Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!

September 23, 2026 by M S R

.

(  రమణ కొంటికర్ల  ) …. తల్లయ్యాక కత్రినా కైఫ్ దేహంలో వచ్చిన మార్పుల మీద రీసెంటుగా బాడీ షేమింగ్, బోలెడు చర్చ, మీమ్స్, పోస్టులు, ఖండనలు సాగుతున్నాయి కదా… ఆమె కూడా ఏదో వివరణ ఇచ్చుకుంది హుందాగా, సంస్కారయుతంగా… ‘బాహ్యరూపం కాదు… నా అసలైన అందం నా ఆనందం, నా ఆత్మవిశ్వాసం మాత్రమే’…

నో డౌట్, ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్… భర్త విక్కీ కౌశల్ స్టార్ హీరో… ప్రస్తుతం బాలీవుడ్‌లో మంచి గిరాకీ ఉన్న హీరో… ఆమె స్టేటస్‌కు ఇప్పటికీ ఏమీ తక్కువ లేదు… అయితే మరో ఆసక్తికరమైన విషయం చెప్పుకుందాం… ‘‘కత్రినా కైఫ్ తల్లి తమిళనాడు గ్రామంలో విద్యుత్, ఇంటర్నెట్ లేకుండా ఎందుకు ఉంటున్నారు?’’

Ads

కొందరి జీవనశైలి ఆసక్తికరంగా ఉంటుంది. ఆ వ్యక్తిగత జీవితాలు మనకు అవసరమా అనుకున్నా… ఓసారి తొంగిచూసి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీని పెంచుతుంటాయి. అలాంటిదే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లి కథ.

కత్రినా కైఫ్ పేరు చెబితే టాప్ మోస్ట్ బాలీవుడ్ హీరోయిన్ గా విలాసవంతమైన జీవితం, సినిమాలు, స్టార్ డమ్, సెలబ్రిటీ హోదా ఇవన్నీ సాధారణంగానే చాలామంది స్టార్స్ లాగే గుర్తొస్తాయి. కానీ, కత్రినా తల్లి సుజానే టర్కోట్ జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతోంది. లండన్ జీవితాన్ని వదిలి ఆమె ఇప్పుడు తమిళనాడులోని ఓ గ్రామంలో బతుకుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలుగా ఆమె ఈ సాధారణ జీవితాన్నెందుకు ఎంచుకున్నారన్నదే ఆసక్తికరం.

పైగా ఆమె జీవిస్తున్న గ్రామంలో సరిగ్గా నిరంతర విద్యుత్ సరఫరా కూడా ఉండదట. రోజులో సుమారు 12 గంటల పాటే విద్యుత్ అందుబాటులో ఉంటుందని కత్రినానే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని సమయాల్లో ఇంటర్నెట్ కూడా అందుబాటులో లేకపోవడంతో వీడియో కాల్ మాట్లాడటం కూడా సాధ్యం కాదట. అలాంటప్పుడు కూతురు కత్రినా సాధారణ కాల్ చేసి మాట్లాడాల్సి వస్తోందట.

katrina

2008లో తమిళనాడు బాట పట్టిన సుజానే టర్కోట్! సుజానే 2008లో లండన్ నుంచి తమిళనాడుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్య, ఆరోగ్యం, ఇతర సాయం అందించాలన్న ఒక సత్సంకల్పం ఈమె గ్రామీణ జీవితాన్ని ఎంచుకోవడం వెనుక ఉంది. అలా మధురై జిల్లా ఉసిలంపట్టి తాలూకాలోని ఈ పుత్తుపట్టి అనే మారుమూల గ్రామంలో రిలీఫ్ ప్రాజెక్ట్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను ఆరంభించి.. తద్వారా తాననుకున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అలాగే, అక్కడే 2015లో మౌంటెన్ వ్యూ స్కూల్ పేరిట ఓ పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. మొదట చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చిన్నారులతో చిన్న స్థాయిలో ఆరంభమైన ఆ పాఠశాల క్రమంగా అభివృద్ధి చెంది.. ఇప్పుడు వందలాది మంది పిల్లలకు విద్యనందిస్తోంది. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యనందిస్తున్న ఈ స్కూల్ లో… 2025-26 సంవత్సరంలో 305 మంది పిల్లలు చదువుకుంటున్నారు.

సుజానే అక్కడ కేవలం నిర్వాహకురాలే కాదు. పాఠశాలలో తానూ బోధిస్తుంది. పాఠ్య ప్రణాళిక రూపొందిస్తోంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి పనుల్లోనూ పాల్గొంటోంది.

సుఖాన ఉన్న జీవితాన్ని మరెందుకు దుఖాన పెట్టుకున్నట్టు..? గ్రామంలో తీవ్రమైన వేడి. మరోవైపు విద్యుత్ సరిగ్గా ఉండదు. కూతురి స్టార్ డమ్ తో పాటే… అంతకుముందు నుంచే మంచి సంపన్న కుటుంబం కావడంతో ఏసీల్లో పెరిగిన వాతావరణం. ఇవన్నీ కాదనుకుని ఒక ఛాలెంజింగ్ లైఫ్ ను సుజానే టర్కోట్ ఎందుకు స్వీకరించినట్టు..?

ప్రజలకు సేవ చేయాలన్న ప్యాషన్. పైగా అన్నీ ఉన్నా వదిలి రావడమంటే కచ్చితంగా ఓ ప్రత్యేకమైన మనస్తత్వం కల్గి ఉన్నవాళ్లే ఇలా చేయగలరు.

మరి కత్రినా బాల్యమెలా ఉండేది..? తన చిన్ననాటి జీవితం కూడా ఇప్పుడు కనిపించే స్టార్ డమ్ కు పూర్తి భిన్నంగా ఉండేదంటున్నారు కత్రినా కైఫ్. తన తల్లి సేవా కార్యక్రమాల ప్రభావం తమ కుటుంబంపైనా ఉండేదంటోంది ఆమె. సాధారణమైన, పొదుపుతో కూడిన జీవితాన్నే తమ తల్లిదండ్రులు తనకు నేర్పారంటోంది. తల్లి సేవా కార్యక్రమాల కారణంగా చిన్నప్పట్నుంచే గ్రామీణ జీవితంలోని సవాళ్లను తానూ దగ్గరగా చూశానని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

కూతురి మద్దతు! తల్లి చేస్తున్న సేవా కార్యక్రమాలను తాను ఆ స్థాయిలో ప్రత్యక్షంగా చేయలేకపోతున్నప్పటికీ.. తల్లికి కూతురు కత్రినా కైఫ్ మాత్రం ఆర్థికంగానూ మద్దతిస్తోంది. ఓవైపు బాలీవుడ్ లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న కత్రినా కైఫ్ జీవితం… మరోవైపు, తమిళనాడులోని గ్రామీణ పిల్లల కోసం విద్యా సేవ చేస్తున్న ఆమె తల్లి సుజానే టర్కోట్ జీవితం… ఇలా రెండు భిన్న పార్శ్వాలు ఆ కుటుంబంలో ఆకట్టుకునేవి…. ఇప్పుడు చెప్పండర్రా కత్రినా అసలైన సౌందర్యం ఏమిటో..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బిడ్డ బాలీవుడ్ స్టార్ ! తల్లి ఓ తమిళపల్లెవాసి ! ఇదీ అసలు సౌందర్యం !!
  • చిన్న సినిమా అంటే చిన్నతనం కాదు… చిల్లరతనం అసలే కాదమ్మా…
  • హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!
  • చచ్చీ చెడీ… చావు దప్పి… ఓ అవమానకరమైన విజయం…
  • ఓసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేనికి ఓ చికాకు ప్రశ్న వేశాడు..!
  • లిక్కర్ స్కాంలో జగన్‌ను లోపలేస్తారా..? ఏపీ పాలిటిక్స్‌లో చర్చ !!
  • ‘‘ దిగితే మావాడు సీఎం – మావాడు తలుచుకుంటే దేశానికే పీఎం… ’’
  • చరిత్ర చెబుతోంది ! దానం నాగేందర్‌కు ఈ ఉపఎన్నిక అంత ఈజీ కాదు !
  • తండ్రి సినిమాకు కన్నీటి సర్టిఫికెట్..! ఎన్నిసార్లు చూసినా ఏడ్చేస్తోంది ‘మాత’..!!
  • పేరడీ ! ఏశనాగుల కట్ట మీద ఉయ్యాల ఊగిన జబర్దస్త్ సద్దాం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions