. ఏ ప్రోగ్రాం అయినా సరే, కొన్ని అలిఖిత మర్యాదలు, ప్రొటోకాల్స్ ఉంటాయి… పాటించబడాలి… లేకపోతే అహాల సమస్యలు వస్తాయి, కొత్త తలనొప్పులు క్రియేటవుతాయి… సీఎం పేరు మరిచిపోతే, దాన్ని వెకిలిగా సమర్థించుకోబోతే అల్లు అర్జునుడు ఎంత భంగపడ్డాడో, ఇండస్ట్రీ అంతా ఎలా షాకయిందో చూశాం కదా… తాజాగా ఓ సంఘటన… ఫేస్బుక్లో మిత్రుడు – డా. మహ్మద్ రఫీ వాల్ మీద కనిపించింది… ఆసక్తికరంగా ఉంది… ముందు ఆ వార్త చదవండి… ఏదైనా ఒక కార్యక్రమానికి […]
క్వశ్చన్ అవర్..! పాత అక్రమాలకు ప్రతిపక్షం ప్రశ్నించబడుతోంది..!!
. మామూలుగా ప్రతిపక్షం అంటే..? ప్రభుత్వం చేసే అక్రమాల్ని, తప్పు నిర్ణయాల్ని, ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రశ్నించేది… నిలదీసేది… అంతే కదా… సాధారణంగా జరిగేది అదే కదా… నో, తెలంగాణలో జరుగుతున్నది వేరు… ప్రతిపక్షమే ప్రశ్నించబడుతోంది… ప్రశ్నల తాకిడికి తల్లడిల్లిపోతోంది… తను అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలపై నిలదీయబడుతోంది… అదీ బహుముఖంగా… అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగులకు పాల్పడిన పోలీస్ విలనుడు రాను రాను అని అమెరికాలో హఠం వేసుకుంటే… ఎలా రప్పించాలో మాకు తెలుసులేవో అని రకరకాల ఇంటర్ […]
మరణం తరువాత..? ఓ చిక్కు ప్రశ్న… ‘మళ్లీ బతికిన’ ఆమె చెప్పేదేమిటంటే..?
. ఒకటి మనిషికి అంతుపట్టలేదు, తెలియలేదు… కాబట్టి అది లేదనుకోవాలా..? అబద్ధం అనుకోవాలా..? మనిషికి తెలియనంతమాత్రాన అది లేకుండా పోదు కదా… అర్థం కాలేదు కదా… కాస్త సరళంగా చెప్పుకుందాం… ఉదాహరణకు ఆత్మ… అంటే, అదేమిటో నిర్వచించలేం, ఖచ్చితంగా అదేమిటో తెలియదు కూడా… మనిషి మరణించాక ఏమవుతాడు..? ఏమీ కాడు… ఓ భౌతిక దేహం ప్రాణం పోతుంది, కట్టె కాలి బూడిదవుతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది అంటుంది హేతువాదం… కానీ మరణాన్ని మించి మరో జీవితం ఉంది… […]
కొమ్మినేని అరెస్టు… పత్రికాస్వేచ్ఛ మీద ఓ సుదీర్ఘ తటస్థ విశ్లేషణ..!!
. ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం… సాక్షి ఎడిటర్ ధనుంజర్ రెడ్డి ఇంటికి వెళ్లి, సోదాలు చేసి, ఏపీ పోలీసులు బెదిరించిన తీరు చూశాం… అంతకుమించి సాక్షి టీవీ డిబేటర్, మాజీ ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని అరెస్టు అంతకుమించిన సంచలనం… నిజానికి రెంటికీ తేడా లేదు… పైగా హోదా రీత్యా సాక్షిలో కొమ్మినేని జస్ట్ ఓ డిబేటర్… కానీ తను సీనియర్, తెలుగు రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన పేరు… కానీ ధనుంజయ్ ప్రస్తుత హోదాకన్నా […]
ఆ దంపతులు నడిపితేనే.. నాటి రాజకీయ ప్రముఖుల విమానయానం…
. నేడు అందుబాటులోకొచ్చిన సాంకేతికతకు రూట్ మ్యాప్ చూసుకోవడానికి పేపర్ అక్కర్లేదేమోగానీ… జీపీఎస్ అందుబాటులోకి రాని ఆ రోజుల్లో.. ఓ పేపరే దారిదీపమైన పరిస్థితుల్లో ఓ విమానంలో నుంచి ఆ రూట్ మ్యాప్ పేపర్ జారి కిందపడితే..? ఆ విమానంలో మన మొట్టమొదటి రాష్ట్రపతి, రాజ్యాంగసభ అధ్యక్షుడైన డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ వంటి హేమాహేమీలుంటే ఇంకేంటి పరిస్థితి..? అవునూ, అలాంటి ఒక చరిత్రలో మనం చూడని ఉత్కంఠ రేపే ఓ చాప్టర్ లోకి వెళ్లొద్దాం. ఇవాళ మనం […]
జైన వెడ్స్ బ్రాహ్మణ… ఒక సంపూర్ణ సంప్రదాయిక పెళ్లి వేడుక…
. Bvs Bhaskar వాల్ నుంచి సేకరణ… కొత్త సంప్రదాయం పెళ్ళికి వెళితే ఎలా ఉంటుంది… — పెళ్లిళ్లు, సంబరాలు, పండుగలు మన కుటుంబ సంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులకు అనుగుణంగా చేసుకోవడం సర్వసాధారణం. వేరే రాష్ట్రాలు, దేశాలకు లేదా మతాలకు చెందిన యువతీయువకులు పెళ్లిళ్లు ఈమధ్య ఎక్కువయ్యాయి. కానీ మేము వెళ్లిన పెళ్ళి అ completely different and a ‘destination marriage’. ఒక గొప్ప సంప్రదాయ పెళ్ళికి నేను, మా ఆవిడ వెళ్ళాము. ఎక్కడ, ఎలా అనేది […]
ఫిక్సింగ్… విజయోత్సవాల్లో ఏదో కుట్రకోణం… 11 మంది ఉసురు తీసిందెవరు..?
. నిజంగానే ఏదో పెద్ద మిస్టరీ ఉంది బెంగుళూరు తొక్కిసలాట విషాదం వెనుక..! ఎందుకంటే..? చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించి, నూటాయాభై మంది గాయపడిన సంగతి తెలుసు కదా… ప్రభుత్వం ఎడాపెడా పోలీస్ అధికార్లను బదిలీ చేసేసింది… స్టేట్ పొలిటికల్ సెక్రటెరీ సహా మరికొందరిపైనా వేటు పడింది… కర్నాటక్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు రాజీనామాలు చేశారు… ఆర్సీబీ మీద పోలీసులు కేసు పెట్టారు, ఒకరిద్దరిని అరెస్టు కూడా చేశారు… బీసీసీఐ […]
నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
. ఓ వార్త… రాజకీయాల్లోకి శైలిమ… ఈ డౌటనుమానం ఎందుకొచ్చిందయ్యా అంటే… ఐసీయూలో ఉన్న ఎమ్మెల్యే మాగంటి ఫ్యామిలీకి దన్నుగా నిలుస్తూ, ఆరోగ్య స్థితిని కనుక్కుంటూ, వెండెంబడి కేటీయార్‌కు సమాచారం ఇస్తున్నది అని… అంతేనా..,? ఆ ఒక్క ఉదాహరణతో ఆమె రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టు సూత్రీకరిస్తారా..? ఏమో.., ఆమె ఈరోజుకూ ఎప్పుడూ మీడియా తెర మీదకు రాలేదు… లైమ్‌లైట్‌లో లేదు… చిన్న ఇంటర్వ్యూ గానీ, వార్తాచిత్రం గానీ కనిపించవు… మరి ఏమిటిది హఠాత్తుగా..? కావచ్చు, ఆ కుటుంబానికి కేటీయార్ […]
అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
. ఇది రాజకీయం కాదు… పొలిటికల్ సవాళ్లు, ప్రతిసవాళ్లు, నిందారోపణలు కావు… తెలంగాణ సర్వతోముఖాభివద్ధి దిశలో ఓ ప్రణాళిక…! ఓ సంకల్పం…! దీన్ని పొలిటికల్ కోణంలో కాదు, చూడాల్సింది తెలంగాణ సమాజం కోణంలో…!! రేవంత్ రెడ్డి పదే పదే ఓ మాట చెబుతున్నాడు… పదేళ్లు సమయమివ్వండి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వన్ ట్రిలియన్ స్థాయికి తీసుకుపోతానని… అసలు ఎక్కడా అప్పు పుట్టడం లేని ప్రస్తుత ఆర్థిక దురవస్థ నుంచి ఏకంగా పదేళ్లలో వన్ ట్రిలియన్ ఆర్థిక సత్తాను […]
జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
. నాగార్జున నష్టజాతకుడే అని కొందరు తీర్మానించేస్తారు… కానీ తప్పు… తన నటన స్థాయికి తను సంపాదించుకున్న పాపులారిటీ చాలా చాలా ఎక్కువ… అసలు ఇన్నేళ్లు ఫీల్డులో ఉండటమే పెద్ద ఘనత… తండ్రి సంపాదించిన ఆస్తుల్ని అప్పులో చేశాడో ఏం చేశాడో గానీ అమ్ముకోలేదు, నిలబెట్టాడు… నష్టజాతకుడు ఎందుకయ్యా అంటే..? కొడుకులు నటనకు వారసులు కాలేకపోయారు… అసలు నాగేశ్వరరావుతో పోలిస్తే తనకే ఏమీ రాదు… కానీ నిలబడ్డాడు… చైతూ, అఖిల్ నిలబడలేక నానా పాట్లూ పడుతున్నారు… ఒక […]
ట్రంపుపై మస్క్ పేల్చిన చీకటి బాంబు… అమెరికాలో కలకలం… అసలు కథ ఇదీ…
. ట్రంప్, ఎలన్ మస్క్… ఇద్దరూ బిలియనీర్లు, స్వతహాగా వ్యాపారులు… మస్క్ సాహసి, ప్రయోగశీలి… ట్రంప్ మీద ఎన్నెన్నో ఆరోపణలు ప్లస్ నోటిదూల… కానీ ఇద్దరూ స్నేహితులు… ట్రంపు గెలుపు కోసం కోట్లను ఖర్చుపెట్టాడు మస్క్… అఫ్కోర్స్, వ్యాపారి ఏ ప్రయోజనం లేనిదే పైసా ఖర్చు చేయడు కదా… ట్రంపు అధికారంలో దాదాపు భాగస్వామి అయ్యాడు… కానీ ట్రంపు ట్రంపే కదా… బేమాన్… ఏదో బిల్లు తెచ్చాడు, అది మస్క్ టెస్లా కార్లకు విఘాతం… అసలే చైనా […]
దిక్కుమాలిన క్షుద్రానువాదాలు… దరిద్రపు పర్యవేక్షణ అంటే ఇదే…
. ఎప్పుడైనా అసెంబ్లీ, సచివాయల తదితర ప్రభుత్వ కార్యాలయాల తెలుగు గమనించారా..? మల్టీనేషనల్ కంపెనీల తెలుగు యాడ్స్‌లో భాష, పోనీ, ఈనాడు అనువాదాల తీరు గమనించారా..? సరే, ఆ ఇనుప గుగ్గిళ్లు సరే… ఇప్పుడు ఎంచక్కా గ్రోక్, చాట్‌జీపీటీ, డీప్‌పీక్, జెమిని ఎట్సెట్రా చాలా ఎఐ ప్లాట్‌ఫారాలు వచ్చి ఏడిచాయి కదా… ఏదైనా ఇంగ్లిష్ కంటెంటును దానికి ఇస్తే సెకన్లలో… నిజమే, సెకన్లలో తెలుగులోకి తర్జుమా చేసి ఇస్తాయి కదా… కాకపోతే ఒరిజినల్ ఒరిజినలే… ఈ అనువాదాల్లోనూ […]
ఆపరేషన్ సిందూర్‌ను పొడిగించకపోవడమే మంచిదైందట…!!
. “ఆపరేషన్ సిందూర్‌ను పొడగించకపోవడమే మంచిదైందట… కానీ ఎందుకు?” ఓ సమర్థన… అబ్బే, ఫూలిష్ సమర్థన అంటారా..? పోనీ, ఓ కథలాగా చదువుకొండి… నిజమే అంటారా..? ఎంజాయ్… ఇది కేవలం భారత్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం కాదు. ఇది భారత్ వర్సెస్ పాకిస్తాన్ + చైనా + టర్కీ + అమెరికా డీప్ స్టేట్ + దేశంలో ఉన్న అంతర్గత శత్రువులు… ప్లస్ బంగ్లాదేశ్ కూడా ఈ కుట్రదారులకు సహాయ పాత్రధారి… ఈ దుష్టకూటమికి ప్రేరణ కలిగించినది […]
ఉక్రెయిన్ యుద్ధతంత్రం… ఇండియాకు ఓ పెద్ద మేలుకొలుపు…
. నిజానికి ఉక్రెయిన్ రష్యా మీద అమలు చేసిన ఓ భిన్నమైన, తెలివైన యుద్దవ్యూహం… ప్రపంచంలోని అన్ని దేశాల సైన్యాన్ని, రక్షణ విభాగాల్ని నివ్వెరపరిచింది… ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్పై కథ… ఉక్రెయిన్ సీక్రెట్ ఏజెంట్ Artem Tymofieiev డీజే అవతారం ఎత్తి, నాలుగు సంవత్సరాలు అండర్ కవర్ ఆపరేషన్ లో ఉండి…, ఆర్డర్స్ రాగానే 117 డ్రోన్లను హవాలా మార్గం ద్వారా రష్యాలోకి రప్పించుకొని… తన కమర్షియల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా నలుగురు డ్రైవర్లని మాట్లాడి, […]
ఐపీఎల్… ఇదొక వికృత క్రీడ… ఆటగాళ్ల వేలంవెర్రి… ఓ పిచ్చి…
. Nàgaràju Munnuru…… ఐపిఎల్ అని పిలువబడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది బీసీసీఐ నిర్వహించే ఒక ప్రైవేటు క్రికెట్ టోర్నమెంట్. ఇంతకు ముందు కూడా చెప్పాను ఇది డబ్బులు సంపాదించడం కోసం నిర్వహిస్తున్న పక్కా కమర్షియల్ లీగ్ మాత్రమే. టోర్నమెంట్ నిర్వహించడానికి జట్లు కావాలి కాబట్టి వాటికి ఏవో పేర్లు పెట్టారు. ఫ్రాంచైజీ పేరులో రాష్ట్రాల పేర్లు, రాష్ట్ర రాజధానుల పేర్లు ఉన్నంత మాత్రాన అవేమీ ఆయా రాష్ట్రాలకు అధికార ప్రాతినిధ్యం వహించవు. వందల కోట్లు […]
విషాదమే… కానీ ఉన్మాదం… కర్నాటక సర్కారు ఘోర వైఫల్యం…
. ఇది అభిమానం కానే కాదు, ఓరకమైన పిచ్చి, ఉన్మాదం… బెంగుళూరులో ఆర్సీబీ ఐపీఎల్ జట్టు విజయోత్సాహం, విజయోత్సవాలు జస్ట్, అబ్సర్డ్… స్టేడియం బయట తొక్కిసలాటలో కనీసం 11 మంది మరణించారనీ, 50 మంది గాయపడ్డారనీ ప్రాథమిక వార్తలు… అన్నింటికీ మించి అక్కడి సర్కారు దిక్కుమాలినతనం… ఇటీవల కాలంలో సినిమా తారలు, క్రికెటర్ల పట్ల జనంలో అభిమానం నిజంగానే ఓ ఉన్మాద స్థాయిలో పెరిగిపోయింది… అప్పటికప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జనం గుమిగూడిన సంఘటన తాలూకు నష్టాలు […]
ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
. తెలంగాణ షర్మిల ధర్నా చేసింది… సొంతంగా తండ్రితో సహా, సోదరుడితో సహా, పార్టీతో సహా అందరూ బహిష్కరించినా సరే… అదే తండ్రిని కీర్తిస్తూ… ఫాఫం ఆయనకు నోటీసులు వచ్చాయనే కన్నీళ్లతో ధర్నా… చాలా విషయాలు చెప్పింది, షర్మిల సభల్లాగే జనం… ఓసారి ఆమె ఏం చెప్పిందో మొత్తం విన్నాక ఆశ్చర్యం, నవ్వు ఒకేసారి ముంచెత్తుతాయి ఏ సగటు తెలంగాణవాసికైనా… ముందుగా ఆమె ఏం చెప్పిందో చదువుదాం ఓసారి… వెంట వెంటనే మన సందేహాలు కూడా అడిగేద్దాం… […]
2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
. మన విశ్వనగరం హైదరాబాద్‌లో… ధనికులు, హైపర్ ధనికులు నివసించే ప్రాంతాల్లో కూడా ఖరీదైన ఫ్లాట్ రేటు ఎంత..? చదరపు అడుగుకు (స్క్వేర్ ఫీట్) గరిష్టం 20 వేలు ఉండొచ్చా..? పోనీ, అత్యంత ఖరీదైన పోష్ విల్లా స్క్వేర్ ఫీట్‌కు గరిష్టం 40, 50 వేల రూపాయలు ఉండొచ్చా..? మరి ముంబై..? మన దేశ వాణిజ్య రాజధాని… వర్లి ఏరియా… సీ ఫేస్… ఇప్పటివరకూ ఇండియాలో పలకనంత అత్యధిక రికార్డు రేటుతో ఓ లావాదేవీ జరిగింది… ఫార్మస్యూటికల్ […]
జైషా నిశ్శబ్ద దరహాసం..? మొత్తం ఆ వైరల్ ఫోటోలో ఉన్నట్టుగానే…?!
. ఐపీఎల్ 2025… ఫిక్సింగే గెలిచిందా..? ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ బాగోతం అని మెజారిటీ ఇండియన్ క్రికెట్ ప్రేమికులు అనుమానిస్తారు… ఐనా చూస్తూనే ఉంటారు… కొన్నాళ్లుగా ఓ ఫోటో వైరల్ అవుతోంది తెలుసు కదా… అది క్రికెట్ బాస్ జైషా పేరిట ప్రచారంలో ఉంది… ఇదుగో ఇదీ… అవును, ఫైనల్ దాకా కీలక మ్యాచుల ఫలితం ఈ ఫోటోలో ఉన్నట్టే జరుగుతోంది… చివరకు ఫైనల్లో కూడా అంతే… ఎప్పుడైతే పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఔటయిపోయాడో అప్పుడే […]
ప్రపంచ సుందరికి అయోధ్య సందర్శన అభిలాష… ఓ నేపథ్యం…
. మొన్న ఓ వార్త… మిస్ వరల్డ్ ఒపల్ సుచాత చాంగ్వా శ్రి భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించాలనే తన కోరికను, ప్రత్యేకించి అయోధ్య రామజన్మభూమికి వెళ్లాలనే సంకల్పాన్ని బయటపెట్టింది… అబ్బే, ఈ అందాల పోటీదార్లు ఏ దేశం వెళ్లినా అలాగే మాట్లాడుతుంటారు, ఈ చిలుక పలుకులు ఎవరికి తెలియదులే అని చాలామంది కొట్టిపారేశారు… ప్రత్యేకించి రామజన్మభూమి సందర్శించాలనే ఆమె కోరిక పట్ల చాలామంది నెటిజనం నెగెటివ్‌గా రియాక్టయ్యారు… కానీ అలా తీసిపడేయాల్సిన అవసరం లేదు, […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- …
- 124
- Next Page »