Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మోషన్ పిక్చర్ కాదు, ఎమోషన్ పిక్చర్ – ఆయువుపట్టు, జటాయువుపట్టు

November 9, 2026 by M S R

.

Mrityunjay Cartoonist … #ramayana
‘జురాసిక్ పార్క్ ‘ స్టోరీ బోర్డులు, ‘స్పైడర్ మ్యాన్’ పోజింగులు నాకు ఇష్టం. బాపూ గారు తీసే ప్రతి సినిమాలో ప్రతి షాట్ స్టోరీ బోర్డ్ స్కెచ్చు వేసుకొని షూట్ చేస్తారు. బాపూ గారి అన్ని సిన్మాల్లోని స్టోరీ బోర్డులంటే నాకు అమిత ప్రేమ. ఈ ‘రామాయణ్’ లో కూడా స్టోరీ బోర్డులు బాగున్నాయి. సిన్మా చూస్తున్నప్పుడు నాలో ఇంప్రింట్ అయిన కొన్ని ఫ్రేములు ఇంటికొచ్చాక రఫ్ స్టోరీబోర్డులు వేసా.

ఈ సిన్మా షాట్లు, క్యారెక్టర్లు ‘అమర చిత్రకథ’ కామిక్స్ లోని బొమ్మలవలె ఉన్నాయి. ప్రతి ఆర్టిస్టు, యానిమేషన్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా, వేటి మీదా ఏ ఆసక్తి లేనివాళ్లు చూడకపోయినా ఏం పరవాలేదు!

Ads

రాముడు తన గురువు వశిష్టుడి వేషంలో వచ్చిన అసురుడిని గుర్తించి బాణం వేసినట్టే సీత రూపంలో వచ్చిన శూర్పనఖను ఎందుకు గుర్తించలేదో?! నఖశిఖ పర్యంతము అందంగా తీర్చిదిద్దబడివున్న శూర్పనఖ ఇక అందవికారమైన రాక్షసికి ఉపమానం కాబోదు అన్న దర్శకుడి ప్రయత్నం ఫలించింది.

ముక్కు తెగకుండానే ముక్కు తెగింది అని ప్రేక్షకుడిని భ్రమింపచేసే ప్రయత్నం చేసి అందమైన రకుల్ శూర్పనఖ ముక్కుపై అందమైన గాటు పెట్టాడు. ఆజానుబాహుడు, అరవిందనేత్రుడు సరే, మరి నీలమేఘ శ్యాముడేమయ్యాడో? ఢిల్లీ దూరదర్శన్ అరుణ్ గోవిల్ నుంచి చూస్తున్నాం.. అదే శరీరచ్చాయ.

జేంసు కేమరూను మన రాముడు, విష్ణువు, శివుడి స్కిన్ టింట్ తన ‘అవతార్’ ప్రమథ గణాలకు పులిమాను అని చెబుతుంటే మనం మాత్రం అది మరచి కేమరూన్ మోషన్ క్యాప్చర్ కు స్ఫూర్తి పొంది, అవతార్ యాక్షన్ డైరెక్టర్ ‘గాయ్ నోరిస్ ‘ ను తీసుకొచ్చి ఈ రామాయణానికి వాడి… అచ్చం అవతార్ పాండోరా గ్రహం మీది దృఢమైన చెట్ల దుంగలపై నెయితిరీ, నేవీలు పరిగెత్తే సీన్లే ఇందులో సీతా సమేత రామ లక్ష్మణులకు చెప్పి పరిగెత్తించాం…

ramayana

ఒక హాలివుడ్డాయన మన రామాయణం ప్రేరణతో ‘ ఇన్ డీసెంట్ ప్రపోజల్ ‘ తీస్తే ఆ సిన్మాతో మనవాళ్ళు స్ఫూర్తి పొంది ‘ సొగసుచూడ తరమా ‘ తీసారు. మన రాముడు అటుతిరిగి ఇటుతిరిగి మనదగ్గరకే వస్తున్నాడు.. అప్పుడెప్పుడో వచ్చిన జపాన్ యానిమేషన్ రామాయణంలో రాముడికి పైజామాలు తొడిగారు.

మనమేం తక్కువా? ఈ రామాయణంలో అయోధ్య, లంక అర్కిటెక్చర్ బిల్డింగులను నేపాల్ నుంచి తీసుకొచ్చాం.
థియేటరంతా సైలెంట్ గా మారి తెరపై భారీ శరీరాలున్న అసురులు రాముడి వైపు సమీపిస్తున్నప్పుడు రాముడు ధనస్సు లాగి బాణం ఎక్కుపెట్టినప్పుడు వచ్చే కిర్రుమనే శబ్ధం మనలో ఒక స్పిరిచ్యువల్ వైబ్రేషన్ కలిగిస్తుంది.

ramayana

కృష్ణుడు ఇంటలెక్చువల్లీ రొమాంటిక్, రాముడు స్పిరిచ్యువల్లీ రొమాంటిక్… అందుకేనేమో సీత శూర్పనఖని చేసుకొని ఆమెకు రాజువి కమ్మని చెప్పినప్పుడు ‘ మరి నీకు సేవకుడెవరవుతారు?’ అంటాడు.
సీత స్వయవరం అయ్యాక, సీతను రాముడు ‘ నేను ధనస్సు ఎత్తగలనని అనుకున్నావా? ‘ అనడిగితే ‘ లేదు, మీరే ఎత్తాలని కోరుకున్నా ‘ అనడం ఎంత బాగుందో.

కైకేయి డిమాండుకు తలొగ్గి వనవాసానికి బయలుదేరుతున్నప్పుడు రాముడు కైకేయి దగ్గరికి వచ్చి ‘ వనవాసం అయిపోయి తిరిగొచ్చాక మొదటి అన్నం ముద్ద నాకే పెట్టాలి ‘ అన్నప్పుడు కైకేయి కఠిన హృదయం కరిగినట్టు ఆమె కళ్లల్లో కనిపించడం నాకు పర్సనల్ గా నచ్చిన అద్భుతమైన సీన్.

‘మోషన్ క్యాప్చర్లు ‘ ఎక్కడి నుంచైనా తీసుకురావొచ్చు కానీ, ఎమోషన్ క్యాప్చర్లు తీసుకురావడం అంత తేలిక కాదు. క్లైమాక్స్ లో జాటాయువు రావణుడిని తన పదునైన కాలిగోళ్లతో పట్టే సీన్లు ఈ సినిమాకు ఆయువుపట్టు. అది జటాయువుపట్టు!
– మృత్యుంజయ్

ramayana

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోషన్ పిక్చర్ కాదు, ఎమోషన్ పిక్చర్ – ఆయువుపట్టు, జటాయువుపట్టు
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను ఇండియా త్వరలో స్వాధీనం చేసుకోబోతున్నదా?
  • సీతమ్మ శౌర్యం ! ఆ ఇంగ్లిష్ వెర్షన్ సీన్ ఇండియాలో ఎందుకు తీసేశారు..?!
  • ఓహ్, అదా అసలు సంగతి – స్థానిక గెలుపు బాబు ఘనత ఏమీ కాదన్నమాట..!!
  • సో కాల్డ్ హీరో మెటీరియల్ కాదు- సో వాట్, నిఖార్సయిన నటుడు..!!
  • మహారాష్ట్ర రాజకీయాల్లో మలుపులు? ఎన్సీపీ వర్గాల పునఃకలయిక?
  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions