.
అనసూయ- విపరీతమైన పబ్లిసిటీ పిచ్చి… అదీ కంట్రవర్సీలైతే మరింత ఎక్కువ ప్రచారం… లేడీ ప్రకాశ్ రాజ్ అయిపోతోంది ఈమధ్య… ఈమధ్య శ్రీరాం మీద ఏవో పిచ్చి కూతలు కూస్తే కాషాయం బ్యాచ్ విరుచుకుపడింది… మరి తన మాట మీద తాను నిలబడి ఉండాలిగా తన ఆదర్శం ప్రకాశ్ రాజ్‌లాగా…
అదీ చేతకాదు, దాంతో పెద్ద వివరణ వీడియో పెట్టి ఏదో సోది చెప్పుకొచ్చింది… చివరకు నటి హేమ కూడా ఇచ్చిపడేసింది… హఠాత్తుగా అనసూయలో సంఘసంస్కర్తకు మెలకువ వచ్చింది… నాన్సెన్స్, మొగడు సచ్చిపోతే బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు తీసేయాలా అనడుగుతోంది…
Ads
మొగుడు ఉన్నప్పుడే అవి తీసేసి, గజ్జె కట్టి తైతక్కలాడుతూ… తిక్క లేస్తే ప్రియుళ్లతో కలిసి మొగుళ్లను కడతేరుస్తున్న కాలం ఇది… పెళ్లయిన ఏడాదిలోపే మొగుడిని వదిలేసి, నాలుగు రోజుల్లో ఇంకొకడిని చేసుకుంటున్న రోజులివి… అసలే ఆడపిల్లల కొరత, ఎవరు దొరికినా చాలు అనుకుని మొగ పురుష్ కూడా పుస్తెలు కట్టేస్తున్న దినాలు ఇవి…
అంతెందుకు, నా మొగుడికే అభ్యంతరం లేదు, మీరెవర్రా అంటూ బికినీలతో, చెత్తా డ్రెస్సులతో సోషల్ మీడియాలో స్కిన్ షో చేస్తున్న రోజులివి… అవునూ, దినాలు అంటే గుర్తొచ్చింది… ఒకప్పుడు మొగుడు చచ్చిపోతే దినాల చివరి రోజు గాజులు పగులగొట్టి, బొట్టు చెరిపేసి, గుండు గీకేసి గట్రా ఓ తంతు ఉండేది… మరీ ఛాందస కుటుంబాల్లో తప్ప ఇవన్నీ మెజారిటీ ఇళ్లల్లో ఎవరూ పాటించడం లేదు… అందరిలాగే అలంకరణ… (ష్, అసలు మొగుడున్నా బొట్టే పెట్టుకునే రోజులు కావు కదా ఇవి)…
కాలంతోపాటు అన్నీ మారతాయి, మారుతున్నాయి… మారాలి… ఈ సంఘ సంస్కర్త వచ్చేదాకా కాలం ఆగదు కదా… మొన్నటి శ్రీరాం బాపతు ఆగ్రహం నెటిజనంలో పోలేదు కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి తెలివిగా ఈ బొట్టు కాటుక సెంటిమెంట్ పట్టుకొచ్చింది… అదీ మూడేళ్ల క్రితం ముచ్చట, అదీ సొంత ముచ్చట…
‘ఒక ఆలోచన మూడేళ్ల నుంచి నన్ను తినేస్తోంది. మూడేళ్ల క్రితం మా నాన్న చనిపోయాడు. మా అమ్మ చాలా అందంగా ఉంటుంది. బొట్టు పెట్టుకుని, మంచి రంగు గాజులు, గజ్జెలు ధరించి చాలా అందంగా రెడీ అయ్యేది. కానీ నాన్న చనిపోయిన అవన్నీ అమ్మకు దూరమయ్యాయి.
మనకు బొట్టు, కాటుక, గాజులు, గజ్జెలు ఇవన్నీ ఎవరు పరిచయం చేశారు? మా అమ్మకు మా అమ్మమ్మ.. నాకు మా అమ్మ. అలాగే గోరింటాకు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ వేసుకోవడం వంటి వాటిని కూడా మనకు పెళ్లికి ముందే అమ్మలు, అమ్మమ్మలు పరిచయం చేశారు. అలాంటప్పుడు వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టాలి?
భర్త చనిపోగానే బొట్టు, గాజులు, గజ్జెలు ఎందుకు తీసేయాలి? అలా ఎక్కడ రాసి ఉంది? ఒకవేళ ఇవన్నీ పెట్టుకోవద్దని అనుకుంటే.. అమ్మమ్మ చనిపోయినప్పుడే అమ్మ కూడా వాటిని మానేయాలి కదా. అది పర్సనల్ చాయిస్ లా ఉండాలి…’
ఇక్కడ ఆమె అజ్ఞానం ఎక్కడ బయటపడిపోతుందీ అంటే… అమ్మమ్మ చనిపోయినప్పుడే అమ్మ కూడా వాటిని మానేయాలి కదా అనడుగుతోంది… ఉత్త డొల్ల బుర్ర… అమ్మమ్మ మరణానికీ అమ్మ బొట్టు మానేయడానికి లింకేమిటో ఆంటీకే తెలియాలి… వైధవ్యం, మాంగల్యం, మళ్లీ పెళ్లి, సమాజంలో మార్పు వంటివి అర్థం కానప్పుడు మూసుకుని ఉండాలి… బొట్టు పరిచయం చేసిన తల్లి సచ్చిపోతే బిడ్డ బొట్టు మానేయడం ఏమిటి..?
ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలట, స్థూలంగా చెప్పుకోవడానికి వోకే, కానీ బతికేది సమాజంలో, ప్రతి సమూహానికి, ప్రతి సమాజానికి కొన్ని పద్ధతులుంటాయి, నో, నాకు నచ్చినట్టు బరిబాతల తిరుగుతా అంటే ఊరుకోదు సమాజం… ప్రతి దానికీ పరిమితి, పద్ధతి ఉంటుంది..!! పదే పదే ఏదో ఒకటి గోెకుతా అనుకుంటే ఎప్పుడో ఓసారి బీభత్సంగా ఎదురుతంతుంది, బహుపరాక్ !!
Share this Article