నందమూరి కల్యాణరామ్… ఏళ్లకేళ్లు ఎదురు చూడగా చూడగా డగా… ఒక్క హిట్… దాని పేరు బింబిసార… ఆహా, మావాడు కాకపోతే ఇంకెవ్వరూ ఈ పాత్ర పోషించలేరు, సూపర్, బంపర్ అంటూ జూనియర్ ఎన్టీయార్ తెగ మోశాడు… సరే, అప్పట్లో జానపద ఫిక్షన్ కథలు కాస్త ట్రెండ్ కదా… కాస్త కథ ట్రీట్మెంట్ కూడా బాగున్నట్టనిపించింది… సినిమా హిట్టయ్యింది… ఇంకేముంది..? కల్యాణరాముడి సూపర్ ఇన్నింగ్స్ స్టార్టయినట్టే అని సైట్లు, యూట్యూబర్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సహా మోసేశారు… నిజానికి […]
Hidimba… నందిత శ్వేత నటనొక్కటే హైలైట్… మిగతా సినిమా అంతా సోసో…
హిడింబ… అంటే అర్థమేంటి..? అదొక పేరు… మహాభారతంలో హిడింబాసురుడు… అడవుల్లోకి పారిపోయిన పాండవులను హతమార్చి తినాలని ప్రయత్నిస్తాడు… చివరకు భీముడి చేతుల్లో హతమవుతాడు… ఆ హిడింబాసురుడి చెల్లె హిడింబి… భీముడినే పెళ్లి చేసుకుంటుంది… వాళ్ల కొడుకే ఘటోత్కచుడు… ఇదీ భారతంలోని కథ… మరి హిడింబ అనే సినిమా కథకూ ఈ భారత కథకూ లింక్ ఏమిటి..? ఏమీ లేదు… ఈ సినిమా కథలోనూ నరమాంస భక్షకులుంటారు… ఆ హిడింబ కథలోనూ నరమాంస భక్షకులుంటారు… అదొక్కటే పోలిక… మరి […]
అక్షయ్ కుమార్ సినిమాపై ఆదిపురుష్ దెబ్బ… భయపడుతున్న సెన్సార్…
మొత్తానికి ఆదిపురుష్ భారీ వ్యయం, భారీ ఫ్లాప్ దేశంలోని సినిమా నిర్మాతలందరికీ ఓ పాఠం నేర్పింది… తలాతోకా లేని పిచ్చి డైలాగులతో, సీన్లతో, వేషధారణలతో ఓ చెత్తా గ్రాఫిక్ సినిమాను ప్రజెంట్ చేస్తే ఈ దేశ ప్రేక్షకులు ఎలా రియాక్టవుతారో స్పష్టంగా చెప్పింది… కొందరు జాతీయవాదులు అనవసర ప్రేమతో సినిమాను చూడండీ, చూడండీ అని సోషల్ మీడియాలో ప్రచారం చేసినా సరే ప్రేక్షకులు పట్టించుకోలేదు… చివరకు అలా అభిమాన ప్రచారాన్ని చేసిన ప్రేక్షకులు సైతం ఛీకొట్టేశారు అంతిమంగా… […]
అమ్మకానికి హాట్‌స్టార్… కాదంటే ఏదైనా బలమైన గ్రూపుతో పొత్తు…
హాట్ స్టార్ – వాల్ట్ డిస్నీ తెలుసు కదా… ఓటీటీ, పలు భాషల్లో సినిమాల రిలీజ్, వెబ్ సీరీస్, వీడియో ఆన్ డిమాండ్… చాలా పాతుకుపోయింది వినోదరంగంలో… ఇప్పుడిది మాంచి బలమైన మూలాలున్న జాయింట్ వెంచర్ భాగస్వామి కోసం అన్వేషిస్తోంది… అసలు వీలయితే అమ్మేయాలని అనుకుంటోంది మంచి పార్టీ దొరికితే… విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన ఓ నివేదిక ప్రకారం… ఈ ప్రయత్నాలు చాలా ప్రాథమిక దశలోనే ఉన్నయ్… ఇంకా ఏ […]
వెండి తెరపై వెలగబోయే సితార… తల్లి వేయించే అడుగులు అటువైపేనా..?!
మిత్రుడు Rajasekhar Reddy… రాసిన ఓ పోస్టు చదువుతుంటే… అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల సినిమాల్లోకి రాకుండా, హీరోయిన్గా చేయకుండా అభిమానులు అడ్డుపడిన తీరు గుర్తొచ్చింది… ఫ్యాన్స్ అభిప్రాయానికి తలొగ్గిన కృష్ణ బిడ్డను సినిమాల్లోకి రానివ్వలేదు… కానీ ఓ హీరోయిన్ నమ్రతను తన కొడుకు మహేశ్ పెళ్లి చేసుకోకుండా మాత్రం కృష్ణ అడ్డుకోలేదు… ఇష్టమో, అయిష్టమో గానీ మహేశ్ నిర్ణయానికి సమ్మతించాడు… ఫ్యాన్స్ కూడా పెద్దగా వ్యతిరేకించలేదు… ఇప్పుడు మహేశ్ కూతురు సితారను భావి హీరోయిన్గా […]
హడలగొట్టే భయంకరంగారావు… హాయిగొలిపే టింగురంగారావు…
నట చిరస్వీ…. రంగారావు ఎస్వీ…. జులై 18 ఎస్వీఆర్ 49 వ వర్ధంతి… నట యశస్వి ఎస్వీ రంగారావు నటనలో నిజంగా యశశ్వినే. ఆయన పరమపదించి నలబై తొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యింది. 1974 లో ఇదే రోజున కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన పాత్రలు చిరస్థాయిగా నిలుస్తున్నాయి. ఆయన నటనకు ఈ తరం సైతం ముగ్దులవుతున్నారు. అనేక పాత్రలను అవలీలగా పోషించిన రంగారావును స్మరించుకుంటూ డాక్టర్ పురాణపండ వైజయంతి రచన ఇది… స్వర్గలోకం సందడిసందడిగా ఉంది. చిత్రమేమిటంటే స్వర్గంలో […]
Narsapalle Song… ఒకే పాట 2 గొంతుల్లో, 2 సినిమాల్లో… ఒకటి చిరంజీవిది…
నర్సపల్లే… ఈ ఫోక్ సాంగ్ ఎంత పాపులరో తెలుసు కదా… యూట్యూబ్‌లో కోట్ల వ్యూస్… పాట పాడిన కనకవ్వ అకస్మాత్తుగా స్టార్ అయిపోయింది… పలు టీవీ ప్రోగ్రాముల్లో కూడా పాల్గొంది… మంగ్లితో కూడా కలిసి పాడింది… ఇప్పుడు తెలంగాణ పాట మీద కదా ఇండస్ట్రీ కన్ను… సరే, దాన్ని అలాగే తీసుకుని వాడుకుంటే పర్లేదు… కానీ తెలుగు ఇండస్ట్రీ తెలంగాణ పాటను అలా ఎందుకు స్వచ్ఛంగా ఎందుకు ఉంచుతుంది..? చిరంజీవి భోళాశంకర్ సినిమా వస్తోంది కదా… అందులో […]
పాపం పసివాడు సినిమా గుర్తుందా..? ఐతే ఇది చదవండి ఓసారి…
Bharadwaja Rangavajhala…… విరామచంద్ … టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టారరుల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన దేవుడు చేసిన మనుషులు . ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచీ వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. మన పాపులర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ ఆయనకు సమీప బంధువు. వి.రామచంద్రరావు సుదీర్ష సహాయ దర్శకత్వ అనుభవం తర్వాత […]
ఓహ్… ప్రభాస్ ప్రాజెక్ట్-కే సినిమాలో కే అంటే ఆ మహాభారత పాత్రా..?!
‘‘ఒక సైంటిఫిక్ ప్రపంచం… మానవాళికి ఓ పెద్ద విపత్తు సంభవిస్తుంది… మహాభారతం నుంచి కర్ణుడిని ఎత్తుకొస్తారు… భూమండలాన్ని రక్షిస్తారు… అదే ప్రాజెక్ట్ కే… అంటే కర్ణ…’’ ఇదీ ఆ సినిమా కథ అట… ఒకవైపు అమితాబ్ బచ్చన్, మరోవైపు కమల్ హాసన్… హీరో ప్రభాస్, హీరోయిన్ దీపిక పడుకోన్… దిశా పటాని… సూర్య కూడా అంటున్నారు గానీ డౌట్ ఫుల్… దేశం యావత్తూ అభిమానించే ఈ అతిరథ తారాగణం కొలువు తీరే సినిమా అంటే ఏమేరకు ఎక్స్పెక్టేషన్స్ […]
ఆ కలం కదిలితే హిట్టే… తెలుగు సినిమా మహామహులందరికీ ఇష్టుడు…
Bharadwaja Rangavajhala……… కాబట్టి మిత్రులారా … ఇప్పుడు మనం దాట్ల వెంకట నరసరాజు గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న ఆయన జయంతి. కె.వి.రెడ్డి విజయా బ్యానర్ లో పాతాళబైరవి తీసిన తర్వాత వాహినీకి పెద్దమనుషులు కమిట్ అయ్యారు. పింగళి విజయాలో రచయితగా జీతానికి చేరడంతో గత్యంతరం లేక చక్రపాణి అనుమతి కోరారు. ఆయన ఇవ్వలేదు. మీరు రచయితను ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని బెజవాడ నుంచి ఓ కొత్త రచయితను తీసుకువచ్చారు. ఆయన పేరు డి.వి.నరసరాజు. […]
వైష్ణవి చైతన్య… ఎక్కడి టిక్‌టాక్ వీడియోలు… ఎక్కడి సినిమా హీరోయిన్ చాన్స్…
ఆమే… అవును, ఆమే… వైష్ణవి చైతన్య… ఎందుకు లేరు తెలుగులో..? సరిగ్గా పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలే గానీ తెరపై బాగా రాణించగల సత్తా మన తెలుగమ్మాయిల్లో ఎందుకు లేదు..? ఉంది… కాకపోతే మన నిర్మాతలకు, డైరెక్టర్లకు కనబడి చావరు… వాళ్లకు ఎంతసేపూ తెల్లతోలు, ఎక్స్పోజింగ్, కమిట్మెంట్లు కావాలి… తెల్లతోలు తారలకు నటన రాకపోయినా పర్లేదు, పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, డబ్బు అడిగినంత ఇస్తే సరి… ఈ అమ్మాయే చూడండి… విజయవాడ… వైష్ణవి… అల వైకుంఠపురంలో […]
కాస్త అధిక శృంగార రసం… నర్తకి అనూరాధకు చిరంజీవితోపాటు పేరొచ్చింది…
ఇందాకే ఎవరో చెప్తుంటే విన్నాను … చిరంజీవి మగమహారాజు సినిమా విడుదలై నలభై ఏళ్లు అయ్యిందట. ఆ సినిమా విడుదలైనప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను. అప్పటి పీపుల్స్ వార్ లో పోస్ట్ మ్యాన్ ఉద్యోగంలో ఉన్నాను. విశాఖ నుంచీ నెల్లూరు వరకూ బెంగుళూరు మద్రాసు అప్పుడప్పుడు నాగపూర్ … నాగపూర్ లో సరోజ్ థియేటర్ బాగా గుర్తు. ఇలా దాదాపు రైళ్లల్లోనో బస్సుల్లోనో లారీల్లోనో బతికేస్తున్న రోజులవి. అలాంటి సమయంలో ఈ మగమహారాజు విడుదలైంది. నేను […]
ఒకప్పటి జాతీయ అవార్డుల విజేత… ప్చ్… మరీ ఇలా నాసిరకం ప్రదర్శనేమిటి..?
జీవితంలాగే సినిమా ఇండస్ట్రీ… ఎప్పుడు ఎవరు వెలిగిపోతారో, ఎప్పుడు ఎవరు మసకబారతారో చెప్పడం కష్టం… నీలకంఠ అనే దర్శకుడు గుర్తున్నాడా..? ఇరవై ఏళ్ల క్రితం షో అనే ఓ చిన్న సినిమాతో వెలుగులోకి వచ్చాడు… రెండు జాతీయ అవార్డులతో మనకొక మంచి దర్శకుడు వచ్చాడు అనే పేరు సంపాదించుకున్నాడు… ప్రత్యేకించి స్క్రీన్ ప్లే రచనలో భిన్నత్వాన్ని, కొత్తదనాన్ని చూపించాడు… తరువాత మిస్సమ్మ అనే మరో సినిమా వచ్చినట్టు గుర్తు… భూమిక పాత్ర బాగుంటుంది అందులో… తరువాత ఇంకొన్ని […]
ఆదిపురుష్ డైలాగ్ రైటర్ బేషరతు సారీ… బేశరం సారీ అని మళ్లీ ట్రోలింగ్…
మనోజ్ ముంతాషిర్… హిందీ సినిమాల్లో పాటలు, డైలాగులు రాస్తుంటాడు… ప్రతిష్టాత్మకమైన ఆదిపురుష్ సినిమాలో చెత్త డైలాగులు రాసింది ఇతనే… ప్రత్యేకించి హనుమంతుడికి తలతిక్క డైలాగులు రాశాడు… అదేమంటే, సమర్థించుకోవడానికి విఫల ప్రయత్నం చేశాడు… దేశమంతా తిట్టిపోస్తుంటే ఉల్టా వ్యాఖ్యలకు దిగాడు… నిజానికి ఆదిపురుష్ అట్టర్ ఫ్లాప్ కావడానికి ఈయన డైలాగులు కూడా ప్రధాన కారణమే… జనం ఛీకొట్టారు… అసలు ప్రభాస్ ఇలాంటి చెత్త టీమ్‌ను ఎందుకు నమ్మినట్టు..? ‘అసలు హనుమంతుడు దేవుడే కాదు, కేవలం భక్తుడు, మనమే […]
మరో మహిళా డెైరెక్టర్… పెద్ద బ్యానర్ దొరికితే ఇంకా రాణించే అవకాశం…
ఈమె గురించిన సమాచారం నెట్లో పెద్దగా దొరకదు… ఎవరు..? ఓ సాథియా సినిమా దర్శకురాలు దివ్య భావన… ఈమె ప్రముఖ కథారచయిత విజయేంద్రప్రసాద్ దగ్గర కొన్నాళ్లు పనిచేసింది… అదొక్కటే విశేషం కనిపిస్తుంది ఈమె గురించి..! నిజానికి ఇండస్ట్రీలో మహిళలు 24 క్రాఫ్ట్స్‌లో కనిపించేదే అత్యంత అరుదు… అంతా మగమయమే… ఒకవేళ ధైర్యంగా మహిళలు ఈ ఫీల్డులోకి వస్తే వివక్ష, అవమానాలు గట్రా కామన్… అసలు ఆడదాన్ని మనిషిగానే చూడని దుష్ట ఇండస్ట్రీ ఇది… అలాంటిది ఓడకు కెప్టెన్ […]
వేదిక మీదే హీరోయిన్‌పై పిచ్చి కూతలు… ధైర్యంగా ఎండగట్టిన జర్నలిస్టు…
రోబో శంకర్ అనే ఓ కమెడియన్ ఉన్నాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో… పార్టనర్ అనే సినిమాలో యాక్ట్ చేశాడు… నిర్మాతలు చెన్నైలో రీసెంటుగా ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించారు… సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆది, హన్సిక కూడా ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు… బాగా తాగి వచ్చాడేమో శంకర్… తనను ఏవో నాలుగు ముక్కలు మాట్లాడాలని నిర్వాహకులు కోరితే, వేదిక మీద హన్సిక మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేశాడు… తాగి ఫంక్షన్లకు వెళ్లడం, ఆడవాళ్లను కనీసం మనుషుల్లా […]
మమతా మోహన్‌దాస్… ఈ దొరసాని వైవిధ్యమైన పాత్రలో ఇరగదీసింది…
కథ రాముడి చుట్టూ తిరిగితే అది రామాయణం… అలా గాకుండా కథను రావణుడి చుట్టూ తిప్పుతూ, తననే బలంగా ఎలివేట్ చేస్తే..? నాయకుడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోతే..? అది రుద్రంగి సినిమా…! రావణుడు, దుర్యోధనుడు వంటి ప్రతినాయక పాత్రల్ని కూడా నాయక పాత్రలకు దీటుగా చూపించడం పాతదే… ఎన్టీయార్ ఏనాడో చేశాడు ఆ పని… ప్రేక్షకులు ఆమోదించి చప్పట్లు కొట్టారు కూడా… అయితే ఆ పాత్రల చిత్రణలో తమ నెగెటివ్ చర్యలకు, పోకడలకు జస్టిఫికేషన్ ఇచ్చే […]
రంగ‘బలి’… సత్య మెప్పించాడు… తనే ఓరకంగా హీరో… నాగశౌర్యకు మళ్లీ నిరాశే…
బ్రహ్మానందం లేని సినిమా అంటూ ఉండేది కాదు… తెలుగు సినిమాకు బ్రహ్మి ఓ సెంటిమెంట్‌గా వెలిగిపోయాడు కొన్నాళ్లు… విపరీతమైన డిమాండ్… రాజబాబు తరువాత ఎందరో కమెడియన్లు వచ్చిపోయినా బ్రహ్మి ఓ స్టార్డం ఎంజాయ్ చేశాడు… మధ్యమధ్య సునీల్ కామెడీ ఆకట్టుకునేది… మొనాటనీతో బ్రహ్మానందం కామెడీతో విసిగిపోయిన ప్రేక్షకుల మీదకు నిర్మాతలు, దర్శకుడు వెన్నెల కిషోర్‌ను రుద్దారు… బ్రహ్మీ తెరమరుగయ్యాడు… తను మెరిట్ ఉన్న నటుడే అయినా ఓ మూస పాత్రలు, మూస నటన… చూసీ చూసీ జనానికి […]
Time Travel… మూస కథలకు భిన్నంగా 7.11 పీఎం మూవీ… నాట్ బ్యాడ్, పర్లేదు…
అప్పట్లో విఠలాచార్య తీసిన సినిమాలు ఓసారి గుర్తుకుతెచ్చుకుందాం… ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ అప్పట్లో లేదు, వీఎఫ్ఎక్స్ లేదు… ఐనా సరే, సినిమాల్లో ట్రిక్కుల దృశ్యాలు అనగా మన కళ్లను మాయచేసే ఎన్నో చిత్రీకరించాడు… అనేక సినిమాలు హిట్… ఈ సీన్లకన్నా కథ చెప్పే తీరుతో ఆకట్టుకునేవాడు… అంతెందుకు..? ఆదిత్య 369లో గ్రాఫిక్స్ ఏమున్నాయని..? సినిమా సూపర్ హిట్… కారణం :: కథ చెప్పే విధానమే… రోబో సినిమా గ్రాఫిక్స్ ప్రధానమే కానీ మహేశ్ నాని, సూర్య 24 […]
నది కోసుకుపోతున్న నావను ఆపండీ… రేవు బావురుమంటోందని…
Bharadwaja Rangavajhala….. పడవ పాటలు… తెలుగు సాహిత్యంలోనూ జానపద సంగీతంలోనూ చాలా పాపులర్ జాలర్ల పాటలు. పడవ నడిపేటప్పుడూ చేపలు పట్టేటప్పుడూ ఇలా పడవ మీద పనిచేసే ప్రతి సందర్భంలోనూ జాలర్లు పాటలు పాడుతూనే ఉంటారు. శ్రమ మరచిపోయేటట్టు చేసేదే పాట. శ్రమైక జీవన సౌందర్యమే పాట. పడవ పాట అనగానే ఠక్కున గుర్తొచ్చేది సంపూర్ణ రామాయణంలో ఘంటసాల వారు గానం చేసిన కొసరాజు సాహిత్యం. రామయ్య తండ్రీ అంటూ గుహుడు పాడతాడీ గీతాన్ని.. కొసరాజు రాఘవయ్య […]
- « Previous Page
- 1
- …
- 56
- 57
- 58
- 59
- 60
- …
- 126
- Next Page »