ఓ పెద్ద ఉపోద్ఘాతానికి వెళ్దాం… కొన్ని సినిమాల పోస్టర్లు గమనిస్తే… ట్రెయిలర్లు చూస్తే… వార్తలు చదివితే ఇంట్రస్టింగుగా అనిపిస్తాయి… సరే, ఇదేదో సినిమా బాగానే ఉండేటట్టుంది అనుకుంటాం… తీరా థియేటర్‌కు వెళ్తే అది మన ఉత్సాహాన్ని తుస్సుమనిపిస్తుంది… లక్ష్మి బాంబు అనుకున్నది కాస్తా తోకపటాకలా జస్ట్ టప్మంటుంది… 18 పేజెస్ సినిమా అదే… సుకుమార్ రైటింగ్, అల్లు అరవింద్ సమర్పణ, బన్నీ వాసు నిర్మాణం… ఫస్ట్ నుంచీ ఆ సాంగ్స్, ఆ వార్తలు, ఆ ట్రెయిలర్లు భిన్నంగా […]
ఎన్ని సీన్లు రీషూట్ చేసినా… సెట్ కాలేదు..! ఆ 18 పేజీలూ జస్ట్ పర్లేదు…
అనుపమ పరమేశ్వరన్… ఈ మలయాళీ నటి ఏడేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది… ఎక్కువగా తెలుగు సినిమాలే… లీడ్ రోలే కావాలని ఏమీలేదు… ఏ రోల్ ఇచ్చినా చేస్తుంది… నటన, అందం, అనుభవం ఉన్నా కానీ ఎందుకో రావల్సినంతగా పేరు, అవకాశాలు రావడం లేదేమో అనిపిస్తుంది… కార్తికేయ-2తో పాన్ ఇండియా రేంజులో పరిచయం అయ్యింది… ఇప్పుడు 18 పేజెస్ సినిమాతో అదే హీరో నిఖిల్‌తో కలిసి వచ్చింది… నిజానికి ఆమె ఉన్నంతసేపూ ప్లజెంటుగా కనిపిస్తుంది… కార్తికేయ-2లో ఏదో కథాకథనాల బలంతో, […]
నటనలో… కథలో… సినిమా పోకడలో… అదే మొనాటనీ… అదే రొటీన్ ఫార్ములా…
పలు సినిమాల్లో అవకాశాల కోసం తిరిగీ తిరిగీ… నలిగీ నలిగీ… చివరకు మందలో ఒకడిగా నటించిన రోజుల నుంచి హీరోగా రవితేజ ప్రస్థానం చిన్నదేమీ కాదు… ఏ పాత్ర దొరికితే ఆ పాత్ర… కష్టపడేవాడు… నా ఆటోగ్రాఫ్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం వంటి సినిమాలు ఒకప్పుడు… తరువాత ఇమేజీ బందిఖానాలోకి చేరిపోయాడు… ప్రత్యేకించి రాజమౌళి విక్రమార్కుడు సినిమా తనను పెద్ద హీరోను చేసేసింది… ఇక ఆ తరువాత రవితేజ అంటే మొనాటనీ… ఫార్ములా… రొటీన్… తను ఏం […]
ఈ సంపూర్ణ నటుడికి గౌరవప్రదమైన తుది వీడ్కోలు పలకండర్రా కనీసం..!!
నిజంగా కైకాల సత్యనారాయణకు రావల్సినంత గుర్తింపు దక్కిందా..? ఎందుకో దక్కలేదనే అనిపిస్తోంది… ఒక ఎస్వీరంగారావులాగే తనూ వివక్షకు గురయ్యాడా..? 62 ఏళ్లపాటు సినిమా సెట్లలో ఉండి, 777 సినిమాలు చేయడం చిన్న విషయం ఏమీ కాదు… ఎప్పుడో 1959లో మొదలైన కెరీర్ మూడేళ్ల క్రితం నాటి మహర్షి వరకు… ఈ సంఖ్య అనితరసాధ్యం… కొందరికి మినహా… మరి ఆయనకు దక్కిన పురస్కారాలు..? ప్చ్, చెప్పదగినవేమీ లేవు… నిజానికి తను మొదట్లో హీరో… ఎన్టీయార్, ఏఎన్నార్లాగు స్ఫురద్రూపం… డైలాగ్ […]
ఓహ్… కాంతార రెండో భాగంపై అనుకోని ట్విస్టులు… శివ తండ్రి కథ అట…
ఒక వార్త ఇంట్రస్టింగుగా అనిపించింది… అందరూ కాంతార సీక్వెల్ గురించి అడుగుతున్నారు, రాస్తున్నారు కదా… తనలో రకరకాల ఆలోచనలు ఉన్నాయని, అవి ఇంకా ఓ ఫైనల్ షేప్‌కు రాలేదని రిషబ్ శెట్టి చెప్పి తప్పించుకుంటున్నాడు… ఈమధ్య పీటీఐతో మాట్లాడుతూ కాంతార నిర్మాత విజయ్ కిరంగదూర్ ‘‘కాంతార -2 ఉంటుంది… ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేను… అంతేకాదు, అది సీక్వెలా, ప్రీక్వెలా కూడా తేల్చుకోవాల్సి ఉంది…’’ అన్నాడు… హఠాత్తుగా తన నోటి వెంట ప్రీక్వెల్ మాట వచ్చేసరికి… ఇక అందరి […]
లాఠీతో విరగబాదిన విశాల్… అటు ఆకు రౌడీలను, ఇటు ప్రేక్షకులను…
కొందరు హీరోలు…., కాదులెండి… నటులు… అస్సలు మారరు… మారడానికి ప్రయత్నించరు… కాలం ఎంత మారినా వాళ్లు మారాలనే తపన ప్రదర్శించరు… అదే రొటీన్, రొడ్డుకొట్టుడు, ఫార్ములా, ఇమేజ్, చెత్తా కథలతో ప్రేక్షకులతో దాడి చేస్తూనే ఉంటారు… ఒరే నాన్నా… లోకం చాలా మారిందిరా, కాస్త నువ్వూ మారొచ్చు కదా అంటే వినరు… మరింత ఇరగబాదుతారు… లాఠీ సినిమా కూడా అదే… నిజానికి లాఠీ సినిమా ట్రెయిలర్ చూసినప్పుడే ఆ సినిమా మీద ఓ అభిప్రాయం ఏర్పడింది… కాపురం […]
ప్చ్… ఒయిజా బోర్డుతో ఆత్మతోపాటు ప్రేక్షకులు కూడా ‘కనెక్ట్’ కాలేదు…
ఓయిజా బోర్డు… OUIJA Board… ఆత్మలను పిలిచి మాట్లాడే ఓ మార్గం… నమ్మేవాళ్లు నమ్ముతారు… లేదంటే లేదు… దీని మీద చాలా కథలు, సినిమాలు వచ్చాయి… ఆ బోర్డు మీదకు వచ్చే ఆత్మలు డిస్టర్బ్ అవుతే వెళ్లిపోతాయి తప్ప వికటించి, ఆడేవాళ్లను ఆవహించవు… ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే… నయనతార ప్రధాన పాత్రలో కనెక్ట్ అనే సినిమా వచ్చింది… అందులో మరణించిన తన తండ్రి ఆత్మతో మాట్లాడాలని ఓయిజా బోర్డు ద్వారా ప్రయత్నిస్తుంది ఓ బిడ్డ… కానీ […]
ఉట్టికి ఎగిరారు సరే… ఆకాశానికి ఎగరలేక చతికిల..? పుష్ప ఫ్లాప్ కథ..!
ఆర్ఆర్ఆర్ జపాన్ భాషలోకి అనువదింపబడుతుంది… మస్తు హిట్ అవుతుందని ఏదో లెక్క చెబుతారు… పలు ఇండియన్ సినిమాలు చైనా భాష (మాండరిన్)లోకి అనువదింపబడతాయి… వేల కోట్లు వసూలు చేసినట్టు లెక్కలు చెబుతారు… పాన్ వరల్డ్ సినిమాల్లాగా ప్రచారం జరుగుతుంది… నిజంగా ఇండియన్ సినిమాను దేశదేశాల ప్రజలు అంత ఇష్టపడుతున్నారా..? ఈ పిచ్చి ఫైట్లు, ఈ తిక్క పాటల్ని నెత్తిన పెట్టుకుంటున్నారా..? లేక ఈ డబ్బింగుల పేరిట హవాలా, మనీలాండరింగు ఏమైనా జరుగుతోందా..? ఈడీకి ఇవెందుకు పట్టవు..? ఎంతసేపూ […]
నిజానికి ఫస్ట్ మార్చాల్సింది ఈ బిగ్‌బాస్ చెత్తా టీంను… హోస్టును కాదు…
నాగార్జునలో ఉన్న బ్యూటీ ఏమిటంటే..? ఈ వయస్సులో కూడా ఆ స్టామినా మెయింటెయిన్ చేయడం ఒక్కటే కాదు… బిగ్‌బాస్ హౌజులో ఉన్నవాళ్లతో మాట్లాడేటప్పుడు ఎక్కడా పొల్లు మాట మాట్లాడడు… కానీ కమాండ్ ఉంటుంది… నవ్వే చోట నవ్వుతూ, సీరియస్‌గా ఉండేచోట అలాగే ఉంటూ… సరదాగా ఆడిస్తూ… పర్ఫెక్ట్ ప్రోగ్రాం హోస్ట్ తను… సీనియర్ నటుడు, ఓ స్టూడియో అధినేత, ఇద్దరు హీరోల తండ్రి, ఈరోజుకూ కాస్తోకూస్తో హీరోగా డిమాండ్… అలా సహజంగానే నాగార్జున మాట్లాడుతుంటే హౌజులో ఉన్న […]
కాంతార హీరో కమ్ దర్శకుడు రిషబ్ శెట్టి తప్పుచేసింది ఎక్కడ అంటే..?
16 కోట్ల బడ్జెట్ సినిమా… అనితరసాధ్యమైన రీతిలో తెరకెక్కించాడు… దర్శకుడు తనే… హీరో తనే… సినిమా ఓ కొత్త చరిత్ర సృష్టిస్తూ 460 కోట్లు వసూలు చేసింది… కానీ కాంతార దర్శకుడు రిషబ్ శెట్టికి దక్కిందేమిటి..? హొంబళె ఫిల్మ్స్ వాళ్లు రిషబ్ శ్రమను, ప్రయాసను, క్రియేటివిటీనీ లైట్ తీసుకున్నారా..? రిషబ్ శెట్టికి దక్కింది ముష్టి మాత్రమేనా..? ఇదీ కన్నడ మీడియాలో కొత్త చర్చ… ఈ చర్చ ఉద్దేశపూర్వకమా..? నిజంగానే రిషబ్ శెట్టికి అన్యాయం జరిగిందా..? నిజానికి రిషబ్ […]
నీవేమో విలువైన పైసలు.., వేరే నిర్మాతలవి పెంకాసులా నయనతారా..?!
ఎంత తోపు హీరోతో నటించినా సరే… ఎంత భారీ సినిమా అయినా సరే… ఎంత పెద్ద బ్యానర్ అయినా సరే… ప్రమోషన్ వర్క్‌కు, అంటే ప్రిరిలీజ్ ఫంక్షన్లు, ట్రెయిలర్ రిలీజులు, ఆడియో రిలీజులు, పోస్టర్ రిలీజులు గట్రా ప్రోగ్రాములకు నయనతార హాజరయ్యేది కాదు… ససేమిరా… సైట్లు, మీడియా, యూట్యూబర్ల ఇంటర్వ్యూలకు కూడా నో చెప్పేది… ఒకసారి సినిమా షూటింగ్ అయిపోయిందంటే ఖతం… ఇక అది ఏమైపోయినా తనకు పట్టేది కాదు… సైరా, గాడ్‌ఫాదర్ సినిమాలకు కూడా సింగిల్ […]
ఒకే ఒక సినిమా… ఫుల్ స్టాప్… నేనూ నా సంగీతం… అదే నా ప్రపంచం…
ఒకే ఒక సినిమా చేసేసి, ఆ తరువాత సినిమాలకు గుడ్ బై కొట్టేసి, ఇతర రంగాల్లో సెటిలైన వాళ్లు ఉన్నారా..? అదీ హీరోయిన్లు… ఒకసారి ఆ మేకప్పులు, లైట్లు, ఆ పాపులారిటీ పాత కాలం విస్కీలా ఎక్కేసి, ఇక అవకాశాల కోసం ఇండస్ట్రీలోనే చక్కర్లు కొడుతుంటారు సాధారణంగా… కానీ కొందరు ఆ ప్రలోభాల్లో పడరు… ఎస్పీ శైలజ ఒకే ఒక్క సినిమా చేసింది… అదీ విశ్వనాథ్ మొహమాటానికి… సాగరసంగమం… తను ట్రెయిన్డ్ డాన్సర్, ట్రెయిన్డ్ సింగర్ కాబట్టి […]
ఆ ఇద్దరు మెగా ‘జయా’ల నడుమ… ఈ కుర్ర రాశి ఎలా ఇరికింది బాలయ్యా…
నో డౌట్… తెలుగు టీవీల్లో నప్పతట్ల సెలెబ్రిటీలు పలు చాట్షోలు చేశారు… ఏదో పైపైన సరదాగా నడిచిపోయాయి… కానీ విస్తృత ప్రజాదరణ పొందుతున్నది మాత్రం ఆహా ఓటీటీలో వచ్చే బాలయ్య అన్‌స్టాపబుల్ షో… వాళ్లేదో డిజిటల్ వ్యూస్ అని ఏవో తప్పుడు లెక్కలు ప్రచారం చేసుకుంటారు, వాటి నిజనిర్ధారణకు ఎలాగూ మనకు చాన్స్ లేదు… సినిమా వాళ్ల వసూళ్ల సంగతి తెలుసు కదా… ఇవీ అంతే… బట్, బాలయ్య షో సూపర్ హిట్… అయితే..? ఫస్ట్ సీజన్ […]
మూడే రోజుల్లో అవతార్ డబ్బులొచ్చేసినయ్… ఏం వసూళ్లురా బాబూ…
అవతార్2 డబ్బులొచ్చేశాయ్… మూడే రోజుల్లో… 3600 కోట్లను ఇప్పటికి వసూలు చేసింది… నో, నో, 16 వేల కోట్లు వస్తే గానీ బ్రేక్ ఈవెన్ రాదని జేమ్స్ కామెరూన్ చెప్పాడు కదా అంటారా..? హంబగ్… ఇండియాకు వచ్చిపోయినట్టున్నాడు పలుసార్లు… ఇక్కడి నిర్మాతలను చూసి ఇలాంటి లెక్కలు నేర్చుకున్నాడేమో… మనం గతంలోనే చెప్పుకున్నాం కదా… ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర, రిలీజ్ కాని ఆదిపురుష్ తదితర సినిమాల నిర్మాణ వ్యయాలపై ఎన్ని సందేహాలున్నాయో… ఐనా 16 వేల కోట్లు కాకపోతే, 36 […]
ఈ మాత్రం రాయడానికి అనంత శ్రీరాంలు, రామజోగయ్య శాస్త్రిలు కావాలా..?!
ఏంటీ… ఆఫ్టరాల్ ఒక సినిమా పాట రాయడానికి అంత డిమాండ్ చేస్తున్నాడా..? నాలుగు తెలుగు పదాలు అటూ ఇటూ కూర్చడానికి అంత డిమాండా..? ఇదేమైనా సాహిత్యమా..? సినిమా పాట ఆ పూటకు రంజింపజేస్తే చాలదా ఏం..? తరతరాలూ నిలవాలా..? ఆ ప్యాడ్, ఆ పెన్నూ పట్రండి… చకచకా నాలుగు వాక్యాలు నేనే రాసి పడేస్తా… ఏం..? నాకు చేతకాదా ఏమిటి..? అసలు సంగీత దర్శకుడు అనేవాడు పాటల రాతగాడు కూడా అయి ఉండాలోయ్… లేకపోతే ఈ కవులు, […]
ఏదో కూశాడు, కొందరు చెప్పులు విసిరారు… హీరోయిజం చంకనాకిపోయింది…
మాకు బొచ్చెడు ఫ్యాన్ బేస్ ఉంది, ఏం చేసినా చెల్లుతుంది, మేం దైవాంశ సంభూతులం, మేం తోపులం అనుకునే తలతిక్క కేరక్టర్లు టాలీవుడ్లో మాత్రమే కాదు, ప్రతి భాష సినిమా ఇండస్ట్రీలోనూ ఉంటారు… ఉన్నారు… దర్శన్ అని కన్నడంలో ఓ హీరో, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు… పర్లేదు, పాపులర్ హీరోయే… ఈమధ్య క్రాంతి అనే సినిమా తీశాడు… దాని ప్రమోషన్ కోసం హొస్పేటలో ఫంక్షన్లో పాల్గొన్నాడు… ఆ సందర్భంగా ఎవరో తన మీద చెప్పులు విసిరారు… తన […]
ఫాఫం ప్రభాస్… ఆదిపురుషుడికి రిపేర్లు కూడా సాధ్యం కావడం లేదట..!!
బ్రహ్మాండమైన ధమ్కా బిర్యానీ వండారు… తీరా శాంపిల్‌గా ఓ స్పూన్ తిని చూస్తే యాఖ్… అది ఏ రీతిలోనూ లేదు… దాన్ని హోటల్ కస్టమర్లకు గనుక వడ్డిస్తే మళ్లీ హోటల్‌కు ఎవడూ రాడు… తిట్టిపోస్తారు… ఒకరిద్దరు తన్నినా దిక్కులేదు… దాంతో మళ్లీ పొయ్యి మీదకు ఎక్కించాడు చెఫ్… కాస్త ఉప్పు నీళ్లు జల్లి మంట పెట్టాడు… మసాలా యాడ్ చేశాడు… ప్చ్, బేసిక్‌గా వంటకం మొదట్లోనే తన్నేసింది… రంగు, వాసన ఏదీ కుదరలేదు… పైగా ఘోరమైన రుచి… […]
అవసరాల శ్రీనివాస్‌కు అభినందనలు… ఆత్మను చంపకుండా బతికించాడు…
అవతార్ మీద ఎన్ని నెగెటివ్ విమర్శలు వచ్చినా, సమీక్షలు వచ్చినా… ఎవడెన్ని సెటైర్లు వేసినా… జేమ్స్ అంటే జేమ్స్ అంతే… తిరుగులేని దర్శకుడు… తనలా గ్రాఫిక్స్ వాడుకుని సినిమాలు తీసిన దర్శకులు బోలెడు మంది… కానీ ఒక టైటానిక్, ఒక అవతార్, ఇప్పుడు అవతార్ సీక్వెల్… జేమ్స్ కామెరూన్ ఏం మాయ చేస్తాడో గానీ టచ్ చేస్తాయి… ఈ విమర్శకులెప్పుడూ ఉంటారు, అవతార్ ఫస్ట్ పార్ట్ గురించి ఇంతకన్నా ఘోరంగా ఖండఖండాలుగా నరుకుతూ సమీక్షలు కూడా చేశారు… […]
సొంత సినిమా పోస్టర్కేమో నకల్ కొడతడు… అవతార్‌పై ఏదేదో కూస్తడు…
జేమ్స్ కామెరూన్ ఓ విషయం సీరియస్‌గా ఆలోచించాలి… అవసరమైతే అవతార్-3 సీక్వెల్ కొన్నాళ్లు వాయిదా వేసి, కోడి మెదళ్ల మీద ఓ సినిమా తీయాలి… ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ గ్యారంటీ… కావాలంటే హైదరాబాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగురోజులు, బాలీవుడ్ ముంబైలో నాలుగు రోజులు, చెన్నై-బెంగుళూరుల్లో రెండేసి రోజులు క్యాంప్ వేస్తే సరి… మొత్తం స్క్రిప్టు తయారవుతుంది… అంతెందుకు..? టాలీవుడ్లో నాగవంశీ అనే కేరక్టర్ ఉంది… తనతో ఒకరోజు ఉండండి… టాలీవుడ్లో నిజంగానే విష్వక్సేనులు పెరిగిపోతున్నారు… ఈ నాగవంశీ […]
టాప్-10లో ఒకే ఒక హిందీ సినిమా… మిగతాదంతా సౌత్ డామినేషనే…
సంవత్సరం ముగింపుకొచ్చింది… అన్నింటికీ అతీతమైన అవతార్ సినిమాను వదిలేసి, ఇండియన్ సినిమాల్లో ఏవి ఈ సంవత్సరం టాప్-10 అంటూ ఐఎండీబీ ఓ లిస్టు రిలీజు చేసింది… సక్సెస్, వసూళ్ల ఆధారంగా ఆ జాబితాను ప్రిపేర్ చేసినట్టుగా ఉంది… వీటిలో ఒకేఒక హిందీ సినిమా… అదీ ‘ది కశ్మీరీ ఫైల్స్’… ఇక మిగతావన్నీ సౌత్ సినిమాలే… కంటెంటు, ప్రజంటేషన్, ఖర్చు, మార్కెటింగ్, ప్రమోషన్… ఏ కోణం తీసుకున్నా సౌత్ సినిమా బాలీవుడ్‌ను స్పష్టంగా డామినేట్ చేస్తోంది… మొన్న రిలీజైన […]
- « Previous Page
- 1
- …
- 81
- 82
- 83
- 84
- 85
- …
- 130
- Next Page »