్లి, నో జంఝాటం, కలిసి ఉందాం, అన్ని అవసరాలూ తీర్చుకుందాం, చిరాకెత్తితే విడిపోదాం, నువ్వు నువ్వే, నేను నేనే… అంతేనా..?

Ads

నవతరం దర్శకులకు నిజంగా జెన్‌జీ ఎదురుకునే జీవనసవాళ్లు, కొందరు అనేక అవరోధాల్ని అధిగమిస్తూ శిఖరాలు చేరుతున్న సక్సెస్ స్టోరీలు కనిపించవు.., చాలామంది యువతీయువకులు చాలా ప్లాన్‌డ్‌గా, మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తున్నారు…

తాత్కాలిక సుఖాల వెంపర్లాట మాత్రమే కాదు వాళ్ల దారి… కానీ ఈ సినిమాలో చూపించినట్టు ఎంతసేపూ బోల్డ్ సీన్లు, విలాసాలు, ఇంటిమేట్ యవ్వారాలు, ఇవేనా..? బేబీ సినిమా కాంబో దేవరకొండ ఆనంద్, వైష్ణవి చైతన్య కొత్త సినిమా ఎపిక్, ఫస్ట్ సెమిస్టర్ సినిమా చూస్తుంటే గుర్తొచ్చేవి ఇవే… న్యూ ఏజ్ లవ్ డ్రామా అంటే ఇదేనా మిస్టర్ డైరెక్టర్..?

ఆల్రెడీ బేబీలో చూశాం కదా ఈ ఇద్దరి బోల్డ్‌నెస్… ఈ సినిమాలో ఇంకాస్త డోస్ పెంచారు… నిజంగా సహజీవనాలు, చిక్కులు, మనోవర్తి, భరణం, పేరెంట్స్ ఆందోళన, జీవితంలో స్థిరపడేందుకు ప్రయాస… చాలా పెద్ద సబ్జెక్టు… ఏవో కొన్ని మసాలా సీన్లు, కాసింత కామెడీ జల్లేసి కథ అలా పెరిఫెరల్‌గా నడిపించాడు దర్శకుడు ఆదిత్య హసన్… మన వివాహ వ్యవస్థ ప్రస్తుతం కుదుపులకు గురవుతోంది, దాన్ని అర్థం చేసుకునేంత పరిణతి ఈ దర్శకుడి టేకింగులో, ప్రజెంటేషన్‌లో, ముగింపులో కనిపించలేదు…

కేరక్టరైజేషన్లు- కథనంలోనూ పలుచోట్ల ప్రేక్షకుడు గందరగోళానికి గురవుతాడు… బహుశా దర్శకుడి స్థాయిలో ప్రేక్షకుడు ఈ గందరగోళపు న్యూఏజ్‌లోకి ప్రేక్షకుడు ప్రయాణించలేకపోవడం వల్లనేమో!!

నిజమే, అసలు వర్తమాన సమాజంలో ఓపట్టాన పెళ్లిళ్లు కుదరడం లేదు.., ఆడపిల్లకూ, మగపిల్లాడికీ శ‌ృతి పొసగడం లేదు, ఇరువైపులా కోర్కెల జాబితాలు తెగవు… సంబంధాలు అతుక్కోవు… ఒకవేళ పెళ్లి జరిగినా నాలుగురోజులు కుదురుగా ఉండటం లేదు, విడాకులు, కేసులు, గృహహింస, లైంగిక వేధింపులు… మరీ శృతి మించితే కొత్త ప్రియుళ్లతో కలిసి పాత ప్రియుళ్లను లేదా భర్తలను ఖతం చేయడం… ఓ సామాజిక సంక్షోభం చుట్టుముడుతోంది వేగంగానే..!

ఒకరకంగా సున్నితంగా మారిపోయిన మగాడూ ఈ జంఝాట రహిత సహజీవనాల్నే ఇష్టపడుతున్నట్టుంది… ఈ స్థితి నిజానికి ఆడపిల్లకే ఈ బంధాలు ఆర్థికంగా, సామాజికంగా, చట్టపరంగా అభద్రతను కలిగిస్తాయి… ఓ మధ్యతరగతి పిల్లాడు (ఆనంద్), సినిమాలే తన లక్ష్యం, కానీ పేరెంట్స్ కోసం యూకే వెళ్తాడు చదువు కోసం… అక్కడ ఓ తెలుగు పిల్ల (వైష్ణవి చైతన్య) కలుస్తుంది, వెంటనే కలిసిపోతారు…

దర్శకుడికి అర్థమైన జెన్‌జీ ధోరణి అంటే అంతే మరి… నాలుగు కామెడీ సీన్లు, లండన్ వీథులు, అందాలు గట్రా… సెకండాఫ్‌లో తల్లిదండ్రులు, బాధ్యతలు, ఎమోషన్స్ కలిపారు… క్లైమాక్సుకు ముందు కథ బరువు పెంచారు గానీ క్లైమాక్స్ చివరకు తేలిపోయింది… పలుచోట్ల ల్యాగయిన ఫీలింగు…

ఏమాటకామాట… పెద్దలకు మాత్రమే సినిమా ఇది… ఐనా అరచేతిలో సంభోగ దృశ్యాలు సాధారణమైన ఈరోజుల్లో చిన్నలు ఎవరు, పెద్దలు ఎవరు..? సంగీతం, పాటలు పర్లేదు… ఎప్పటిలాగే, అంటే బేబీలాగే ఆనంద్‌ను వైష్ణవి స్పష్టంగా డామినేట్ చేసింది… ఆమె నటనలో పరిణతి కనిపిస్తుంది… తన పాత్రను తన నటనతో ఎలివేట్ చేస్తుంది…

చివరగా… ‘‘ఈరోజుల్లో ఇవన్నీ కామనే’’ అనే అపరిపక్వ ఆలోచనలు, కో-రిలేషన్ల వైపు యువతరాన్ని తీసుకెళ్లే ఇలాంటి సినిమాలు, ఈ కథలు అసలు సోషల్ టాక్సిక్‌లు… యశ్ టాక్సిక్ ఓరకమైన విచ్చలవిడితనమైతే… మరి ఇదేమిటి దర్శకా..?!

అవునూ, మొన్న ప్రిరిలీజు ఫంక్షన్‌లో ఏమంటివి వైష్ణవీ… ఈ సినిమా చూస్తుంటే బేబీ గుర్తుకురాకపోతే సక్సెస్ అయినట్టే అని కదా… ట్రాజెడీ ఏమిటంటే..? నువ్వు ఎంచుకున్న పాత్ర అదే, అదే సినిమా గుర్తొచ్చింది… అదే కాదు, సఖి, ఒకే బంగారం వంటి పాత సినిమాలు కూడా గుర్తొచ్చాయి, కానీ వాటిల్లో ‘బోల్డ్’ వాసనల్లేవు!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • EPIC – బోల్డ్‌గా ఏదో చెప్పాలనుకుని- బోల్తాకొట్టిన కథాకథనాలు !!
  • వారమైనా కాలేదు – బిగ్‌బాస్ తిక్క ప్లానింగు – ఓ గట్టి కంటెస్టెంట్ ఔట్ !!
  • సినిమా బ్లాక్‌బస్టర్ ! హఠాత్తుగా కరోలీ బాబా ఇంటిపై పంచాయితీ !!
  • సర్దార్-2 … మిషన్ పెద్దదే… కానీ ఇంజన్‌లో దమ్ములేదు – ఇది కార్తి టాక్సిక్ !!
  • ‘‘పిరికి న్యాయమూర్తి అనిపించుకోవడంకంటే చావడానికే ఇష్టపడతాను’’
  • ప్రతి కథా ఇరుముడి కాలేదు – మారెమ్మలా తుస్సుమనొచ్చు కూడా!!
  • బిడ్డ అడిగిన బర్త్‌డే గిఫ్ట్ … బడ్జెట్ లెక్కలేసి బావురుమన్న తండ్రి!
  • లడఖ్ మారుతోంది ! ప్రకృతి వనరుల్నే ఇంధనంగా మార్చుకుంటూ !!
  • టీవీ ఆఫ్ కాలేదు – వింటోంది, చూస్తోంది, రికార్డ్ చేస్తోంది… అన్నీ !!
  • జియోథర్మల్ పవర్ ! ఇండియాలో తొలి ప్రయోగం ! కొత్త ఎనర్జీ సోర్స్ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions