‘‘నేనొకరి ఇంటికి ఈమధ్య భోజనానికి వెళ్లాను, తను చెబుతున్నాడు, ఆర్ఆర్ఆర్ తప్ప అసలు థియేటర్లో సినిమా చూసి చాలాకాలమైంది అని… అన్నీ ఎంచక్కా ఓటీటీలో చూసేస్తున్నారు… ఓటీటీ ప్రభావం అది…’’ తెలుగు సినిమాను శాసించే సిండికేట్‌లో కీలకవ్యక్తి దిల్ రాజు చెప్పిన మాటే ఇది… ఆర్కే ఓపెన్ హార్ట్‌లో మాట్లాడుతూ ఒక లెక్క చెప్పాడు… అది సినిమా భవిష్యత్తును చెప్పబోతోంది… ‘‘గతంలో 20 శాతం వరకూ నాన్- థియేటరికల్ రెవిన్యూ ఉండేది… మ్యూజిక్ రైట్స్ ఎట్సెట్రా… మిగతా […]
మరో క్రైమ్ థ్రిల్లర్… ఈ జానర్ ఇష్టపడేవాళ్లకు వోకే… శేషు టార్గెట్ కూడా వాళ్లే…
ఎన్నోసార్లు చెప్పుకున్నదే… కథ పాతదైతేనేం, కొత్తగా చెప్పు… లేదా కొత్త కథ చెప్పు… హిట్-2 సినిమాలోని కథలాంటివి ప్రపంచవ్యాప్తంగా బోలెడు సినిమాల్లో వచ్చాయి… సైకో కిల్లర్ కథలు అత్యంత పురాతన సబ్జెక్టు… పైగా ఇన్వెస్టిగేషన్, సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఎప్పుడూ చూసే జానరే… టీవీల్లో, వెబ్ సీరీస్‌లో కూడా ఇలాంటి కథలు బోలెడు… అదేదో హిందీ చానెల్లో డిటెక్టివ్ సీరీస్ చాలా ఫేమస్ కూడా… ఇవన్నీ చూసినప్పుడు హిట్-2 ఓ సాదాసీదా ప్రయత్నమే అనిపిస్తుంది… పైగా ఏడు […]
ఎంతగా బంపర్ హిట్టయితేనేం… కార్తికేయుడిపై సీతారాముడిదే పైచేయి…
నిజానికి ఇదేమీ నిఖిల్, దుల్కర్ నడుమ పోటీ ఏమీ కాదు… కాకపోతే పోలిక తప్పకుండా వస్తుంది… ఎందుకంటే..? సీతారామం, కార్తికేయ-2 రెండూ వేర్వేరు జానర్లు… సీతారామం వైజయంతి మూవీస్ వాళ్లది… స్వప్న దగ్గరుండి కథను, కథనాన్ని, పాటల్ని, షూటింగ్‌ను చూసుకుంది… అశ్వినీదత్ డబ్బు పెట్టలేక కాదు, ఐనా సరే, ఎక్కడెక్కడో తిరిగి, షూటింగు కంప్లీట్ చేసి, 30 కోట్లతో సినిమాను పూర్తి చేయించింది ఆమె… కొందరికి నచ్చకపోవచ్చుగాక… కానీ స్థూలంగా సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది… […]
ఆఫ్టరాల్ న్యూటన్… యాపిల్ ఎలా పడుతుందో కనిపెట్టాడు… కానీ ఈ మనిషి…
నిజానికి చిట్‌చాట్‌కైనా సరే… ఒక రాఘవేంద్రరావు, ఒక దగ్గుబాటి సురేష్, ఒక కోదండరాంరెడ్డి, ఒక అల్లు అరవింద్… వీళ్లు దొరికితే ప్రతి ఒక్కరిదీ విడివిడిగా దున్నేయాలి… ఒక్కచోట కలిపితే మిర్చి బజ్జి, కడక్ జిలేబీ, రగడా సమోసా, చికెన్ కబాబ్ కలిపి ఖైమా చేసినట్టు ఉంటుంది… ఏ టేస్టూ సపరేటుగా తెలియదు… అసలు ఆ కలయికే కుదరదు… నో, నో, బాలయ్యకు అవేమీ చెప్పొద్దు… అదంతా గుడ్డెద్దు చేలో పడ్డ యవ్వారం… 90 ఏళ్ల తెలుగు సినిమా […]
లైగర్ చుట్టూ గట్టిగానే బిగుస్తోంది… బాలీవుడ్‌కూ సెగ తాకుతోంది…
ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూరుకుపోతున్నారు… రష్మిక తనకు అవసరం లేని వివాదాల్ని నెత్తికి చుట్టుకుంటూ కూరుకుపోతోంది… విజయ్ దేవరకొండను మనీ లాండరింగు కింద ఈడీ గట్టిగానే బిగిస్తోంది… ఆ పిచ్చిది అనవసరంగా రిషబ్ అండ్ గ్యాంగును గోకుతోంది… పాతవన్నీ మనసులో పెట్టుకుని వాళ్లను రెచ్చగొడుతూ ఉంది… అవన్నీ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం… కన్నడ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు ఇప్పటికీ ఆమె మీద మంట మీద ఉన్నారు… ఆమె నటించిన రెండు సినిమాలపై కర్నాటకలో నిషేధం అనే ప్రతిపాదన ఇంకా […]
ఈమె కాంచన కాదు, కంగనా… లారెన్స్, ఈమె మరీ జగమొండి చంద్రముఖి…
రజినీకాంత్ చంద్రముఖి సీక్వెల్లో కంగనా రనౌత్… ఇదీ వార్త… ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కూడా… కాబట్టి కన్ఫరమ్… ఫాఫం, రాఘవ లారెన్స్‌కు ‘‘కాంచన నష్టాలు కమ్ కంగనా కష్టాలు’’ తప్పేట్టు లేవు… ఈ చంద్రముఖిని తట్టుకోవడం కష్టమే… నిజానికి గత జూన్ నుంచే కాదు, అంతకుముందు నుంచే చంద్రముఖి సీక్వెల్ అని ఎవరెవరో చెబుతున్నారు… కానీ లారెన్స్ ప్రధానపాత్రలో నటిస్తాడు అని ప్రకటించాక క్లారిటీ వచ్చింది… కాంచనలోలాగే ఓ ఆడవేషం వేసుకుని, తనే రాజనర్తకి […]
సుధీర్ సక్సెస్… ఆఫ్టరాల్ టీవీ కమెడియన్ అని వెక్కిరించిన నోళ్లకు మూత..!
మహేశ్ బాబు కెరీర్ మొదట్లో ఒకటీరెండు సినిమాలు సరిగ్గా నడవకపోతే, పత్రికల్లో విమర్శలు వస్తే… హీరో కృష్ణ ఓ జవాబు చెప్పాడు… ఒక సినిమా హిట్ కావాలన్నా, ఫెయిల్ కావాలన్నా చాలా కారణాలు ఉంటయ్… కానీ నేను చూస్తున్నది మహేశ్‌ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేశారా లేదానేది మాత్రమే… చేశారు, అది చాలు… ఒక మంచి పాత్ర పడితే తన కెరీర్ అదే పికప్ అవుతుంది… ఇదీ తన విశ్లేషణ… వర్తమానానికి వద్దాం… ఒక కమెడియన్, అందులోనూ […]
ఇజ్రాయిల్ ఎందుకలా సీరియస్‌గా రియాక్టయి, ఆ నిర్మాతకు గడ్డి పెట్టింది..!!
ప్రపంచంలో అత్యంత ఘోరమైన ఊచకోతలకు గురైన జాతి యూదులు… holocaust… ఏ దేశం వెళ్లినా కష్టాలే… కేవలం భారతదేశమే వాళ్లను కడుపులో పెట్టుకుంది… తరువాత వాళ్లకూ ఓ దేశం ఏర్పడింది… దాని రక్షణకు వాళ్లకు నిత్యసమరమే… అలాంటి యూదుల్లో పుట్టిన ఓ ఇజ్రాయిలీ సినిమా కేరక్టర్ నాదవ్ లాపిడ్ కాశ్మీర్లో కూడా ప్రజలు అలాంటి ఊచకోతలకు గురయ్యారనే నిజం, ఆ నిజాన్ని చిత్రీకరించిన ది కశ్మీరీ ఫైల్స్ సినిమా నచ్చలేదు… వల్డర్, ప్రాపగాండా అని వ్యాఖ్యానించాడు… మన […]
సిద్ధరామయ్య బయోపిక్… ఆ పాత్రలో విజయ్ సేతుపతి… ఇమేజీ బిల్డింగ్ పాట్లు…
కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..? మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి […]
ఈమె కూడా ఓ గంధర్వగాయని..! కానీ ఆ ఇద్దరికే దక్కిన తెలుగు అభిమానం..!
తెలిమంచు కరిగింది, తలుపు తీయనా ప్రభూ అంటూ టీవీలో ఓ గీతం స్వరమాధుర్యాల్ని వెదజల్లుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చింది… కళ్లు మూసుకుని ఆ తదాత్మ్యంలోనే కాసేపు మునిగీ తేలాక, పాట ఆగింది… కాసేపు శూన్యం… ఎంతటి శ్రావ్యత… ఏదో టీవీలో పొద్దున్నే వాణిజయరాం పాటల మీద ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది… అదీ నిద్రలేపింది… నీ దోవ పొడవునా కువకువల స్వాగతం, నీ కాలి అలికిడికి మెళకువల వందనం… దొరలని దొరనగవు దొంతరని, తరాలని దారి తొలిగి […]
కథలో దమ్ముంటే ఇదీ హవా… మూడు విదేశీ భాషల్లోకి రీమేక్…
ఒక వార్త… దృశ్యం సినిమాను ఇండినేషియన్ భాషలోకి రీమేక్ చేయబోతున్నారు… దృశ్యం అంటే ఒరిజినల్ దృశ్యం-1… సీక్వెల్ కాదు… 2019లో కావచ్చు, చైనా మాండరిన్ భాషలోకి రీమేక్ చేశారు… మన సినిమాల్ని మాండరిన్‌లోకి డబ్ చేసి, కోట్లకుకోట్ల వసూళ్లు చూపించుకున్న సినిమాలు ఉన్నయ్… కానీ రీమేక్ అయిన మొట్టమొదటి ఇండియన్ సినిమా… ఆ సినిమా పేరు వు షా… అంటే రఫ్ అర్థం నరహత్య… దానికి ఇంగ్లిష్ వాయిస్ పెట్టేసి Sheep Without Shepherd అని పేరు […]
శృతి కలవని కలయిక… పట్టాలు తప్పిన బాలయ్య అన్‌స్టాపబుల్ షో…
చక్కగా, సాఫీగా, విజయవంతంగా, బాలయ్య కొత్త ముఖచిత్రాన్ని చూపిస్తూ సాగిపోతున్న అన్‌స్టాపబుల్ షోను సాక్షాత్తూ బాలయ్యే పట్టాలు తప్పించేశాడు… ఫలితంగా ఒక్కసారిగా నిస్సారంగా తయారై, చిరాకు లేవనెత్తింది మొన్నటి ఎపిసోడ్… అసలు ఈ సీజన్2 మొత్తం అలాగే ఉంది… మరీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి, నటి రాధికలతో చేసిన మొన్నటి ఎపిసోడ్ ఎందుకు అంత నాసిరకంగా మారింది..? ఫ్యూజన్… పాలిటిక్స్‌లోని సీరియస్నెస్నూ, సినిమా ఫీల్డ్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్‌నూ కలిపి శృతిచేయడం చాలా కష్టం… కర్నాటక […]
ఇప్పటికీ… ఎప్పటికీ… తెలుగు సినిమా తెరకు ఏకైక హీరో ఈయనే… లా జవాబ్…
పార్ధసారధి పోట్లూరి …… చిత్ర పరిశ్రమకి సంబంధించి ఒకే ఒక్క లెజండ్ లేదా దిగ్గజ నటుడు ఉంటాడు ఎప్పటికీ ! తెలుగు చిత్రసీమకి సంబంధించి ఒకే ఒక్క లెజెండ్ ఉన్నారు ! ఆయన సామర్ల వెంకట రంగా రావు గారు SVR! ‘మెథడ్ యాక్టింగ్’ కి ఆద్యుడు భారత చలనచిత్ర సీమకి ! Yes. మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటో అసలు ఎవరికీ తెలియని రోజుల్లో సహజంగానే కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు SVR పుట్టుకతో అబ్బిన […]
ఇంత పెద్ద తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరే రియల్ హీరోలా…? మిగతావాళ్లు దద్దమ్మలా..?!
మంచు కుటుంబం మాట్లాడే తీరు పట్ల తెలుగుజనంలో బాగా వ్యతిరేకత ఉండవచ్చుగాక… కేవలం ఆ వ్యతిరేకత కారణంగానే మొన్నటి జిన్నా సినిమా కోటిరూపాయలు కూడా సంపాదించలేక స్క్రాప్‌లో కొట్టుకుపోయి ఉండవచ్చుగాక… కానీ ఇవ్వాల్టి దినానికి తెలుగులో తనొక్కడే హీరో… తనతోపాటు నిఖిల్… మిగతా హీరోలు పేరుకే… వెన్నెముకల్లేవు… బుర్రలు అసలే లేవు అనే విమర్శలు వస్తున్నాయి…. ఆమె ఎవరో రిచా చద్దా అట… భారతీయ సైన్యాన్ని వెక్కిరిస్తూ ఏదో పిచ్చి ట్వీట్ కొట్టింది… ఈజీ కదా… పాకిస్థాన్, […]
అవతార్-2… జాతర షురూ… ప్రీమియం ఫార్మాట్ టికెట్లకు భారీ స్పందన…
కనీసం 16, 17 వేల కోట్ల వసూళ్లు ఉంటే తప్ప అవతార్-2 బ్రేక్ ఈవెన్ రాదు అన్నాడు కదా జెమ్స్ కామెరూన్… ప్రపంచ సినిమా చరిత్రలో బిజినెస్ కోణంలో అత్యంత చెత్తా ప్రాజెక్టుగా చెప్పబడుతున్న ఈ సినిమాపై మంచి హైప్ అయితే వచ్చింది… ఇంకా పెరుగుతోంది… జాతర ఆరంభమైంది… ఇంకా 3 వారాల టైమ్ ఉన్నా సరే… ఇండియాలో అప్పుడే టికెట్ల బుకింగ్ స్టార్టయింది… 3 రోజుల క్రితం 45 స్క్రీన్లలో ప్రీమియం ఫార్మాట్ టికెట్లు అమ్మకానికి […]
తమిళులకు మాత్రమే నచ్చిన ‘అతి’… తెలుగులో ఇప్పుడు ‘లవ్ టుడే’గా…
ఆటుపోట్లకు గురవుతున్న దిల్ రాజు మొత్తానికి ఒక సినిమాపై అసాధారణ హైప్ క్రియేట్ చేయడంలో సక్సెసయ్యాడు… 5 కోట్లతో తీసిన సినిమా 60 కోట్లు వసూలు చేసిందీ అనే పాయింట్ సహజంగానే సినిమా పట్ల ఓ పాజిటివిటీని పెంచుతుంది… రిలీజుకు ముందే లవ్ టుడే సినిమా హిట్ అని కూడా బోలెడు స్టోరీలు అర్జెంటుగా వండబడ్డాయి… తీరా చూస్తే సోసో సినిమా… నిజానికి యూత్ కనెక్టవుతారనేది కూడా భ్రమే… చెప్పుకుందాం… ఈ సినిమా వరల్డ్ వైడ్ 66 […]
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ… జస్ట్, ఆహ్వానితులకు మాత్రమే ప్రవేశం…
సూపర్ స్టార్ కృష్ణ… ఎంత గొప్పగా బతికి పోయాడు… కానీ తన అంత్యక్రియలు, ఊరేగింపు దగ్గర నుంచి ప్రతి విషయంలో మరణానంతరం అభిమానుల్ని కలుక్కుమనిపించే సీన్లు… అవన్నీ మళ్లీ లంబా చోడా ఇక్కడ చెప్పుకోలేం కానీ… ఫాలో కానివాళ్లు ఉంటే కాస్త దిగువన ఇచ్చిన ‘ముచ్చట’ లింక్ చదవండి… అసలు విషయం మొత్తం అర్థం అయిపోతుంది… ఇక ఇప్పటి సంగతి చెప్పుకుందాం… ఈమధ్యకాలంలో మనం ఇద్దరి కర్మకాండ, ఏర్పాట్లు, ఘనమైన వీడ్కోళ్లు చూశాం… ఒకటి కృష్ణం రాజు […]
కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
గొప్ప దర్శకులైనంత మాత్రాన… తీసిన ప్రతి సినిమా గొప్పగా ఉండకపోవచ్చు, ఉండాలని లేదు… కొన్నిసార్లు కోతిని చేయబోతే కొండెంగ కావచ్చు కూడా… సినిమా అంతా అద్భుతంగా ఉండి ఒకటోరెండో సీన్లు, సాంగ్స్ చికాకు పెట్టవచ్చు… ఎస్, బాపు గొప్ప చిత్రకారుడు… ఒక చిత్రాన్ని, ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక దృశ్యాన్ని చిత్రిక పట్టడంలో కుంచెలు తిరిగినవాడు… కానీ భక్తకన్నప్పలో ఓ సూపర్ పాటను సరిగ్గా టాకిల్ చేయలేదేమో, అంటే చిత్రీకరణలో తన మార్క్ చూపించలేక, చివరకు అలా […]
నో… ఆ కోర్టు స్టే ఎత్తేసినా సరే… వరాహరూపం ఒరిజినల్ పాట పెట్టలేరు…
కాంతార కేసులో ఓ ట్విస్టు… వరాహరూపం పాట కేసు తెలుసు కదా… అది మా ప్రైవేటు ఆల్బం నుంచి కాపీ చేశారని మలయాళ మ్యూజిక్ కంపెనీ థైకుడం బ్రిడ్జి కాంతార నిర్మాతలపై కేసు వేసింది… అది ఆ పాట వాడకుండా స్టే విధించింది… కాంతార నిర్మాతలు హైకోర్టుకు వెళ్లినా సరే మొన్ననే కదా హైకోర్టు కొట్టేసింది… దాంతో విధిలేక మరో ప్రత్యామ్నాయ ట్యూన్లో అదే కంటెంటును ఓటీటీ వెర్షన్లో పెట్టారు… ఒరిజినల్ తొలగించారు… సదరు థైకుడం బ్రిడ్జి […]
న్యూటన్ సినిమా చూసినట్టే ఉంది డైరెట్రూ… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
సినిమా ప్రియులకు గుర్తుండే ఉంటుంది… అయిదేళ్ల క్రితం హిందీలో న్యూటన్ అనే సినిమా వచ్చింది… అప్పట్లో సూపర్ హిట్… 9, 10 కోట్ల ఖర్చుకు గాను 80 కోట్లు వసూలు చేసింది.,.. అప్పట్లో ఈ పాన్ ఇండియా కల్చర్ ఇంతగా ఇంకలేదు కదా… వదిలేశారు… కానీ దర్శకుడు ఏఆర్మోహన్ ఆ సినిమాలోని వోటింగ్ మెషిన్, టీచర్ ఎట్సెట్రా పార్ట్‌ను ఎత్తేసి, ఇక తనదైన కథను చుట్టూ అల్లుకున్నాడు… ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే పేరుతో తెలుగులో రిలీజైంది […]
- « Previous Page
- 1
- …
- 79
- 80
- 81
- 82
- 83
- …
- 126
- Next Page »