Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మావిగన్! ఆంధ్రుల రాజధాని ఇక ఎప్పటికీ ఓ ప్రశ్నార్థకమే!!

July 2, 2026 by M S R

.

కంప్లీట్‌గా క్లూలెస్… అమరావతి కావాలంటే టీడీపీకి వోటేయండి, మావిగన్ కావాలంటే నాకు వోటేయండి… ఇదీ జగన్ విస్పష్ట వ్యాఖ్య… జనానికి పిలుపు… స్థూలంగా చూస్తే రాజకీయంగా ఓ మూర్ఖపు స్ట్రాటజీగా పైకి కనిపిస్తుంది… కానీ అంత అనాలోచితంగా ఎందుకు అంత బ్లంట్ స్టేట్‌మెంట్ ఇస్తాడు తను..? ఏదో ఉంది, కానీ అదేమిటి..? ఎవరికీ అర్థం కాదు, జగన్ అంటేనే ఎవరికీ అర్థం కాడు కదా… ఇదీ అంతే…

జగన్ ఇంకా అమరావతిని కమ్మరావతిగానే చూస్తున్నాడా..? తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెడుతున్నాడా..? లేక ఎలాగూ కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరుగుతోంది, మూడో ప్రత్యామ్నాయం ఎవడూ లేడు… సో, కమ్మరావతిని వ్యతిరేకించినా సరే నాకు వచ్చే నష్టమేమీ లేదు అనుకున్నాడా..? బట్, ఇది తనకు ఏం ఫాయిదా తీసుకొస్తుంది..?

Ads

తెలంగాణ వాళ్లకు పాలన తెలియదు, మేమే అన్నీ నేర్పించాం అని వెక్కిరిస్తుంటారు కదా ఆంధ్రులు… కానీ నిజానికి పెద్ద ఫెయిల్యూర్స్ ఎవరు..? అంతర్గత రాజకీయాలు ఏమైనా ఉండనీ… తెలంగాణ ఈ ఏపీ రాజధాని పరిణామాలను చూస్తూ పకపకా నవ్వుతోంది…

మద్రాసు నుంచి తమిళుడు తరిమేస్తే కర్నూలులో వచ్చి పడ్డారు, తెలంగాణ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆక్రమించారు, రాజధాని అన్నారు, ఇక్కడా తరిమేస్తే కట్టూబట్టలతో మళ్లీ పలాయనం… ఇన్నేళ్లలో ఓ రాజధాని కట్టుకోగలిగారా..? అసలు తెలుగు జాతికి తనకంటూ ఓ రాజధాని వస్తుందా..? అటు తమిళుడు, ఇటు తెలంగాణవాడు నవ్వుతున్న రోషం ఏమైనా తెలుగు జాతిలో కనిపిస్తోందా..?

కొత్త రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయ్యాడు… ఏం జరిగింది..? కేసీయార్ తరిమేదాకా ఏ సోయీ లేదు… తరువాత అప్పటికప్పుడు అమరావతి అని తేల్చుకుని, టెంపరరీ అసెంబ్లీ గట్రా కట్టుకుని… ఇక రాజమౌళి బాపతు గ్రాఫిక్స్, కాలయాపన… పక్కా ఫూలిష్ టైమ్ వేస్ట్… ప్రకటనలు, షోఅప్స్… ఈలోపు జగన్ వచ్చాడు…

నో, కమ్మరావతి అన్నాడు… అప్పటిదాకా అరకొర పనులు చేస్తున్న తెలుగు కంట్రాక్టర్లు పారిపోయారు… పఢావు పడిపోయింది, మూడు రాజధానులు అన్నాడు… మరి ఆ దిశగా ఏమైనా చేశాడా..? లేదు… తను ఉండటానికి వైజాగులో ఓ ప్యాలెస్ కట్టుకోవడం తప్ప జరిగింది, ఒరిగింది ఏమీ లేదు… జనం బటన్ సర్కారు వద్దులే అని మరీ 11 సీట్లకు పడేశారు…

ఈరోజుకూ ఆత్మవిమర్శ లేదు, సమీక్ష లేదు, దిద్దుబాటు లేదు… అమరావతిని వ్యతిరేకించడానికి, లక్ష కోట్ల ప్రజాధనానికి సార్థకత లేకుండా చేయటానికి ఇదేం ధోరణి..? కేంద్రం రుణాలిప్పిస్తోంది, అనేక కేంద్ర సంస్థలు భవనాలు కట్టుకుంటున్నాయి, యూనివర్శిటీలు, గుళ్లు… ఏదేదో నిర్మాణాలు వస్తున్నాయి… ఇప్పుడు జగన్ వ్యతిరేకించడం అంటే… జరుగుతున్న పనుల్ని ఒకరకంగా అడ్డుకోవడం…

నేను అధికారంలోకి వస్తే మళ్లీ అమరావతి లేదు అంటున్నాడు… ఓ భ్రమాత్మక మావిగన్ కేపిటల్ అంటున్నాడు… దీంతో అసలే రెండో దఫా భూసేకరణకు మొరాయిస్తున్న రైతులు ఇక మరింత మొండికేస్తారు… అదే జగన్ ఆశించింది కూడా… కానీ అమరావతిని మరో కాళేశ్వరం, మరో మేడిగడ్డను చేస్తున్నాడా తను..?

ఆ డబ్బు జగన్ జేబులోనిది కాదు, చంద్రబాబు జేబులోనిది కాదు… ప్రజాధనం… దాన్ని అమరావతిలో బొందపెడతారా..? పక్కా అభ్యంతరకరం! పోనీ, చకచకా అమరావతిని పూర్తి చేసి, గతంలోలాగా గాకుండా, జగన్‌కు ఇంకేమీ చాన్స్ లేకుండా చేస్తాడా చంద్రబాబు..? లేదు, తనకూ శ్రద్ధ లేదు, స్లో ప్రోగ్రెస్… నత్తనడకన నిర్మాణాలు…

నిజానికి చంద్రబాబు చేతుల్లో ఏమీ లేదు… లోకేష్, తన కోటరీ రాష్ట్రాన్ని పాలిస్తోంది, మంత్రి నారాయణకూ వాళ్లకూ పడుతున్నట్టు లేదు… ఉన్నతాధికారులతో సమన్వయమూ లేదు… వెరసి… అమరావతి ఒక కల… ఆంధ్రుల రాజధాని ఒక కల… సేమ్ పోలవరం…

చివరగా… చంద్రబాబు స్వార్థాన్ని, నిర్వాకాన్ని వదిలేయండి కాసేపు… ఇప్పుడు జగన్ ఉన్న ప్లేసులో వైఎస్ గనుక ఉన్నట్టయితే… ఇలాంటి మావిగన్ నినాదాలు ఇచ్చేవాడా..? నెవ్వర్..! ఒక్కసారి హైదరాబాద్ మెట్రో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఓఆర్ఆర్, గోదావరి వాటర్ ఎట్సెట్రా పనులు గుర్తొస్తే వైఎస్ ఏమిటో అర్థమవుతుంది..!! పిటీ ప్రజెంట్ తెలుగు జాతి..!!

.

  • జగన్ ఇదే మాట మీద నిలబడతాడు అనుకోవద్దు ప్లీజ్… ముందు అమరావతి వద్దన్నాడు, తరువాత సరే అన్నాడు, అధికారంలోకి వచ్చాక పఢావు పెట్టాడు, మూడు రాజధానులు అన్నాడు… ఇప్పుడు విజయవాడే (మావిగన్) రాజధాని అన్నాడు, మరి తను ప్యాలెస్ కట్టుకున్నవిశాఖపట్టణం, మరో రాజధాని కర్నూలు మాటేమిటి..? భలేవారే, తనకైనా తెలిస్తే కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ముట్టడి పోరాటాలన్నీ మైలేజీ పోరాటాలే… ఎవ్వడూ తగ్గట్లేదు…
  • ధర్మేంద్ర ప్రధాన్… విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగినవాడే…
  • బీజేపీ- బీఆర్ఎస్ ‘పొత్తుపొడుపు’..! అమిత్ షా సంకేతాలు ఇవే !!
  • ఈ చట్టాలు ఎందుకూ పనికిరావు – ముళ్లు పీకాల్సింది బుల్‌డోజర్లే !!
  • జస్ట్, సెకన్ల ఆపరేషన్ – ఖేల్ ఖతం – ఉగ్రవాది హతం – 141 ప్రాణాలు సేఫ్
  • అప్పటి సంచలనం… ఇప్పటి మీడియాకూ తెలియదేమో ఈ కథ…
  • ఆల్రెడీ బాలయ్య హిట్ సినిమా ఇది! మరి రీమేక్ ఎవరు చూడాలి ?!
  • డొల్ల మాటల వ్యాపారి..! మళ్లీ తెలంగాణ యాసపై అదే ఏడుపు !!
  • ఢిల్లీ అల్లర్ల వైఫల్యానికి, కల్లోలానికి ఎవరు అసలు బాధ్యులు..?
  • అబ్బో… ఈ ఉదయ్‌కృష్ణుడు మామూలోడు కాదు… ఎందుకంటే..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions