.
ఇప్పుడు బన్నీ టీమ్ కూడా బరిలోకి దిగింది… అసలే నాని పైత్యంతో పెంట పెంటగా మారిన ఓ సినిమా ఇష్యూ మరింత దిగజారిపోయింది జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తలపిస్తూ..! ఆల్రెడీ ‘ముచ్చట’ నాని మార్క్ మూర్ఖత్వం, బాధ్యతారాహిత్యం, తెలివిడిలేనితనంతో ఇదెలా వివాదంగా మారిందో సవివరంగా చెప్పుకొచ్చింది… ఆఫ్టరాల్ ఓ నటుడి ఎదుట సాగిలబడకండీ అని ప్రభుత్వాన్ని, పోలీసులను సూచించింది… ఇదీ లింక్… హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!
(నానిని హీరో అనడానికి మనస్కరించడం లేదు… ఏమాత్రం, హీరోయిజం అంటే తెలియని అత్యంత బాధ్యతారహిత కేరక్టర్ కాబట్టి)…. ఈ స్థితిలో ఓ సీఎం నిష్కర్షగా ఫోఫోవోయ్, వెధవ కోరిక అని కొట్టిపారేయాల్సింది, లేక సైలెంటుగా ఉండాలి… కానీ సినిమాలకు సంబంధించి ఈ ప్రజాప్రభుత్వానికి ఓ దశ లేదు, ఓ దిశ లేదు, దిల్ రాజు చూపించిన వైపు గుడ్డిగా అడుగులు వేయడం తప్ప…
Ads
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరుకే ఈ పోర్ట్‌ఫోలియో, ఇందులో అసలు తన నిర్ణయాధికారం లేదు, ఎవరూ వేలు కూడా పెట్టనివ్వరు పాపం… ఇక నాని పైత్యపు ట్వీట్ తరువాత (అసలు నేను ట్వీట్ చేస్తే ఆఫ్టరాల్ సీఎం ఎట్సెట్రా స్పందిస్తారు, పర్మిషన్ ఇస్తారు అనుకున్నాడు ఈ ఎలపరుడు… పర్మిషన్ కోసం ఓ ప్రొసీజర్ ఉంటుంది, పాపం ఎంత తెలంగాణ పోలీసులైనా వాళ్లకూ ఆత్మగౌరవం ఉంటుంది కదాని మరిచాడు…)
వరుసగా ఏం జరిగిందో చూద్దాం… సీఎం పేరిట ఓ ట్వీట్… పర్లేదు శ్రీయుత అత్యంత గౌరవనీయ నాని గారూ, సంబంధిత ఠాణాలో అప్లయ్ చేయండి అని… ఓ నటుడి కోరికకు ది గ్రేట్ తెలంగాణ స్టేట్ సాగిలబడాలా అనే సోయి సీఎం టీమ్‌కు లోపించింది… సీఎం పోస్టు తాలూకు విలువ కూడా లుప్తమైపోయింది.,. అత్యంత బ్యాలెన్స్డ్గా, హుందాగా, సీఎం పోస్టు తాలూకు సుపీరియర్ హోదాకు తగినట్టు డీల్ చేయాల్సిన సీఎం టీమ్ ఈ ఇష్యూ సెన్సిటివిటీని ఏమాత్రం పట్టుకోలేదు…
సీఎం చెప్పాక ఇక బాగుండదులే అనుకుని, మేమూ సినిమాటోగ్రఫీయే కదా అని, మాకూ బాధ్యత ఉంటుందేమో అనుకుని… కోమటిరెడ్డి పేరిట ‘సేమ్ సో సో’ ట్వీట్ కొట్టింది తన టీమ్… అదొక దిక్కుమాలిన శాఖ… పేరుకు ఓ మంత్రి, నడిపించేదంతా దిల్ రాజు, రోహిణ్ రెడ్డి…
పాపం, సీఎం టీమ్ ఏదో అవగాహన రాహిత్యంతో ఏదో ట్వీట్ కొట్టినా సరే… తెలంగాణ డీజీపీకి ఆ ట్వీట్ ట్యాగ్ చేయడంతో తనకు తప్పలేదు… పాపం, బాగానే స్పందించాడు… ఎందుకొచ్చిన గొడవ నాకు అనుకుని… అయ్యా, నానీ, అయ్యా, ఓదెల శ్రీకాంత్… మీరయితే అప్లయ్ చేయండి, హైదరాబాద్ సీపీ అన్నీ పరిశీలించి నిర్ణయిస్తాడు అని రీట్వీట్ చేశాడు…
ఇక్కడ తన తప్పులేదు, అదే ట్వీట్లో ఒకవైపు వందల గణేషుడి విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తుంటాయి, సెన్సిటివ్ ఇష్యూ, ఈ స్థితిలో గణేషుడిని వదిలేసి, నాని అనే ఓ దేవుడి రక్షణకు వందల మంది పోలీసులను నియమించలేం కదా… అదీ గుర్తుచేశాడు… పాత సంఘటనలో ఒకామె మరణించడం, ఆమె కొడుకు ఈరోజుకు జీవచ్ఛవంలా మిగిలిపోవడాన్ని కూడా గుర్తుచేశాడు, ఇష్యూ తీవ్రత కోసం… ఇక్కడివరకూ పర్లేదు…

ఎప్పుడైతే తెలంగాణ డీజీపీ పాత సంఘటనల్ని ఉదహరించాడో వెంటనే బన్నీ టీమ్ బరిలోకి దిగింది… ఈ పెంటను, ఈ బురదను, ఈ దుర్వాసనను మేం మరింత జటిలం చేస్తాం, మేం వ్యాప్తి చేస్తాం అన్నట్టుగా… (బన్నీ అంటే గుర్తుంది కదా, నానికి తాత, అదే సంధ్య థియేటర్ దగ్గర షోఆఫ్ చేసి, తొక్కిసలాటకు, ప్రాణనష్టాలకూ ప్రధాన కారకుడు… జైలుకు పోయొచ్చినా ఏమాత్రం పశ్చాత్తాపం లేని అత్యంత కనికరుడు)…
(Bunny – Youth Icon Of India … @BunnyYouthIconn …. ఇదీ సదరు బన్నీయుడి ఎక్స్ ఖాతా ప్రొఫైల్… తనకు తానే భుజాలు చరుచుకుని డీజే సౌండ్‌తో చెబుతున్నాడు నేను యూత్ ఐకాన్ ఆఫ్ ఇండియా అని… స్మగ్లర్ల పాత్రలు పోషించి, వెగటు రొమాంటిక్ సాంగ్స్ చేసుకునే ఓ వెర్రి పుష్పుడి పరిచయం ఇది…)
(అవునూ, సంధ్య థియేటర్ అనగానే అదేదో పుష్కరిణి అన్నట్టుగా, ఆకాశగంగ, పాపనాశనం స్థాయిలో ఎందుకు చూస్తారు..? రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు కదా ఈ పైత్యాన్ని..? పైగా ఒకసారి కేసు పెట్టబడ్డాక కూడా సదరు సంధ్య ఓనర్‌కు ఇంకా పాపం బుర్ర ఆపరేషన్లోకి రానట్టుంది)…
బన్నీ టీమ్ స్పందన చూద్దాం… అందరికీ గోకిగోకి పెంట చేయడమే కదా కర్తవ్యం… ‘‘అయ్యా, తెలంగాణ డీజీపీ గారూ, ఆ సంధ్య థియేటర్ కేసు ఇంకా విచారణలో ఉంది కదా, ఓ మహిళ మరణం, ఓ బాలుడి శాశ్వత వైకల్యం ఎవరి వల్ల జరిగిందో కోర్టు కదా తేల్చాల్సింది… మీరెలా ట్వీటుతారు, సబ్‌జుడీస్ కాదా’’ అన్నట్టు ఓ ట్వీట్ వదిలింది… అంతేకాదు, ఆఫ్టరాల్ ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మాకేం లెక్క అన్నట్టుగా…
- ‘‘ కోర్టు ధిక్కరణ చట్టం (సెక్షన్ 2(సి), అఖిల భారత సర్వీసుల ప్రవర్తనా నియమావళి (నియమాలు 3, 7, 9) ప్రకారం మీరు ఇలాంటి ప్రకటనలు చేయవద్దు కదా’’ అని తెలంగాణ డీజీపీకి చురకలు పెట్టింది బన్నీ టీమ్… ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు కాస్త ఆత్మగౌరవ స్పృహ కలుగుతుందని ఆశించడం తప్ప ఇంకేమీ చేయలేం… అన్నింటినీ దాటేస్తున్నారు సోకాల్డ్ నటులు…
వావ్… ఇక్కడ గణుషుడి నిమజ్జనం ఈ తలతిక్క పైత్యపు ఇండస్ట్రీకి పట్టదు, హైదరాబాద్ సెన్సిటివిటీ పట్టదు… ఎవడో ఏదో అడుగుతాడు… హుందాగా, అత్యున్నత అధికార స్థాయిలో స్పందించాల్సిన ప్రభుత్వానికి ఆ సోయి కూడా లేదు… అందుకే, ఇదుగో ఇలా ప్రతి ఒక్కడూ అన్ని ఇష్యూస్‌ను పెంట పెంట చేస్తున్నారు…
చివరగా... ఈ పైత్యపు టీమ్‌లన్నీ ఓచోట కలిసి ‘దొరల్ తాగే ఇప్ప సారై’ తాగి, సమాలోచనలు జరిపితే ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో.... పాపం, తెలంగాణ జనం.!! (ముఖచిత్రం కోసం వాడిన ఫోటో ఆ సినిమా పైత్యంలోని భాగమేనని గ్రహించగలరు...)
Share this Article