Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?

October 9, 2026 by Rishi

( యండమూరి వీరేంద్రనాథ్ ) …. ఈ పోస్టు కేవలం స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం భయపడుతున్న ఇన్వెస్టర్ల గురించి మాత్రమే:

దాదాపు మూడు నెలల క్రితం షేర్ మార్కెట్ నుంచి నా investmentలో కొంత మొత్తం తీసేసి FDల్లో వేస్తున్నప్పుడు, ఒకళ్లిద్దరు చార్టర్డ్ అకౌంటెంట్స్ “మీరు bear market expect చేస్తున్నారా?” అని అడిగారు.

ఈ bear market అనేది చాలా ప్రమాదకరమైన పదప్రయోగం. ఒక Chartered Accountantగా నా అంచనా ప్రకారం, ఇప్పటి market fallని (వెంటనే) bear market అని పిలవడం కరెక్ట్ కాదు.

Ads

సాధారణంగా peak నుంచి సుమారు 20% కంటే ఎక్కువ fall వచ్చి, ఆ భయం market అంతటా వ్యాపించి.. ఆ రూమర్స్ స్థిరపడినప్పుడు మాత్రమే bear market అనే మాట వాడతారు. అయితే కొంతమంది చాలా భయపెడుతున్నారు. కొంతమంది భయపడుతున్నారు. మరి కొందరు దీన్ని 1929 Great Depressionతో పోలుస్తున్నారు. ఆ పోలిక కరెక్ట్ కాదు.

1929 Great Depression అంటే banking collapse, unemployment, production crash, global depression. ఇప్పటి fall తీవ్రమే అయినా, అది అంతటి వ్యవస్థాత్మక collapse అని ఇప్పుడే చెప్పలేం.

panic పెంచి, చిన్న retail investorsని భయంతో తమ స్టాక్స్ అమ్మేలా చేయడానికి… అలాంటి పోలికలు ఎక్కువగా stock mafia sharks వాడతారు.

ఇప్పటి పరిస్థితికి ప్రధాన కారణాలు ఇవి:

1 . క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం
Brent crude $100 దాటడంతో భారత్‌కు inflation భయం పెరిగింది. మనం oil import చేసుకునే దేశం కాబట్టి ఇది rupee, inflation, company costs అన్నింటిపై ఒత్తిడి పెడుతుంది.

  1. Foreign investors డబ్బు తీసుకెళ్తున్నారు
    FIIs గత కొన్ని రోజులుగా భారీగా అమ్ముతున్నారు. ఇది market మీద పెద్ద pressure.
    Interest rates / bond yields పెరగడం
    అమెరికాలో Treasury yields చాలా పెరిగాయి. Interest rate ఎక్కువైతే investors stocks నుంచి safer bonds వైపు వెళ్తారు. అందుకే US market కూడా ఒత్తిడిలో ఉంది.
  2. RBI stance కఠినంగా మారడం
    RBI inflation మీద strictగా ఉండడం వల్ల growth stocks, banks, real estate, midcaps మీద pressure పెరిగింది.
  3. Profit booking
    గతంలో బాగా పెరిగిన stocksలో పెద్దవాళ్లు profit తీసుకుంటున్నారు. పడే సమయంలో retail investors భయంతో అమ్మితే fall ఇంకా వేగంగా కనిపిస్తుంది.
    …
    ఇంకా పడుతుందా? Short termలో పడే అవకాశం ఉంది. కానీ markets ఎప్పుడూ straight lineలో పడవు. మధ్యలో sharp bounce కూడా రావచ్చు.
    Futureలో పెరుగుతుందా? Long termలో Indian marketకి growth story ఇంకా ఉంది. కానీ recoveryకి crude oil price తగ్గాలి, FII selling ఆగాలి, US bond yields కాస్త దిగాలి, RBI/Fed interest rates ఇంకా పెరుగుతాయనే భయం investorsలో తగ్గాలి.

నా విశ్లేషణ ఒక్క వాక్యంలో:
ఇది భారతీయ కంపెనీల quality suddenly చెడిపోయిన fall కాదు; ఇది oil prices, interest rates, foreign selling, panic వల్ల వచ్చిన broad market correction.
Sure గా Great Depression కాదు, కానీ carelessగా leverage / short-term trading చేస్తే ప్రమాదకరం.

స్టాక్స్ గురించి సరిగ్గా తెలియని investorsకి ఒక సలహా: మీ predictions గురించి మీరు ఎక్కువ ఊహించుకోకండి. Marketలో వందల కోట్లు చేతిలో పెట్టుకుని ఆడే పెద్ద players ఉంటారు. వాళ్ల మధ్య చిన్న investor తన prediction కరెక్ట్ అవుతుందని నమ్మి దూకితే, చివరికి loss ఎక్కువగా అతనికే వస్తుంది.

బ్రోకర్ల మాటలకు మోసపోకండి.
అత్యాశ అజ్ఞానం.
రేపటి గురించి బెంగ మూర్ఖత్వం.
భయపడటం ఇంకా ప్రమాదకరం.
జాగ్రత్తపడటం జ్ఞానం…….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!
  • ఎలన్ మస్క్ Vs ముఖేష్ అంబానీ ! స్టార్‌లింక్‌ అడ్డుకునే ఆలిగార్కులు !!
  • తన స్టెప్పులతో రష్యన్లను మరోసారి షేక్ చేసిన డిస్కో డ్యాన్సర్!
  • బిగ్గర్ దేన్ హీరో ! అందుకే హీరోలు తన పక్కన చేయడానికి భయపడతారు !!
  • Evil Dead – నానా పటేకర్ మృతిపై ఓ చేదు స్పందన – ఎవరామె? ఏంటీ కథ?
  • నానా పేర్లన్నీ ఒకవైపు – నానా పేరొకవైపు..! వీరుడా సెల్యూట్ !!
  • … కల్కి భక్తులు రెచ్చిపోయి వార్త ఆఫీసులపై దాడులు చేశారు !!
  • పోలీసులే కాపాడారు… పోలీసులే ఎన్‌కౌంటర్ చేయాలనుకున్నారు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions