.
Kovela Santoshkumar …. 13 కోట్ల ఓట్ల తొలగింపు గురించి ఎన్నికల సంఘం ఇప్పటికే చెప్పిన వివరాలు..
మరణించినప్పటికీ ఇప్పటివరకు జాబితాలోనే కొనసాగుతున్న ఓటర్లు: 2.80 కోట్లు
ఒకే వ్యక్తి పేరు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్లు: 1.02 కోట్లు
ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి శాశ్వతంగా నివాసం మార్చిన వారు: 6.30 కోట్లు
ఓటర్ల జాబితాలో ఉన్న చిరునామాలో ప్రస్తుతం అందుబాటులో లేని వారు: 3.01 కోట్లు
సాంకేతిక కారణాలు లేదా ఇతర నిబంధనల పరిధిలోకి వచ్చే ఓట్లు: 0.26 కోట్లు
మొత్తం (Total) 13.39 కోట్లు
మరి 13 కోట్ల ఓట్లు తొలగించారని చెప్తున్న విపక్షాలు, కమ్యూనిస్టులు, మేధావులం అనుకొనేవారు.. గుడ్డిగా నేటి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకులు, యమ అర్జెంటుగా యువరాజును ప్రధానిని చేయాలని ఆతృత పడుతున్న వారు.. ఇందులో ఏది తప్పో చెప్పాలి కదా.. పోనీ ఇవన్నీ తప్పులని తేల్చాలి కదా.. తేల్చరు. తప్పులు అని నిర్ధారించేస్తారు. ఏదీ చెప్పకుండా.. ఎవరిని తొలగించారో చెప్పకుండా.. రోడ్ల మీద వీరంగాలు వేసేవారిని ఏమనాలి..
Ads
విపక్షనేతకు ప్రధాన సలహాదారు యోగేంద్ర యాదవ్.. ఇకపై నిర్ణయాలన్నీ పార్లమెంటుల్లో, కోర్టుల్లో జరుగవు.. వీధుల్లోనే జరుగుతాయని స్పష్టంగానే ప్రకటించారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. ఇప్పుడు కోర్టులో ఈ వ్యవహారంమీద కేసులు కూడా వేశారు. విచారణ కూడా జరుగుతున్నది. కానీ, కోర్టులు చెప్పటం తమకు ఇష్టం ఉండదు. తాము చెప్పిందే నిజం. తాము చెప్పినట్టే జరగాలి. రోజుల తరబడి.. నెలల తరబడి, సంవత్సరాల తరబడి రోడ్లపై వీరంగాలు వేయాలి.. పార్లమెంట్ అవసరం లేదు. కోర్టులు అవసరం లేదు. యోగేంద్ర యాదవ్ చెప్పినట్టు రోడ్లపైనే నిర్ణయాలు జరగాలి.

నీట్ నిరసన ఉద్యమం పేరుతో ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని కొన్ని బొద్దింకలను అడ్డం పెట్టుకొని చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేయడంతో నీట్ పరీక్షా విధానం, విద్యా వ్యవస్థలు అద్భుతమైన మార్పులు వచ్చాయా? ఇంతకీ ఆయన రాజీనామా కోరడానికి వెనుక ప్రయోజనం ఏమిటి? అసలు ప్రయోజనం( హిడెన్ అజెండా పక్కనపెడితే ) ఉందా? ఉంటే నెరవేరిందా? రాజీనామా చేయగానే.. నీట్ విషయం అటకెక్కింది. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు ఏమయ్యాయో.. నీట్ లీకేజీ కథ ఏమైందో ఎవ్వరికీ అక్కరలేకుండా పోయింది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. అప్పటిదాకా ఊపిరాడకుండా ఉన్న విపక్షాలకు, వామపక్షవాదులకు, లిబరలిస్టులకు, స్పాన్సర్డ్ ఉద్యమాల కోసం అర్రులు చాచుకుంటూ ఉన్న వారికి ఒక్కసారిగా ఊపిరి వచ్చినట్టయింది.
మధ్యలో ఉన్నట్టుండి ఐఐటీ బాంబే ఇష్యూ వచ్చింది. కొద్ది రోజులు ఊగుదామనుకున్నారు కానీ.. అది కాస్తా రివర్స్ తమకే తగిలేటట్టుండటంతో గప్ చుప్ అయిపోయారు. మరి దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు కదా.. ఏమైందీ పోరాటం.. ? అదే ఊళ్లో పక్కనే ఉన్న కాక్రోచ్ కు కూడా పట్టలేదు. దిక్కూమొక్కూ లేకుండా పోయింది.
ఆ వెంటనే పంజాబ్ లోని రెండు యూనివర్సిటీల్లో కలకలం రేగింది. విధ్వంసం జరిగింది. అక్కడ ఉన్నది ఆప్ సర్కారు కదా.. సహజంగానే ఏ బొద్దింకా.. ఏ విపక్షమూ, ఏ కమ్యూనిస్టూ.. ఒక్కడూ మాట్లాడలేదు.
వెంటనే ఎస్ఐఆర్ దొరికేసింది. ఇంకేం పోతురాజులు తయారైపోయారు. ఇప్పటికి 19 సార్లు జరిగిన ఎస్ఐఆర్ ఇప్పుడు మాత్రం కంటు అయిపోయింది.
అదేమిటంటే.. ఇప్పుడు ఓట్లు తొలగించారు అంటారు సరే… ఫలానా ఓటు ఫలానా కారణం లేకుండా తొలగిపోయిందంటూ చెప్పాలి కదా.. ఎందుకు చెప్పరు. చెప్పరు సరికదా.. ఎన్నికల కమిషనర్ ను గద్దార్.. దేశద్రోహి అని ముద్రవేస్తారు. ఈ ముద్రవేసేవారు.. తమను తాము దేశభక్తులమని చెప్పుకుంటారా అంటే అదీ లేదు.
ఇదే బృందం ఈశాన్య భారతాన్ని భారతదేశం నుంచి చీల్చాలని బహిరంగంగా వ్యాఖ్యానించిన షార్జీల్ ఇమామ్, పార్లమెంట్ పై దాడి చేసిన “భారత్ తేరే టుక్డే హోంగే…” (భారతదేశం ముక్కలవుతుంది) “తుమ్ కిత్నే అఫ్జల్ మారోగే, ఘర్ ఘర్ సే అఫ్జల్ నిక్లేగా…” (మీరు ఎంతమంది అఫ్జల్లను చంపుతారు, ప్రతి ఇంటా ఒక అఫ్జల్ పుడతాడు) “అఫ్జల్ హమ్ శర్మిందా హై, తేరే ఖాతిల్ జిందా హై…” (అఫ్జల్ మేము సిగ్గుపడుతున్నాము, నిన్ను చంపినవారు ఇంకా బతికే ఉన్నారు) అంటూ నినాదాలు చేసిన ఉమర్ ఖలీద్ లు దేశద్రోహులు కదా అంటే.. ఆ విషయం మాత్రం సుప్రీం కోర్టులో తేలాలంటారు.
ఎన్నికల కమిషనర్ ను మాత్రం వీళ్లు రోడ్ల మీద కూర్చొని ప్రశాంతంగా దేశద్రోహిగా, గద్దార్ గా డిక్లేర్ చేస్తారు. ఈ కమిషనర్ రాజీనామా చేస్తే.. చాలు.. ఇండ్లకు వెళ్లిపోతరంట. మంత్రి రాజీనామాతో నీట్ వ్యవస్థ బాగుపడినట్టే.. ఇదీ బాగుపడుతుందన్నమాట.. ఓట్లన్నీ చక్కబడిపోతాయన్నమాట..
అంతిమంగా వీరి అజెండా
1. నీట్ వ్యవస్థ చక్కబడటం కాదు.
2. ఎన్నికల సర్ లో తేడాలో.. లోపాలో.. ఉంటే.. సరిచేయడం కాదు
3. ఇల్లీగల్ ఓట్లు కొనసాగేలా చూడటం.
- ముఖ్యంగా ఈశాన్యంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, బెంగాల్, బీహార్ అన్నింటా కూడా బీజేపీ అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్రాలన్నీ కూడా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటాయి. దేశంలోకి చొరబాట్లు జరగటానికి ఉన్న ఏకైక సరిహద్దు ఇది మాత్రమే. పాకిస్తాన్ నుంచి చొరబాట్లు అంటే కేవలం టెర్రరిస్టులు మాత్రమే. బంగ్లాదేశ్, మయన్మార్ ల నుంచే మన దేశంలోకి చొరబాట్లు ఎక్కువగా ఉంటాయి. వారందరికీ ఇంతకాలం బెంగాల్ లోని 24 పరగణాల జిల్లాలో భారతదేశానికి సంబంధించిన సకల గుర్తింపు కార్డులు తయారు చేసి ఇచ్చేవారు. వాటిని పట్టుకొని వాళ్లు దేశమంతటా విస్తరించారు. నిన్నటికి నిన్న కాశ్మీర్ లో కూడా పట్టుబడితే.. తిరిగి పంపించాల్సి వచ్చింది. ఈ రాష్ట్రాల్లో ఎక్కడా తాము అధికారంలో లేకపోవడం పెద్ద సమస్యాత్మకంగా మారింది.
4. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత సృష్టించాలి
5. విదేశీ నిధుల నియంత్రణకు చట్టాలు తెచ్చే ప్రయత్నాన్ని అడ్డుకోవాలి
6. పొరపాటున హిందూ ఓటు పోలరైజేషన్ అయితే అది అత్యంత ప్రమాదకర సంకేతం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ జరుగకుండా చూడాలి.
7. నిరంతర ఆందోళనల ద్వారా తటస్థ ఓటర్లను ప్రత్యర్థి వైపు వెళ్లకుండా నిరోధించవచ్చు.
- అందుకే…
2015: అవార్డు వాపసీ నటనలు
2016: జేఎన్యూ.. టుక్డే టుక్డే నిరసనలు..
2019-20: సీఏఏ నిరసనలు
2020-21: రైతుల నిరసనలు
2023: కుస్తీ వీరుల నిరసనలు
2026: బొద్దింకల నిరసనలు
2026: ఇండికూటమి నిరసనలు.
అంతిమ లక్ష్యం…
సెక్యులర్ మత శక్తులు తిరిగి అధికారంలోకి రావాలి.
లక్షిత వ్యవస్థల్లో తిరిగి చొరబడి బలం పుంజుకోవాలి.
పి.ఎస్.: ఇది ఫక్తు రాజకీయం. రాజకీయ పార్టీలు, అధికార పార్టీకి అనుకూలంగా లేని శక్తులు చేసే రాజకీయం. రాజకీయంగా మాత్రమే చూడాలి. ఇదేదో ప్రజా ప్రయోజనాల కోసమో.. దేశాన్ని ఉద్ధరించడం కోసమో.. వ్యవస్థలను బాగు చేయడం కోసమో అనుకుంటే అది చిత్తభ్రమ. దీనికోసం సామాజిక మాధ్యమాల్లో మాత్రం అద్భుతమైన విశ్లేషణలు జరుగుతుంటాయి.
Share this Article