‘ఎవరి పనిని వారు చేసుకోనిస్తే రిజల్ట్ దేవరలా ఉంటుంది… దర్శకుడు కొరటాల శివ అన్న ఈ మాట నాకు బాగా నచ్చింది… దర్శకుడిని నమ్మిన హీరో ఉంటే విజయం మరింత బలంగా ఉంటుందని దేవర నిరూపించింది’… ఈ మాట అన్నది గేయరచయిత రామజోగయ్య శాస్త్రి… అంటే, సింపుల్… జూనియర్ ఎన్టీయార్ దర్శకుడిని నమ్మాడు, తన పనిని తాను చేసుకోనిచ్చాడు, అందుకే ఈ సక్సెస్ అనేది తన మాటల సారాంశం… వెంటనే సోషల్ మీడియాలో ఈ మాటల్ని కొందరు […]
అన్ని బళ్లెందుకురా బుజ్జీ అన్నట్టుగా… ఇంత తారాగణం దేనికి కొరటాల దేవరా..?!
అసలు జూనియర్ ఎన్టీయార్ వంటి సూపర్ స్టార్డం ఉన్న హీరోయే ప్రధాన ఆకర్షణ… తనకు ఇతరత్రా స్టార్ అట్రాక్షన్ తోడు నిలవాల్సిన అవసరమే లేదు… తనే ఒంటి చేత్తో సినిమాను మోయగలడు, లాగగలడు… కానీ దేవర సినిమాలో ఎందరో నటీనటులు, ఎన్నో పాత్రలు… అవన్నీ ఈ సినిమాకు పాన్ ఇండియా లుక్కు తీసుకొస్తాయనీ, మార్కెటింగ్ వ్యూహాల్లో ఇదీ ఒకటని అనుకున్నాడేమో దర్శకుడు కొరటాల… కానీ ఎవరికీ సరైన ప్రాధాన్యం లేదు… ఎవరికీ సరైన స్క్రీన్ స్పేస్ లేదు… […]
జీవనదిలా మంద్రంగా సాగే ప్రవాహం… బంధాలు, భావోద్వేగాల పలకరింపు…
మొన్నామధ్య నాని సినిమా ఏదో వచ్చింది కదా… అందులో కథానాయకుడి పాత్ర నానిది… ప్రతినాయకుడి పాత్ర ఎస్జే సూర్యది… అనేక సీన్లలో సూర్య నానిని డామినేట్ చేశాడు… పాత్రకు కూడా అంత ప్రాధాన్యం ఉంది… ఒక దశలో ఇది నాని సినిమాయా..? సూర్య సినిమాయా..? అన్నట్టుగా ఉంటుంది… సాధారణంగా హీరోలు, ప్రత్యేకించి సౌత్ ఇండియన్ హీరోలు… బిల్డప్పులకు, ఇగోలకు విపరీతంగా ప్రాధాన్యమిచ్చే స్టార్ హీరోలు ఈ ధోరణిని అంగీకరించరు… నాని డిఫరెంట్ కదా, సూర్య పాత్ర ప్రాధాన్యాన్ని […]
ఇందు రెబెకా వర్గీస్… సాయి పల్లవి పోషించే ఈ పాత్ర ఒరిజినల్ ఎవరు..?
అమరన్… ఇది శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా… త్వరలో రాబోతోంది… తాజాగా ఆ సినిమాలో సాయిపల్లవి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు… అందులో ఎర్రకోట దగ్గర ఆర్మీ పరేడ్, మోడీ ఫీడ్ యథాతథంగా వాడుకున్నట్టున్నారు… తప్పు లేదు… తన సాహసానికి, తన త్యాగానికి గుర్తుగా మరణానంతరం అశోకచక్ర పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ అది… అందులో మేజర్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రను సాయిపల్లవి పోషిస్తోంది… ఈ […]
మెయిజగన్… సత్యం సుందరం… మనవాళ్లకు కనెక్టయితే దేవరకు దెబ్బే..!!
Meiyazhagan… అంటే తమిళంలో స్వీట్ హార్ట్… అమృత హృదయం… తెలుగులో మంచి టైటిల్ ఏదీ స్ఫురించనట్టుంది… మరీ కొన్ని తమిళ సినిమాల పేర్లను యథాతథంగా తెలుగులోనూ పెట్టేసినట్టు మెయిజగన్ అని పెట్టేయలేదు… సంతోషం… సత్యం సుందరం అని తెలుగులో టైటిల్ పెట్టారు… 96 అని ఆమధ్య ఓ సినిమా వచ్చింది తెలుసు కదా… దర్శకుడు ప్రేమ కుమార్… విజయ్ సేతుపతి, త్రిష ప్రధానపాత్రలు… ప్రేక్షకుడిని సున్నితమైన నాస్తాల్జిక్ అనుభూతుల్లోకి తీసుకెళ్లిన ఎమోషనల్ మూవీ… తెలుగులో కూడా ఎవరో రీమేక్ […]
“దూకే ధైర్యమా జాగ్రత్త ! రాకే తెగబడి రాకే ! దేవర ముంగిట నువ్వెంత ?’’
మాకు చాలా భయంగా ఉంది దేవరా! నవరసాల్లో భయం చాలా భయంకరంగానే ఉంది. ఆ భయం ఎన్ని రకాలు? అన్న దగ్గరే స్పష్టత లోపించినట్లుంది. సైకాలజీకి కూడా భయమంటే చచ్చేంత భయమే. నిలువెల్లా వణుకే. భయాన్ని చిటికెలో తీసి అవతల పారేస్తాను అని అంతటి సైకాలజీ కూడా ధైర్యంగా చెప్పలేదు. భయం ఒక భావోద్వేగ అంశం అన్నారు. “భయపడేవాళ్లంతా వచ్చి నా చుట్టూ పడుకోండి” అన్నాడట వెనకటికి ధైర్యం నటించే ఒకానొక పిరికివాడు. “అనవసరంగా భయపడకండి…మీకేమీ […]
కొరటాల మార్క్ మూస మాస్… ఫార్ములా కమర్షియల్ లెక్కల్లో దేవర వోకే… కానీ…?
యండమూరి పాత నవల… బహుశా ఆనందో బ్రహ్మ కావచ్చు… ఓ ప్రఖ్యాత రచయిత తన కొత్త పుస్తకం కంప్యూటర్ ముందు పెడతాడు… 20 శాతం ఎమోషన్, 30 శాతం ప్రేమ, 25 శాతం డ్రామా… ఇలా కొన్ని శాతాలు చెప్పి, పర్ఫెక్ట్ ఫార్ములా అని తేల్చేస్తుంది కంప్యూటర్… తీరా చూస్తే ఆ పుస్తకం సేల్స్ పెద్దగా ఉండవు… పాఠకులు పెదవి విరుస్తారు… కారణం, కొత్తదనం లేకపోవడం… క్రియేటివిటీ లోపించడం… ఫార్ములా లెక్కలు తప్ప మరేమీ లేనితనం… ఆ […]
అసలే పవన్ కల్యాణ్, ఆపై హిందుత్వ, తోడుగా బీజేపీ… ప్రకాష్‌రాజ్ గోకుడే గోకుడు..!!
రాజకీయాల మొదట్లో ధరించిన లౌకిక అవతారం వదిలేసి, తాజాగా సనాతన కాషాయ వస్త్రాలు ధరించిన పవన్ కల్యాణ్ మతం, ఆయన అభిమతం… ఆయన అభీష్టం… అది రాజకీయ అవసరమా..? మానసిక పరివర్తనా..? మరేదో పరిణామ క్రమమా..? అదంతా వేరే చర్చ… కానీ నువ్వలా మారడానికి వీల్లేదు, అది తప్పు అని తప్పుపట్టలేం… నాస్తికుడు ఆస్తికుడిగా… ఆస్తికుడు నాస్తికుడిగా మారడం అసాధారణమేమీ కాదు… అనుభవాలు, అవసరాలు, జీవిత పాఠాలు మార్చేస్తుంటాయి… పవన్ కల్యాణ్ కూడా అంతే… అత్యంత చంచల […]
ఒక పుస్తకం… ఒక విభ్రమం, ఒక ఉత్సవం… ‘సావిత్రి సూపర్ క్లాసిక్స్…
ఒక విభ్రమం, ఒక ఉత్సవం… ‘సావిత్రి సూపర్ క్లాసిక్స్’ ………………………………… నటి సావిత్రి సినిమాలు , జీవితం పై సంజయ్ కిషోర్ తెచ్చిన తాజా పుస్తక పరిచయం ఇది ……………………………………………….. అవి సావిత్రి సినిమాలకు జనం గోడలు దూకి వెళ్తున్న రోజులు. 1960వ దశకం. ఒక స్వర్ణయుగం. కాలం సావిత్రి వెంటనడుస్తున్న కాలం అది. ఒక్క సావిత్రి చూపు, ఒక్క సావిత్రి నవ్వు ఆంధ్రప్రదేశ్ ని, తమిళనాడుని మల్లెల ఊయలలూపుతన్న రోజులవి. ఆ నాటి వెండితెర […]
సినిమా పాటకు పర్యాయపదం బాలు… చెరిగిపోని స్వర చేవ్రాలు…
బాలు మాట- పాట- బాట పనీపాట లేకుండా పాట పుట్టదు. పనితోపాటే పాట పుట్టింది. పనిని మరిచిపోవడానికి పాట పుట్టింది. పనిలో శ్రమను తగ్గించడానికి పాట పుట్టింది. పనిని గుర్తు చేయడానికి పాట పుట్టింది. మాట మాట్లాడలేక మౌనమైనప్పుడు పాట పెదవి విప్పింది. గుండె గొంతుకలో వేదన సుడులు తిరిగితే మౌన రోదనగా పాట పుట్టింది. ఆనందం అర్ణవమైతే మనసుకు రెక్కలొచ్చి పాట పుట్టింది. పుడితే ఉయ్యాల పాటనుండి పొతే మొయ్యాల్సిన పాటదాకా బతుకంతా పాటే. […]
అప్పట్లో యద్దనపూడి నవలాచిత్రాలు అంటే ఓ ట్రెండ్… ఇదీ అదే…
జయసుధ తనను తాను కేరెక్టర్ ఏక్టరుగా చెక్కుకుంటున్న క్రమంలో వచ్చిన సినిమా . అన్నపూర్ణ బేనరుపై 1977 లో వచ్చిన ఈ ప్రేమలేఖలు సినిమా రాఘవేంద్రరావుకు కూడా మంచి పేరుని తీసుకుని వచ్చింది . యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తీసారు . బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . ఈ సినిమాలో మ్యూజికల్ సిగరెట్ లైటర్ని తన లవరుకు ప్రెజెంట్ చేస్తుంది హీరోయిన్ . అలాంటి లైటర్ […]
లక్ష్మి అందం, అభినయం… వేటూరి పాటకు రాజన్ నాగేంద్ర స్వరాభిషేకం…
A great musical and visual feast . క్లాస్ & మాస్ ఆడియన్సులను ఇద్దరినీ అలరించిన సినిమా . ఈరోజుకీ ప్రతీ పాట సూపర్ హిట్టే . నవతా ఆర్ట్స్ బేనరుపై వచ్చిన ఈ పంతులమ్మ సినిమా లక్ష్మి , రంగనాధ్ కెరీర్లలో ఒక మైలురాయిగా మిగిలిపోయింది . కథను ఎవరు వ్రాసారో కానీ చాలా చక్కగా వ్రాసారు . టైటిల్సులో నవతా టీం అని వేసుకున్నారు . చక్కటి కధకు కె.వి రెడ్డి గారి […]
laapataa ladies… ఆస్కార్ ఎంట్రీ కోసం పోటీపడిన మిగతా సినిమాలేవో తెలుసా..?
గుడ్, లాపతా లేడీస్ సినిమాను వచ్చే ఆస్కార్ అవార్డుల కోసం ఇండియా ఫిలిమ్ ఫెడరేషన్ అధికారికంగా పంపించడానికి నిర్ణయించారు… సినిమా పర్లేదు కానీ, షార్ట్ లిస్ట్ చేసిన 29 సినిమాల్లో ఇంకొన్ని మంచి సినిమాలు కూడా ఉన్నాయి… సరే, ఇవీ జాతీయ అవార్డుల వంటివే కదా… రకరకాల ప్రభావాలుంటాయి… ఏవేవో సమర్థనలూ ఉంటాయి… ఏవో లెక్కలుంటాయి… ఐతే దర్శకురాలు కిరణ్ రావుకు మంచి గుర్తింపు ఇది… ఆస్కార్ ఎంట్రీగా పంపించడం అంటే గుర్తించదగిన సినిమాగా మన వాళ్లు […]
వైర ముత్తు మరియు ఓ షాంపూ బాటిల్ కానుక కథ… మగానుభావుడు..!!
గీతరచయిత వైరముత్తు – ఓ షాంపూ బాటిల్ కానుక (గాయని సుచిత్ర ఇటీవల ఓ తమిళ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు..) గీతరచయిత వైరముత్తు గురించి సింగర్ చిన్మయి ఆరోపణలు చేస్తే అందరూ ఆమెనే తప్పుబట్టారు. ఆమే ఏదో తప్పు చేసిందన్నట్లు ఆమెను దూరం పెట్టారు. ఇప్పటికీ ఇంకా ఆమెనే మాటలంటున్నారు. కానీ వైరముత్తు అందరు లేడీ సింగర్స్‌తో అలాగే ప్రవర్తిస్తారు. అది ఇండస్ట్రీలో ఉండే అందరికీ తెలుసు. కానీ ఎవరూ బయటకు చెప్పరు. వైరముత్తు లేడీ సింగర్స్‌కి […]
దానవీరశూర కర్ణుడు గెలిస్తే… ‘కురుక్షేత్రం’లో అర్జునుడు ఓడిపోయాడు…
కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా 1977 లో వచ్చిన ఈ కురుక్షేత్రం సినిమా నిజంగా కురుక్షేత్రమే . ఆనాటి తెలుగు సినిమా దిగ్గజాలు అయిన యన్టీఆర్ , అక్కినేనిలతో పోటీ పడ్డారు కృష్ణ . దాన వీర శూర కర్ణ సినిమాను ఒంటి చేత్తో లాగించారు యన్టీఆర్ . కృష్ణ అందరితో లాగించారు . కురుక్షేత్రం సినిమా ఔట్ డోర్ షూటింగ్ రాజస్థాన్ , మైసూర్‌లలో జరిపారు . ఈ రెండు సినిమాలు పోటాపోటీగా తయారవుతున్నప్పుడే […]
భగవంతుడే దిగి వచ్చి భక్తుడిని సేవించుకునే కథ… అక్కినేని తాదాత్మ్య నటన…
అక్కినేని నటించిన భక్తి రస చిత్రాలలో నాకు బాగా ఇష్టమైన సినిమా 1977 లో వచ్చిన ఈ చక్రధారి సినిమా . మహారాష్ట్రలోని ఓ చిన్న గ్రామంలో పాండురంగడికి అసలు సిసలయిన భక్తుడు గోరా కుంభార . ఆ భక్తుని కధ ఆధారంగా కన్నడంలో వచ్చిన భక్త కుంభార సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . రాజకుమార్ నటించారు . చాలా భాషల్లో ఈ కధ సినిమాలుగా వచ్చాయి . 1948 లో తమిళంలో చిత్తూరు […]
అంతటి ఎన్టీయార్‌నే నిస్సహాయుడిగా చూపిస్తే జనం మెచ్చుతారా..?!
అడవిరాముడు సినిమాకు ఎదురీది వంద రోజులు అడిన సినిమా 1977 లో వచ్చిన ఈ ఎదురీత సినిమా . హిందీలో , బెంగాలీలో ఒకేసారి విడుదల అయిన అమానుష్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ రెండింటిలోనూ ఉత్తమ కుమార్ , షర్మిలా టాగోర్ హీరో హీరోయిన్లు . 1978 లో తమిళంలో త్యాగం అనే టైటిల్ తో శివాజీ గణేశన్ , లక్ష్మిలతో వచ్చింది . అదే సంవత్సరంలో మళయాళంలో ఇత ఒరు […]
థమన్ ఇక నటుడు కూడా… కానీ, ఇండియన్ ఐడల్‌కు ఇకపై జడ్జిగా రాకపోవచ్చు..!!
థమన్ బహుశా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్‌కు రాకపోవచ్చు… ఏమో, కార్తీక్ కూడా అంతేనేమో… ఎందుకీ డౌట్ వచ్చిందీ అంటే, జవాబు వెంటనే చెప్పలేం… పేరుకు ఈసారి సీజన్ అత్యంత భారీ ఖర్చు అన్నారు… భారీ ఆడిషన్స్ అన్నారు… తీరా కొత్త మొహాలేమీ లేవు… చిన్నప్పటి నుంచీ చాలా పోటీల్లో పాల్గొంటున్నవాళ్లనే ఎంపిక చేశారు, కొత్త మొహాల్లేవు… రెండో సీజన్లో ఏదో ఉండీలేనట్టుగా ఉంటూ, తిక్క జడ్జిమెంట్లు వెలువరిస్తూ చిరాకు పుట్టించిన గీతా మాధురి ఈ […]
సతీ సావిత్రి మార్క్ కథకు ట్రెజర్ హంట్ మిక్స్… జనానికి నచ్చింది…
గిరిబాబుకి మంచి బ్రేకుని ఇచ్చింది 1977 లో వచ్చిన ఈ దేవతలారా దీవించండి సినిమా . Adventure , fantasy , sentiment , emotional movie . 1976 లో హిందీలో ఓ ఊపు ఊపిన సినిమా నాగిన్ ప్రేరణతో మన తెలుగు సినిమాను జయభేరి పిక్చర్స్ వారు తీసారు . కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించిన మొదటి సినిమా . ఈ సినిమాలో మురళీమోహన్ , గిరిబాబు భాగస్తులు . డైలాగులను జంధ్యాల వ్రాసారు […]
అందగాడు కాదు, మంచి నటుడూ కాదు… కానీ…? (అక్కినేనిపై ఆత్రేయ)…
సెప్టెంబరు 20 అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఆ సందర్భంగా ఆత్రేయ అక్కినేని గురించి రాసిన వ్యాసం… అక్కినేని మీద ఆత్రేయ వ్యాసం… అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు, ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి, హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు (వివరాలు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకూ, ఆయనకూ తెలుసూ) సంపాదించాడు. […]
- « Previous Page
- 1
- …
- 8
- 9
- 10
- 11
- 12
- …
- 120
- Next Page »