Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కడా?!

October 7, 2026 by M S R

.

Pardha Saradhi Upadrasta …. సర్దార్ వల్లభాయి పటేల్ అన్న గారు అయిన విఠల్‌భాయ్ పటేల్ , నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు వీలునామా రాస్తే , సర్దార్ వల్లభాయి పటేల్ దాని మీద కోర్టుకెల్లారు. దేశ భక్తుడు అయిన సుభాష్ చంద్ర బోస్ మీద డబ్బుల కోసం పటేల్ కోర్ట్ కు ఎక్కారు అనే ఒక కథ సోషల్ మీడియాలో నడుస్తోంది

కారణాలు, కోర్టు తీర్పులు కూడా రాసుకుంటే విషయం మీద స్పష్టత వస్తుంది… సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నగారైన విఠల్‌భాయ్ పటేల్ అనారోగ్యంతో ఉన్నప్పుడు యూరప్‌లో సుభాష్ చంద్రబోస్ ఆయనకు ఎంతో దగ్గరుండి సేవలు చేశారు. దీనికి కృతజ్ఞతగా , బోస్ దేశభక్తిని గౌరవిస్తూ, విఠల్‌భాయ్ పటేల్ 1933లో స్విట్జర్లాండ్‌లో ఒక వీలునామా రాశారు.

Ads

వీలునామాలోని అంశం ఏమిటంటే తన ఆస్తిలో 3/4 వంతు భాగాన్ని (సుమారు ₹1 లక్ష) “భారతదేశ రాజకీయ పురోగతి , విదేశాలలో దేశ స్వాతంత్ర్య ప్రచారం” కోసం సుభాష్ చంద్రబోస్ ఉపయోగించాలని అందులో పేర్కొన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ వీలునామాను కోర్టులో సవాలు చేయడానికి కేవలం వ్యక్తిగత కారణాలు మాత్రమే లేవు, కొన్ని బలమైన చట్టపరమైన , రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చట్టపరమైన స్పష్టత కోసం ఆయన కోర్టుకెల్లారు.

వీలునామాలో రాసిన “రాజకీయ పురోగతి కోసం” అనే పదం చాలా అస్పష్టంగా ఉందని పటేల్ భావించారు. ఆ డబ్బును ఏ నిర్దిష్ట ట్రస్ట్‌కు లేదా ఏ చట్టబద్ధమైన పనికి వాడుతారో స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయములో స్పష్టత ఇవ్వండీ అని కోర్టును కోరారు. అన్న మీద కేసు అంటే అదేదో అన్న విల్లు మీద, అన్న చేసిన దానికి వ్యతిరేకముగా కాదు, సుభాష్ చంద్ర బోస్ మీద. నేరుగా కేసు కాదు. విల్లు న్యాయ పర స్పష్టత కోసం.

వీలునామాలో పేర్కొన్న “రాజకీయ ప్రయోజనం” అనేది చట్టపరంగా ఒక చెల్లుబాటు అయ్యే ఛారిటబుల్ ట్రస్ట్‌గా పరిగణించలేమని, అది చాలా అస్పష్టంగా ఉందని కోర్టు ఆ వీలునామాను రద్దు చేసింది.

చివరికి కోర్టు తీర్పు ప్రకారం ఆ ఆస్తి విఠల్‌ భాయ్ పటేల్ చట్టబద్ధమైన వారసులకు (అంటే పటేల్ కుటుంబానికి) దక్కింది. అయితే, సర్దార్ పటేల్ ఆ డబ్బును తన సొంతానికి వాడుకోలేదు. ఆ మొత్తాన్ని ఆయన “విఠల్‌భాయ్ మెమోరియల్ ట్రస్ట్” కు బదిలీ చేసి, దేశ సేవ కోసమే ఉపయోగించారు.

ఆయన కోర్టుకు వెళ్ళిందే స్పష్టత కోసం. చివరికి అన్న గారి పేరున ట్రస్ట్ లో వాడారు ఆ డబ్బులు. విఠల్ పటేల్ విల్లులో రాసింది కూడా అదే……

సర్దార్ పటేల్ ఆ కేసు వేయడానికి కారణం బోస్‌కు ఆస్తి దక్కకూడదనే వ్యక్తిగత కక్షకంటే, ఆ వీలునామా యొక్క చట్టబద్ధత లోపించడం , రాజకీయ నిధుల వినియోగంపై ఉన్న అస్పష్టతలే ప్రధాన కారణం.

విషయాలు పూర్తిగా తెలియకుండా సర్దార్ వల్లభాయి పటేల్ , నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి వ్యతిరేకముగా కోర్టుకు పోయి ఆస్తి తెచ్చుకున్నాడోచ్ అనేది ప్రచారం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏది నిజం? సర్దార్ పటేల్‌ నేతాజీ బోస్‌కు వ్యతిరేకంగా కోర్టుకెక్కడా?!
  • క్షణాల్లో టికెట్లన్నీ ‘మాయం’ – ఏం జరుగుతోంది నాయుడూ..?!
  • లెంపలేసుకున్న ఈనాడు – ఆ వార్త పొరపాటే అని ఒప్పుకోలు !!
  • 100 రోజుల బందిఖానా కాదు… 4 వారాల్లోనే ‘ఖేల్ ఖతం’!
  • విమానంలో సీటు పోయిందా..? ఆ ఒక్క మాట చెప్పండి.. కథే మారిపోతుంది!
  • “ఖాన్‌తో గేమ్స్ ఆడకు… శాల్తీలు లేచిపోతాయ్”
  • రేవంత్ రెడ్డి దూకుడు! కేసీయార్‌కు ఇక చెరుపుకోలేని మరక!
  • భేష్ మృణాల్… కథ తడబడినా… నటన తగ్గనివ్వలేదు!
  • నేను రెడీ’ అని స్మృతి చెప్పింది.. మూడు నెలలకే హర్మన్ తప్పుకుంది!
  • అబ్బురపరిచే సినిమాటిక్ ‘ఎదుగుదల’..! ఎవరీ ‘పవర్‌ఫుల్ కేరక్టర్..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions