Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్న సినిమా అంటే చిన్నతనం కాదు… చిల్లరతనం అసలే కాదమ్మా…

September 23, 2026 by M S R

.

అమిషా పటేల్… ఈ పేరు గుర్తుంది కదా… ఒకప్పుడు, అంటే ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు… మన తెలుగు సినిమాల్లో కూడా చేసింది ఈ నటి… బద్రి, నాని, నరసింహుడు… ఐరనీ, ట్రాజెడీ, పారడాక్స్, మన్నూమశానం ఏ పేరయినా పెట్టుకొండి… తనతో హీరోలుగా చేసిన వాళ్లు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, బాలయ్య ఇంకా యంగ్ అండ్ ఎనర్జిటిక్… ఫాఫం, ఈమె మాత్రం 50 ఏళ్ల ముసలామె అయిపోయింది…

మన సినిమా ఇండస్ట్రీ అంటే అంతే కదా పాపం… ఈమెకు కాస్త టెంపర్‌మెంట్ ఎక్కువ… అది తరువాత చెప్పుకుందాం… కానీ సరిగ్గా చాన్సులు రాక అడపాదడపా రోల్స్ వేస్తూ గడిపింది… ఒక దశలో 2018 తరువాత అసలు 2023 వరకు ఒక్క సినిమా కూడా లేదు… ఐనా సరే, ఆ టెంపర్‌మెంట్‌లో తేడా లేదు…

Ads

తాజాగా ఏదో ఇంటర్వ్యూలో ఏమన్నదీ అంటే…? ‘‘వన్ ప్లస్ వన్, బయ్ వన్ గెట్ వన్, 99 రూపాయల టికెట్ బాపతు చిన్నాచితకా చిల్లర సినిమాల్లో నేనెందుకు నటిస్తాను..? అవసరమైతే ఖాళీ ఉంటాను, ఏదో గదర్ వంటి సినిమాల్లో చాన్స్ వస్తే చేస్తా…’’ అని చెప్పుకొచ్చింది… సరే, ఈ సినిమా తారలు ప్రమోషన్స్‌కు రమ్మంటే తమ స్టాఫ్‌ను తీసుకొచ్చి, అడ్డగోలు ఖర్చుల్ని నిర్మాతలపై రుద్దుతున్నారు అనే మరో అంశాన్ని కూడా టచ్ చేసింది…

అమీషా

చిన్న సినిమా అంటే చిల్లర సినిమా కాదు అమిషా..! నీకు ఇండస్ట్రీ చెప్పే పాఠం ఇదే!!… హనుమాన్ అంశ్ అనే సినిమా ఖర్చు జస్ట్ కోటిన్నర… ఇప్పుడది 350 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్ బస్టర్… ఒక ఇరుముడి కూడా మొదట్లో చిన్న సినిమాయే… 250 కోట్లను దాటేసింది ఇప్పుడు… సో, చిన్న సినిమాను తేలికగా తీసేయడం ఏమిటసలు..?

పైగా ఆమె వయస్సు 50 ఏళ్లు దాటింది… యవ్వనంలో ఉన్నప్పుడు వచ్చే పాత్రలు ఎలాగూ ఇప్పుడు రావు… హీరోయిన్‌గా ఒకప్పుడు ఉన్న డిమాండ్‌లో పదిశాతమూ ఇప్పుడుండదు, అసలు ఆమె వైపు చూసే నిర్మాత, దర్శకుడే కనిపించరు…

ఈ స్థితిలో “నేను చిన్న సినిమాలు చేయను… ₹99 టికెట్ సినిమాలు చేయను… ఏదో ఒక సినిమా చేశానని చెప్పుకోవడానికి చెత్త ఫిల్లర్ సినిమాలు చేయను… కొన్ని సంవత్సరాలకోసారి ‘గదర్’ లాంటి సినిమా చేస్తా” అని చెప్పడం మాత్రం ధైర్యమే! కాదు, ఓరకంగా ఫూలిష్ స్టేట్‌మెంట్…

చిన్న సినిమా వేరు… చిల్లర సినిమా వేరు!  ఈ రెండింటి మధ్య తేడా తెలియకపోతేనే అసలు సమస్య. ఒకప్పుడు కహో నా ప్యార్ హై, గదర్ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రోజులు ఉన్నాయి. కానీ ఆ రోజులు గతించాయమ్మా తల్లీ…  2023లో వచ్చిన గదర్ 2 ఆమెకు మరోసారి పెద్ద గుర్తింపు తెచ్చింది. కానీ ఆ తర్వాత ఇప్పటివరకు తనకు నచ్చినంత పెద్ద సినిమా దొరకలేదన్న కారణంతో, మిగతా సినిమాలన్నింటినీ ‘రబ్బిష్ ఫిల్లర్’గా చూడటం మాత్రం మూర్ఖత్వం…

స్టార్ కాస్ట్ లేకపోయినా ప్రేక్షకుడిని థియేటర్‌కు లాగిన చిన్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో కోట్ల బడ్జెట్, భారీ స్టార్ కాస్ట్, వందల మంది సిబ్బంది ఉన్నా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడిన భారీ సినిమాలూ తక్కువేమీ కావు…

అయితే… అమిషా లేవనెత్తిన మరో పాయింట్ మాత్రం చాలా సీరియస్. స్టార్ల ఎంటూరేజ్! ఒక సినిమా తార షూటింగ్‌కు వెళ్తున్నదంటే మేనేజర్, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్, పర్సనల్ అసిస్టెంట్లు, బాడీగార్డులు, డ్రైవర్లు… ఇలా ఒక చిన్న బృందమే వెళ్లడం ఇప్పుడు సాధారణమైపోయింది. ప్రమోషన్స్‌కు వచ్చినా అదే ధోరణి…

ఈ ఖర్చంతా ఎవరిది? నిర్మాతదే! అమిషా పటేల్ తాజాగా ఇదే విషయాన్ని ప్రశ్నించింది. నిర్మాత డబ్బుతో ప్రమోషన్స్‌కు వచ్చే కొందరు హీరోయిన్ల ఎంటూరేజ్ ఖర్చు వారి సినిమా మొదటి రోజు కలెక్షన్ కంటే ఎక్కువగా ఉంటోందని ఆమె వ్యాఖ్యానించింది… అంతేకాదు… నిర్మాత డబ్బు ఇవ్వకపోతే అదే స్థాయిలో ఎంటూరేజ్‌ను వ్యక్తిగత జీవితంలో కూడా వాళ్లు మెయింటైన్ చేస్తారా అని ప్రశ్నించింది…

ఇక్కడ మాత్రం అమిషా మాటలో పాయింట్ ఉంది… ఎందుకంటే ప్రమోషన్ ఖర్చు పేరుతో, షూటింగ్ ఖర్చు పేరుతో, స్టార్ కంఫర్ట్ పేరుతో నిర్మాతపై పడుతున్న భారం చిన్న విషయం కాదు. ఒక హీరో లేదా హీరోయిన్‌కు అవసరమైన ప్రొఫెషనల్ టీమ్ ఒకటి… స్టార్ స్టేటస్ చూపించడానికి వెంటేసుకుని తిరిగే విలాసాల టీమ్ మరోటి… వెరసి పెద్ద సినిమా అని ప్రభుత్వాన్ని మభ్యపెట్టి… టికెట్ రేట్లు పెంచేసుకుని, మళ్లీ ప్రేక్షకుల మీద పడటం!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిత్యం వార్తల్లో బొద్దింకలు ! రాహుల్‌ను సైడ్‌లైన్ చేసేందుకు బీజేపీ ప్లాన్ !!
  • తిలక్ వర్మ రనౌట్ స్వీయ తప్పిదమే… కానీ వెస్టిండీస్ క్రీడాస్పూర్తి !?
  • వేకువ ఝామున వెన్నెల మరకలుగా… రేపటి వాకిట ముగ్గులుగా…
  • క్రాంతికుమార్ – తెలుగు సినిమా కథల ప్రయోగాల సాహసి !!
  • 3 Statues Of Liberty – మూడు విగ్రహాలకూ ‘విముక్తి’ అంతఃసూత్రం !!
  • ఆంధ్రా తూర్పు తీరాన్ని.. నువ్వుల తీరం అనీ పిలిచారని తెలుసా ?
  • ఓ అమెరికన్ గ్రౌండ్ జీరో ! మరి తెలంగాణ ‘గ్రౌండ్ జీరో’ మాటేంటి..?!
  • ఎన్టీయార్, దిలీప్‌కన్నా శివాజీ గణేశన్‌తోనే ఆ పాత్రకు న్యాయం !!
  • ఒక ఫోన్ కాల్ … ఒక అరెస్ట్ … వార్త పంపాక మొదలైన అసలు టెన్షన్…
  • దేశంలోనే మొట్టమొదటిసారి ఒక విలేకరిపై టాడా కేసు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions