విజయవాడ Cityని తూర్పు, పడమరగా ఇంద్రకీలాద్రి పర్వతం divide చేస్తుంది. విజయవాడలో దాదాపు 70 percent area తూర్పు వైపు ఉంటే, 30 percent area పడమర వైపు ఉంటుంది.
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాలన్నా, ఇటు నుంచి అటు రావాలన్నా ఇంద్రకీలాద్రిని cross చేయాల్సిందే. దానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ఒకటి కృష్ణానది వెంబడి ఉన్న దుర్గ ఫ్లైఓవర్, రెండోది ఇంద్రకీలాద్రి పర్వతంలో ఏర్పాటు చేసిన టన్నెల్, మూడోది ఇంద్రకీలాద్రికి ఉత్తరం వైపు నుంచి వెళ్లే మార్గం.
విజయవాడ తూర్పు నుంచి పడమర వైపు వెళ్లే trafficలో దాదాపు 60 percent traffic దుర్గ ఫ్లైఓవర్ మీదుగానే వెళ్తుంది. మంచి Flyover వేశారు. దాంతో trafficకు చాలా relief వచ్చింది. అందుకు సంతోషించాల్సిందే.
Ads
కానీ అసలు problem అక్కడితో ముగియదు.
ఆ Flyover దిగిన వెంటనే, Bus Stand దగ్గర ఒక Low Bridge ఉంటుంది. Majority traffic ఆ Low Bridge మీదుగానే వెళ్లాలి. ఆ ప్రాంతం సహజంగానే కిందకు ఉండటంతో, చిన్న వర్షం పడినా అక్కడ నీళ్లు నిలిచిపోతాయి.
ఒక్కసారి ఆ Low Bridge దగ్గర నీళ్లు నిలిచాయంటే చాలు—విజయవాడ తూర్పు నుంచి పడమర వైపు వెళ్లే మొత్తం traffic స్తంభించిపోతుంది. రోడ్లన్నీ అస్తవ్యస్తమైపోతాయి.
ఇది కేవలం విజయవాడలోని ఒక చిన్న road problem కాదు.
కొత్త Seed Access Road ఏర్పడిన తర్వాత, ప్రకాశం బ్యారేజ్ మీదుగా అమరావతికి వెళ్లే traffic కూడా ఈ Low Bridge మీదుగానే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ చిన్న Low Bridge ఇప్పుడు విజయవాడ East–West trafficకే కాకుండా, అమరావతి వైపు వెళ్లే important connectivityకి కూడా ఒక major bottleneck అయిపోయింది.
ఇంతకీ అసలు ఆశ్చర్యం ఏమిటంటే—ఆ నీటిని బయటకు పంపడానికి రెండు natural outlets చాలా దగ్గరలోనే ఉన్నాయి.
ఒక వైపు కేవలం సుమారు 50 meters దూరంలో కృష్ణానది ఉంది. మరో వైపు దాదాపు 150 meters దూరంలో బందర్ కాలువ ఉంది. ఈ రెండూ కూడా ఈ Low Bridge ప్రాంతం కంటే తక్కువ levelలోనే ఉన్నాయి.
మరి ఒక proper storm-water drainage system ఎందుకు ఏర్పాటు చేయకూడదు?
అవసరమైతే ఒక strong pumping system పెట్టి, ఈ storm waterని వెంటనే బందర్ కాలువలోకి లేదా కృష్ణానదిలోకి divert చేయవచ్చు. Levels అనుకూలంగా ఉంటే, ఒక pipeline ద్వారా gravity flowతోనే నీటిని బయటకు పంపే అవకాశం కూడా ఉందేమో engineeringగా పరిశీలించవచ్చు.
ఒక వైపు 50 meters. మరో వైపు 150 meters.
ఇంత దగ్గరలో water outlets ఉన్నప్పుడు, ఈ సమస్యకు ఒక permanent solution ఎందుకు రావడం లేదు?
ఇది ఏదో వేల కోట్ల రూపాయల project కాదు. ఏళ్ల తరబడి విజయవాడ ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఒక basic civic problem.
కానీ మనం ఏం చేస్తున్నాం?
ఈ మూల నుంచి ఆ మూలకు Flyover వేస్తాం. పెద్ద పెద్ద corridors కడతాం. భారీ infrastructure projects గురించి మాట్లాడతాం. Visionary solutions గురించి చెబుతాం.
కానీ ప్రతి వర్షం పడినప్పుడు విజయవాడ నగరాన్ని స్తంభింపజేస్తున్న ఈ చిన్న Low Bridge problemకు మాత్రం ఒక permanent solution కనుక్కోలేకపోతున్నాం.
Most probably, ఈ problem మీద ఎవ్వరూ బుర్ర పెట్టడం లేదు.
ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న problem. Problem ఎక్కడుందో తెలుసు. ఎందుకు నీళ్లు నిలుస్తాయో తెలుసు. Waterని ఎక్కడికి divert చేయవచ్చో కూడా మన కళ్లముందే ఉంది.
అయినా solution మాత్రం లేదు.
కేసినేని చిన్ని గారు, సుజనా చౌదరి గారు, బోండా ఉమా గారు, గద్దె రామ్మోహన్ గారు—మీరు విజయవాడకు ప్రాతినిధ్యం వహిస్తున్న very strong political leaders. మీకు political strength ఉంది. Governmentతో మాట్లాడే స్థాయి ఉంది. Decisions తీసుకునే అవకాశం ఉంది.
అలాంటి మీ leadershipలో విజయవాడను ప్రతి వర్షంలో ఇబ్బంది పెట్టే ఈ చిన్న problem కూడా solve కాకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయం.
పెద్ద పెద్ద visionary projects తర్వాత చూద్దాం.
ముందు ప్రతి వర్షంలో విజయవాడను స్తంభింపజేస్తున్న ఈ Low Bridge problemకి permanent solution ఇవ్వండి.
విజయవాడకు పెద్ద పెద్ద projects కావాలి. కానీ అంతకంటే ముందు, ప్రజల day-to-day lifeని ఇబ్బంది పెట్టే చిన్న problemsని solve చేసే leadership కావాలి.
ఈ చిన్న problemని కూడా solve చేయలేకపోతే, అది … విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం……. By సతీష్ చాగంటి…..
Share this Article