Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!

September 23, 2026 by M S R

.

సినిమా వాళ్లకు ప్రేక్షకులంటే ఓ తేలికతనం… ఎవడెట్లా పోతేనేం, ఎవడు చస్తేనేం, తప్పులు చేస్తూనే ఉంటారు… ప్రత్యేకించి హీరోలకు వాళ్ల వెర్రి ఫ్యాన్స్ ముఖ్యం, డబ్బు ముఖ్యం, ఇమేజ్ ముఖ్యం, తద్వారా మరింత సంపాదన ముఖ్యం… వాళ్లు తీసే వెర్రి సినిమాలు చూసి జనం వెర్రెక్కిపోవడం ముఖ్యం…

నటుడు నాని పేరిట కనిపించిన ఓ వెర్రి ట్వీట్ చదవగానే అనిపించే భావన ఇదే… తమ వెర్రి కోరికలకు ఇచ్చుకునే వెర్రి సమర్థన కూడా విస్తుగొలుపుతోంది… తను నటించిన ప్యారడైజ్ సినిమా రిలీజ్ అవుతోంది కదా… హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ ‌రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో వీక్షిస్తాడట,..

Ads

ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలట… వీళ్లకు ప్రభుత్వాలన్నా, ప్రజలన్నా ఎంత తేలికభావం ఉందో అర్థమవుతోంది… ముందుగా తను వేసిన ఆ వెర్రి ట్వీట్ చదవండి, తెలుగులో…

nani

 



గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ @రేవంత్_అనుముల, గౌరవనీయ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు, శ్రీ

@కోమటైర్డ్డికేవీఆర్ గారు. గౌరవనీయ అధికారులు, @తెలంగాణCOPs

ఇది ఒక సినిమా అభిమానిగా, మరీ ముఖ్యంగా చిన్నప్పటి నుంచే అత్యుత్తమ సినిమాను ఆస్వాదించిన వ్యక్తిగా నా అభ్యర్థన. నాకు, సినిమా అంటే ఎప్పుడూ, నాలాగే సినిమాను ప్రేమించే వారితో కలిసి చూడటమే. ఇక హైదరాబాద్‌లో, ఆ అనుభవానికి RTC X రోడ్స్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది.

#TheParadise ప్రీమియర్ షో (సెప్టెంబర్ 23) కోసం RTC X రోడ్స్‌లోని థియేటర్‌కు వచ్చి, మేము ఎవరి కోసం ఈ సినిమా తీశామో ఆ ప్రేక్షకులతో కలిసి ఈ చిత్రాన్ని అనుభవించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రేక్షకుల మధ్య కూర్చుని, సినిమాకు వారి స్పందనను అనుభవించడంలోనే సినిమా తీయడంలో అంతిమ సంతృప్తి ఉంటుందని నేను నమ్ముతాను.

మేము అవసరమైన అన్ని ప్రోటోకాల్‌లు, భద్రతా మార్గదర్శకాలను పాటిస్తాము. అదే మా ప్రాధాన్యత. మీరు దయచేసి నా అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. గౌరవపూర్వకంగా, నాని.



…. చదివారు కదా, ఇదీ ఆ ట్వీట్… నాని ఒకసారి పోలీస్ కమిషనర్‌ను లేదా ఆ ఏరియా పోలీసులను కలిసి పర్మిషన్ అడిగే ముందు… గతంలో అల్లు అర్జున్ అనబడే మరో హీరో సాగించిన ఓ వెర్రి షో వల్ల తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి, ఈరోజుకూ ఓ జీవచ్ఛవంలా పడున్న శ్రీతేజ అనే పిల్లాడిని చూసిరా… ఆ పిల్లాడి తల్లి రేవతి కూడా ఆరోజూ అక్కడే మరణించింది… నాటి గాయాలు, బన్నీ షోఆఫ్ పైత్యం ఈరోజుకూ హైదరాబాద్‌ను సలుపుతూనే ఉన్నాయి…

అదే సంధ్య థియేటర్‌లో సినిమా చూస్తాడట… ఆ సంఘటన కారకులపై ఈరోజుకూ కేసు నడుస్తోంది, థియేటర్ యాజమాన్యంపై కూడా… అల్లు అర్జున్ ఓరోజు జైలులో ఉండి వచ్చాడు… (తన ఇంటికి ఇండస్ట్రీ మొత్తం పరామర్శకు లైన్ కట్టింది, అది వేరే సంగతి… ఇప్పటి ఈ ప్యారడైజ్ నాని గతంలో తెలంగాణ వ్యతిరేకి అనేదీ గమనార్హం)…

sandhya(చిన్నప్పటి నుంచీ సినిమాను ప్రేమించే నానీ, ఈమె మొహాన్ని గుర్తుపట్టగలవా..?)

అదే సంధ్య థియేటర్‌కు… వెళ్లండిరా బాబూ, వెళ్లండి, మీ టీమ్ మొత్తం వెళ్లండి, ఊరేగండి, జనం ట్రాఫిక్ అవస్థలు, ఫ్యాన్స్ తరలిరావడం, మళ్లీ ఏదైనా జరిగితే బాధితుల మొహాన లక్షల కొట్టండి, ఎవడు బతికితేనేం, ఎవడు చస్తేనేం…

అక్కడ ఆ జనంతో కలిసి సినిమా చూస్తేనే మజా అట, అందుకని అక్కడే చూస్తాడట… యాణ్నుంచి వస్తారుర మీరంతా..? మీ సినిమావాళ్లే అత్యంతాధునిక విలాస థియేటర్లు కట్టారు కదా, అక్కడ చూడకూడదా..? ప్రీమియర్‌కు వచ్చే ఫ్యాన్స్ వెర్రి కేకలు వేస్తుంటే, అక్కడే ఉండి అవన్నీ ఎంజాయ్ చేయడానికి ఈ వెర్రి కోరిక…

allu arrest(allu arjun arrest photo)

ఐనా తెలంగాణ ప్రభుత్వానికీ శరం లేదు… సంధ్య థియేటర్ విషాదం తరువాత ఇక నో ప్రిరిలీజులు అన్నారు, మళ్లీ స్టార్ట్… ప్రీమియర్లు లేవు అన్నారు, మళ్లీ స్టార్ట్… టికెట్ రేట్ల పెంపు ఉండదు అన్నారు, మళ్లీ స్టార్ట్… ఓ కోటి సర్కారు ఖజానా మొహాన కొడితే సరి… దానికితోడు ఇదుగో ఈ ప్రీమియర్ షోలకు హీరోలు వెళ్తారట… ఓ రెండొందల మంది పోలీసులను మొహరించి, నాని పాదాల మీద సాగిల పడతారేమో ఇక..!!

హైదరాబాద్ సినిమా వెర్రి ప్రేక్షకులారా నినదించండి… జై దిల్ రాజూ, జై రోహిణ్ రెడ్డి, జై కోమటిరెడ్డీ… జైజై రేవంత్ రెడ్డీ…!!

చివరగా... నాని మరొకటీ కోరితే బాగుండేదేమో... *దొరల్ తాగే ఇప్ప సారై* తెచ్చుకుంటాం, అక్కడే ఊగిపోతాం, పర్మిషనివ్వండి అని..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరో నాని ఓ వెర్రి ట్వీట్ ! ప్రజాప్రభుత్వమా ఇక సాగిలబడు ఓ నటుడి ఎదుట !!
  • చచ్చీ చెడీ… చావు దప్పి… ఓ అవమానకరమైన విజయం…
  • ఓసారి ఓ కుర్ర జర్నలిస్టు అక్కినేనికి ఓ చికాకు ప్రశ్న వేశాడు..!
  • లిక్కర్ స్కాంలో జగన్‌ను లోపలేస్తారా..? ఏపీ పాలిటిక్స్‌లో చర్చ !!
  • ‘‘ దిగితే మావాడు సీఎం – మావాడు తలుచుకుంటే దేశానికే పీఎం… ’’
  • చరిత్ర చెబుతోంది ! దానం నాగేందర్‌కు ఈ ఉపఎన్నిక అంత ఈజీ కాదు !
  • తండ్రి సినిమాకు కన్నీటి సర్టిఫికెట్..! ఎన్నిసార్లు చూసినా ఏడ్చేస్తోంది ‘మాత’..!!
  • పేరడీ ! ఏశనాగుల కట్ట మీద ఉయ్యాల ఊగిన జబర్దస్త్ సద్దాం !!
  • వై నాట్ సిరిసిల్ల – వై నాట్ సిద్దిపేట – రేవంత్ ‘అఫెన్స్ గేమ్ ప్లాన్’…
  • కండ్లల్ల కన్నీళ్లు సమ్మక్కా, నీ రొమ్ములకెట్లొచ్చే సమ్మక్కా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions