.
బీజేపీని తిడుతున్నాం అనే మూర్ఖ భ్రమల్లో పడి కోట్లాది మంది హిందువుల విశ్వాసాల్ని కించపరుస్తున్నవారి జాబితాలో కేటీయార్ కూడా చేరాడు… ఫాఫం, సెక్యులరిజం అంటే, బీజేపీని వ్యతిరేకించడం అంటే హిందువుల్ని, హిందూ దేవుళ్లను, విశ్వాసాల్ని అవమానిస్తున్నాడు కేటీయార్…
ఈ మాట అనడానికి ఏమీ సందేహించడం లేదు… హిందూగాళ్లు బొందుగాళ్లు, శూర్ఫణఖ జన్మభూమి, రావణ జన్మభూమి అని కొక్కిరించిన కేసీయార్ కొడుకే కదా తను… కరీంనగర్ వెళ్లినప్పుడు మళ్లీ హిందువుల్ని వెక్కిరించే పనికి పూనుకున్నాడు…
Ads
అయోధ్య తలంబ్రాల పేరిట రేషన్ బియ్యం పంచి బండి సంజయ్ గెలిచాడని ఎద్దేవా చేశాడు… అంటే అయోధ్య తలంబ్రాలుగా నమ్మి భక్తిగా స్వీకరించిన ప్రతి ఒక్కడినీ కేటీయార్ వెక్కిరిస్తున్నాడు ఒకరకంగా… తను మారడు, తన తండ్రీ మారడు…
మళ్లీ ఇదే వీర సెక్యులరిస్టులు హైదరాబాద్ నగరపాలక ఎన్నికలు అనగానే ప్రపంచంలోకెల్లా భీకరమైన, భయంకరమైన హిందువుగా ప్రచారం చేసుకుంటారు… అబ్బే, మజ్లిస్ మేమూ వేర్వేరు అని కొత్త అబద్ధాలకు పదును పెడతారు…
అదుగో ఈ వైఖరికే ఆ అపరదుర్గ కోపించి, అంతటి ఆయుత చండీయాగం చేసినా సరే, హోమగుండాల పైకప్పును కాల్చేసి హెచ్చరించింది… ఎన్నికల్లో కొట్టుకుపోయింది పార్టీ… కాళ్లు విరిగాయి, ఏడాదిన్నరగా ఇల్లు కదల్లేదు కేసీయార్……. మీలాగే ఎవరైనా కడుపు మండి ఈ వ్యాఖ్యలు చేస్తే వోకేనా..? స్వీకరిస్తారా..?
ఒకడు మహాకుంభమేళాలో స్నానం చేస్తే దరిద్రం పోతదా అంటడు… మరొకతి మహా మృత్యుకుంభ్ అంటుంది… ఇంకొకడు వెక్కిరిస్తాడు… మరొకడు కొక్కిరిస్తాడు… అంటే, మహాకుంభమేళాకు వెళ్లి స్నానాలు చేసే ప్రతి ఒక్క హిందువును, ప్రతి విశ్వాసిని వాళ్లు కించపరుస్తున్నారు… ఖర్గే, మమత, లల్లూ… వాళ్లకూ కేటీయార్‌కు తేడా లేదు…
అయోధ్యకు చందాలనూ రచ్చ చేశారు… హఠాత్తుగా భద్రాచలం రాముడి మీద ప్రేమ కురిపిస్తారు… ఎంతసేపూ రాజకీయం, బీజేపీని తిడుతున్నామనే పేరిట హిందువుల విశ్వాసాల్ని, ఆధ్యాత్మికత మీద బురద జల్లడం… అంటే, అయోధ్యకు చందాలిస్తే, అక్కడికి వెళ్తే, త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఇక బీజేపీ కార్యకర్తలు అనేనా..? సానుభూతిపరులు అనేనా…?
క్షుద్ర రాజకీయాలు ఇవి… తుచ్ఛమైన వ్యాఖ్యలు ఇవి… తలంబ్రాలు కాదు, రేషన్ బియ్యం అని అప్పట్లో పొన్నం ప్రభాకర్ కూడా వెక్కిరించాడు… ఎస్, కేటీయార్ కూడా పొన్నం స్థాయికి ఎదిగాడు… భేష్…
ఏడాది క్రితం కూడా ఇవే వ్యాఖ్యలు… నేరుగా చెప్పొచ్చు కదా కేటీయార్… నేను హిందూ మతానికీ, విశ్వాసాలకూ వ్యతిరేకిని అని… ఈ డొంక తిరుగుడు మాటలు దేనికి..? ఏడాది క్రితం ఇలాగే మాట్లాడితే అప్పట్లో ‘ముచ్చట’ పబ్లిష్ చేసిన స్టోరీ ఇదుగో…
బీజేపీ హిందూ సంఘటన వ్యూహాల్ని ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్‌కు అస్సలు అర్థం కావడం లేదు, ప్రసంగాల్లో గందరగోళం కనిపిస్తోంది… అప్పుడే ఒక మాట, మళ్లీ అప్పుడే మరో మాట… కేడర్‌లోనూ అయోమయం నింపుతున్నారు…
అన్నింటికన్నా ముందుగా… బీఆర్ఎస్‌కు మొన్నమొన్నటిదాకా మజ్లిస్ సెక్యులర్ పార్టీ, జాన్ జిగ్రీ… కానీ బీజేపీ మాత్రం మత పార్టీ… చేతనైతే బీజేపీ విధానాల్ని ఖండితంగా వ్యతిరేకించాలి, తప్పదు, తప్పులేదు, అది రాజకీయ అవసరం… అది అమాంతం మింగేయడానికి వస్తున్న అనకొండ…
కానీ అటూఇటూ కాని ధోరణి సరికాదు… జైశ్రీరామ్ అంటే కడుపులు నిండవు అంటాడు కేటీయార్ ఓసారి… అలా అన్నవారిని సముదాయించి, కన్విన్స్ చేయాలంటాడు… మళ్లీ తనే ఇంకెక్కడో రాముణ్ని మొక్కుతాం, బీజేపీని తొక్కుతాం అంటాడు… సరే, కేసీయార్ అయితే మరీ ఘోరంగా అయోధ్య మీద వ్యాఖ్యానాలు చేశాడు, మళ్లీ మళ్లీ రాసుకోవడం, చదువుకోవడం వృథా…
కేటీయార్ ప్రతిచోటా బీజేపీ మీద చేస్తున్న ద్వైధీభావంతోపాటు హిందూ ఓటును తనంతట తానే బీజేపీ వైపు నెట్టేస్తున్నట్టుగా ఉంది… నాస్తికుడిగా కనిపిస్తాడు, వెంటనే ఆలంపూర్ గర్భగుడి మెట్ల మీద మొక్కుతూ కనిపిస్తాడు… సేమ్, బీజేపీ మీద చేసే విమర్శలు కూడా…
తాజాగా ఏమంటున్నాడు..? అవి అయోధ్య అక్షింతలు కావు, కేవలం రేషన్ బియ్యమే అట… బియ్యం కాకపోతే అక్షింతలు వేటితో చేస్తారు..? అవి రేషన్ బియ్యమా..? సోనా మశూరియా, బాస్మతి బియ్యమా అని కాదు… అవి ఏ సంకల్పంతో మన చేతుల్లోకి చేరాయో అది ప్రధానం… తిరుపతి లడ్డూలు, పుల్లారెడ్డి స్వీట్ షాపు లడ్డూలు సేమ్ అంటారా ఎవరైనా..? ఇదీ అంతే…
అక్షింతలు ఆకాశం నుంచి రాలిపడే గింజలు కావు, రాముడి తలంబ్రాలుగా సంకల్పించుకుని, భక్తిగా కలుపుకునే బియ్యమే… అబ్బే, అవి రేషన్ బియ్యం అని వెక్కిరింతలు దేనికి..?
కేటీయార్ ఘనంగా చెప్పుకునే యాదగిరిగుట్టలో అక్షింతలు, భద్రాచలంలో అక్షింతలు మాత్రం బియ్యం కావా..? ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అయోధ్య భక్తులను (తటస్థంగా, బీజేపీకి సంబంధం లేకుండా…) కించపరచడమే… పోనీ, అయోధ్య అక్షింతల్ని స్వీకరించిన సగటు గృహస్తు వాటిని బీజేపీ అక్షింతలుగా తీసుకోలేదు కదా, ఆ అక్షతల్ని స్వీకరించడం అంటే అయోధ్య గుడికి ఓ సమర్థన, రాముడి పట్ల భక్తి… అది వాళ్ల ఇష్టం… వాళ్ల విశ్వాసం… వెక్కిరించడానికి నువ్వెవరు..?
బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ కౌంటర్ ఇచ్చినట్టు… కేటీయార్‌కు తలంబ్రాలకు అక్షింతలకు తేడా తెలియదు… అయోధ్యలో ఉన్నది బాలరాముడి గుడి అనే సంగతీ తెలియదు… నిజానికి పేదలు తినే రేషన్ బియ్యాన్ని కూడా చీప్‌గా తీసిపడేసి అవమానించడం… ఆ రేషన్ బియ్యం నువ్వు ఇచ్చినవే కావా..?
ఎస్, బీజేపీ రాముడిని వాడుకుంటోంది… మతవాదం సరికాదు… వోకే, మరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ‘కేసీయార్ ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువు, యాదాద్రి కట్టాడు, అయుత చండీయాగం చేశాడు, మజ్లిస్‌తో మాకు దోస్తీ లేదు’ వంటి ప్రచారం ఎందుకు జరిగింది..? హిందువుల వోట్ల కోసం, హిందూ వోటు బీజేపీకి పోకుండా చేయడం కోసం… అదొక వ్యూహం అనుకుంటే ఇక బీజేపీకి, బీఆర్ఎస్‌కూ నడుమ తేడా ఏముంది..?
అయోధ్య చందాల సేకరణ వేళ కొందరు కాంగ్రెస్ నేతలు సైతం విరాళాలు ఇచ్చారు… కారణం రాముడి మీద భక్తి మాత్రమే కాదు, రాముడు అందరివాడు, రాముడిపై బీజేపీకి పేటెంట్లు ఏమీ లేవు అని చాటడానికి..! ఆ సున్నితమైన అంశం కేటీయార్‌కు అర్థమై ఉంటే ఈ ‘రేషన్ బియ్యం’ వంటి వ్యాఖ్యలు వచ్చేవి కావు… తన మతవ్యతిరేకతను బయటపెట్టుకునేవాడే కాదు… అలాంటి వ్యాఖ్యలే చేసిన పొన్నం ప్రభాకర్‌కూ నీకూ తేడా లేనట్టేనా కేటీయార్..?
చివరగా… బండి సంజయ్‌ను తిట్టాలనుకుంటే, బీజేపీని తిట్టాలనుకుంటే బోలెడు అంశాలు దొరుకుతాయి… చేతనైతే రాజకీయంగా ఎదుర్కొండి, తనకే అర్థమయ్యీకాని వింత భాషలో ఏదో జవాబు ఇచ్చుకుంటాడు సంజయ్ తనే… అంతేతప్ప, యావత్ హిందూ సమాజాన్ని వెక్కిరించకండి…!! యాంటీ బీజేపీ అంటే యాంటీ హిందూ కాదు..!!!
Share this Article