. కొన్ని ఉద్విగ్న క్షణాలు ఉంటయ్… వాటిని అక్షరాల్లోకి దించలేం… ఇండియా- ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్లో మన తెలుగు క్రికెటర్ నితిష్ కుమార్ రెడ్డి దంచిన సెంచరీ అలాంటిదే… ఎహె, సెంచరీలను ఇప్పటివరకు వేలాది మంది క్రికెటర్లు సాధించారు కదా అనొచ్చు… కానీ కొన్ని సెంచరీలకు వేరే విలువ ఉంటుంది… అలాంటిదే ఇది కూడా… ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్సే అధికంగా ఉన్న ఆ 80 వేల మంది ప్రేక్షకుల చప్పట్లతో హోరెత్తింది స్టేడియం… అదీ ఆ సెంచరీ […]
ఆరోజు గుర్తుందా రాహుల్..? మన్మోహన్సింగ్ కాబట్టి భరించాడు..!!
. ఇప్పుడు కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ను ఆహా ఓహో అని ఓన్ చేసుకుంటోంది… కీర్తిస్తోంది… అక్కడికి తననేదో స్వేచ్ఛగా పనిచేయనిచ్చినట్టు..! తనను జస్ట్ ఓ హెడ్ గుమస్తాగా మాత్రమే కదా సోనియా కుటుంబం తనను ట్రీట్ చేసింది… తనకు పీవీ గురువే అయినా సరే, పీవీకి ఉన్న ఆత్మాభిమానం మన్మోహన్కు లేదు కాబట్టి, అవమానాల్ని తుడిచేసుకుంటూ కాలం గడిపాడు… అప్పట్లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అప్పటి మీడియా సలహాదారు సంజయ్ బారు ఓ పుస్తకం రాశాడు… […]
రేవంత్రెడ్డి పోలీసు అడ్డాలో, పోలీసు భాషలోనే క్లియర్గా చెప్పాడు..!!
. రాజు- దిల్ రాజు…… నిజమే. గవర్నమెంటు చాలా పెద్దది. బెనిఫిట్ షో, టికెట్ రేట్ల పెంపు చాలా చాలా చిన్నవి… తెలంగాణ ఫిలిం డెవెలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు మాటల ఫ్లోలో అనుకోకుండా అనేశారో, లేక లోపల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశ సారాన్ని ప్రతిబింబించడానికి ఉద్దేశపూర్వకంగానే అన్నారో కానీ… నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకుంటున్నది అదే. రాజ్యం ముందు ఎవరైనా పిపీలికాలే. బహుశా నీళ్ళు నమలకుండా కుండబద్దలు కొట్టినట్లు తన సహజసిద్ధమైన పద్ధతిలో […]
50 కోట్ల మంది హాజరయ్యే కుంభమేళా… మార్కెటింగ్ మహత్తు ఇదీ..!!
. మామూలుగా ఓ చిన్న జాతర జరుగుతూ ఉంటేనే… బోలెడు మంది చిరు వ్యాపారులు మాత్రమే కాదు… బ్రాండ్ ప్రమోషన్ల యాడ్స్ కూడా బాగా కనిపిస్తుంటాయి… వర్తమాన వాణిజ్య ప్రపంచంలో ఎవరికైనా బ్రాండ్ ప్రమోషన్ తప్పదు… గతంలోని సంప్రదాయ మార్కెటింగ్ విధానాలు కాదు ఇప్పుడు… రకరకాల కొత్త పోకడలు వచ్చాయి… అలాంటిది కుంభమేళా వంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరుగుతుంటే ఇక యాడ్స్ సంగతి చెప్పాలా సపరేటుగా..? ఎక్స్చేంజ్ ఫర్ మీడియాలో ఓ ఆసక్తికర […]
మన్మోహన్సింగ్… తన కెరీర్పై ఇవీ కొన్ని ఇంట్రస్టింగ్ నిజాలు…
. . ( శివ రాచర్ల ) .. …. Destined Prime Minister… రాజకీయ ఆరోపణలు ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే విమర్శలు ఏ నాయకుడి వ్యక్తిత్వాన్ని, వారి ట్రాక్ రికార్డ్ ను ప్రతిబింబించవు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ , సోనియా గాంధీ మీద విమర్శలకు మన్మోహన్ సింగ్ ను ఒక అవకాశంగా వాడుకున్నారు. అందులో ప్రధానమైనది “accidental prime minister ” అనటం… ఈ దేశంలో ఆక్సిడెంటల్ ప్రధానులు […]
నిజానికి ప్రజల్ని దోచుకునేది ప్రభుత్వమే… ఎడాపెడా బాదుడే…
. ఈమధ్య రెండు సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా చిత్ర విచిత్ర వ్యాఖ్యానాలు చేస్తోంది. ఆమె లండన్ ఎకనమిక్ స్కూల్ విద్యార్థి. ఏకకాలంలో అనేకభాషలు మాట్లాడగలరు. ఆమె చదువును, జ్ఞానాన్ని తక్కువ చేయాల్సిన పనిలేదు. మోడీ, అమిత్ షా ల కాలంలో ఆర్థికమంత్రిగా ఆమెకున్న పరిమితులు కూడా లోకానికి తెలియనివి కావు. అయినా ఎందుకో ఆమె తరచుగా సామాజిక మాధ్యమాలకు వస్తువు అవుతున్నారు. పద్దెనిమిదేళ్ళ వయసులో చదరంగంలో జగజ్జేతగా […]
బురద రాజకీయాల నడుమ… చిన్న మరకా అంటని నిష్కళంకుడు…
. నిజానికి తను పొలిటిషియన్ కాదు… ఆర్థిక రథాన్ని ఎలా నడపాలో బాగా తెలిసిన సారథి… ప్రణాళికవేత్త… అన్నింటికీ మించి పదే పదే ప్రశంసించదగిన సుగుణం… అవినీతి, అక్రమాలతో కుళ్లిన వర్తమాన రాజకీయ వ్యవస్థలోనే దశాబ్దాలపాటు కీలక స్థానాల్లో ఉన్నా సరే, ఏదీ అంటకుండా నిష్కళంకుడిగా బతికిన స్వచ్చుడు… తన ఆర్థిక విధానాలను, తన పాలన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తులు, పార్టీలు కూడా ఆయన్ని ఎప్పుడూ అవినీతిపరుడిగా విమర్శలకు పోలేదు… తను ప్రధానిగా ఉన్న పదేళ్ల […]
ప్రభువుల వారు కనికరించాలి… మహానటులు పాదాక్రాంతం ప్రభూ…
. దాసరి వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు వచ్చాడు గానీ… దాసరి చిరంజీవి ఎందుకు రాలేదు..? సోకాల్డ్ రాజమౌళి, ప్రభాస్, మహేశ్ ఎట్సెట్రా ఎందుకు రాలేదంటారూ..? అసలు నిందితుడు అల్లు అర్జున్ ఎందుకు రాలేదు..? క్రీస్తుపూర్వం నాటి సినిమా సెలబ్రిటీలు కొందరు, సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీలు కొందరు… అసలు వర్తమానంలో ఎవరూ పట్టించుకోనివారు మరికొందరు… మొత్తానికి దిల్ రాజు భలే గ్యాదర్ చేశాడు… కానీ, వీరిలో ఇండస్ట్రీని శాసించగలిగే శక్తి ఉన్నవాళ్లు ఎవరు..? సిండికేట్ సభ్యులైన […]
కట్ చేస్తే..! సీన్ మొత్తం ఛేంజ్… జనం ఊహించని, ఆశించని ట్విస్ట్…
. ఓ డిజిటల్ పత్రికలో బ్యానర్ హెడింగ్… “కట్ చేస్తే”… సూపర్… ఆప్ట్ హెడింగ్ ఇది… సినిమా భాషలోనే ఉంది… నిజంగానే సీన్ కట్ చేస్తే…. మొత్తం సీనే మారిపోయింది… రేవంత్ రెడ్డి ఇగో దెబ్బతిన్నది, ఇండస్ట్రీ తీరుతో తను చాలా అసంతృప్తితో ఉన్నాడు, తన ముఖ్యమంత్రిత్వాన్ని అసలు ఇండస్ట్రీ గుర్తించడం లేదు, పైగా వేదికల మీద ఇన్సల్ట్ చేస్తున్నారు అనే వాదనలు ఎన్ని ఉన్నా… నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చివేత, మోహన్బాబు ప్లస్ కొడుకులపై కేసుల […]
అమ్మా, నిర్మలమ్మా… దేశం నీలాంటి ఆర్థికమంత్రిని ఇక చూడబోదు..!!
. . ( నాగరాజు మున్నూరు ) .. … ఈవీ రీసేల్ లాస్ మార్జిన్ మీద 18% జీఎస్టీ చెల్లించాలా? శనివారం జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో… వినియోగించిన విద్యుత్ కార్ల అమ్మకం మీద 18 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కారు అమ్మకం ద్వారా కలిగే లాస్ మార్జిన్ మీద అమ్మకందారుడు 18 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుందని ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతున్నది. […]
ప్రధాని కుర్చీ ఎక్కనేలేదు, చకచకా పీవీ షాకింగ్ డెసిషన్స్… ఐఎంఎఫ్ పాలన..!!
. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేయడానికి ఒకరోజు ముందే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..? మన్మోహన్సింగ్ను ఆర్థికమంత్రిగా తీసుకోవడానికి అసలు తెరవెనుక శక్తులు వేరే పనిచేశాయా..? మన జీవితాల్ని, మన దేశ స్థితిగతుల్ని నిజంగా శాసించేది ఎవరు..? 1978 నుంచీ పలు జాతీయ పత్రికల్లో పొలిటికల్ రిపోర్టింగ్ చేసిన వెటరన్ రైటర్ పి.రామన్ దివైర్ సైటులో రాసిన ఓ వ్యాసంలో కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు ఉన్నయ్… ఆ వ్యాసమంతా కాదు గానీ, కొన్ని సంక్షిప్తంగా, […]
తప్పిపోయిన గొర్రెలూ కొన్నిసార్లు యుద్ధాన్ని గెలిపిస్తయ్… ఇలా…
. . ( రమణ కొంటికర్ల ) .. … ప్రతీ ఏటా జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ చేసుకుంటున్నాం. దానికి సరిహద్దుల్లో మన సైనికులెంత కారణమో… అసలా మొత్తం ఎపిసోడ్ లో ఇండియన్ ఆర్మీని అలర్ట్ చేసిన ఓ వ్యక్తి అంతకంటే కీలకం. సదరు గొర్లకాపరి 58 ఏళ్ల వయస్సులో మృతి చెందడంతో బార్డర్ లోని సైనికవర్గాలతో పాటు.. పలువురు అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఇంతకీ పాక్ పై విజయభేరి మ్రోగించిన భారత విజయం వెనుక […]
వర్తమాన జర్నలిజానికి 8 గంటలే వెలుగు… 16 గంటలూ చీకటే..!!
. మన తాజా జర్నలిజం ఎలా తగలడింది అని ప్రశ్న వేయండి… నిన్నటి అయనాంతం ఎపిసోడ్లాగా వెలిగిపోయింది అనేదే సమాధానం… అర్థం కాలేదా…? కొన్నాళ్లుగా సైట్లు, ట్యూబర్లు తెగ రాసేస్తున్నాయి… డిసెంబరు 21… అదుగో, 16 గంటలపాటు రాత్రి… జస్ట్, 8 గంటలే పగలు… అద్భుతమైన భౌగోళిక విశేషం… అరుదైన సందర్భం అన్నట్టుగా కూశాయి, రాశాయి… చివరకు ప్రధాన మీడియా బాపతు సైట్లు, డిజిటల్ ప్లాట్ఫారమ్స్ కూడా కళ్లు మూసుకుని ఇదే రాశాయి… హహహ… ఏమైంది…? వర్తమాన […]
అల్లు అరవిందుడికి తలనొప్పి… తగ్గని కొడుకు… తెగని పంచాయితీ…!!
. ‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ ని దగ్గరగా చూసిన వ్యక్తిగా చెపుతున్నా సార్, ఫస్ట్ టైం మాటలు తడబడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి ఈ రోజు ప్రెస్ మీట్ లో.., తన బలమే పీపుల్ మేనేజ్మెంట్… అటువంటి అరవింద్ తన సొంత కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధపడి ఉంటాడు… తను పక్కా వ్యాపారి… తనకు అందరూ కావాలి… ఎవరితోనూ వైరం వద్దు… కానీ కొడుకు బన్నీతో తొలిసారి అవస్థలు పడుతున్నట్టున్నాడు… చిరంజీవిని, పవన్ కళ్యాణ్ ని, […]
అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యం… చెప్పినా వినని బరితెగింపు…
. సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి … సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు… అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు… కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో […]
మా కరీంనగర్ టూ ఆ లంబసింగి.. వయా హైదరాబాద్..!
. . ( రమణ కొంటికర్ల ) .. …. మంచు కురిసే వేళలో…. చెడ్డీదోస్తుల లంబసింగి టెయిల్స్! చలి చంపుతున్న చమక్కులో గిలిగింతకొచ్చిందంటూ పాడుకుంటున్న చలికాలపు సాయంత్రాల్లో… పూర్తిగా మంచుదుప్పట్లోకే చొరబడ్డాం! చూసొచ్చినవాళ్లు చెప్పే ముచ్చట్లు.. యూట్యూబర్స్ ఊరించే కబుర్లు.. సోషల్ మీడియాలో వైరలయ్యే రీల్స్.. ఎంత కాదన్నా ఎంతో కొంత ప్రభావితం చేస్తూనే ఉంటాయి. పైగా చాలాకాలంగా ఒకేచోట తిష్ఠ వేసి కూర్చోవడం.. అటు వెళ్లాలి, ఇటు […]
డియర్ కేటీయార్… మరణించిన ఓం ప్రకాష్ చౌతాలా కథ తెలుసా..?!
. తను అడ్డగోలుగా బుక్ అవుతున్నాననే స్పృహ కేటీయార్లో చాలా రోజులుగా కనిపిస్తోంది… తమకు ఇన్నేళ్లుగా అణిగిమణిగి కోవర్టు ఆపరేషన్లు చేసే నాయకుడు కాదు కదా రేవంతుడు… అసలే బాధితుడు కదా… కాస్త కసిగానే వర్కవుట్ చేస్తున్నాడు… కవితను వదిలేయండి, ఆమె బీజేపీ స్ట్రాటజీ కస్టమర్… సరే, వాళ్లు కొన్నాళ్లకు పిచ్చి పొలిటికల్ స్ట్రాటజీల పేరిట ఉపేక్షిస్తారు… అదే కేసీయార్ మళ్లీ ఏవేవో డ్రామా ఎపిసోడ్లతో బీజేపీని బజారుకీడుస్తాడు… బీజేపీ నాయకులకు సిగ్గూశరం ఏమీ ఉండదు తెలిసిందే […]
ఆ సుమధుర గొంతుపై ఇందిర నిషేధం కత్తి..! అసలేం జరిగింది..?
. . ( రమణ కొంటికర్ల ) . ….. బినాకా గీత్ మాల.. 1970వ దశకంలో ఒక ఊపు ఊపిన రేడియో కార్యక్రమం. భారత్ తో పాటు, పొరుగుదేశాలైన శ్రీలంక, పాకిస్థాన్ వంటి చోట్లా ఓ ఎమోషనల్ బాండ్ ఏర్పర్చుకున్న రేడియో షో. అదే సమయంలో 1975-77 మధ్య ఎమర్జెన్సీ సమయంలో ఇందిర కుటుంబానికీ, సుప్రసిద్ధ గాయకుడు కిషోర్ […]
శ్రీనివాసా… కొండ మీద దేవుడికి కోపం రాదనే కదా వారి ధీమా..!!
. తిరుమలలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ మీడియాతో మాట్లాడాడు… ఏమంటున్నాడు అనేది తరువాత… తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే కొండ దిగేలోపు కేసు పెడతామని ఆమధ్య టీటీడీ పాలకమండలి చెప్పినట్టు గుర్తు… ఐనా, అక్కడ ఇంకా మీడియా గొట్టాలు ఎందుకు కొనసాగుతున్నట్టు..? శ్రీనివాస గౌడ్ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా అవి వివాదాస్పద వ్యాఖ్యలే… చైర్మన్ బీఆర్ నాయుడు వరుసగా హరీష్, శ్రీనివాసయాదవ్ తదితర బీఆర్ఎస్ మాజీ మంత్రులను కూడా కలిసి ఆశీస్సులు […]
అడకత్తెరలో బంగ్లాదేశ్… సరిహద్దుల్ని మొత్తం ఆక్రమించిన అరకాన్ ఆర్మీ..!!
. కొందరు ఉంటారు… మన దేశం అనుభవిస్తున్న సార్వభౌమిక స్వేచ్ఛ విలువ తెలియదు… మరోసారి చెబుతున్నా… అంతర్జాతీయ సమాజంలో మనం అనుభవించే స్వేచ్ఛ విలువ వాళ్లకు తెలియదు… చుట్టూ అగ్నిగుండాలు… శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, మాల్దీవులు, చివరకు హిందువుల్ని, బౌద్ధుల్ని తరిమేస్తున్న బంగ్లాదేశ్… మళ్లీ అదే బంగ్లాదేశ్ అయ్యో అయ్యో మా రోహింగ్యా ముస్లింలను బర్మాలో ఊచకోత కోస్తున్నారని ఏడుస్తుంది.. సేమ్, చైనా… ఇదే చైనా జింజియాంగ్ ప్రావిన్సులో తనే ముస్లింల మీద ఉక్కుపాదం మోపుతుంది… కానీ […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- …
- 146
- Next Page »