.
Pardha Saradhi Potluri …. అమెరికాకి డీజిల్ అవసరం ఏర్పడ్డది!
రష్యా మీద ఉన్న క్రూడ్ ఆయిల్ సంబంధిత ఆంక్షలని ఎత్తివేసింది అమెరికా!
అయితే ఆంక్షలని ఎత్తివేయడం అనేది 60 రోజులకే పరిమితం అని ట్రంప్ పేర్కొన్నాడు! అంటే 60 రోజుల పాటు లేదా రెండు నెలల పాటు రష్యా దగ్గర ఎవరైనా క్రూడ్ ఆయిల్ లేదా పెట్రోల్, డీజిల్ కొనవచ్చు!
భారత్, చైనాల మీద రష్యా నుండి ఆయిల్ కొంటున్నందుకు వేయచూపిన 100% టారిఫ్స్ ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది!
అమెరికాకి డీజిల్ కొరత ఎందుకు ఏర్పడింది?
1.గ్లోబల్ సప్లై చైన్ తెగిపోయింది. మధ్య ప్రాచ్యం నుండి క్రూడ్ సప్లై స్థంభించి పోవడంతో దాని ఫలితం అన్ని దేశాలతో పాటు అమెరికా కూడా అనుభవిస్తున్నది.
2.మధ్య ప్రాచ్యం ఆయిల్ సప్లైతో పాటు మరో మేజర్ క్రూడ్ సప్లైర్ అయిన రష్యా నుండి ఎగుమతులు ఆగిపోవడం ఒక ఎత్తయితే అమెరికా ఆంక్షల వల్ల భారత్, చైనా దేశాలు తప్పితే వేరే ఏ దేశం కూడా రష్యా నుండి ఆయిల్ కొనలేని స్థితిలో ఉండడంతో క్రూడ్ ధరలు ఒక్క సారిగా $107 డాలర్లకి చేరుకుంది బ్రెంట్ బారెల్ ధర కానీ డిమాండ్ కి అనుగుణంగా సప్లై లేదు.
Ads
3.మరి అమెరికా క్రూడ్ ఉత్పత్తి మాటేమిటి? అమెరికన్ ఆయిల్ ఎగుమతిదారులు బారెల్ $107 డాల్లర్లకి చేరుకోవడంతో లాభాలకి ఆశపడి ఎగుమతిని పెంచేసి స్థానికంగా దొరకకుండా చేశారు. అలాగని ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న ఆర్డర్స్ కావు, ఆరు నెలల కింద తీసుకున్న ఎగుమతి ఆర్డర్స్! లాభాలని వదులుకోవడం అంటుంచి అగ్రిమెంట్ చేసుకున్నాక ఇప్పుడు ఎగుమతి చేయలేము అంటే ముందు ముందు నమ్మే పరిస్థితి ఉండదు! ఇది ఇప్పుడు కేవలం డీజిల్ ఎగుమతుల మీదనే ఒత్తిడి ఉంది. ఇంకొన్నాళ్ళు ఇలానే కొనసాగితే పెట్రోల్ షార్టెజ్ కూడా రావొచ్చు!
4.అమెరికాలో కొత్త ఆయిల్ బావుల కోసం అన్వేషణ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కానీ గత నాలుగు నెలలుగా కొత్తగా చమురు బావి కనుగొనబడలేదు!
1980 లో నమోదు అయిన రికార్డ్ ప్రకారం 102 నుండి 107 బిలియన్ బారెళ్ల క్రూడ్ ఉత్పత్తి ఈ రోజున ఉత్పత్తి అవుతున్న దానితో సమానంగా ఉంది. అంటే చాలా తక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నది.
5.ఒక స్టాండర్డ్ బారెల్ ముడి చమురు 42 గ్యాలెన్లు ఉంటుంది. దానిని శుద్ధి చేసే క్రమంలో డిస్టిలెట్ వచ్చేది 11 నుండి 13 గ్యాల్లన్లు మాత్రమే. డిస్టిలెట్ అంటే పెట్రోలియం ట్రేడ్ భాషలో డీజిల్, డొమెస్టిక్ అవసరాలకి వాడే హీటింగ్ ఆయిల్ అని అర్ధం.
6.అమెరికాలోని రిఫైనరీస్ 96% సామర్ధ్యంతో పనిచేస్తున్నా స్థానిక డిమాండ్ తో పాటు అంతకుముందే ఎగుమతుల కోసం చేసుకున్న అగ్రిమెంట్స్ తాలూకు డిమాండ్స్ ని అందుకోలేకపోతున్నాయి.
7. వ్యవసాయ అవసరాల కోసం వాడే డీజిల్ డిమాండ్ పెరగడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులని చేరవేసే ట్రక్కుల డిమాండ్ కూడా పెరగడంతో డీజిల్ షార్టెజ్ ఏర్పడింది.
8.ప్రస్తుతం అమెరికాలో పెట్రోల్ లీటర్ కి 114 రూపాయలు కి అమ్ముతున్నారు ( $4.50 per Gallon )(రాష్ట్రాల వారీగా వేర్వేరు రేట్లుంటాయి)
9.డీజిల్ $6.53 per Gallon అంటే ఒక లీటర్ కి 135/- రూపాయలు.
రాబోయే నెలలో అమెరికాలో డీజిల్ డిమాండ్ ఇప్పటి కంటే మరో 20% పెరుగుతుందని అంచనా!
గల్ఫ్ నుండి సరఫరా ఎప్పుడు పునరిద్దరించబడుతుందో తెలియదు.
నెల రోజుల క్రితం వారం రోజుల వ్యవధిలో టెక్సస్ లోని రిఫైనరీలో, వెనిజులలోని మరో రిఫైనరీలో పేలుడు సంభవించి శుద్ధి ప్రక్రియ ఆగిపోయింది!
ఇక దారేది?
భారత్, రష్యాలు మాత్రమే అమెరికాకి డీజిల్ సరఫరా చేయగలవు!
ఉక్రెయిన్ చేసిన, చేస్తున్న డ్రోన్ దాడుల వల్ల రష్యాలో ముడి చమురుని శుద్ధి చేసే రిఫైనరీస్ దెబ్బతిని మొత్తం సామర్ధ్యంలో 30% మాత్రమే పనిచేయగలుగుతున్నాయి! గత నాలుగు నెలలుగా రష్యాలో పెట్రోల్, డీజిల్ కొరత వలన మాస్కో, సేయింట్ పీటర్స్ బర్గ్ లాంటి నగరాలలలో పెట్రోల్ స్టేషన్ల వద్ద కిలోమీటర్లకొద్ది వాహనాలు వేచి ఉండడం సహజమై పోయింది!
నాటో దేశాలు రష్యాలోని 2000 km దూరంలో ఉన్న రిఫైనరీల మీద కూడా పదే పదే డ్రోన్లతో దాడులు చేస్తుండడంతో రష్యాలో ఇంధన కొరత తీవ్రంగా ఉంది.
భారత్ నుండి రష్యా చమురు కొనుగోలు!
Yes! రష్యా భారత్ నుండి పెట్రోల్, డీజిల్ ని దిగుమతి చేసుకుంటున్నది గత రెండు నెలల నుండి!
మోడీ ముందు చూపు!
Yes! మోడీ ముందు చూపుతో 2017 లో నయారా ఎనర్జీ ( Nayara Energy ) ని పుతిన్ తో చర్చలు జరిపి, భారత్ లో రష్యాకి రిఫైనరీ ఉండాలి అని రష్యా భాగస్వామ్యంతో స్థాపించారు!
ప్రస్తుతం నయారా ఎనర్జీ పేరుతో పిలవబడుతున్న రిఫైనరీ 2017 కి ముందు ESSAR Oil పేరుతో చెలామణి లో ఉండేది.
ESSAR OIL యాజమాన్యం అప్పుల బాధతో రిఫైనరీని అమ్మకానికి పెట్టినప్పుడు మోడీ చొరవతో పుతిన్ రష్యన్ ఆయిల్ సంస్థ అయిన ROSNEFT చేత 49.13% స్టేక్స్ కొనిపించారు. మరో అంతర్జాతీయ సంస్థలు అయిన Kesani Enterprises Co.Ltd , United Capital Partners కి 49.13% స్టేక్స్ ఉన్నాయి. రష్యన్ రోస్ నెఫ్ట్ అధీనంలోకి వెళ్లిన తరువాత ESSAR OIL కాస్తా NAYARA ENERGY అయింది.
2017 లో ₹13 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ జరిగింది మోడీ చొరవ వల్ల.
నయరా రిఫైనరీ ముఖ్యంగా విదేశాలకి పెట్రోల్, డీజిల్ ఎగుమతుల మీద దృష్టి పెట్టింది. మన దేశంలో 6,500 అవుట్ లెట్స్ మాత్రమే నెలకొల్పింది నయారా!
రష్యా నుండి నాలుగు క్రూడ్ ఆయిల్ షిప్స్ దారి మార్చుకొని చైనాకి వెళ్లకుండా భారత్ కి చేరుకున్నాయి అనే వార్త తరుచూ మనం వింటున్నాము కానీ అవి దారి మార్చుకోలేదు, నయారా రిఫైనరీ కోసమే వస్తున్నాయి కానీ వాటిని షాడో ఫ్లీట్ అంటారు. అమెరికా ఆంక్షల నుండి తప్పించుకోవడానికి షిప్ రిజిస్ట్రేషన్, జెండాలు తప్పుగా ఉంటాయి. చైనాకి వెళ్తున్నట్లే వెళ్లి మధ్యలో దారి మళ్ళి గుజరాత్ తీరానికి చేరుకుంటాయి.
భారత్ ఆయిల్ ఎగుమతుల మీద పన్ను పెంచింది అనే వార్త కూడా నయారా, రిలయన్స్ రిఫైనరీ ల నుండి విదేశాలకి ఎగుమతి అయ్యే పెట్రోల్, డీజిల్ లకి వర్తిస్తుంది తప్పితే మన ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థలు విదేశాలకి ఎగుమతి చేయవు.
GST తో పాటు ఎక్స్పోర్ట్స్ టాక్స్ కడుతున్నాయి కాబట్టి నయారా ఎనర్జీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలని తగ్గిస్తాయి, పెంచుతాయి.
అమెరికా అవసరం విలువ ఎంత?
డీజిల్ అవసరాలు తీరాలి అంటే ఉక్రెయిన్ రష్యా మీద దాడులు నిలిపివేసేంతగా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయి. అందుకే జెలెన్స్కీ చేత బలవంతంగా దాడులు ఆపేయించింది అమెరికా. ముందు ఎలాన్ మస్క్ చేత స్టార్ లింక్ ని డిస్కనెక్ట్ చేయించింది అమెరికా. దాంతో రష్యాలోని టార్గెట్స్ ని గుర్తించడం కష్టమైపోయింది ఉక్రెయిన్ కి.
అటు పుతిన్ తో జెలెన్స్కీ సమావేశం జరిపించి, యుద్ధం ఆపివేయడానికి కొద్ది రోజుల్లో వేదిక ఏర్పాటు చేయబోతున్నది అమెరికా!
మరో వైపు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానితో జామ్ నగర్ లో సమావేశం అయ్యారు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, భారత్ లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ లు.
వెనిజులలో దొరికే ఎక్సట్రా హెవీ – క్రూడ్ ఆయిల్, హెవీ క్రూడ్ అండ్ సౌర్ ఆయిల్ ని శుద్ధి చేయడానికి రిలయన్స్ సహకారం కోసమే మార్కో రుబియో భారత్ కి వచ్చాడు.
అమెరికాలో కొత్తగా ఒక రిఫైనరీ నిర్మించడానికి $500 బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ ని ముఖేష్ అంబానీ రిలయన్స్ తో ఒప్పందం చేసుకోబోతున్నది. అమెరికా ఇది పాత వార్త. మరో వైపు ఇంకో రిఫైనరీ నిర్మాణం కోసం పాత కాపు అయిన ఎస్సార్ గ్రూప్ తో చర్చలు జరుపుతున్నది అమెరికా!
అమెరికా కి తక్షణమే డీజిల్ సరఫరా చేయాలి అంటే నయారా ఎనర్జీ మాత్రమే దిక్కు అందుకే రష్యా మీద ఆంక్షలు ఎత్తేసింది అమెరికా!
రష్యాలోని రిఫైనరీస్ మళ్ళీ పునరిద్దరించి రష్యా నుండి నేరుగా అమెరికాకి ఎగుమతి అయ్యేవరకూ గుజరాత్ లోని వాదినగర్ లోని నయారా ఎనర్జీ నుండి డీజిల్ ఎగుమతి అవుతుంది అమెరికాకి! అప్పటి వరకూ రష్యా నుండి క్రూడ్ గుజరాత్ కి వచ్చి శుద్ధి చేయబడిన తరువాత డీజిల్ అమెరికాకి వెళుతుంది అన్నమాట!
అమెరికా ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది!
గత ఫిబ్రవరిలో ట్రంప్ తన నమ్మిన బంటు అయిన సెర్గియో గోర్ ని భారత్ లో రాయబారిగా నియమించాడు. సెర్గియో గోర్ కి రెజిమ్ చేంజ్ అనబడే నాటకాన్ని రక్తి కట్టించడంలో మంచి అనుభవం ఉంది. సెర్గియో గోర్ మధ్యలో ఎవరి అనుమతి లేకుండా నేరుగా ట్రంప్ తో మాట్లాడగలిగిన చనువు ఉంది. భారత్ లో సెర్గియో గోర్ ని నియమించడం ఇక్కడ అస్థిరత సృష్టించడానికే! కానీ ఇప్పటివరకు అలాంటిది ఏమీ చేయలేకపోయాడు సెర్గియో గోర్!
ఇదిగో ఇప్పుడు డీజిల్ కోసం రాయబారం చేస్తున్నాడు!
మార్కో రుబియో ఈ సంవత్సరంలో ఇది రెండో సారి భారత్ పర్యటనకి రావడం. కానీ రెండుసార్లు ఢిల్లీని స్కిప్ చేసి తన కౌంటర్ పార్ట్ జై శంకర్ తో సమావేశం అయ్యి అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు! గత మే నెలలో వచ్చినప్పుడు కలకత్తాకి వచ్చాడు, ఇప్పుడు ముంబై వచ్చి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు!
భారత్ యూరోప్ కి ఇంధనం అమ్ముతున్నది – అమెరికా!
గత రెండు నెలల వరకూ ట్రంప్ తో పాటు యూరోప్ నేతలు కూడా మోడీ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొని దానిని శుద్ధి చేసి తిరిగి యూరోప్ కి అమ్ముతున్నాడని మొత్తుకుంటూ వచ్చారు!
ఇప్పుడు?
అదే రష్యన్ ఆయిల్ ని నయారా ఎనర్జీ నుండి కొనాల్సిన దుస్థితి!
విచిత్రం ఏమిటంటే 2017 లో రష్యన్ ఎనర్జీ జెయింట్ Rosneft భారత్ లో రిఫైనరీలో మెజారిటీ వాటాలు కొన్నదని తెలిసీ, నయరా ఎనర్జీ నుండి పెట్రోల్, డీజిల్ కొంటూ, మరో పక్క రష్యా నుండి సహజ వాయువు కొనడం ఆపకుండా భారత్ ని దోషిగా నిలబెట్టాలని చూసాయి!
భారత్ కి చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా ఇతర దేశాలకి ఎగుమతులు చేయలేదు! రిలయన్స్, నయారా ఎనర్జీ మాత్రమే ఎగుమతులు చేస్తూ వచ్చాయి!
మార్కో రుబియోకి మోడీని కలవడానికి ముఖం చెల్లలేదు ఎందుకని?
అమెరికా 70 ఏళ్ళ పాటు తనవెంట తిప్పుకున్న యూరోప్ దేశాలని పక్కనపెట్టేసి రష్యాతో చేతులు కలిపింది నిస్సిగ్గుగా!
పుతిన్ స్టేట్మెంట్!
అమెరికా, రష్యా, భారత్, చైనా దేశాలు మాత్రమే అగ్రదేశాలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే అర్కిటిక్ సముద్రంలో భారత్, రష్యా, అమెరికా కలిసి పనిచేయాలని నిర్ణయించాడా పుతిన్?
బదులుగా ఉక్రెయిన్ లో ఇప్పటికే పుతిన్ ఆక్రమించిన 25% భూభాగం రష్యాకి అప్పచెప్పెట్లుగా జెలెన్స్కీ చేత బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నాడు ట్రంప్!
ఇది గుర్తుంచుకోవాలి!
ఉక్రెయిన్ లో స్థానికులని బలిపెట్టి, జనాభా తగ్గించి, చివరికి యూదులకి అప్పచెప్పాలనే ప్లాన్ తోనే జెలెన్స్కీ రష్యా తో యుద్ధం కొనసాగించాడు!
Mission accomplished?
చూద్దాం! యుక్రెయిన్ యుద్ధం అనేది ఒక ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగింది!
మధ్య ప్రాచ్యంలో సౌదీ అరేబియా ప్రాబల్యం తగ్గించడానికే జరుగుతున్నది!
ఎందుకంటే ….
మొన్న ముంబై లో జరిగిన సమావేశంలో మార్కో రుబియో, ముఖేష్ అంబానీ, జై శంకర్ తో పాటు UAE నుండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, UAE విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కూడా పాల్గొని భారత్ కి క్రూడ్ సరఫరాతో పాటు గల్ఫ్ లోని పరిస్థితుల మీద చర్చలు జరిపాడు!
సౌదీ రాజు అటు పుతిన్ తో పాటు ఇటు మోడీతో కూడా సఖ్యంగా ఉండడం లేదు గత కొంతకాలంగా!
ఏది ఏమైనా త్వరలో ముడి చమురు ధరలు తగ్గి ఊరట లభిస్తే చాలు!
Share this Article