Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నమ్మకాన్ని బ్రేక్ చేసిన వైసీపీ… ఇది ఎవరికి చెంపపెట్టు ?

October 22, 2026 by M S R

.

Siva Racharla …. వైసీపీ మీద మొదటి నుంచి ఉన్న విమర్శ గ్రౌండ్ లో యుద్ధం చేసినట్లు లీగల్ బ్యాటిల్ చేయదు అని.. వైసీపీ కేసులు గెలవలేదు అని …

ఇప్పుడు సుప్రీం కోర్ట్.. “నామినేషన్ల గడువు పెంపు మీద 48 గంటలో నిర్ణయం చెప్పండి, అప్పటి వరకు తుది అభ్యర్థుల లిస్ట్ ప్రకటించొద్దు” అని రాష్ట్ర ఎన్నికల సంఘంకు ఆదేశాలు ఇవ్వటం వైసీపీకి గొప్ప విజయం.. మొదట SEC 19 స్థానాల్లో ఎన్నిక వాయిదా అని చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని మొత్తం 100 స్థానాల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నాం అని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పటం ప్రభుత్వానికే కాదు “ఈనాడు”కు చెంపపెట్టు..

Ads

ఈనాడు మొదటి నుంచి ఏ పక్షంవైపు ఉన్నా కానీ వార్తను ఒక మోస్తరుగా రాసేది.. గత నాలుగేళ్లుగా దాని స్థాయి పడిపోయింది.. ఇంకో ఐదారేళ్ళ తరువాత ఏదైనా చర్చ సందర్భంలో ఈనాడు వార్తలను కోట్ చేయటం కూడా మానేస్తారు..

ఎంత లేదని చెప్పినా అధికారులు గన్స్ బయటకు తీయటం, నామినేషన్ వేయటానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థులను శాంతిభద్రతల పేరుతో హౌస్ అరెస్ట్ చేయడం వంటి ఘటనలు వీడియోలలో కళ్ళ ముందు కనిపిస్తున్నాయి..

రిటర్నింగ్ అధికారుల చేతుల్లో నుంచి వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను అధికార పార్టీ నేతలు లాక్కొని చించేస్తుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు.. ఏ ఒక్క రిటర్నింగ్ అధికారి కూడా తమ చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని కంప్లైంట్ ఇవ్వలేదు.. అలాంటి అధికారుల మీద వైసీపీ కోర్టుకు వెళితే కోర్టు అడిగే మొదటి ప్రశ్న ఇదే?, మీరు కంప్లైంట్ ఇచ్చారా ? అని…

మరీ కామెడీగా ఏదో మున్సిపాలిటీలో 21 మంది వైసీపీ అభ్యర్థులు నామినేషన్ మీద సంతకాలు చేయలేదని వారి నామినేషన్లు తిరస్కరించారట .. ఒకరు ఇద్దరు కాదు 21 మంది సంతకాలు లేవంటే అది కుట్ర అని సదరు అధికారికి తెలియలేదు పాపం.. నామినేషన్ వేయటం కూడా చేతకాలేదు అని అధికార పార్టీ నేతల వెటకారం ..

మీ హాయంలో అంతా చక్కగా జరిగిందా అని మీడియా ముందు అడిగినట్లు కోర్టు ముందు అడగలేరు.. ఒక్క కంప్లైంట్ రాలేదని SEC తరుపు లాయరు అంటే కోర్టు నవ్విందట. ఇప్పుడు కూడా తిరకాసుగా వ్యవహరిస్తే కోర్టుకు జవాబుదారీ అధికారులే అవుతారు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నమ్మకాన్ని బ్రేక్ చేసిన వైసీపీ… ఇది ఎవరికి చెంపపెట్టు ?
  • ప్చ్, వ్యవస్థలో ఎవరూ శుద్దపూసలు కారు- ఈయన అతీతుడేమీ కాదు !!
  • ఇన్నేళ్లకు దొరికింది సరైన పాత్ర..! భేష్, రెచ్చిపోయింది ఈ వరంగల్ పోరి !!
  • నిరాశ ! గాయపడిన ప్రతి బాధితుడి ప్రతి చర్యా న్యాయమైపోదు!!
  • ఒక బొద్దింక నిజాలు మాట్లాడుతోంది… మరో రెండు నోరువిప్పాల్సి ఉంది…
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • స్పర్శతో రూపం దిద్దుకున్న దైవం : అంధ శిల్పి రాంపాల్ వేళ్లే కళ్లు !
  • దక్షిణ వెండి తెరపై చాప్లిన్ ఈ గుండూరావ్ అలియాస్ నగేష్ !
  • లెనిన్ పాండియన్ ! తమిళ వెండి తెరపైకి మళ్లీ వచ్చిన నగరి రోజా !
  • నిజమేనా..? సుందర్ పిచై తల్లికి మోదీ పాదాభివందనం చేశాడా..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions