Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కడుపులా..? చెత్త కుండీలా..? వంటల వీడియోలతో బహుపరాక్..!!

June 24, 2025 by M S R

chef

. మొన్న ఒక ఫుడ్ వీడియో… పుదీనా, మెంతి ఆకు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లికాడలు ప్లస్ ధనియాల పొడి, జిలకర పొడి, మసాలా ప్లస్ ఆవాలు, వెల్లుల్లి, ఉల్లి, జిలకర, మెంతులు, మినపపప్పు, శెనగపప్పు, అల్లం, పసుపు, ఇంగువ, కారం, ఎండుమిర్చి ప్లస్ నూనె, చిక్కదనం కోసం వరిపిండి లేదా సోయా… తీరా చూస్తే వంకాయ, ఆలూ, టమాట కరీ… ఇన్నిరకాల (దాదాపు 25)  దినుసులు వేశాక అసలు ఒరిజినల్ వంట ఏముంది..? మనం ఏం తింటున్నామో […]

60 ఏళ్ల క్రితమే… ఈ గొంతు నులిమే కుట్ర… నరకం చూసి, చావును గెలిచింది…

June 23, 2025 by M S R

lahta

. అమృతం పంచిన ఆ గొంతును అరవై ఏళ్ల క్రితమే ఈ లోకానికి దూరం చేసే కుట్ర జరిగింది… నిజం… చాలామందికి తెలియని చేదు నిజం ఇది… లతా మంగేష్కర్ మీద స్లోపాయిజన్ హత్యాప్రయత్నం జరిగింది… ఇప్పుడు (ఫిబ్రవరి 2022) 28 రోజులపాటు ముంబై, బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మృత్యువు ఎదుట ఓడిపోయింది… ఆమె వయస్సు కారణం కావచ్చు, సాధారణంగా స్టార్ హాస్పిటల్స్‌లో జరిగే చికిత్స కక్కుర్తి దారుణాలు కావచ్చు… తన 33 ఏళ్ల […]

పచ్చిపులుసు అంటేనే పచ్చిదనం… దాన్నలా పెంటదనం చేయకండి…

June 19, 2025 by M S R

pachipulusu

. నో పొయ్యి, నో పోపు, నో నూనె, నో కాయగూర, నో మసాలా, నో టైమ్ టేకింగ్… ఫాస్ట్‌గా ఉండాలి, నాలుకకు రుచి తగలాలి… ఇవి చెప్పేవాడే చెఫ్ అంటే… దిక్కుమాలిన వంటలు ఎన్ని ఉంటేనేం యూట్యూబులో..?! 20, 30 దినుసులు, బోలెడంత టైమ్, ప్రయాస…. నానా పెంటా కలగలిపేసే వంటలు ఎవడైనా చెబుతాడు… ఎన్నో ఏళ్లుగా మన పెద్దల కడుపులు నింపిన పాత వంటల్ని పరిచయం చేసి, చిట్కాలు చెప్పి, చేసి చూపించేవాడే నిజమైన […]

‘‘ఆ జర్నీలో అనుకోని పరిచయం… ఒకరు సీఎం, మరొకరు పీఎం అయ్యారు…’’

June 18, 2025 by M S R

modi vaghela

. ‘‘1990 వేసవి… నేనూ, నా స్నేహితురాలు ఇండియన్ రైల్వే (ట్రాఫిక్) సర్వీస్ ప్రొబేషనర్లం… లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణించాం రైలులో… మేం ఉన్న బోగీలోనే ఇద్దరు ఎంపీలు ఉన్నారు… వాళ్లతోపాటు ఉన్న దాదాపు డజను మంది కార్యకర్తలు, అనుచరుల ప్రవర్తన నీచస్థాయిలో ఉంది… వాళ్లెవరికీ రిజర్వేషన్లు లేవు… మా రిజర్వ్‌డ్ సీట్ల నుంచి మమ్మల్ని దింపి, మా లగేజీ మీద కూర్చోబెట్టారు… వాళ్ల చూపులు, మాటల తీరు ఏవగింపు కలిగించేలా ఉంది… బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాం… ఇతర […]

చేతగాకకాదు.., బప్పీ మార్క్ మెలొడీయే వేరు… పోనీ, ఈ పాటనేమందాం..?!

June 18, 2025 by M S R

bappi

. బప్పీలహిరి దేహం పంచభూతాల్లో విలీనం అయిపోయి మూడేళ్లయిపోయింది కదా… తన పాటలతో ఉర్రూతలూగించిన ఆయనకు జీవితకాలంలో ఒక్క పద్మశ్రీ కూడా దక్కలేదు సరికదా తన మరణానంతరం మీడియా స్మరణ కూడా తక్కువే అనిపించింది… మరీ తెలుగు మీడియా అయితే మరీ మొక్కుబడిగా స్పందించింది… ఇప్పటికీ పెద్దగా తన గురించి ఎక్కడా ప్రస్తావించదు… అవున్లెండి, చక్రవర్తి బాపతు మీడియా టేస్టుకు బప్పీలహిరి ఏం రుచిగా ఉంటాడు..?! సాక్షిలో ఆర్టికల్ మాత్రం బాగుంది… కానీ ఇంకాస్త డెస్త్ ఉంటే […]

చిన్న కథే… చిన్న విషయాలే… ఐతేనేం, చీకట్లో చిరుదివ్వె చాలదా ఏం..?

June 15, 2025 by M S R

coffee

. తెల్లవారింది.. నాకు ఐదు గంటలకే మెలకువ వచ్చింది. లేచి చేసేది ఏముందని అలాగే పడుకొని ఉన్నాను. మార్నింగ్ వాక్ కి వెళ్ళాలి… కానీ బద్దకంగా అనిపించింది. మావారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు… ఆయన చనిపోయి రెండేళ్లు అయింది… కొడుకు కూతురు అమెరికాలో స్థిరపడి పోయారు. నన్నూ అక్కడకు వచ్చేయమంటారు…కానీ నాకే ఇష్టం లేదు. ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది. నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతున్నాను.. కాఫీ తాగాలి అనిపించింది. కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావడాన డాక్టర్స్ సలహా మేరకు కాఫీ మానేశాను.. కాఫీ […]

ఒక్క క్షణం…! ఎంత విలువైంది… ఓసారి పుతిన్ పుట్టుకను చదవండి… అర్థమౌతుంది…

June 15, 2025 by M S R

putin

. ఒక కథ చెప్పుకోవాలి… Destiny is Ultimate… ఈ మాట చెబితే చాలామంది నాస్తికులు ఛీఛీ అంటారు… నాన్సెన్స్ అంటారు… కానీ అదే అంతిమం… ఇప్పుడు ప్రపంచమంతా చెప్పుకుంటున్న పేర్లలో ఒకటి పుతిన్… అనేక అగ్రదేశాలు ఒక్కటై రష్యాను వ్యతిరేకిస్తున్నా, యుద్దోన్మాది అనే ముద్ర వేస్తున్నా, పుతిన్ అంతు చూడాల్సిందే అని ఉరుముతున్నా, పదే పదే తలుచుకుంటున్న పేరు పుతిన్… ఒకప్పటి గోర్బచెవ్ దేశాన్ని ముక్కలు చేశాడు, బలహీనపరిచాడు… కానీ పుతిన్… ఓ డిఫరెంట్ స్టోరీ… […]

దేవుడే పెదరాయుడు..! తీర్పు చెబితే సుప్రీం చెప్పినట్టే… అదే గుడికోర్టు…!!

June 15, 2025 by M S R

temple court

. చట్టం, ధర్మం, న్యాయం… ఈ మూడింటి నడుమ తేడా ఏంటి..? సింపుల్… ఓ వ్యక్తి నమ్మి, నీకు అప్పు ఇచ్చాడు, కన్నుమూశాడు, కాగితం లేదు… కాగితం లేకపోతే అప్పు తీర్చే పనే లేదంటుంది చట్టం… కాదు, తీర్చాలి అంటుంది న్యాయం… అప్పు తీర్చడమే కాదు, కొన్నాళ్లు ఆ కుటుంబం బాగోగులు పట్టించుకోవాలి అంటుంది ధర్మం… ఇప్పుడంటే ఏళ్లకేళ్లు విచారణలు, లాయర్లు, కోర్టులు, కింది కోర్టులు, పైకోర్టులు… మరీ సివిల్ కేసులు అయితే లాయర్ల భవనాలు పెరుగుతూ […]

ఆత్మలు ఆవహించే కేరక్టర్ కాదు… మంత్రగత్తె అసలే కాదు… మహేంద్రజాలిని…!!

June 13, 2025 by M S R

suhani shah

. వయస్సు పాతికేళ్ల నుంచి ముప్ఫయిలోపు… కాస్త పొట్టిగా, బక్కపలుచగా… అందంగా ఉన్న ఓ అమ్మాయి… ప్రతి కదలికలో అంతులేని ఆత్మవిశ్వాసం, నిబ్బరం, మొహంలో కళ… ప్రత్యేకించి ఆ కళ్లు… మనస్సుల లోతుల్లోకి తీక్షణంగా చూస్తున్నట్టుగా…! ది ఫేమస్ ఇండియన్ ఐడల్ షో వేదిక మీదకు వచ్చింది… కంటెస్టెంట్లకు ప్లస్ యాంకర్‌కు తలా ఓ కాగితం, పెన్ను ఇప్పించింది… ఓసారి అలా చూసి, మీ మనస్సులో బొమ్మ గీయండి అని చెప్పింది… ముగ్గురు జడ్జిలు… ఒకరు అందరికీ […]

కృష్ణ అంటే ఏమిటో వంద కథలు చదవనక్కర్లేదు… ఈ ఒక్కటీ చాలు…

June 12, 2025 by M S R

sravan

. ముందుగా ఓ కథ వంటి సంఘటన చదువుదాం… కథ అనడం ఎందుకంటే… పిల్లికి బిచ్చం వేయని, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వాళ్లుండే సినిమా ఫీల్డులో ఇలాంటి ‘‘నిజమైన హీరోలు’’ ‘‘మనసున్న కథానాయకులు’’ కూడా ఉంటారా అని మనకు డౌట్ వస్తుంది కాబట్టి… 2015లో ఆంధ్రజ్యోతిలో శ్రావణ్ అనే పేరుతో ఓ ఆర్టికల్ వచ్చింది… అందులోనే వివరాలున్నాయి కాబట్టి… సంక్షిప్తంగా, సూటిగా అందులో ఏముందో చూద్దాం… ‘‘తెలంగాణలోని మానుకోట నుంచి 1973లో ఓ కుర్రాడు […]

కృతి మహేశ్… లండన్‌లో ఫోరెన్సిక్ సైన్స్ పీజీ… ఇప్పుడు డాన్స్ ఫ్లోరే బతుకు…

June 9, 2025 by M S R

kruti

. ‘‘నా పేరు కృతి మహేశ్ మిద్య… ఈ మిద్య అనే పేరు ఈమధ్య ఎనిమిదేళ్ల క్రితం మొగుడిగా మారిన బాయ్‌ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చి చేరింది లెండి… తండ్రి పేరు మహేశ్… నా ఒంటి పేరు కృతి… నాన్న ఇష్టంగా పెట్టుకున్న పేరు ఇది… ముంబైలో ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను… మధ్యతరగతి… ఇద్దరం అక్కాచెల్లెళ్లం… శ్యామ్ సింగరాయ్ సినిమావాళ్లు నాకు క్రెడిట్స్ ఇవ్వలేదనే ఓ వార్త చదివాను… నిర్వేదంగా ఓ నవ్వు పుట్టుకొచ్చింది… […]

అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!

June 7, 2025 by M S R

rebirth

. (By… రమణ కొంటికర్ల…) శ్యాంసింగరాయ్ సినిమా అనంతరం ఇప్పుడు గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువ కనిపిస్తున్న పేర్లలో శాంతిదేవి ఒకటి. అయితే ఈ పేరును శ్యాంసింగారాయ్ లో కోర్ట్ సీన్ లో… నాని తరపు లేడీ అడ్వకేట్ కేసు వాదనలో భాగంగా ఉటంకించడం.. ఏకంగా మాహాత్మాగాంధీనే శాంతిదేవి పునర్జన్మ తాలూకు విశేషాల గురించి పూర్తి పరిశోధన చేయాలని ఓ కమిటీ వేయడంతో.. ఇంతకాలం చరిత్రగా ఉన్న శాంతిదేవి పేరు మరోసారి వార్తగా చర్చల్లోకి వస్తోంది. ఇప్పటికే […]

కథ కన్నీళ్లు పెట్టిస్తుంది… కానీ ఈ కథ ఎక్కడిది..? ఎవరిది..? ఆ కథేమిటి..?!

June 6, 2025 by Rishi

mica ias

ముందుగా ఓ కథ చదవండి, నీతి కథ… బాగుంది… పూర్తిగా చదవండి… తరువాత అదేమిటో చెప్పుకుందాం… ఈ కథ వాట్సప్పు, ఫేస్‌బుక్కల్లో తెగ చక్కర్లు కొడుతోంది ఈ నడుమ… మరి చెప్పుకోకపోతే ఎలా..? ఇదీ విస్తృత ప్రచారంలో ఉన్న ఆ కథ… యథాతథంగా…  కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు …? మలప్పురం జిల్లా కలెక్టర్ మిస్ రాణి సోయామోయి కళాశాల విద్యార్థులతో సంభాషిస్తున్నారు… (మలప్పురం అంటే కేరళ రాష్ట్రం) ఆమె చేతి గడియారం తప్ప […]

కాకులూ పగబడతాయ్… గుంపుకట్టి దాడిచేస్తయ్… ప్రతీకారం తీర్చుకుంటయ్…

June 5, 2025 by M S R

crow

. ఈగలు పగబడతాయా..? ఓ ప్రశ్న… ఎందుకు పగబట్టవు..? రాజమౌళి తీసిన ఈగ అనే ఫిక్షన్ చూడలేదా..? ఇన్నేళ్లూ పాములకే పగలుంటయ్ అనుకున్నాం కదా అమాయకంగా… కానీ రాజమౌళి అనే మేధావి ఛట్, ఈగలకూ పగలుంటయ్ అన్నాడు… ఈగలకూ పునర్జన్మలుంటయ్, పగలుంటయ్, ప్రేమలుంటయ్, హీరోయిక్ చేష్టలుంటయ్…… హహహ… ఎహె, అది సినిమా, ఓ కల్పన, ఆఫ్టరాల్ ఈగలేమిటి, అంత సీన్ ఏమిటి అని నవ్వొస్తోందా..? మనిషి కూడా జంతువే కదా, మరి మనిషికి ఉన్నట్టే జంతువులకు ఉద్వేగాలుంటయ్ […]

ఆరోజున ఆ ముప్పు నుంచి లక్కీగా ఎలా తప్పించుకున్నామంటే..!!

June 5, 2025 by M S R

destiny

. కార్యకారణ సంబంధం… ఎక్కడో ఓ గడ్డిపోచ ఇటు నుంచి అటు పడిపోయిందంటే దానికీ ఓ కారణం ఉంటుంది, ఎక్కడో ఏదో ప్రభావం ఉండి ఉండవచ్చు… లేదా ప్రభావం వల్ల కావచ్చు… దేన్నీ తేలికగా తీసుకోవద్దు… సెప్టెంబరు 11… అమెరికాను కుదిపేసిన జంట టవర్ల ధ్వంసం సంఘటన అందరికీ తెలిసిందే… ఆ చేదు అనుభవాల నుంచి, భయాల నుంచి కాస్త తేరుకున్నాక, గతంలో ఆ టవర్లలో ఓ పెద్ద ఆఫీసు నడిపించిన కంపెనీ ఏం చేసిందంటే… ఆ […]

ప్రపంచంలోకెల్లా ‘అత్యంత విలువైన’ కూరగాయ… జస్ట్, సొరకాయ..!

June 3, 2025 by M S R

bottle gourd

. ఓ మిత్రుడి పోస్టు సొరకాయను (తెలంగాణలో అనపకాయ, ఆన్యపుకాయ) మించిన కాయ లేదు అని..! నిజమే, దాని ఇంపార్టెన్స్ తెలియదు చాలామందికి… ప్రత్యేకించి ఈ తరానికి..! ఎప్పుడూ ఎగుడు దిగుళ్లు లేని రేటు… కాస్త అటూఇటూ ఒకటే రేటు ఎప్పుడూ… మంచి ఆర్గానిక్… ఎరువులు అక్కర్లేదు, పెస్టిసైడ్లు అక్కర్లేదు… పంట దెబ్బతినడాలు, అకస్మాత్తుగా రేట్లు పడిపోవడాలు, పెరిగిపోవడాల్లేవ్… ఊళ్లల్లో చాలావరకూ ఇరుగూపొరుగు నడుమ ఉచితంగా పంపిణీ కాబడే స్నేహపు దినుసు… పట్టణాల్లో కష్టంలే గానీ, ఊళ్లల్లో, […]

‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!

June 2, 2025 by M S R

mushroom

. ఆరోగ్యం రీత్యా అదిరే కూరగాయ… నిజానికి అది కూరగాయే కాదు… ఆ లెక్కకొస్తే అది అసలు వృక్షజాతే కాదు… చాలామంది మాంసాహారంగా భావించి దూరం పెడతారు, కుల విశ్వాసాల రీత్యా..! వాస్తవానికి అది మాంసాహారం కాదు, జంతు జాతే కాదు… బూజు తెలుసు కదా, పోనీ మన దేహం మీద కనిపించే గజ్జి… అదుగో ఆ జాతి… శిలీంధ్రజాలం… ఫంగస్… దాని పేరు పుట్టగొడుగులు..! నో, నో, అది శాఖాహారమే అంటారు కొందరు… కానేకాదు, మాంసాహారమే […]

ఇది రసజ్ఞుల కోసం మాత్రమే… రసహీనులు దూరముండగలరు…

May 26, 2025 by M S R

ntr

. ఈమధ్యే సోషల్ మీడియాలో అలనాటి యుగపురుష్ అన్నగారి ఆటగాడు అనే అద్భుతమైన సినిమాకు సంబంధించి ఏదో ఒక ఆక్రోశపూరితమైన భీకర పోస్టు చదవబడితిని… అప్పుడంతగా పట్టలేదు గానీ, ఓ మిత్రద్రోహి కుట్రపూరితంగా, కక్షతో ఓ పాటను వాట్సప్పులో పంపించి మరీ వెక్కిరించెను… ‘‘ఈమధ్య కొన్ని పాటల్లో సాహిత్యం, విలువలు, ప్రమాణాలు, తొక్కాతోలూ అని రాసి ఉంటివి కదా, ఈ పాట చూసి తరించుము, ఈసారి ఏదైనా సినిమా పాట గురించి రాసి, లిటరరీ వాల్యూస్ అన్నావనుకో […]

అంతటి బాలు ఆ రెండు పాటల జోలికి ఎందుకో వెళ్లకపోయేవాడు..!!

May 25, 2025 by M S R

spbalu

. బాలసుబ్రహ్మణ్యం గొప్ప పాటగాడు… సకల ప్రపంచమూ ముక్తకంఠంతో అంగీకరించింది… నీరాజనాలు పట్టింది… కానీ ఒక సందేహం మాత్రం సజీవంగా ఉండిపోయింది… ఆయన కొన్ని వందల (వేలు కూడా కావచ్చు బహుశా) కచేరీలు చేశాడు… చిన్న గాయకుల నుంచి పెద్ద పెద్ద గాయకుల దాకా అందరి పాటలూ పాడాడు… కొన్నిసార్లు ఆ గాయకులకన్నా బాగా పాడాడు… తప్పులొచ్చిన చోట వినమ్రంగా, హుందాగా ప్రేక్షకులకు చెప్పాడు… కానీ ఏ కచేరీలోనూ తను మంజునాథ సినిమాలోని మహాప్రాణదీపం పాటను, జగదేకవీరుడి […]

నో పవర్, నో నెట్, నో ఫోన్, నో టీవీ… 17 ఏళ్ల ఏకాంతంలో… ఓ వన్యప్రాణిలా…!!

May 23, 2025 by M S R

jungle

. నో కరెంట్, నో టీవీ, నో బ్రాడ్ బ్యాండ్, నో స్మార్ట్ ఫోన్, నో కనెక్టివిటీ… ఊహించండి… నెవ్వర్, ప్రస్తుత జనరేషన్ అరగంట కూడా తట్టుకోలేదు… అంతెందుకు, దిక్కుమాలిన సోషల్ సైట్లు కొన్ని గంటలు పనిచేయకపోతేనే తల్లడిల్లిపోతాముగా… మరి అవేవీ లేకుండా, అసలు మనిషి పొడ గిట్టకుండా… అడవిలో… జంతువుల నడుమ ఓ జంతువుగా పదిహేడేళ్లపాటు బతకడం అంటే..?! నమ్మడం లేదు కదా… కానీ నిజమే… ఎక్కడో కాదు, మన పొరుగునే… దక్షిణ కన్నడ జిల్లాలోని […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • …
  • 16
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఎందుకు మంత్రి సీతక్క ఈ ఫోటో వైరల్ అయ్యిందో తెలుసా..?!
  • ఎందుకీ ఆందోళనలు..? వలసదారులపై ఎందుకు బ్రిటిషర్ల ఆగ్రహం..!?
  • పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిందేననీ ట్రంపే చెప్పాడా ఏం..?!
  • హఠాత్తుగా ఎందుకో గానీ హైదరాబాద్ మెట్రో నష్టాల పాట..!!
  • నిజ జీవిత తలపై రాజశేఖర్ ‘తలంబ్రాలు’… షీరోయిక్ పాత్ర…
  • సీతాఫలం తినడం ఓ కళ..! చెంచాతో తింటే దాన్ని అవమానించినట్టే..!!
  • కేటీఆర్ మగ రాజకీయ భాష… ఆడతనమంటే చేతగానితనమట…
  • BB9Telugu..! ఫాఫం కింగ్ నాగార్జునకే అగ్నిపరీక్ష… నో బజ్, నో వ్యూయర్స్…
  • ఫాఫం మిరయ్… ఆ నిర్మాతలు ఎవరో గానీ… థియేటర్ వెళ్లే పనిలేదు..!!
  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions